Rashmika Mandanna: కొద్ది నెలల క్రితం కన్నడ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన “కాంతార” గురించి రష్మిక చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపింది. దీంతో రష్మిక సొంత ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ఆమెను బ్యాన్ చేయాలంటూ.. డిమాండ్ చేశారు. రష్మిక సినిమాలు కన్నడ ఇండస్ట్రీలో బ్యాన్ చేయాలని డిమాండ్ చేయడం తెలిసిందే. అయితే అధికారికంగా బ్యాన్ చేయలేకపోయినా గానీ అనాధికారికంగా మాత్రం కన్నడ ఇండస్ట్రీలో నుండి రష్మికకి.. ఒక్క అవకాశం రాకుండా చేస్తున్నట్లు టాక్. విషయంలోకి వెళ్తే కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన.. టాలీవుడ్ ఇండస్ట్రీలో చేసిన సినిమాలతో మంచి పాపులారిటీ దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా సంపాదించింది.
ముఖ్యంగా “పుష్ప” సినిమా రష్మిక మందన తలరాత కూడా మార్చేసింది. ఈ సినిమాతో జాతీయ మరియు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత దక్షిణాదిలో మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ ఎత్తున అవకాశాలు అందుకుంటూ ఉంది. ప్రస్తుతం పుష్ప 2, యానిమల్ తోపాటు తెలుగులో నితిన్ కు జోడిగా ఓ సినిమా చేస్తూ ఉంది. ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ అందరిలో కంటే రష్మిక కెరియర్ మంచి జోరుగా దూసుకుపోతుంది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు చాలా ఆఫర్లు ఈ కన్నడ బామ్మకు వారిస్తున్నాయి.
కానీ ఒక్క కన్నడ ఇండస్ట్రీ నుండి మాత్రమే రష్మిక కి అవకాశాలు రావడం లేదట. గతంలో కన్నడ ఇండస్ట్రీ నుండి ఏదైనా మంచి అవకాశం వస్తే చేయటానికి చాలా సిద్ధంగా ఉన్నట్లు.. కూడా స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది. అయినా గాని కన్నడ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు రష్మిక “కాంతార” మూవీ పట్ల చేసిన.. వ్యాఖ్యలకు నొచ్చుకుని.. అనధికారికంగా బ్యాన్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దేశంలో ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ చాలా చిన్నదాని భావించే వాళ్ళు. కనుక “కేజిఎఫ్”.. సినిమా సాధించిన విజయం కన్నడ ఇండస్ట్రీ సత్తా నిరూపించింది. ఆ తర్వాత కాంతారా కూడా.. అదే తరహా విజయం సాధించింది. ఈ క్రమంలో కన్నడ ఇండస్ట్రీ అయ్యి ఉండి రష్మిక.. కాంతార పట్ల తక్కువ చేసినట్లు మాట్లాడటంతో ఆ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు.. ఆమెపై గుర్రుగా ఉన్నారట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!