Health & Lifestyle: ప్రస్తుత రోజుల్లో నిద్ర అనేది చాలా కష్టతరమైపోయింది. ఉరుకుల పరుగుల జీవితంలో… ప్రశాంతంగా నిద్రపోవటం ఇబ్బందికరంగా మారింది. ఏదో నిద్రపోయామన్న రీతిలో.. కునుకుతీస్తుంటారు. ఇక ఇదే సమయంలో కొంతమంది గురక పెట్టి ఇతరులకు ఇబ్బందికరంగా మారుతారు. అయితే గురక విషయానికొస్తే మహిళల్లో కంటే పురుషుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అసలు ఇంతకీ ఈ గురక ఎందుకు వస్తుంది…? గురక రాకుండా ఉండాలంటే ఏం చేయాలో అనే దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.

గురక రావటానికి గల ప్రధాన కారణం..?
నిద్రిస్తున్న సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడితే అప్పుడు గురక వస్తుంది. ఈ క్రమంలో నోటి ద్వారా శ్వాస తీసుకునే ప్రయత్నం జరుగుద్ది. శ్వాస తీసుకునే మార్గంలో అవాంతరాలు ఉంటే అప్పుడు కుచించుకోకపోయినా మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండటంతో… చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురై చెప్పులు వస్తాయి. ఇంకా గురక రావటానికి కారణలు చూస్తే మానసికపరమైన ఒత్తిడి, కంగారు, విపరీతమైన ఆలోచన ధోరణి కూడా అంటూ వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు వాయునాళాలు తక్కువ వ్యాకోచంతో ఉండటంవల్ల మెడ, గొంతు భాగంలో అధిక బరువు వల్ల కూడా గురక వస్తుందని చెబుతున్నారు. అంతేకాదు నిద్రించే గదిలో పొడిగాలి ఉండటం వల్ల కూడా చాలా మందిలో గురక వస్తుంది.

గురక నివారించడానికి మార్గాలు….
1) ప్రాణాయామం యోగా ప్రక్రియ చేయడం వల్ల శ్వాసక్రియ పై పట్టు పెరుగుతుంది. దీనివల్ల రక్తప్రసరణ శుద్ధికరణ జరిగి శ్వాసక్రియ సవ్యంగా సాగుద్ది.
2) ముక్కు మూసుకోకుండా శుభ్రంగా ఉంచుకోవాలి.
3) రోజు రాత్రి నిద్ర పోయేముందు గొప్పెడు పచ్చి అటుకులను తింటే గురక రాకుండా కంట్రోల్ అవుతుంది.
4) ఒక గ్లాస్ నీటిలో ఒకటి లేదా రెండు పెప్పర్మెంట్ ఆయిల్ చుక్కలు వేసి రాత్రి నిద్ర పోయే ముందు నోటిలో పోసుకుని బాగా పుక్కిలించాలి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. లేదా పెప్పర్మెంట్ ఆయిల్ చేతి వేళ్లకు రాసుకుని వాసన చూస్తుంటే కూడా వరకతకుతుంది.
5) వెల్లకిలో పడుకున్నప్పుడు గురక ఎక్కువగా వస్తుంది కాబట్టి పడుకునేటప్పుడు తలభాగం ఎత్తులో ఉండేలా చూసుకోవాలి.
6) పడకగదిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.
7) నిద్రపోయే ముందు మద్యం అలవాటు ఉంటే మానుకుంటే మంచిది.
8) శరీరం బరువు పెరగటం వల్ల గడ్డం ప్రాంతంలో కొవ్వు కణజాలం పెరిగిపోయి కూడా గురక వస్తుంది. అందుకని శరీర బరువు కూడా తగ్గించుకోవటం మంచిది.
9) గ్లాసెడు వేడి నీటిలో అరటి స్పూన్ యాలకుల పొడి కలుపుకుని పడుకునే ముందు తాగితే కూడా గురక నివారణ చెయ్యొచ్చు.
10) గొంతు, నాలుకకు సంబంధించిన ఎక్సర్సైజ్ లు చేయటం ద్వారా గురక సమస్యను అధిగమించవచ్చు.
Women’s Health Tips: నెలసరి సమయంలో స్త్రీలు అధిక నొప్పి.. వేదనకు గురి కాకుండా చిట్కాలు..!!