Jajikaya In Ayurveda | Nutmeg: మన ప్రాచీన ఋషులు కొన్ని వేళా సంవత్సరాల కు పూర్వం మనకు అందించిన విజ్ఞానమే ఆయుర్వేద శాస్త్రం . ఇప్పుడు ప్రపంచ మాన్తా మన ఆయుర్వేద ఉత్పత్తులకు ఎంతో గిరాకీ ఉంది. అలా ఆయుర్వేదం అందించిన ఒక అద్భుతమైన వస్తువు జాజి కా య . దీన్ని జాతిఫలం అని జైఫల్ అని కూడా అంటారు. జాజికాయ మీద ఎంతో మంది పరిశోధన చేశారు. ఇందులో సైనడిన్స్, ప్రొపనాయిడ్స్ లాంటి కెమికల్స్ చాలా ఉన్నాయి. జాజికాయను మసాలాగా ఉపయోగిస్తారు. జాజికాయ నూనెను ఔషధాలు, సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు. ఆయుర్వేదంలో ఇది చాలా ముఖ్యం. ఇది ఇండోనేషియా మసాలా. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. జాజికాయలో ఫైబర్, థియామిన్, విటమిన్ బి 6, ఫోలేట్, కాపర్, మాక్రిగ్రాన్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఈ నూనె అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇంకా బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించేందుకు కూడా జాజికాయ పనిచేస్తుందని సైంటిస్టులు కనుగొన్నారు.
మేల్ సెక్స్ పొటెన్సీని జాజికాయ బాగా ఇంప్రూవ్ చేస్తుందని కూడా పరిశోధనలో తేలింది. 5 గ్రాముల పొడిని డైలీ తీసుకుంటే మగవారికి అలా మేలు జరుగుతుంది. జాజికాయలో సెక్స్ కోరికలు పెంచే గుణాలున్నాయంట. మగవారు ఆ సమయంలో దీన్ని తీసుకుంటే అందులో బాగా పార్టిసిపేట్ చేయొచ్చట. వీర్యవృద్ధికి తోడ్పడుతుందంట. దాంపత్య సమస్యలను జాజికాయ దూరం చేస్తుంది. అర స్పూన్ జాజికాయ పొడిని పాలలో కలుపుకుని తాగితే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందంట
1.దుర్వాసన కోసం – జాజికాయ నూనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది చాలా టూత్‌పేస్టులలో ఉపయోగించబడుతుంది. చెడు శ్వాస బ్యాక్టీరియా నుంచి బయటపడటానికి ఇది సహాయపడుతుంది. ఇది చిగురువాపు, పంటి నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎందుకంటే ఇది తాపజనక, అనాల్జేసిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. మీరు రెండు చుక్కల జాజికాయ నూనెను నీటిలో వేసి ముఖం కడుక్కుంటే చాలా మంచిది.
2. సానపట్టే రాసి తీసుకుని జాజికాయను దానిమీద అరగదీసి నోట్లో పుండ్లు ఉన్నప్పుడు రాస్తే ఆ పుండ్లు త్వరగా మానతాయి. ఇంకా ఈ లేపానంతో వారానికి ఒకటి రెండు సార్లు పళ్లు తోముకుంటే.. పవర్ ఫుల్ యాంటీ బాక్టీరయాగా పనిచేస్తుంది. పళ్లు పుచ్చడాన్ని నివారిస్తుందని సైంటిఫిక్ గా నిరూపించారు.
3. కండరాల మరియు కీళ్ల నొప్పులకు-
జాజికాయ నూనెలో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇది కండరాల ఉద్రిక్తతతో సంబంధం ఉన్న నొప్పిని తగ్గించడానికి పనిచేస్తుంది. ఈ నూనె కీళ్ళలో వాపు నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. బాధిత ప్రాంతంపై కొన్ని చుక్కల జాజికాయ నూనె వేసి మర్దన చేయాలి.
ఒత్తిడిని తగ్గించడానికి – జాజికాయ నూనెను అరోమాథెరపీకి కూడా ఉపయోగించవచ్చు. దీనిని డిఫ్యూజర్‌లో ఉంచడం ద్వారా ఉపయోగించవచ్చు. ఇది ఒత్తిడి, ఆందోళన సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది.
4. చర్మం కోసం – జాజికాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి మేలు చేస్తుంది. మీరు స్నానం చేసేటప్పుడు జాజికాయ ఎసెన్షియల్ ఆయిల్ ను నీటిలో ఉపయోగించవచ్చు.
5. జాజికాయ ప్రభావం చాలా వేడిగా ఉంటుంది. అధికంగా వాడటం మీ శరీరానికి హాని కలిగిస్తుందని తెలుసుకోండి. ఇది కంటి సమస్యలు, తలనొప్పి, మైకము, చర్మంపై దద్దుర్లు, నోరు పొడిబారడం వంటివి కలిగిస్తుంది. అందువల్ల దీనిని తక్కువగానే వాడాలి.
6. జాజికాయలో కామెర్ల వ్యాధిని తగ్గించే స్వభావం ఉంది. నాలుకమీది పాచిని పోగొట్టి జిగటను తొలగిస్తుంది. పిల్లలకు కలిగే నీళ్ళ విరేచనాలను తగ్గిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసి మలబద్దకాన్ని తొలగిస్తుంది. శరీరానికి కాంతిని కలిగిస్తుంది. గుండె నొప్పిని తొలగించి బీపీని కంట్రోలు చేస్తుంది. జాజికాయ, సొంఠి అరగదీసి కణతలకు పట్టు వేస్తే తలనొప్పి, మైగ్రేన్ వంటి వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. జాజికాయ ముక్కను నమిలితేపండ్లలోని క్రిములు నశిస్తాయి. దీని గంధం 2-3బొట్లు చెవిలో పిండితే చెవిపోటు సమస్య ఉండదు.

Health & Lifestyle: గురక రావటానికి అసలు సిసలైన కారణాలు..? గురక నివారించడానికి చిట్కాలు..!!
7. బెంగుళూరు వారు కూడా జాజికాయ మీద పరిశోధన చేసి.. ఇది యాంటిడిప్రసెంట్ గా పనిచేస్తుందని నిరూపించారు. మూడ్ స్వింగ్స్ ను తొలగించడానికి, మానసిక అలజడని, కొంతమంది రకరకాల ఆలోచనతో.. ఆగం ఆగం అయితారు.. అలాంటివారికి జాజికాయ బాగా పనిచేస్తుంది. నైట్ నిద్రపోయే ముందు పాలల్లో 7-8 గ్రాముల జాజికాయ పొడి, బాదం పొడి, యాలకలపొడి వేసుకుని తాగి పడుకుంటే నిద్రబాగా పడుతుంది. డిప్రషన్ కూడా పోతుందని స్పష్టం చేశారు.
8. జాజికాయ చూర్ణంను ప్రతి రోజు ఉదయం తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయి. అలాగే గుండెల్లో మంట, నొప్పిని తగ్గించే శక్తి కూడా జాజికాయకు ఉంది.
9. జాజికాయను పౌడర్ చేసుకుని డికాషన్ లా చేసుకుని అందులో తేనె వేసుకుని కూడా తాగొచ్చు. జాజికాయ నూనె కూడా మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. దీని వల్ల.. మోకాళ్ల నొప్పుులు, కీళ్లనొప్పులు తగ్గుతాయి.
10. 2017వ సంవత్సరంలో చికాగో స్టేట్ యూనివర్శిటీ వారు జాజికాయ మీద పరిశోధన చేసి.. బ్లాక్ హెడ్స్ ను రిమూవ్ చేయడానికి పనికొస్తుందని నిరూపించారు. జాజికాయను అరగదీసి.. ఆ లేపనానికి తేనె రాసి బ్లాక్ హెడ్స్ మీద పెట్టేసి..20 నిమిషాలు ఉంచుకుని ఆ తర్వాత మీగడ రాసి రబ్ చేసి క్లీన్ చేస్తే.. నల్లటి మచ్చలు తగ్గుతున్నాయని కనుగొన్నారు జాజికాయను ఒకపూటకు 7-8 గ్రాముల వరకే వాడుకోవాలి. రోజులో రెండుసార్లు వాడుకుంటే.. 15-20 గ్రాములు మించకూడదు. అంతకంటే ఎక్కువ వాడితే.. మళ్లీ అనవసరమైన సైడ్ ఎఫెక్ట్ వస్తాయి.