NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri February 1 2024 Episode 142: కేదార్ ని చంపడానికి ప్లాన్ వేసిన యువరాజ్…

Jagadhatri Today Episode February 1 2024 Episode 142 Highlights

Jagadhatri February 1 2024 Episode 142: చూడు మీ అక్క చేతికి గాయం అయింది అని యువరాజ్ అంటాడు. అది నిన్న కూరగాయలు కట్ చేస్తుంటే మా కళ్ళ ముందే తెగింది అని నిషిక అంటుంది. మరిది గారికి చెప్పుతుంటే వినిపించుకోకుండా నువ్వు జగదాత్రి ఐపీఎస్ కదా అంటున్నాడు చెల్లి అర్థమయ్యేలా చెప్పు అని జగదాత్రి అంటుంది. మేము పోలీసులమైతే అంత తక్కువ జీతానికి స్కూల్లో ఎందుకు పని చేస్తాం యువరాజ్ అని కేదార్ అంటాడు.పదండి పార్టీకి లేట్ అవుతుంది అని నిషిక యువరాజ్ ని తీసుకొని వెళ్తుంది.ధాత్రి కొంచమైతే మనం పోలీసులమని తెలిసిపోయేది కదా అని కేదార్ అంటాడు. అందుకే కదా కేదార్ ప్లాన్ వేసి కుంకుమ నీళ్ళు చల్లుకొని వాళ్లని నమ్మించింది అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 1 2024 Episode 142 Highlights
Jagadhatri Today Episode February 1 2024 Episode 142 Highlights

ఏంటి నిషి పార్టీ అంటే చాలా ఉత్సాహంగా ఉంటుందనుకున్నాను ఇంత సప్పగా ఉంది అని దివ్యాంక అంటుంది. నీకు కావాల్సిన వాళ్ళని పిలిపిస్తాను ఉండు అని కాచిని పిలిచి కీర్తి ఏడుస్తుందని కౌశికి వదినకు చెప్పమని చెబుతుంది.కీర్తిని అడ్డం పెట్టుకొని వదినను బాధ పెట్టాలని చూస్తున్నారు కేదార్ ఏదో ఒకటి చేయాలి అని జగదాత్రి అంటుంది. ఈ ఆటని భార్యాభర్తలకు సంబంధించింది కాబోయే భార్య భర్తలకు ఈ పార్టీ అంకితం చేస్తున్నాను అని నిషిక అంటుంది. కాచి వెళ్లి కౌశికిని పిలుచుకు రాగానే కీర్తి బెలూన్స్ తో ఆడుకుంటూ ఉంటుంది ఇందాక ఏడుస్తుంది అక్క అని కాచి అంటుంది. కౌశికిని చూసిన నిషిక దివ్యాంక గారు మీకు సురేష్ అన్నయ్యకి గేమ్ పెట్టబోతున్నాను అందులో బెలూన్స్ ఎవరు ఎక్కువగా పగలగొడితే వాళ్లే గెలిచినట్టు అని నిషిక అంటుంది. కేదార్ జగదాత్రి మీరు కూడా రండి ఆటోలో పాల్గొనండి అని బూచి అంటాడు. మాకు ఇంట్రెస్ట్ లేదు మీరు కానివ్వండి అని కేదార్ అంటాడు.

Jagadhatri Today Episode February 1 2024 Episode 142 Highlights
Jagadhatri Today Episode February 1 2024 Episode 142 Highlights

పర్వాలేదు రండి అని పిలిచి సురేష్ దివ్యాంక మధ్యలో బెలూన్ పెడుతుంది నిషిక. జగదాత్రి కేదార్ తల మధ్యలో బెలూన్ పెట్టి వీటిలో బాల్స్ ఎవరు పగలగొడితే వాళ్లే విన్నర్స్ అని చెప్పగానే ఇద్దరు బెలూన్స్ ని పల్లగొట్టడానికి ప్రయత్నిస్తారు అందులో దివ్యాంక కౌశికిని చూసి రెచ్చిపోయి ఆ బెలూన్ పక్కకు నెట్టేసి సురేష్ మీద పడుతుంది. అది చూసి కౌశికి బాధపడుతుంది. కౌశికి బాధపడుతుంటే నిషిక నవ్వుతుంది. కేదార్ బెలూన్ పగలగొడుతూ జగదాద్రి తల మీద ముద్దు పెడతాడు. అందరి ముందు సిగ్గు పడుతున్నట్టు ఆక్ట్ చేస్తావు కానీ మొదటి బెలూన్ కి ముద్దు పెట్టేసావుగా అని బూచి అంటాడు. ఎంత దూరం ఉన్నా సురేష్ మీద కాస్త ప్రేమ ఉందని అప్పుడప్పుడు భయం వేసేది కానీ ఇవన్నీ చూస్తుంటే ఇంకెక్కడి ప్రేమ అని వైజయంతి అనుకుంటుంది.

Jagadhatri Today Episode February 1 2024 Episode 142 Highlights
Jagadhatri Today Episode February 1 2024 Episode 142 Highlights

గేమ్ ఇంతటితో ఆపేద్దాం బెలూన్స్ ఎన్ని పగలగొట్టారో లెక్క పెడదాం అని నిషిక అంటుంది. దివ్యాంక కౌశికి దగ్గరికి వెళ్లి ఏంటి కౌశికి మా జంటను చూసి నీ కళ్ళల్లో కన్నీళ్ళకు బదులు నిప్పులు వస్తున్నాయి అని అంటుంది. నేను వద్దనుకున్న వాళ్లతో నాకు అవసరం లేదు మిమ్మల్ని చూసి బాధపడుతున్నానని అనుకోవడం పొరపాటు ఈ పార్టీ అయిపోయేదాకా ఇక్కడే ఉంటాను అప్పుడైన నేను బాధపడట్లేదని నువ్వు అనుకుంటావు అని కౌశికి అంటుంది. అది చూస్తాను అంటూ దివ్యాంక వెళ్తుంది. నా ఇంటికి వచ్చి కుప్పిగంతులు వేస్తున్నా ఎందుకు ఊరుకుంటున్నాను అంటే నిషిక బాధ పడుతుందని కౌశికి అంటుంది. మీరు ఇలాగే ఉండండి వదిన దివ్యాంకకి బుద్ధి చెప్పి ఇక్కడి నుంచి పంపిద్దాం అని జగదాత్రి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 1 2024 Episode 142 Highlights
Jagadhatri Today Episode February 1 2024 Episode 142 Highlights

మీనన్ యువరాజ్ కి ఫోన్ చేసి ఒక అతను పార్సల్ తెచ్చి ఇస్తాడు అని చెబుతాడు. మా ఇంట్లో ఉన్న పోలీసులని నేను కనిపెట్టేసాను బాయ్ అని యువరాజ్ అంటాడు. ఎవరు నాకు తలకు గురిపెట్టి గట్టిగా మాట్లాడిన ఆ స్వరం నాకు కావాలి అని మీనన్ అంటాడు. నాకు ఇంకా కొంచెం డౌట్ ఉంది బాయ్ ఆ డౌట్ క్లియర్ చేసుకొని మీ ముందు నిలబెడతాను కొంచెం టైం ఇవ్వు అని యువరాజ్ అంటాడు. ఈ లోగా నేను పంపించిన మనిషి వచ్చి నీకు పార్సల్ ఇచ్చి వెళ్తాడు తీసుకో ఆ తరువాత పోలీసుల్ని త్వరగా కనిపెట్టు అని మీనన్ ఫోన్ కట్ చేస్తాడు. మీనన్ మనిషి వచ్చి యువరాజుకి పార్సల్ ఇచ్చి అన్నా ఈ బాంబు ఈ కవర్ తీయగానే పేలుతుంది అని అతను చెబుతాడు. అయితే వెళ్లి ఆ కేదార్ కి ఇవ్వు అని యువరాజ్ అంటాడు. అలాగే అన్నా అని ఆ రౌడీ వెళ్లిపోతాడు. కేదార్ మా నాన్న నీకు తండ్రి కావాలని ఆరాటపడుతున్నావ్ కదా చూడరా ఈరోజుతో నీ చాప్టర్ క్లోజ్ అని యువరాజ్ అనుకోని లోపలికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode February 1 2024 Episode 142 Highlights
Jagadhatri Today Episode February 1 2024 Episode 142 Highlights

దివ్యాంగకు బుద్ధి చెప్తానని చెప్పి ఈ బెలూన్స్ లో కలర్ నింపుతున్నారేంటి అని మాధురి అంటుంది. ఈ బెలూన్స్ తో ఆడుకుంటూ ఉండగా నీళ్లు దివ్యాంక మీద పడి చిరాకు పడి ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది అని జగదాత్రి అంటుంది. సూపర్ ప్లాన్ కానీ ఈ బెలూన్స్ వాళ్ళ మీద పగలగొట్టేది ఎవరు అని కేదార్ అంటాడు. అటుగా పాట పాడుకుంటూ వెళ్తున్న బూచిని పిలిచి జగదాత్రి నిషి ఒక గేమ్ ప్లాన్ చేసింది అది మమ్మల్ని సిద్ధం చేయమని చెప్పింది అని జగదాత్రి అంటుంది. ఏం గేమ్ అది అని బూచి అంటాడు. ఎవరికీ చెప్పొద్దని చెప్పింది బావ అని కేదార్ అంటాడు. నాకు కూడా చెప్పొద్దన్నారా గేమ్ అని బూచి హర్ట్ అవుతాడు. మీరు అలా బాధపడకండి అన్నయ్య నేను చెప్తాను కదా ఈ బెలూన్స్ అన్ని తీసుకువెళ్లి పైనుంచి దివ్యాంక మీద పగలగొడితే అవి చూసి నిషిక ఎవరు ఎక్కువ పగలగొడితే వాళ్లకి లక్ష రూపాయలు ఇస్తారంట అని జగదాత్రికి చెబుతుంది. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు బావ అని కేదార్ అంటాడు. నాకు నిజంగా ఈ గేమ్ గురించి తెలియదు అంటూ బూచి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆ రౌడీ వచ్చి కేదార్ కి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. గిఫ్టు ఓపెన్ చేయబోతూ ఉండగా ఒక్క నిమిషం కేదార్ అని జగదాత్రి అంటుంది.

Related posts

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri