NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu December 16 2023 Episode 948: శైలేంద్ర గురించి రవీంద్రకు నిజం తెలుస్తుందా.

Guppedantha Manasu Today Episode December 16 2023 Episode 948 Highlights

Guppedantha Manasu December 16 2023 Episode 948: మహేంద్ర జగతి శైలేంద్రను కూడా నీ దగ్గరికి పంపిస్తున్న తీసుకో అంటూ శైలేంద్రని షూట్ చేస్తాడు. అనుపమ వచ్చి మహేంద్రను పక్కకు నెట్టు వేస్తుంది కాస్తలో శైలేంద్ర బ్రతికి బయటపడ్డాడు. మహేంద్ర అడ్డు తప్పుకో అనుపమ నన్ను అడ్డుకోకు ఈరోజు శైలేంద్ర ప్రాణాలు తీయకుండా నేను ఊరుకోను అంటాడు. అనుపమ మహేంద్ర నేను చెప్పేది కాస్త విను శైలేంద్రని చంపి నువ్వు నేరస్తునివి కావద్దు అంటుంది. మహేంద్ర అయితే కానీ అనుపమ నేను నేరస్తుడిని అయినా నాకు వచ్చిన తలనొప్పి ఏమీ లేదు శిక్ష అనుభవిస్తాను కానీ ఇలాంటి నీచుడు భూమ్మీద బ్రతకడానికి నేను ఊరుకోను ఒప్పుకోను వీడిని ఎలాగైనా చంపి తీరుతాను అలాగే జైలుకు వెళతాను అంటాడు మహేంద్ర. వసుధార ప్లీజ్ మామయ్య నేను చెప్పేది కాస్త వినండి. మహేంద్ర నాకేమీ చెప్పొద్దమ్మా వసుధారా శైలేంద్రను చంపడమే ఇప్పుడు నా పని అంటాడు. వసుధార ప్లీజ్ మామయ్య నేను చెప్పేది కాస్త వినండి ఇప్పుడు మీరు శైలేంద్ర ను చంపి జైలుకు వెళ్తే నేను ఒంటరిగా ఎలా ఉండగలను చెప్పండి ఇప్పటికే జగతి మేడం చనిపోయారు తరువాత రిషి సార్ కనపడకుండా వెళ్లిపోయారు ఇప్పుడు మీరు కూడా లేకుండా వెళితే నేను కూడా బ్రతికి ఏం లాభం మామయ్య ఆలోచించండి అంటూ మహేంద్రని పక్కకి తీసుకు వెళుతుంది.

Guppedantha Manasu Today Episode December 16 2023 Episode 948 Highlights
Guppedantha Manasu Today Episode December 16 2023 Episode 948 Highlights

అనుపమ చూడు మహేంద్ర శైలేంద్రని సాక్షదారాలతో నిరూపించి తనకి శిక్ష పడేలా చేస్తాను ఆ విషయంలో నువ్వు ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు అని నేను ముందే చెప్పాను కదా మళ్లీ ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేస్తున్నావు చెప్పు అంటుంది అనుపమ. మహేంద్ర చూడు అనుపమ ఇన్ని తెలిశాక నేను ఏమీ చేయలేక చేతులు ముందట పెట్టుకొని కూర్చుంటే నాలాంటి నిస్సహాయతుడు ఎవరు ఉండరు మీరు ఈరోజు మధ్యలో రాకుండా ఉంటే శైలేంద్ర నా చేతిలో చచ్చేవాడు వాడి ప్రాణాలు గాల్లో ఎప్పుడూ కలిసిపోయేవి కానీ మీరు వచ్చి అడ్డుకున్నారు ఇది నాకు నచ్చలేదు అంటాడు. అనుపమ వసుధారా ప్లీజ్ మహేంద్ర నేను చెప్పేది కాస్త విను పద ముందు మనం ఇంటికి వెళ్దాం అని మహేంద్రను తీసుకొని వెళుతుండగా

Guppedantha Manasu Today Episode December 16 2023 Episode 948 Highlights
Guppedantha Manasu Today Episode December 16 2023 Episode 948 Highlights

కట్ చేస్తే అప్పుడే రవీంద్ర వస్తాడు మహేంద్రను చూసి రవీంద్ర ఏంటి మహేంద్ర ఎప్పుడు వచ్చావు అదేంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు ఇంట్లోకి పదండి భోజనం చేద్దాం అంటాడు. మహేంద్ర ఏం వద్దన్నయ్య నాకు ఆకలిగా లేదు అంటాడు. రవీంద్ర అదేంటి మహేంద్ర ఆకలి లేకపోవడం ఏంటి ఋషి గురించి బాధపడుతున్నావా రిషి ఎక్కడున్నా వెతికి కనిపెడదాము. కానీ ఆ పని చేసిన వాడు ఎవడో నాకు తెలిస్తే వాన్ని నిజంగానే నేను వదిలిపెట్టను నీ కంటే ముందే నేను వాడిని గోతి తీసి తొవ్వి పెడతాను నువ్వు ఆ విషయంలో ఏమి బాధపడకు మహేంద్ర నీకు తోడుగా నేనున్నాను కదా ఈ అన్నయ్యను మర్చిపోయావా మహేంద్ర అంటాడు రవీంద్ర. మహేంద్ర అయ్యో అదేం లేదు అన్నయ్య సరే నేను వెళ్తాను అంటాడు. అప్పుడే శైలేంద్ర పరిగెత్తుకుంటూ వచ్చి రవీంద్రతో నేను అదే చెబుతున్నాను నాన్న రిషి గురించి నువ్వేమీ వర్రీ కాకు రిషి ని ఎక్కడున్నా వెతికి నేను తీసుకు వస్తాను కాకపోతే కొంచెం నా ఆరోగ్యం కుదుటపడ్డాక నేనే స్వయంగా వెళ్లి రిషి ఎక్కడున్నాడు వెతికి తీసుకువచ్చి నీ చేతుల్లో పెడతాను అని చెప్పాను నాన్న కానీ బాబాయి అదంతా ఏమీ వినడం లేదు బాధపడుతున్నాడు అంటాడు శైలేంద్ర. వసుధర సరే సార్ మేము వెళ్తాము అని వెళ్ళిపోతారు.

Guppedantha Manasu Today Episode December 16 2023 Episode 948 Highlights
Guppedantha Manasu Today Episode December 16 2023 Episode 948 Highlights

రవీంద్ర ఇంట్లోకి రాగానే వస్తువులన్నీ కిందపడి ఉండడం చూసి శైలేంద్ర ఏంటి ఇల్లంతా గందరగోళంగా ఉంది ఈ వస్తువులన్నీ ఎందుకు ఇలా చిందరవందరగా పడి ఉన్నాయి ఏం జరిగింది చెప్పండి అంటాడు. శైలేంద్రఏమి సమాధానం చెప్పడు. రవీంద్ర దేవయాని నువ్వైనా నిజం చెప్పు మహేంద్ర ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నాడు శైలేంద్రకు ఎందుకు చెమటలు పట్టాయి మహేంద్ర మొహంలో కూడా మొత్తం చెమటలతో నిండిపోయింది ఏం జరిగింది ఏం గొడవ జరిగింది చెప్పు దేవి అని చెబుతావా లేదా అని గట్టిగా అరుస్తాడు రవీంద్ర. దేవయాని అబ్బే అదేం లేదండి మహేంద్ర మామూలుగానే ఉన్నాడు మామూలుగానే మాట్లాడాడు అంటుంది.రవీంద్ర నువ్వు అబద్దం చెబుతున్నావని నాకు అర్థం అవుతుంది దేవయాని సరే ధరణి నువ్వైనా చెప్పు ఏం జరిగింది? ఇక్కడ జరిగింది ఉన్నది ఉన్నట్టు మొత్తం నాకు క్లియర్గా చెప్తావా లేదా నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు ఏం జరిగిందో చెప్పు అంటాడు రవీంద్ర. ధరణి చెబుతాను మావయ్య గారు చిన్న మామయ్య గారు వచ్చి మీ కొడుకు శైలేంద్ర మీద గన్ను గురి పెట్టి చంపేస్తాను రిషి ఎక్కడున్నాడు చెబుతావా లేదా అంటూ ఎవరు అడ్డం వెళ్లిన అందర్నీ పక్కకు నెట్టు వేసి శైలేంద్రను చంపబోయాడు అని చెబుతోంది ధరణి.రవీంద్ర అవునా ఏంటి దేవి అని నువ్వు ఏం చెప్పావ్ మామూలుగా మాట్లాడాడు అంటావా ఎందుకు నా దగ్గర నిజం దాచాలని చూసావు దేవయాని చెప్పు అంటాడు. శైలేంద్ర నువ్వేమైనా పొరపాటు చేస్తున్నావా నిజం చెప్పు అంటాడు.

Guppedantha Manasu Today Episode December 16 2023 Episode 948 Highlights
Guppedantha Manasu Today Episode December 16 2023 Episode 948 Highlights

శైలేంద్ర నాన్న అదేమీ లేదు నేనేమైనా పొరపాటు చేయడానికి వాళ్ళు ఏమైనా బయటి వాళ్ళ చెప్పు నా పిన్ని బాబాయి తమ్ముడు నా కుటుంబం కదా వాళ్లని నేనెందుకు అలా చేస్తాను చెప్పండి నాన్న అంటాడు.రవీంద్ర శైలేంద్ర అలా అయితే ముకుల్ తీసుకువచ్చిన వాయిస్ రికార్డులో నీ వాయిస్ ఎందుకు వచ్చింది అంటాడు. దేవయాని అదేంటండీ అలా అడుగుతున్నారు అందుకు సమాధానం మన శైలేంద్ర చెప్పాడు కదా అంటుంది. రవీంద్ర మరి మహేంద్ర నిన్ను చంపడానికి ఎందుకు వస్తాడు చిన్న కారణం తోనే అయితే ఎవరూ చంపడానికి రారు ఏదైనా పెద్ద బలమైన కారణం ఉంటే తప్ప ఒక మనిషిని చంపడానికి వస్తారు అంటాడు.శైలేంద్ర వామ్మో నాన్న ముకుల్ కంటే నాన్న ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి ముందు ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అనుకుంటాడు. రవీంద్ర ఏంటి శైలింద్ర ఏం మాట్లాడావ్ ఏంటి రిషి కనిపించక పోవడానికి అందుకు కారణం నువ్వేనా నిజం చెప్పు అంటాడు. శైలేంద్ర నాన్న అదేంటి అలా మాట్లాడుతున్నారు నేను హాస్పిటల్లో ఉన్నాను కదా మరి నాకు ఎలా తెలుస్తుంది అంటాడు. దేవయాని అదేంటండీ వాడి కడుపు చీరేల పొడిచారు శైలేంద్ర ఆ సమయంలో స్పృహ లో లేడు మరి అలాంటప్పుడు ఆ పని ఎలా చేయగలడు చెప్పండి అంటుంది. రవీంద్ర దేవయాని నన్ను తప్పుదోవ పట్టించాలని చూడకు ఏదైనా చేయాలి అనుకుంటే స్పృహలోనే ఉండాలి ఇక్కడే ఉండి చేయాలి అని ఏమీ లేదు ఎక్కడో అండమాన్ జైల్లో ఉన్నా కానీ ఏ పనైనా చేయొచ్చు అంటాడు. శైలేంద్ర ఓ మై గాడ్ త్వరగా నా అన్న దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అంటూ అబ్బా కడుపు నొప్పి లేస్తుంది అంటూ కింద పడిపోయి ఏడుస్తాడు. దేవయాని చూశారా మీరు ఎక్కువగా వాడిని మాట్లాడించడం వల్లనే ఇప్పుడు నా కొడుక్కి కడుపు నొప్పి స్టార్ట్ అయింది ఇదంతా మీ వల్లే నాన్న శైలేంద్ర నువ్వు వెళ్లి రూమ్ లో రెస్ట్ తీసుకో పో అంటుంది.
మహేంద్ర దేవయాని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు ఇప్పుడు శైలేంద్ర కనిపించకపోతే నీకు ఎంత బాధ ఉంటుంది చెప్పు అదే బాధ మహేంద్ర కూడా పడుతున్నాడు మీకు అది అర్థం కావడం లేదు అంటాడు.

Guppedantha Manasu Today Episode December 16 2023 Episode 948 Highlights
Guppedantha Manasu Today Episode December 16 2023 Episode 948 Highlights

కట్ చేస్తే శైలేంద్ర రూమ్ లోకి వెళ్లి అమ్మ బాబోయ్ నాన్న నుంచి తప్పించుకున్నాను అంటూ తల పగిలిపోతుంది త్వరగా కాఫీ తాగాలి అంటు ధరణి ధరణి ఎక్కడున్నావ్ ఒకసారి ఇలా రా అని పిలుస్తాడు. ధరణి ఏంటండి చెప్పండి అంటుంది. శైలేంద్ర ఏమీ లేదు ధరణి తల బాగా పగిలిపోతుంది వెళ్లి స్ట్రాంగ్ గా వేడివేడిగా ఒక కాఫీ తీసుకురా అంటాడు. ధరణి అలాగేనండి అంటుంది. శైలేంద్ర ఆగుతారని నీకు నేను థాంక్స్ చెప్పాలి అంటాడు. ధరణి నాకు ఎందుకండి థాంక్స్ అంటుంది. శైలేంద్ర అవును ధరణి నువ్వు నన్ను రెండు సార్లు కాపాడవు ఒకసారి హాస్పిటల్ కి తీసుకువెళ్లి ఇంకొకసారి ఇప్పుడు బాబాయ్ చేతిలో నుంచి నీకు తెలియకుండానే నన్ను కాపాడేస్తున్నావు ధరణి అలాగే నన్ను ఇలా కాపాడుకుంటున్న నీలాంటి భార్య నాకు దొరికినందుకు మరి నీకు నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి కదా నీకు ఏం కావాలో కోరుకో అది నేను తప్పకుండా నెరవేరుస్తాను అంటాడు శైలేంద్ర. ధరణి ఏంటండీ నన్ను మీరు పాము లాగా వాడుకుంటున్నారు కదాఅంటుంది.శైలేంద్ర నిన్ను పాములాగా వాడుకోవడం ఎందుకు ధరణి ఆ టైంలో నువ్వు నా భార్యగా అన్ని చేసేస్తున్నావ్ ఇది నాచురల్ ఇక నువ్వు నా మనసు ఆలోచించినట్లుగా ఆలోచిస్తే ఇక నీకు నాకు ఎప్పటికీ సంతోషమే సరే నువ్వు వెళ్లి వేడివేడిగా ఒక కప్పు కాఫీ తీసుకురా పో అంటాడు శైలేంద్ర

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N