NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

Champai Soren: అదృష్టం వరించింది అంటే ఇదే కదా ..! తోటి కోడళ్ల పంచాయతీతో కుటుంబం దాటిన సీఎం పదవి

Champai Soren:  రాజకీయాల్లో సీఎం పదవి రావడం అంటే అంత ఈజీ కాదు. అందులోనూ ప్రాంతీయ పార్టీలో అయితే వ్యవస్థాపక కుటుంబానికే ఆ పదవి వరిస్తుంటుంది. కుటుంబ సభ్యులను దాటుకొని బయటి వ్యక్తికి ఆ పదవి దక్కడం కష్టసాధ్యమే. కానీ పార్టీ వ్యవస్థాపక కుటుంబ సభ్యుల్లో తోటి కోడళ్ల పంచాయతీ కారణంగా జార్ఘండ్ లో సీనియర్ నేత చంపై సోరెన్ సీఎం పదవి వరిస్తొంది. ఇది నిజంగా అదృష్టంగానే భావించాల్సి ఉంటుంది.

భూకుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఝార్ఖండ్ సీం హేమంత్ సోరెన్ ను బుధవారం రాత్రి ఈడీ అధికారులు అరెస్టు చేశారు. అంతకు ముందు ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి చంపై సోరెన్ ను జేఎంఎం సంకీర్ణ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. దీంతో కొత్త సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు.

తొలుత హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సొరెను సీఎం చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. అయితే కల్పనా సొరెన్ సీఎం కాకుండా తోటి కోడలు సీతా సొరెన్ అడ్డుపుల్ల వేశారు. కల్పనా సొరెన్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు తాను వ్యతిరేకమంటూ జేఎంఎం అధినేత శిబు సోరెన్ పెద్ద కోడలు ఎమ్మెల్యే సీతా సొరెన్ బహిరంగ ప్రకటన చేశారు.

ఎమ్మెల్యే గా ఎన్నిక కాని, రాజకీయ అనుభవం లేని కల్పననే సీఎంగా ఎందుకు..?  పార్టీలో ఎంతో మంది సీనియర్ లు ఉండగా..ఆమె పేరునే ఎందుకు ప్రచారం చేస్తున్నారు..? కుటుంబం నుండే సీఎం ను ఎన్నుకోవాలంటే ఇంట్లో తానే సీనియర్.14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాను అని ప్రకటించారు. హేమంత్ సోరెన్ భార్య కల్పన సొరెన్ ఎమ్మెల్యే కూడా కాదు. వదిన సీతా సొరెన్ 14 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఇప్పుడు ఆమె అభ్యంతరం చెప్పడంతో పార్టీకి మొదటి నుండి విధేయుడుగా ఉన్న సీనియర్ నేత చంపై సొరెన్ ను సీఎం అభ్యర్ధిగా ప్రతిపాదించారు. దీంతో పార్టీ శాసనసభా పక్ష నేతగా చంపై సొరెన్ ను ఎన్నుకున్నారు. ఇంతకూ చంపై సొరెన్ ఎవరు అంటే.. హేమంత్ సోరెన్ తండ్రి జేఎంఎం అధినేత శిబు సొరెన్ తో కలిసి పని చేశారు. పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరు. హేమంత్ సొరెన్ కుటుంబానికి నమ్మకమైన నేతగా ఉన్నారు. త్వరలోనే ఝార్ఖండ్ సీఎంగా చెంపై సొరెన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Interim Budget 2024: నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్ పై ఆశలు

Related posts

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju