How to reduce period pain? స్త్రీ శరీరంలో రుతుస్రావం అనేది అనివార్యమైన భాగం. ప్రతి నెలసరి ఒక అగ్ని పరీక్ష లాగా ఉంటుంది. ఆ సమయంలో కడుపు నొప్పితో మొదలయ్యి వాంతులు, కళ్ళు తిరగటం, నడుం నొప్పి, నీరసం, చికాకు, తిమ్మిర్లు, అధిక రక్తస్రావం, వంటి తీవ్ర పరిస్థితుల గుండా స్త్రీలు వెళుతుంటారు. ఈ క్రమంలో కొన్ని కారణాల వల్ల నెలసరి సమయంలో నొప్పి విపరీతంగా ఉంటుంది. దీంతో ఆ మూడు రోజులు ఏ పని సక్రమంగా చేయలేకపోతుంటారు. ఈ నొప్పి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. ఆ సమయంలో రోజు చేసే పనులే చాలా కష్టతరంగా చేసుకుంటూ ఉంటారు. ఎంతో వేదనకరంగా ఉండే ఈ నెలసరి నొప్పి నుంచి ఉపశమనం కోసం స్త్రీలు ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు. నొప్పి మరింత బాధిస్తే బయటకు వెళ్లాల్సిన కార్యక్రమాలను వాయిదా వేసుకోవటం రద్దు చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది. స్త్రీలు నెలసరి సమయంలో పడే బాధను అర్థం చేసుకుని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం సైతం… ఇటీవల సెలవులు కూడా మంజూరు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ నొప్పి నుంచి ఉపశమనం కలిగించే ఉత్పత్తులు తాజాగా మార్కెట్ లో లభిస్తున్నాయి. వీటిని వాడకం వల్ల నెలసరి సమయంలో స్త్రీలు పడే వేదన నొప్పి కాస్త పోరాట లభిస్తుందని తక్కువ సమయంలో ఎంతో తేడా గమనించవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం..

బెల్లం…
నెలసరి సమయంలో రక్తం నష్టం వల్ల కలిగే బలహీనతను పోగొట్టుకోవడానికి బెల్లం చాలా దివ్య ఔషధంగా పనిచేస్తుందని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కెమికల్ స్టడీస్ తెలియజేస్తూ ఉంది. బెల్లంలో ఉండే సోడియం, పొటాషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలు… గర్భాశయ తిమ్మిరిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇదే సమయంలో మూడ్ స్వింగ్స్, పొత్తికడుపు నొప్పి ఇతర లక్షణాలను బెల్లం నివారిస్తుంది అని తేలింది.
మసాజ్…
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం ప్రకారం… నూనెతో పొత్తి కడుపు మీద మర్దన చేయడం వల్ల కూడా బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు అని పేరేంది. ముఖ్యంగా మార్జొరం, లావెండర్, సీమ చామంతి వంటి ఔషధ మొక్కల నూనెతో పొత్తికడుపు మర్దన నొప్పి తీవ్రత తగ్గించడంతోపాటు వీటినుంచి వచ్చే పరిమళం మనసును తాజాగా ఉంచడానికి తోడ్పడుతుంది.
ఎక్సర్సైజ్ మరియు యోగ:
తేలికపాటి శరీరా వ్యాయామాలు ద్వారా కూడా నెలసరి నొప్పి నివారించవచ్చు. యోగాసనాలు వాళ్లు కూడా నొప్పి నివారించవచ్చు అని తెలియజేస్తున్నారు. హనుమానాసనం ద్వారా నెమ్మదిగా ఈ నొప్పిని తగ్గించుకోవచ్చు అని దీని ద్వారా అనేక మార్పులు కలుగుతాయి అని నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఏదైనా శరీరాన్ని ముందు వాము చేసుకుని తర్వాత యోగ చేసుకోవడం మంచిదని చెబుతున్నారు. హనుమానాసనంతో కాళ్ల పిక్కలు, కండరాలు, పాదాలు, తొడలు వీటన్నిటికీ ఒత్తిడి తగ్గుతుంది బ్యాలెన్స్ తో పాటు నరాల వ్యవస్థ ఉత్తేజితమవుతుంది. ఈ ఆసనం వల్ల నెలసరి సమయంలో వచ్చే కడుపు నొప్పి ఇతర ఇబ్బందులు చాలా వరకు తగ్గిపోతాయి. అయితే ఈ ఆసనాన్ని గర్భిణీలు, కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు, మోకాళ్ళ చికిత్స చేయించుకున్న వాళ్ళు.. తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వేయకూడదు అని నిపుణులు చెబుతున్నారు.
How to reduce period pain? మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలు..
మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాలు నెలసరి సమయంలో తీసుకోవడం వల్ల భరించలేని నొప్పి అధిగమించే శక్తి ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో బాదం, బ్లాక్ బీన్స్, బచ్చలి కూర, పెరుగు, వేరుశనగ వెన్న వంటి మెగ్నీషియం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినటం కడుపుతో తగ్గించడానికి సహాయపడతాయని చెబుతున్నారు.

మూలిక పానీయాలు..
నెలసరి సమయంలో దాల్చిన చెక్క, సోంపు, అల్లంతో చేసిన మూలిక పానీయాలను తాగటం వల్ల పీరియడ్స్ నొప్పి మరియు తిమ్మిరి తగ్గిపోతాయని చెబుతున్నారు. ఎందుకంటే ఈ మూలిక పానీయా మిశ్రమంలో శోధ నిరోధక లక్షణాలు ఉంటాయి. కండరాల నొప్పితో పాటు పెరియడ్ నొప్పి తీవ్రత తగ్గించే ఔషధ గుణాలు ఉంటాయని చెబుతున్నారు. అంతేకాదు పుదీనా టీ కూడా నెలసరి నొప్పి తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
తగినంత విశ్రాంతి…
నెలసరి సమయంలో ఒత్తిడి అలసిపోవటంతో నొప్పి అధికంగా సంభవిస్తూ ఉంటుంది. దీంతో ఆ సమయంలో స్త్రీ ఎంత విశ్రాంతి తీసుకుంటే బాధ నుంచి అంత నివారణ పొందవచ్చని… అనవసరమైన విషయాలకు.. చికాకులకు వెళ్ళటం వల్ల మరింత ఒత్తిడి అలసట పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
తగినంత మోతాదులో నీరు తీసుకోవాలి…
నెలసరి సమయంలో శరీరం హైడ్రేటెడ్ గా ఉంచటం అనేది చాలా అవసరం. ఆ సమయంలో రక్తం అధికంగా పోయే పరిస్థితి కావడంతో.. చాలా బలహీనమయే పరిస్థితి ఉంది. దీంతో కనీసం రోజుకి ఆరు గ్లాసుల నీళ్లు తాగాలి. లెట్యుస్ క్యాబేజీ, సెలేరి ఆకు కూర, దోసకాయ, పుచ్చకాయ, బెర్రీ పనులు వంటి నీరు పుష్కలంగా ఉండే పండ్లు కూరగాయలు తినటం వల్ల శరీరానికి అవసరమయ్యే మీరు అందుతుంది.