NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi March 28 2024 Episode 370: దుగ్గిరాల ఇంట్లో మరో రచ్చ.. అగ్గి రా చేసిన రుద్రాణి.. ధాన్యం మీద రాజ్ ఫైర్.. ఆఫీస్ కి బిడ్డ తో వెళ్లిన రాజ్.. రేపటి ట్విస్ట్..

Brahmamudi Today Episode March 28 2024 Episode 370 highlights

Brahmamudi March 28 2024 Episode 370:  రాజ్, బాబు ఏడుస్తూ ఉంటే సముదాయిస్తూ ఉంటాడు ఇక కావ్య వెళ్లి ఉగ్గు తీసుకొచ్చి తనకి తినిపిస్తుంది దాంతో బాబు ఏడవడం ఆపేస్తాడు. ఇంట్లో అందరూ కళ్యాణి హెల్ప్ తీసుకున్నందుకు కావ్య మీద కోప్పడతారు అలానే కళ్యాణ్ మీద కూడా అపర్ణ ఫైర్ అవుతుంది. దాంతో కావ్య హెల్ప్ తీసుకోనని బాబుకి ఉగ్గు తినిపించడానికి పైకి వెళుతుంది ఇక కళ్యాణ్ కూడా ఇంట్లో అందరికీ గట్టిగానే సమాధానం చెప్పి వెళ్తాడు. స్వప్న రావడంతో కావ్యకి కొంత సపోర్ట్ గా స్వప్న నిలుస్తుంది రాజ్ బిడ్డ ఎవరు తలలో చెప్పడానికి నీకు కొంత సమయం ఇస్తున్నాను. నువ్వు కనుక్కోకపోతే కనుక నేను రాజు మీద కంప్లైంట్ ఇవ్వడం ఖాయం అని చెప్తుంది స్వప్న.మరోవైపు అప్పుతో కళ్యాణ్ మాట్లాడడం అనామిక చూసి కళ్యాణ్ మీద కోప్పడుతుంది కళ్యాణ్ అనామికకి బుద్ధి చెప్పి ముందు భార్యగా ఎలా ఉండాలో నేర్చుకో ఇలా దొంగచాటుగా నేను మాట్లాడే మాటలు వినడం కాదు అనేసి వెళ్ళిపోతాడు.

Brahmamudi Today Episode March 28 2024 Episode 370 highlights
Brahmamudi Today Episode March 28 2024 Episode 370 highlights

ఈరోజు ఎపిసోడ్ లో కావ్య, బాబుకి స్నానం చేయించడానికి గార్డెన్ లోకి తీసుకురమ్మని రాజ్ తో చెబుతుంది. రాజ్ గార్డెన్ లోకి బాబును తీసుకొని వస్తే మీరు ముందు షార్ట్స్ కొనుక్కోవాలండి అని అంటుంది ఇప్పుడు ఎందుకు అని అంటే ముందు ముందు ఉపయోగపడతాయని అని అంటుంది కావ్య. ఇక బాబుకి స్నానం చేయించడానికి కూర్చోమని అంటుంది. బాబు నీ కాళ్ళ మీద పడుకోబెట్టి ఇప్పుడు ముందు ఆయిల్ రాయండి అని అంటుంది. అయ్యయ్యో ఏడుస్తున్నాడు అని అంటే అందరూ మీలాగా బాత్రూంలో పిచ్చి పాటలు పాడుతూ స్నానం చేయడు అందులో పసిపిల్లలు అస్సలు చేయరు. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా స్నానం చేయాలో తర్వాత మీరు చేయించండి అని అంటుంది. ఇక బాబుని కావ్య ఎత్తుకుంటుంది. నా అంత తింగరిది ప్రపంచంలో ఎక్కడ ఉండదు మర్యాదగా చెప్తున్నాను ఆ బాబు తల్లి ఎవరో తొందరగా తీసుకురండి అని అంటుంది కావ్య. ఇక బాబు నీ తన కాళ్ళ మీద పడుకోబెట్టుకొని వాడికి స్నానం చేయిస్తూ ఉంటుంది అది చూసి రాజ్ నవ్వుతూ ఉంటాడు. నన్ను మిమ్మల్ని ఈ టైంలో మీ అమ్మగారు చూస్తే మనిద్దరికీ ఒకేసారి తలాంటి పోస్తారు. అని కావ్య అంటుంది.

Brahmamudi Today Episode March 28 2024 Episode 370 highlights
Brahmamudi Today Episode March 28 2024 Episode 370 highlights

ఇక మరోవైపు ప్రకాశం ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు చెప్పింది నిజమేనా అని అంటే, అవును సార్ నేను గమనించుకోలేదు రాజు సార్ పట్టించుకుంటారు అనుకున్నాను కానీ ఆయన పట్టించుకోలేదు అని అవతల ఫోన్లో మేనేజర్ చెప్తాడు. ఇక అప్పుడే అనామిక రుద్రాణి పైనుంచి గమనిస్తూ ఉంటారు అనామిక ఏమైంది అని అడిగితే మీ మామయ్య ఎందుకో టెన్షన్ పడుతున్నాడు అదేంటో తెలుసుకోవాలి అని అంటుంది. ఇక ఇద్దరూ ప్రకాశం ఏం మాట్లాడుతున్నారో వింటారు ఇక రాజు వాళ్ళ కోటి రూపాయలు నష్టం వచ్చిందని ఇప్పుడు తెలిస్తే ఇంట్లో పెద్ద గొడవే జరుగుతుంది ఇప్పుడు నువ్వేం చెప్పకు అంతా నేను చూసుకుంటాను అని ప్రకాశం ఫోన్లో అంటాడు అదంతా రుద్రాణి అని అనామిక ఇద్దరూ వింటారు. రాజ్ ఏదో పనిలో ఉండి మర్చిపోయినట్టు ఉన్నాడు నేను చూసుకుంటాను మీరు మాత్రం మా అన్నయ్యకి చెప్పొద్దు అని ప్రకాశం ఫోన్ పెట్టేస్తాడు. చూసావా ఆంటీ మా బావగారు వాళ్ళ కోటి రూపాయలు నష్టం వచ్చినా కానీ మనం బయటికి చెప్పకూడదు అంట అని అంటుంది అనామిక, మీ మామయ్య చెప్పొద్దంటే మనం ఆగుతామా? మనం చెప్పేస్తాం కదా చిచ్చు పెట్టడానికి ఒక్క పుల్ల చాలు, ఆవుల తీసుకెళ్లి మీ అత్తయ్యకి చెప్తే చాలు అని రుద్రాణి,అనామిక ఇద్దరూ కలిసి ధాన్యంతో జరిగింది మొత్తం చెప్తారు.దొరికింది మా అక్క, ఆరోజు మా ఆయన 50 లక్షలు నష్టం తెచ్చాడని భార్యాభర్తలిద్దరూ ఎంత గొడవ చేశారు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు నేను చూస్తాను అని ధాన్యం కోపంగా బయటికి వెళుతుంది. రుద్రాణి అనామిక ఇద్దరూ మన ప్లాన్ సక్సెస్, అవతల వాళ్ళ మధ్య గొడవ పెడితే అందులో ఉండే ఆనందమే వేరు అని రుద్రాణి అనామిక అనుకుంటారు.

Brahmamudi Today Episode March 28 2024 Episode 370 highlights
Brahmamudi Today Episode March 28 2024 Episode 370 highlights

ఇక మరోవైపు, సుభాష్ ప్రకాష్ ఏం ఫోన్ మాట్లాడి లోపలికి వస్తుంటే మనకు రావాల్సిన ఒక ప్రాజెక్టు పంపించలేదంట ఏంటి అని అడుగుతాడు వాళ్ళ ముఖం అన్నయ్య, అది కాకపోతే ఇంకొకటి ప్రాజెక్టు వస్తుందిలే, అని ఏదో చెప్పి కవర్ చేయబోతూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన ధాన్యం రేపు మీరు ఆఫీస్ కి వెళ్లే దాకా మీకు అన్ని గుర్తు ఉంటాయా అని అంటుంది. బావ గారికి కారణం ఇప్పుడే చెప్పండి అని అడుగుతుంది. ఏయ్ నువ్వు ఈ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు. మీరు ఎందుకు ఈ విషయం దాచి పెడుతున్నారు మీ ఎవరిని కాపాడటానికి అని అడుగుతుంది ధాన్యం, అది నీకు అనవసరం అని అంటాడు ప్రకాశం వెంటనే సుభాష్ అసలు ఏం జరుగుతుంది ధాన్యం దేని గురించి మాట్లాడుతుంది నువ్వు ఏ విషయం చెప్పకుండా దాచి పెడుతున్నావు అని అంటాడు సుభాష్ వెంటనే అదేం లేదు అన్నయ్య అదేదో మాట్లాడుతుంది అని అంటాడు ప్రకాశం. ఈ ఆర్డర్ రాకపోవడం వల్ల మన కంపెనీకి కోటి రూపాయలు నష్టం వచ్చింది. ఆ మాట విని అందరూ షాక్ అవుతారు. ఆ నష్టానికి కారణం మన రాజ్ అని ధాన్యం బయటికి చెప్పేస్తుంది. కంపెనీ విషయాలు పట్టించుకోకపోవడం వల్లే ఇదంతా జరిగింది అని అంటుంది వెంటనే అపర్ణ లేచి నిలబడుతుంది. ప్రకాశం నీకేమైనా మెంటల్ ఎక్కిందా కంపెనీ అయిన తర్వాత లాభనష్టాలు వస్తూ ఉంటాయి. ఆ విషయం మీ ఆడవాళ్లకు ఎందుకు మధ్యలో మాట్లాడుతారు. అని ప్రకాశం అనగానే మా అక్క కూడా ఆడదేనండి లాభాల గురించి మాట్లాడలేదు కానీ మీ వల్ల 50 లక్షలు నష్టం వస్తే అప్పుడు మిమ్మల్ని నిలబెట్టి అడగలేదా ఇప్పుడు రాజు వాళ్ళ అంతకు డబల్ నష్టం వచ్చింది ఇప్పుడు దీని గురించి మా అక్క ఏమని సమాధానం చెప్తుంది అని అంటుంది ధాన్యం. ప్రకాశం నోరు మూసుకో లోపలికి వెళ్ళు అని అంటే ఇలా ఎంతకాలం నా నోరు మూయిస్తారు ఎన్ని విషయాల్లో నా నోరు కట్టేస్తారు, కోటి రూపాయలు నష్టం వచ్చిన అది బయటికి తెలియకుండా ఎందుకు మీలోనే దాచాలని చూస్తున్నారు అని అంటుంది. గుట్టుగా మీరు దాచినంత మాత్రాన ఈ ఇంట్లో మీకు కిరీటం పెట్టరు మీరు ఏదైనా మర్చిపోతే మాత్రం ఇలా అనే పదిమందిలో నిలబెట్టి పరువు తీస్తారు. అని ధాన్యం అనగానే అక్కడికి వచ్చిన రాజ్ ఎన్నిసార్లు పరువు తీశారు అని అంటాడు. మా బాబాయ్ పరువు మేము ఎన్ని సార్లు తీసాము ఎవరు తీసాము అని అంటాడు. అసలు వేరుగా మిమ్మల్ని ఎప్పుడైనా చూసామా మీకు మీరే మానసికంగా వేరైపోయి మమ్మల్ని వేరు చేసి మాట్లాడ్డం మొదలుపెట్టారు అని అంటాడు రాజ్. నిజమే ఈరోజు కోటి రూపాయలు నష్టం వచ్చి ఉండొచ్చు దాని కారణం నేను మా అమ్మ ఎందుకు సమాధానం చెప్పాలి అని అంటాడు. మరి అప్పుడు మీ అమ్మ కూడా మరిది గారు అని చూడకుండా వదిలేసి ఉండాల్సింది ఎందుకు మాట్లాడింది అని అంటుంది. వెంటనే అపర్ణ ధాన్యలక్ష్మి ఆరోజు నా భర్త నీకు సారీ చెప్పాడు. ఇప్పుడు ఆ విషయాలని ఎందుకు తిరగ తోడుతున్నావు అని అపర్ణ, అంటుంది. ఆఫీస్ విషయాలు ఆడవాళ్ళు పట్టించుకోకూడదు అని అప్పటి నుంచి ఇప్పటివరకు నేను ఎప్పుడు పట్టించుకోలేదు ఇప్పుడు నేను నీకు సమాధానం చెప్పాలా చెప్పను. ఏం చేస్తావు నోరు ఏసుకొని అరుస్తావా, అరువు ఇంతమందిలో నీ క్యారెక్టర్ కూడా బయటపడుతుంది అంతకంటే ఏం చేయగలవు నువ్వు అని అంటుంది అపర్ణ. కానీ కోటి రూపాయల నష్టం అని అనామిక అనగానే ఏ అని పెద్దగా అరుస్తుంది ధాన్యం, వచ్చింది అయితే ఏంటి నీ పుట్టిన నుంచి పసుపు కుంకాల ఆస్తి ఏమైనా ఇందులో కలిపావా అని అంటుంది. నీకు నీ పుట్టింటి వాళ్ళకి ఇందులో భాగస్వామిని ఏమైనా ఉందా అని అంటుంది అనామిక తో, నిన్నగాక మొన్న వచ్చావు కుక్కిన పెండ్లా పనుండు ఎక్కువ మాట్లాడితే, శాంతని పనిలో నుంచి తీసేసి కోడలిగా అన్ని పనులు నీ చేత చేయిస్తాను అని అంటుంది. దెబ్బకి అనామిక నోరు మూస్తుంది.

Brahmamudi Today Episode March 28 2024 Episode 370 highlights
Brahmamudi Today Episode March 28 2024 Episode 370 highlights

ఇక రాజ్ డాడీ నా మనసు బాగోలేదు నేను ఆఫీస్ కి వెళ్ళలేకపోయాను దాంతో వాళ్ళు డ్రాప్ అయిపోయారు. ఒక నెల తిరిగేటప్పటికి ఇంకొక క్లైంట్ వస్తాడు ఆ నష్టాన్ని నేను పూడుస్తాను ఆ నష్టాన్ని కారణం నేనే పిన్ని నాకు వారసత్వం ప్రకటించాక ఈ సంవత్సరం రెట్టింపు లాభాలు తెచ్చింది కూడా నేనే దేనికి సారీ చెప్పాలి నష్టానికి, లాభానిక అని అంటాడు. ఆఫీసులో జరిగిన నష్టం కాదు ఈ ఇంట్లో జరిగిన నష్టానికి ఎవరి సమాధానం చెబుతారు అని అంటాడు రాజ్. తోడికోడల మధ్య సంకేత దూరం అవుతుంది ఆనష్టానికి ఎవరు పుడస్తారు అని అంటాడు. అన్నదమ్ముల మధ్య కూడా ఆగాదం పెట్టేలా ఉన్నారు ఆ నష్టాన్ని ఎవరు పూరిస్తారు. స్వప్నకు ఆస్తి రాసి ఇచ్చినప్పుడు మా అత్తని ఈ ఇంటి ఆడబడితే కాదన్నారు అది లాభమా నష్టమా అని అంటాడు రాజ్, నష్టం ఈ ఇంట్లో జరుగుతుంది కోటి రూపాయలు ఇవ్వాలి కాకపోతే రేపైనా సంపాదిస్తాను. మానవ సంబంధాలు కుటుంబ విలువలు అంటే ఇంతేనా, ఉమ్మడి కుటుంబంలో బంధాలు దూరమైపోవడం లాభమా నష్టమా అని అంటాడు. నాకు చిన్న దెబ్బ తగిలితే తల్లడిల్లిపోయే ఆ తల్లి మనసు మీ నుండి దూరం అవ్వడం నష్టం. కళ్యాణ్ కి జ్వరం వస్తే ఇంటిల్లిపాది వాడి దగ్గర కూర్చుంటే అలాంటి వాళ్ళని మీరు ఇవాళ తక్కువ చేసి మాట్లాడడం నష్టం, ఒక అన్న తమ్ముని మందలించడం తప్పని చెప్పడం ఈ ఇంట్లో జరుగుతున్న నష్టం ఈ ఇల్లు ఒక గొప్ప కుటుంబం దీన్ని విచ్చినంకాకుండా కాపాడుకోవడం మన బాధ్యత. ఇప్పటివరకు లాభనష్టాలు గురించి చాలా బాగా మాట్లాడావు రాజ్. అని అపర్ణ అంటుంది.ఇక అపర్ణ రాజ్ తో మాట్లాడుతూ, ఒక పెద్ద పాల సముద్రంలో విషపు చుక్క పడింది అది లాభమా నష్టమా అని అడుగుతుంది. నీ వారసత్వంలోని అలసత్వం ఎక్కువైంది ఈ ఇంటి పునాదులతో సహా పెకిలించుకుంటూ ఒక రాతి మొక్క మొలిచింది అది లాభమా నష్టమా అని అడుగుతుంది అపర్ణ. ఈరోజు ధాన్యలక్ష్మి గాని ఇంకొకళ్ళు గాని మాట్లాడుతున్నారంటే, వాళ్లకి మాట్లాడే అవకాశం ఇచ్చింది ఎవరు? ఈ ఇంటి పెద్దరికం మంట కలిసి పోతుంటే చివరికి మిగిలే బూడిద రాశులను చూసుకుంటూ, అప్పుడు నువ్వు లెక్కలేసుకో ఎంత లాభం మిగిలిందో ఎంత నష్టం జరిగిందో, అని అక్కడి నుంచి అపర్ణ కోపంగా వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode March 28 2024 Episode 370 highlights
Brahmamudi Today Episode March 28 2024 Episode 370 highlights

ఇక మరోవైపు అప్పు పోలీస్ సెలక్షన్స్ కి వెళుతుంది మీరు అన్ని టెస్ట్ లో పాస్ అయ్యారు ఇక పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది మీరు రెడీగా ఉండండి అని అంటే థాంక్యూ అని చెప్పిఅప్పు బయటికి వస్తుంది. అందులో బయట ఇంకొకళ్ళు అప్పు అని పిలిచి, ఏంటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు అని అంటే మీరు లంచం ఇస్తేనే పని జరుగుతుంది అన్నారు కానీ నా టాలెంట్ మీద నేను ఇక్కడ దాకా వచ్చాను అని అంటుంది అప్పు అవును మీరు ఇక్కడ దాకా వచ్చారు కానీ చివర్లో ఆగిపోవాల్సి ఉంటుంది అని అంటాడు. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నేను పోలీస్ అవ్వకుండా ఆపలేరు అని అంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ అవ్వలేదు గా అని అంటాడు ఆ వ్యక్తి. మెయిల్ వస్తుందని చెప్పారా, అని అంటే అది నీకెలా తెలుసు అని అంటుంది అప్పు నాకు అన్ని తెలుసు మేడం నేను ఇక్కడ మీడియేటర్ ని, మీలాంటి యంగ్ టాలెంట్ ని ఇక్కడ బాగా ఎంకరేజ్ చేస్తారు. కానీ మధ్యలో నాలాంటి నీచులు కొంతమంది ఉండి వాళ్లకి లంచంగా ఏదో ఒకటి ఇవ్వకపోతే ఏ పని చేయరు. మీకు మెయిల్ రావాలి అంటే లోపల మా వాడే ఉంది మెయిల్ పంపించేవాడు వాడికి లంచం ఇస్తే కానీ, మీకు మెయిల్ పంపించరు. వెంటనే అప్పు నేను ఇప్పుడు ఇదే విషయం వెళ్లి ఆఫీసర్ చెప్తే ఏమవుతుంది అని అంటుంది ఆవేశ పడకండి మేడం ఆలోచించండి. ఇక్కడ దాకా వచ్చామంటే మా జాగ్రత్తలో మేముంటాం. మీ దగ్గర సాక్ష్యం లేకుండా ఏమీ చేయలేరు కదా నా మాట విని నా దారికి రండి. నేను చెప్పినట్టుగా చేస్తే మీరు ఈజీగా పోలీస్ అయిపోతారు ముందు చెప్పినట్టుగా పైసా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు అని అంటాడు. మీరు ఒకే ఒక్క నైట్ నేను చెప్పిన గెస్ట్ హౌస్ కి వస్తే చాలు మా వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేస్తే అన్ని వాటి అంతట అవే జరిగిపోతాయి అని, బాగా ఆలోచించుకొని చెప్పండి అని అంటే అప్పు కాలర్ పట్టుకొని ఈ బ్రోకర్ బుద్ధి చూపించావు కదరా అవసరమైతే పోలీస్ అవ్వాలని ఆలోచన కైనా వదులుకుంటా కానీ నా క్యారెక్టర్ అని మాత్రం వదులుకోను అని అంటుంది అప్పు. షర్టు పెట్టుకోగానే భయపడుతున్నావు నీకెందుకురా ఇలాంటి పనులు పోలీస్ చదివిన తరువాత నాలో ఆవేశం తగ్గించుకున్నాను కాబట్టి నువ్వు బతికి పోతున్నావు లేదంటే ఇక్కడే చంపేసేది దాన్ని అని అప్పు వాడికి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది.

ఇక రాజ్ ఆఫీస్ కి వెళ్తూ ఉంటే కావ్య ఎక్కడికి అని అడుగుతుంది. ఆఫీస్ కి అని అంటాడు అయితే ఆ బాబుని తీసుకుని వెళ్తున్నారా అని అంటుంది. నా దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు అని అంటాడు బాగుందండి బాబుని తీసుకొని ఆఫీస్ కి వెళ్తే నలుగురు ఏమంటారు అసలు మీరు ఈ గడప దాటేయడానికి ఆఫీస్కి ఆ భాగం తీసుకుని వెళ్లడానికి ఈ ఇంట్లో మీరు ఎన్ని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుందో తెలుసా అని అంటుంది. ఆ ప్రశ్నలు అన్నిటికి సమాధానం చెప్పి ఆ తర్వాత భాగం తీసుకెళ్లాల్సి వస్తుంది అని అంటే ఆ ప్రశ్నకి సమాధానం ఏంటో నాకు తెలుసు అని అంటాడు అయితే అదేంటో ఇప్పుడే ఇక్కడే చెప్పండి అని అంటుంది ఈ బాబుని ఇంట్లో ఉంచితే ఎవరూ పట్టించుకోరు కాబట్టి నాతో పాటు ఆఫీస్ కి తీసుకెళ్తున్నాను ఇంట్లో వాళ్లకు చెప్తాను అని అంటాడు. ఇంట్లో ఇన్ని ద్వారాలు దాటుకొని అమ్మమ్మ గారిని అత్తయ్య గారిని మావయ్య గారిని ఇంత మందిని దాటుకొని మీరు బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చేటప్పటికి ద్వారా మూసుకుపోతే ఏం చేస్తారు అని అంటే, మూసుకుపోయినప్పుడు ఆలోచిద్దాం అని అంటాడు.మీరు ఆ బిడ్డ తల్లిని తీసుకువస్తే నేను ఈ గడప దాటతాను అని అంటుంది కావ్య ఆ మాటలకు రాజ్ షాక్ అవుతాడు. మీరు విన్నది నిజమే మీరు ఆ బిడ్డ తల్లిని తీసుకు వస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఇంతేనా కర్మ అనుకుంటాను ఇక్కడితో నా ప్రయాణం ముగిసింది అనుకుంటాను అని అంటుంది కావ్య. రాజ్ మాత్రం దానికి సమాధానం చెప్పకుండా నువ్వు నాతో పాటు ఆఫీస్ కి రావాలి అని అంటాడు ఏ అధికారంతో మీతో పాటు ఆఫీస్ కి రావాలి మీ భార్య గాన లేదంటే ఆకు బిడ్డకి సవతి తల్లిగానా, మీ ఆఫీసులో పనిచేసే డిజైనర్ గానా అని అడుగుతుంది ఆఫీసులో పనిచేసే డిజైనర్ గాని రా అని అంటాడు రాజ్.దాంతో చేసేదేం లేక కావ్య మీతో పాటు వస్తాను. నేను ఇంకా మీ భార్యగా ఎన్ని అవమానాలు ఎదుర్కోవాలో అన్ని పడతాను అని అక్కడినుంచి అసహనంగా బయటికి వెళ్లిపోతుంది.. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది..

రేపటి ఎపిసోడ్ లో రాజ్ బాబుని ఎత్తుకొని కావ్య పక్కన నడుచుకుంటూ ఆఫీసులోనికి వస్తారు. ఆఫీసులో ఈ బాబు ఎవరు అని అడిగితే మీకు బాబు గురించి ఇన్ఫర్మేషన్ కావాలా లేదంటే పనిచేయడం ముఖ్యమా అని రాజ్ కోప్పడతాడు. ఇలా ఎంతమంది నోట్లు మూయిస్తారు అని అంటుంది కావ్య ఇక మరోవైపు శ్వేత ఆఫీస్ కి వస్తుంది బిడ్డ గురించి రాజ్ శ్వేత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే అక్కడికి వచ్చిన కావ్య వాళ్ళ కనపడకుండా గుమ్మం బయట నిలబడి అంతా వింటుంది దాంతో కావ్య షాక్ అవుతుంది. కావ్యకి బాబు గురించి నిజం తెలిసి షాక్ అయిందో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

author avatar
bharani jella

Related posts

NTR: ఎన్టీఆర్ తో సెల్ఫీ…. సారీ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్..!!

sekhar

Manchu Manoj: కూతురు పుట్టిన వెంటనే మంచు మనోజ్ చేసిన పనికి అవాక్ అయిన మౌనిక.. కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్..!

Saranya Koduri

Mogalirekulu: మొగలిరేకులు సాగర్ భార్యను చూశారా?.. ఈమె ముందు స్టార్ హీరోయిన్స్ కూడా బలాదూర్.‌.!

Saranya Koduri

Kumkuma Puvvu April 15 2024 Episode 2155: ఆశ కిటికీ లోనుండి బంటి ని చూస్తుందా లేదా.

siddhu

Guppedanta Manasu April 15 2024 Episode 1050: మహేంద్ర ఫణీంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతాడా లేదా.

siddhu

Malli Nindu Jabili April 15 2024 Episode 623: గెట్ రెడీ గౌతమ్ రోజు నీకు నరకం చూపిస్తూ చచ్చి బ్రతికేలా చేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Rashmika Mandanna: త‌న కెరీర్ లో ర‌ష్మిక మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. అస్స‌లు గెస్ చేయ‌లేరు!

kavya N

Love Guru: సినీ ప్రియుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌.. ఈ మూవీ చూస్తే మలేషియా, కశ్మీర్, ఊటికి ఫ్రీగా ఫ్యామిలీ ట్రిప్‌!

kavya N

Longest Run Movies: థియేట‌ర్స్ లో అత్య‌ధిక రోజులు ఆడిన టాప్ 5 తెలుగు సినిమాలు ఇవే..!!

kavya N

Mamagaru April 15 2024 Episode 186: పెళ్లి పేరుతో అందరినీ కలపాలనుకుంటున్నావా అంటున్న చంగయ్య,చంగయ్య ని మోసం చేసిన ఒక వ్యక్తి..

siddhu

Naga Panchami April 15 2024 Episode 1331: వైదేహి పంచమి కడుపులో ఉన్న బిడ్డను తీయించేస్తుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam April 15 2024 Episode 211: అరుంధతి అమ్మ గారే ఉంటే కాళికా రూపం ఎత్తి పెళ్లిని ఆపేది ని కన్నీళ్లు పెట్టుకుంటున్న రాథోడ్.

siddhu

Janhvi Kapoor: ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌తో పాటు మ‌రో స్టార్ హీరోను మ‌డ‌తెట్టేసిన జాన్వీ క‌పూర్‌.. ఇంత స్పీడ్‌గా ఉందేంట్రా బాబు..?!

kavya N

Madhuranagarilo April 15 2024 Episode 338: రుక్మిణి పండు ఆపరేషన్ కి డబ్బు సహాయం చేసిందని శ్యామ్ రాధకి చెప్తాడా లేదా..

siddhu

Aishwarya Rajinikanth: రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్ మాజీ భార్య‌.. ఐశ్వ‌ర్య‌కు కాబోయే వ‌రుడు ఎవ‌రంటే?

kavya N