NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi జులై 13 ఎపిసోడ్ 147: కావ్య కి డ్రైవింగ్ నేర్పిస్తానన్న రాజ్..కావ్యకి ఫోన్ తిరిగి ఇచ్చిన అపర్ణ..స్వప్న ని బయటకి పంపేందుకు బంపర్ ప్లాన్ వేసిన రాహుల్ – రుద్రాణి!

Brahmamudi Serial july 13 2023 today 147episode highlights

Brahmamudi  జులై 13 ఎపిసోడ్ 147:  కార్ డ్రైవింగ్ నేర్చుకుంటూ పోలీసుని గుద్దిన కావ్య ని , తనని ఆడకుండా కార్ నేర్పించడానికి సిద్దమైన కళ్యాణ్ ని రాజ్ తిడుతూ ఉంటాడు. మీరు ఈరోజు గుద్దిన పోలీస్ కి ఏదైనా జరిగి ఉంటే జీవితాంతం జైలు లో ఉండేవారు అని అంటాడు. అప్పుడు కళ్యాణ్ మాట్లాడుతూ కావ్య వాడినని ఏమి అనొద్దు అన్నయ్యా, నేనే ఆమెకి సరిగా జాగ్రత్తలు చెప్పలేదు అని అంటాడు.

Brahmamudi Serial july 13 2023 today 147episode highlights
Brahmamudi Serial july 13 2023 today 147episode highlights

ఇక నుండి నేనే నీకు డ్రైవింగ్ నేర్పిస్తాను అని రాజ్ అనడం తో కావ్య చాలా సంబరపడుతుంది. మరొపక్కక ఇంట్లో టీవీ రావడం లేదు ఏమిటి అని ఇందిరా దేవి అడగగా, రిమోట్ లో బ్యాటరీలు అయిపోయి ఉంటుంది అత్తయ్య, నేను కొత్త బ్యాటరీ వేస్తాను ఉండు అని డెస్క్ ని ఓపెన్ చేస్తుంది అపర్ణ. ఆ డెస్క్ లో ఇన్ హెల్లెర్ ఉంటుంది , మరో డెస్క్ ఓపెన్ చెయ్యగా అక్కడ కూడా ఇన్ హెల్లెర్ ఉంటుంది. అలా ప్రతీ డెస్క్ లో , కప్ బోర్డ్స్ లో ఇన్ హెల్లెర్ ఉండడాన్ని చూసి అపర్ణ షాక్ అవుతుంది.

Brahmamudi Serial july 13 2023 today 147episode highlights
Brahmamudi Serial july 13 2023 today 147episode highlights

ఇన్ని ఇన్ హెల్లెర్స్ ఎవరు పెట్టారు అని అడగగా, మొన్న రాజ్ కి ఇన్ హెల్లెర్ అందుబాటులో లేక చాలా ఇబ్బంది పడ్డాడు కదా, అందుకే మళ్ళీ అలాంటి ఇబ్బంది కలగకూడదని కావ్య ఇన్ హెల్లెర్స్ తెప్పించి ఇంట్లో ప్రతీ చోట ఉండేలా చేసింది అని అంటుంది ధాన్య లక్ష్మి. అప్పుడు ఇందిరా దేవి చూసావా నీ కొడుకు కోసం కావ్య ఎంత శ్రద్ద చూపిస్తుందో, నువ్వేమో కావ్య ని అసలు ఎందులోనూ పట్టించుకోవు అని అంటుంది. ఇప్పుడు నేనేమి చేశాను అత్తయ్య అని అడగగా, ఇందాక బ్యాంక్ అప్లికేషన్ ఫిల్ చెయ్యడానికి కావ్య మొబైల్ నెంబర్ అడగగా, తన దగ్గర ఫోన్ లెకపొయ్యేసరికి రాజ్ ఫోన్ నెంబర్ ఇచ్చింది. ఈ ఇంట్లోకి కావ్య అడుగుపెట్టగానే, పుట్టింటికి ఫోన్ చెయ్యడానికి వీలు లేదని ఫోన్ లాగేసుకున్నావు, ఆరోజు రాజ్ కి ఇబ్బంది కలిగినప్పుడు ఫోన్ అందుబాటులో ఉండుంటే అంత సమస్య వచ్చేది కాదు కదా అని అంటుంది ఇందిరా దేవి. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటున్న సమయం లోనే రాజ్, కావ్య, కళ్యాణ్ ఇంటికి వస్తారు.

Brahmamudi Serial july 13 2023 today 147episode highlights
Brahmamudi Serial july 13 2023 today 147episode highlights

స్వప్న ని బయటకి పంపేందుకు బంపర్ ప్లాన్ వేసిన రాహుల్ – రుద్రాణి:

కావ్య ఇంటికి రాగానే అపర్ణ కావ్య ఫోన్ కావ్యకి ఇచ్చేస్తుంది. మీరు మనస్ఫూర్తిగానే ఇస్తున్నారు కదా అత్తయ్యా, ఇంట్లో చెప్పారని ఇవ్వట్లేదు కదా అని అడగగా, మొన్న ఫోన్ లేకపోవడం వల్ల ఎంత సమస్య అయ్యిందో అర్థం అయ్యింది కాబట్టే ఈ ఫోన్ నీకు ఇస్తున్నాను అని అంటుంది అపర్ణ. ఇదంతా చూసి స్వప్న ఆవేశం తో రేగిపోతొంది, నా చెల్లి రాజ్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లి, అతని ప్రాణాలు కాపాడి ఇంట్లో అందరినీ తన కంట్రోల్ లో తెచ్చేసుకుంది, నేను కూడా నా టాలెంట్ ఏంటో చూపించాలి, అందరూ నన్ను ఈ ఇంటి పెద్ద కోడలిగా గుర్తించాలి, దానికి నీ సహాయం కావాలి రాహుల్ అని అంటుంది. అప్పుడు రాహుల్ ఏమిటి అడగగా , నీకు చాలా మంది మోడల్ డైరెక్టర్స్ తెలుసు కదా, నీ పలుకుబడి ఉపయోగించి డైరెక్టర్స్ తో నాకు మోడలింగ్ లో ఒక్క అవకాశం ఇప్పించు అని అడుగుతుంది. అప్పుడు రాహుల్ కడుపుతో పొట్టి బట్టలు వేసుకొని మోడలింగ్ చేస్తే ఇంట్లో అందరూ నన్ను తప్పుబడుతారు, సైలెంట్ గా కూర్చో అని చెప్పి బయటికి వస్తాడు, ఇదంతా విన్న రుద్రాణి ఆ పిల్ల మోడలింగ్ చేస్తాను అంటే ఎందుకు వద్దు అన్నావ్, ఇంటి పరువు తీసిందని అందరూ దానిని గెంటేస్తారు కదా అని అంటుంది రుద్రాణి. ఈ ఆలోచన నాకు రాలేదు అమ్మా, ఇప్పుడే చెప్తాను అని మళ్ళీ లోపలకి వెళ్లి మోడలింగ్ చెయ్యడానికి ఒప్పుకుంటాడు రాహుల్. కానీ తన పేరు బయటకి రావడానికి వీలు లేదు, ఇంట్లో నా మీద అసలే మంచి అభిప్రాయం లేదు, ఇప్పుడు నేనే నీకు సపోర్ట్ చేశాను అని తెలిస్తే పెద్ద గొడవలు అవుతాయి అని అంటాడు. అందుకు స్వప్న కూడా ఒప్పుకుంటుంది.

Brahmamudi Serial july 13 2023 today 147episode highlights
Brahmamudi Serial july 13 2023 today 147episode highlights

మరోపక్క కనకం స్వప్న కి సూడుదులు పెట్టేందుకు తన భర్త ని డబ్బులు అడుగుతుంది, అందుకు పడి వేలు ఖర్చు అవుతుంది అనగా , నా దగ్గర కేవలం 5 వేలు మాత్రమే ఉంది అని అంటాడు భర్త. ఈలోపే కావ్య నుండి కనకం కి ఫోన్ కాల్ వస్తుంది. నీ ఫోన్ నుండి ఎలా చేస్తున్నావే, దొంగతనం గా చేస్తున్నావా అని కనకం అడగగా లేదు అమ్మా , మా అత్తయ్య గారే నాకు ఫోన్ తిరిగి ఇచ్చారు అని అంటుంది కావ్య, అలా మాట్లాడుకుంటూ సూడుదులు గురించి కావ్యకి చెప్పగా, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అమ్మా, కావ్య కి ఇలాంటివి అంటే చిరాకు, పైగా నువ్వు తెచ్చే చీర చీప్ గా ఉందని మిమల్ని అవమానిస్తుంది అని అంటుంది కావ్య, అలా మాట్లాడుకుంటున్న సమయం సేటు వచ్చి డబ్బులు అడుగుతాడు, స్వప్న పెళ్లి చెయ్యడానికి కనకం అప్పులు చేసింది అనే విషయాన్నీ తెలుసుకొని షాక్ కి గురి అవుతుంది కావ్య.

Related posts

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N