Sai Pallavi: సాయి పల్లవి అనగానే మొదటి గుర్తుకు వచ్చే పదం న్యాచురల్ బ్యూటీ. తన సహజ అందం, నటన మరియు డ్యాన్సులతో సాయి పల్లవి సౌత్ లో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. గ్లామర్ షోకు తావు లేకుండా ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు చేరువైంది. మేకప్ లేకుండా నటించే ఏకైక నటిగా పేరు తెచ్చుకుంది. టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా ఉన్నప్పటికీ తన సింప్లిసిటీ తో లక్షలాది మంది అభిమానులు సంపాదించుకుంది.
అలాగే సాయి పల్లవి తన ఫ్యామిలీకి అధిక ప్రాధాన్యత ఇస్తుంది. షూటింగ్స్ లేకపోతే తన పూర్తి సమయాన్ని కుటుంబ సభ్యులకే కేటాయిస్తుంది. ఇండస్ట్రీలో సాయి పల్లవికి ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ. అందులోనే టాలీవుడ్ లో ఆమెకు కేవలం ముగ్గురు స్నేహితులు మాత్రమే ఉన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి టాలీవుడ్ లో తనకున్న బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరో రివీల్ చేసింది.
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, రానా దగ్గుబాటి మరియు డైరెక్టర్ శేఖర్ కమల తెలుగు సినీ పరిశ్రమలో తనకున్న బెస్ట్ ఫ్రెండ్స్ అని.. తాము స్నేహితులుగా కాకుండా ఫ్యామిలీగా ఉంటామని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. అలాగే నాగచైతన్య, రానా, శేఖర్ కమ్ముల తనకు అన్ని సమయాల్లోనూ తోడుగా ఉంటారని సాయి పల్లవి తెలిపింది.
కాగా సాయి పల్లవిని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది శేఖర్ కమ్ములనే. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు ఫిదా, లవ్ స్టోరీ చిత్రాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి. లవ్ స్టోరీ చిత్రంలో సాయి పల్లవి, నాగచైతన్య తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ మూవీ అనంతరం మళ్లీ వీరిద్దరూ తండేల్ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఇక రానాతో కలిసి సాయి పల్లవి విరాటపర్వం చిత్రంలో నటించింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!