Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. మొత్తం 14 మంది సభ్యులు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం షో కాస్త నెమ్మదిగా సాగుతోంది. మంగళవారం ఎపిసోడ్ లో మొదటి ఎలిమినేషన్ ప్రక్రియ సాగనుంది. ఈ క్రమంలో మంగళవారం ఎపిసోడ్ కి సంబంధించి విడుదలైన ప్రోమోలో ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా జరిగినట్లు చూపించారు. కొంతమంది ఇంటి సభ్యుల మధ్య గొడవలు జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈసారి హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన 14 మందిలో.. ఇద్దరినీ నాగార్జునకి ఇష్టం లేకపోయినా “మా టీవీ” వాళ్ళు బలవంతంగా తీసుకొచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వాళ్లు సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు అనీ టాక్.
ఒకరు కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ అయితే మరొకరు మరి అందాల ఆరబోత చూపించే కంటెస్టెంట్ అని ప్రచారం జరుగుతోంది. వారిద్దరికీ అవకాశం కల్పించినందుకు నాగార్జున గట్టిగానే డిస్కషన్ చేసినట్లు.. అయితే వాళ్ల పేమెంట్ మొత్తం ఫైనల్ కావడంతో.. ఏం చేయలేక సైలెంట్ అయిపోయినట్లు సరికొత్త వార్త వినిపిస్తోంది. కాగా ఈసారి ఉల్టా పుల్టా అంటూ షో స్టార్ట్ అవ్వకముందు మంచి హైప్ ఇవ్వటం జరిగింది. షో స్టార్ట్ అయ్యాక చూస్తే.. హౌస్ లో మొదటి రోజు చాలామంది.. ఒంటి మీద బట్టలు లేకుండా.. వ్యవహరించారు.
మరోపక్క బిగ్ బాస్… కంటెస్టెంట్లకు.. మంచాలు, సోఫాలు, కుర్చీలు ఇవ్వకుండా మొదటి రోజే షాక్ ఇచ్చారు. కంటెస్టెంట్లను చూస్తే పెద్దగా ప్రముఖులు కాకపోవడంతో పాటు థర్డ్ క్లాస్ వారే.. అనీ టీవీ సీరియల్ ఆర్టిస్టులు తప్ప తెలిసిన మొహాలు పెద్దగా లేరని.. ఉన్నవారిలో ఒక్క నటుడు శివాజీ తప్ప.. పెద్ద ఆర్టిస్టులు లేకపోవడంతో… ఇంటి సభ్యుల విషయంలో ఆడియన్స్ మరోసారి చప్పగా ఫీలవుతున్నారట. మరి సీజన్ సెవెన్ ఈ సభ్యులతో ఏ రకంగా ఆడియన్స్ నీ అలరిస్తుందో చూడాలి.