Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ లలో అన్నిటిలో కల్లా ఎక్కువ నెగిటివిటీ సంపాదించుకున్న సీజన్ ఆరవ సీజన్. ఈ సీజన్ లో ఎంట్రీ ఇచ్చిన సభ్యులు దాదాపు నాలుగు వారాలు పాటు కనీసం గేమ్ ఆడలేదు. ఎంతసేపు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్న విధంగా వ్యవహరించేవారు. ప్రతి వీకెండ్ నాగార్జున క్లాస్ పీకిన గాని ఇంటి సభ్యులలో మార్పు వచ్చేది కాదు. ఎవరికివారు నైట్ అయితే చాలు.. టాస్క్ ఇచ్చినా గాని గురక పెట్టి పడుకునే వాళ్ళు. దీంతో ఇప్పుడు సీజన్ సెవెన్ లో అటువంటి పరిస్థితి లేకుండా ఇమ్యూనిటీ పవర్ గెలుచుకునే విధంగా రకరకాల టాస్కులు పెడుతున్నారు. సీజన్ సెవెన్ నువ్వా నేనా అన్నట్టుగా ప్రేక్షకులు అంచనాలకు హౌస్ లో ఆడుతున్న సభ్యుల ఊహలకు మించి రసవత్తరమైన గేమ్ బిగ్ బాస్ ఆడిస్తున్నారు.
వైల్డ్ కార్డు రూపంలో ఇంటర్వ్యూలు ఎలిమినేట్ అయిన సభ్యులు మళ్ళీ ఎంట్రీలు వైల్డ్ కార్డు రూపంలో ఇంటర్వ్యూలు ఎలిమినేట్ అయిన సభ్యులు మళ్ళీ రీఎంట్రీలు ముందుగా చెప్పినట్టు ఉల్టా పుల్టా అన్న రీతిలోనే గేమ్ సాగుతోంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ సిక్స్ కంటెస్టెంట్ అరోహి అందరికీ సుపరిచితురాలే. అదే సీజన్ లో ఆర్జే సూర్యతో…అరోహి చాలా క్లోజ్ గా ఉండి ప్రారంభంలో బానే గేమ్ ఆడింది. కానీ నాలుగో వారంలోనే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా అరోహి.. ఆన్ లైన్ లో తాను మోసపోయినట్లు సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది. “ఆన్ లైన్ లో సెల్లింగ్ యాప్స్, ఫ్లిప్ కార్ట్ మీ షోలలో రెండు వస్తువులు ఆర్డర్ చేశాను. నాలుగు రోజుల క్రితం ఒక డెలివరీ రావడంతో రెండిట్లో ఏదో ఒక ఐటమ్ వచ్చి ఉంటుందని చెక్ చేయకుండా యూపీఐ ద్వారా అమౌంట్ పే చేయడం జరిగింది.
తీరా పార్సిల్ ఓపెన్ చేసి చూస్తే వైట్ క్లాత్ మాత్రమే వచ్చింది. అసలు నేను ఇలాంటివి ఎప్పుడూ ఆర్డర్ చేయలేదు. దీంతో వెంటనే మీ షో హెల్ప్ సెంటర్ కి వెళ్లి కంప్లైంట్ చేస్తే రెండు రోజుల్లో మేలు వస్తుందని అన్నారు. అమౌంట్ కూడా రిఫండ్ అవుతుందని చెప్పారు. అయితే కంప్లైంట్ చేసి నాలుగు రోజులైనా ఎలాంటి మెయిల్ రాలేదు. వాళ్ల నుండి సరైన రెస్పాన్స్ కూడా లేదు. ఇది టోటల్ గా మీ షో యాప్ ఫ్రాడ్. మీరు కొనే ముందు జాగ్రత్తగా ఉండండి నా మాదిరి మోసపోవద్దు అంటూ అరోహి హెచ్చరించింది.