Bigg Boss Telugu | Third Week Nominations Fight: బిగ్‌బాస్ సీజన్ 7 సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. మొదటి వారం ఏదో సాఫీగా సాగినప్పటికీ.. రెండో వారం నామినేషన్లు, ఎలిమినేషన్స్ ప్రక్రియ ఓ హైప్ క్రియేట్ చేశాయి. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు నిప్పులు కక్కారు. తోడలు కొట్టడాలు, మీసాలు తిప్పడాలు, బూతులు మాట్లాడారు.. ఇలా నువ్వెంతంటే నువ్వేంత అన్నట్లుగా గొడవలకు కూడా దిగారు. కానీ మూడో వారం నామినేషన్ల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. అయితే మొదటి వారంలో జరిగిన నామినేషన్ల మాదిరిగానే మూడో వారం నామినేషన్లు జరిగినట్లు తెలుస్తోంది. సొల్లు రీజన్లు చెప్పి నామినేషన్లు చేశారు. కంటెస్టెంట్లు చెప్పిన రీజన్లు వింటే బిగ్‌బాస్‌కు కాదు.. ప్రేక్షకులకు కూడా చిరాకు వచ్చేసింది. ఇలాంటి రీజన్స్‌తో కూడా నామినేట్ చేస్తారా? అని ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఈ వారం నామినేషన్ ప్రక్రియలో ఏడుగురు ఉన్నారు. 12 మంది హౌస్ మేట్స్‌లో ఆట సందీప్, శివాజీకి నాలుగు వారాల ఇమ్యూనిటీ ఇంది. అప్పటివరకు వీళ్లిద్దరినీ ఎవరూ నామినేట్ చేయలేరు. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్ట్‌తో ఊహించని విధంగా నామినేషన్ లిస్టులో అమర్ దీప్ వచ్చాడు.

దామినిని నామినేట్ చేయాలని ప్లాన్..
బిగ్‌బాస్ లేటెస్ట్ ఎపిసోడ్ ఊహించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఎపిసోడ్ ప్రారంభంలో ప్రిన్ యావర్-దామిని మధ్య చిన్న గొడవ జరిగింది. దామినిని హగ్ చేసుకునేందుకు ప్రిన్స్ యావర్ దగ్గరకు వచ్చాడు. అప్పుడు దామిని.. ‘నువ్వు షకీలా అమ్మను ఎందుకు నామినేట్ చేశావు. నేను నీతో మాట్లాడను.’ అంటూ వెళ్లిపోతుంది. అది నా ఇష్టమని ప్రిన్స్ యావర్ కూడా లైట్ తీసుకుంటాడు. ఇక తెల్లారాక యావర్ జిమ్ చేస్తుండగా.. దామిని, ప్రియాంక చాడీలు మొదలు పెట్టారు. యావర్ యాటిట్యూడ్ నచ్చట్లేదని ప్రియాంక చెబుతుంది. ప్రిన్స్ యావర్ కూడా శుభ శ్రీతో గుసగుసలాడుతాడు. దామిని చాలా డేంజర్ అని, తనను నామినేట్ చేయమని చెప్తాడు. దానికి శుభ శ్రీ కూడా ఓకే అంటుంది.

నామినేషన్ ప్రక్రియ మొదలు..
ఇక బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టాడు. హౌస్‌లో అర్హులు కాదని భావించిన ఇద్దరు కంటెస్టెంట్లను పిలిచి.. రీజన్ చెప్పి ఎలిమినేట్ చేయాలని బిగ్‌బాస్ చెప్తాడు. అలాగే వాళ్ల ముఖంపై ఫోమ్ పూయాలని సూచిస్తాడు. ప్రియాంక ముందుకు వచ్చి.. యావర్, గౌతమ్‌ను నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ వచ్చి.. టేస్టీ తేజను, దామినిని నామినేట్ చేస్తాడు. ఆ తర్వాత శుభ శ్రీ.. శోభా శెట్టిని నామినేట్ చేసింది. నువ్వు హౌస్‌లో రోటీలు మాత్రమే చేస్తున్నావు.. గిన్నెలను తోమడం లేదు. పైగా రెండు వారాలుగా నువ్వు నామినేట్ కాలేదు. అందుకే నిన్ను ఎలిమినేట్ చేస్తున్నానని శుభ శ్రీ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత రతిక రోజ్‌ను ఎలిమినేట్ చేసింది. అమర్ దీప్.. గౌతమ్ కృష్ణను.. మాయాస్త్ర తనకు ఇవ్వాలని కూడా అనుకోలేదని, అందుకే తనను నామినేట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. రెండో నామినేషన్‌గా శుభ శ్రీని ఎంపిక చేశాడు.

హాట్ వాటర్ అడిగినందుకు..
రతిక రోజ్ నామినేషన్ చాలా విచిత్రంగా జరిగింది. ముందుగా శుభ శ్రీని నామినేట్ చేసింది. ఇంట్లో పనులు చేయడం లేదని, సేఫ్ గేమ్ ఆడుతున్నావని, ఎవరూ నిన్ను నామినేట్ చేయట్లేదని చెప్పింది. ఆ తర్వాత గౌతమ్ కృష్ణను నామినేట్ చేసింది. ’నన్ను తాగడానికి హాట్ వాటర్ తెమ్మని అడిగావ్.. అది నాకు నచ్చలేదు.. హెల్త్ బాగాలేనప్పుడు అందరూ హెల్ప్ చేస్తారు.. కానీ నువ్వు బాగున్నా.. ఇంట్లో పడుకుని నాతో పని చెప్పడం నాకు నచ్చలేదు.’ అని చెప్పింది. దాంతో అక్కడున్న అందరూ నవ్వుకున్నారు. వాటర్ అడిగితే తప్పా అని గౌతమ్ అడిగాడు. ఇలాంటి రీజన్‌తో కూడా నామినేట్ చేస్తారా? అని గౌతమ్ కూడా నవ్వుకున్నాడు. ఆ తర్వాత టేస్టీ తేజను రతిక నామినేట్ చేసింది.

అందరినీ నామినేట్ చేయాలనుకుంటున్నా..
నామినేట్ చేసేందుకు రెడీ అయిన దామిని.. వీలైతే అందరినీ నామినేట్ చేయాలని అనుకుంటున్నానని, కానీ బిగ్‌బాస్ ఇద్దరికే ఛాన్స్ ఇచ్చాడని చెప్పుకొచ్చింది. ముందుకు ప్రిన్స్ యావర్‌ను పిలిచి.. మీకు తెలుగు అర్థం కాదు.. చెప్తే అర్థం చేసుకునే ఎబిలిటీ లేదు. ఓవర్ యాక్టింగ్, డ్రామాలు ఎక్కువ చేస్తున్నావని అతడిని నామినేట్ చేస్తుంది. ఆ తర్వాత శుభ శ్రీని నామినేట్ చేసింది. ఇలా ఈ సారి నామినేషన్స్‌లో శుభ శ్రీ, గౌతమ్, ప్రియాంక, దామిని, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, అమర్ దీప్ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో వేచి చూడాలి.