రూ. 100 కోట్లు ఆఫ‌ర్ చేస్తే బ‌న్నీ వ‌ద్ద‌న్నాడట‌.. తెలుసా?

Share

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప ది రైజ్‌`. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ర‌ష్మిక హీరోయిన్‌గా న‌టించ‌గా.. ఫహాద్‌ ఫాజిల్, సునీల్, అజయ్ ఘోష్ విల‌న్లుగా న‌టించారు. ఎర్రచంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ నిర్మించారు.

గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న తెలుగు, త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ మ‌రియు హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి `పుష్ప ది రూల్‌` టైటిల్‌తో పార్ట్ 2 రాబోతోంది. ఫిబ్ర‌వ‌రిలోనే ఇది సెట్స్ మీద‌కు వెళ్లాల్సి ఉంది.

 

కానీ, పార్ట్ 1కు మించి పార్ట్ 2ను ప్లాన్ చేస్తున్న సుకుమార్‌.. ముందు అనుకున్న స్క్రిప్ట్‌లో ప‌లు మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇక‌పోతే ఈ మూవీకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. అదేంటంటే.. `పుష్ప 2` ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే శాటిలైట్, డిజిటల్ రైట్స్ కోసం ప‌లు ఓటీటీ సంస్థలు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయ‌ట‌.

ఇందులో భాగంగానే ఓ ప్ర‌ముఖ ఓటీటీ దిగ్గ‌జం నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం రూ.100 కోట్ల ఆఫర్ చేసిందట. ఆ ఆఫ‌ర్ ప‌ట్ల మైత్రి మూవీ మేక‌ర్స్ ఆస‌క్తిగా ఉన్నా.. బ‌న్నీ మాత్రం వ‌ద్ద‌న్నాడ‌ట‌. సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత బిజినెస్ ఇంకా బాగా జరుగుతుందని.. కాబట్టి అప్పటివరకు ఎలాంటి డీల్స్ ఓకే చేయొద్దని చెప్పిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో తెలియాల్సి ఉంది.


Share

Recent Posts

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంపై స్పందించిన ఏపీ సీఐడీ .. ఫోరెన్సిక్ రిపోర్టుపై డీజీ ఇచ్చిన క్లారిటీ ఇది

గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…

49 నిమిషాలు ago

దగ్గు తగ్గాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి..!

చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…

58 నిమిషాలు ago

చార్మి 13 సంవత్సరాల వయసు నుంచి తెలుసు అంటున్న పూరి జగన్నాథ్..!!

హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…

2 గంటలు ago

ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం .. 15 మంది విద్యార్ధులకు గాయాలు

హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…

2 గంటలు ago

సమంత టెన్త్ మార్క్ షీట్ లో ఇన్ని తప్పులా!

సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…

2 గంటలు ago

“గాడ్ ఫాదర్” టీజర్ రిలీజ్ డేట్ ఖరారు చేసిన సినిమా యూనిట్..!!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…

2 గంటలు ago