NewsOrbit
Entertainment News Telugu TV Serials

Jagadhatri January 23 2024 Episode 134: దివ్యాంక కుట్రని గమనించలేని నిషిక తన మాయ మాటలో పడుతుందా లేదా?.

Jagadhatri Today Episode January 23  2024 Episode 134 Highlights

Jagadhatri January 23 2024 Episode 134:అయినా ఈ ఇంట్లో నీ కంటే ఎక్కువ నాకే హక్కు ఉంది అని జగదాత్రి అంటుంది. ఏంటే నాకన్నా ఈ ఇంట్లో నీకే ఎక్కువ హక్కు ఉందా ఎలా ఈ ఇంటి కోడలికి హక్కు లేకుండా నీకెలా ఉంటుంది ఏదో జాలిపడి ఇంట్లో ఉండనిస్తే మూలన ఉండక హక్కుల గురించి మాట్లాడుతున్నావు అని నిషిక అంటుంది. కొన్ని రోజులు ఆగు అప్పుడు అన్ని నీకే అర్థమవుతాయి అన్ని సమాధానాలకు నేను పరిష్కారం చెప్పాల్సి ఉంటుంది అని జగదాత్రి అంటుంది. చూడు దివ్యాంక వదినని బిజినెస్ లో గెలవడానికి ట్రై చెయ్ ఇలా చీపుగా ప్లాన్ చేసి తనని బాధపెట్టాలని నువ్వు చూస్తే నేను కొట్టే దెబ్బకి నువ్వు తట్టుకోలేవు అని జగదాత్రి వెళ్ళిపోతుంది. ఏంటి నిషి ఆ జగదాత్రి అంత తల పొగరుగా మాట్లాడుతుంది అని వైజయంతి అంటుంది. తనేదో అలాగే మాట్లాడుతుంది లెండి అత్తయ్య దానికి అంత సీన్ లేదు దివ్యాంక మనం బయటికి వెళ్లి మాట్లాడుకుందాం రా అని నిషిక వెళ్ళిపోతుంది. ఎలాగో అలా ఆ సురేష్ కి దివ్యాంక కి పెళ్లి అయితే మా ఇంటికి రాకుండా ఉంటాడు అని వైజయంతి అనుకుంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 23  2024 Episode 134 Highlights
Jagadhatri Today Episode January 23  2024 Episode 134 Highlights

కౌశికి దివ్యాంకా అన్న మాటలు అన్ని గుర్తుకు తెచ్చుకునే బాధపడుతూ ఉంటుంది. ఏంటి నిషి ఆ జగదాత్రికి ఇంట్లో అంత పవర్ ఉందని తెలిస్తే నేను తనతో మాట్లాడేదాన్ని కాదు అని దివ్యాంక అంటుంది. కౌశికి వదిన అండ చూసుకొని రెచ్చిపోతుంది  వారం రోజుల్లో అదే వెళ్ళిపోతుంది అని నిషిక అంటుంది. ఏంటి అలా చూస్తున్నావ్ దివ్యాంక అని నిషిక అడుగుతుంది. ఏమీ లేదు గుడ్ న్యూస్ చెబుదామనుకున్నాను రేపు చెప్పనా ఈరోజు చెప్పనా అని దివ్యాంక అంటుంది. ఏంటది ఈరోజే చెప్పండి అని నిషిక అడుగుతుంది. ఏమీ లేదు నాకు కంపెనీకి మేనేజర్ డైరెక్టర్ గా నిన్ను అపాయింట్ చేస్తున్నాను కౌశికి నిన్ను అసిస్టెంట్ మేనేజర్ గా ఉంచిందని బాధేసింది అందుకే నేను నాకు కంపెనీకి మేనేజర్ డైరెక్ట్ గా చేసుకుని మనిద్దరం కలిసి వర్క్ చేసి కౌశికి ని బిజినెస్ లో ఓడిద్దాం అని దివ్యాంక అంటుంది. నిజమా దివ్యాంక గారు ఉండండి ఇప్పుడే ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను అని నిషిక అంటుంది.డైరెక్ట్ గా కౌశికి ని ఎదురుకోలేనని నిన్ను అడ్డుపెట్టుకొని నా కంపెనీకి మేనేజర్ డైరెక్టర్ని చేసి నీ మీద తప్పుడు ఆరోపణలు రాసి నేనే న్యూస్ వచ్చేలా చేసి నీ కుటుంబం పరువు తీసి కౌశికిని మెంటల్గా దెబ్బతీస్తాను అని దివ్యాంక అనుకుంటుంది. నిషి ఇప్పుడు నువ్వు చెబితే వద్దని ఏదో ఒక సాకు చెప్తారు లేదంటే నువ్వు జాబు మానేయమంటారు రేపు చెప్పావు అనుకో బాగుంటుంది అని దివ్యాంక అంటుంది. సరే నువ్వు చెప్తున్నావ్ కాబట్టి అలాగే చేస్తాను అని నిషిక అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 23  2024 Episode 134 Highlights
Jagadhatri Today Episode January 23  2024 Episode 134 Highlights

కేదార్ జగదాత్రి సాక్షాల కోసం బయలుదేరుతారు. ధాత్రి నేను మా నాన్న కొడుకునాని ప్రూఫ్ చేసుకునే అవకాశం ఇన్నాళ్లకు వచ్చింది అంతా నీవల్లే నువ్వు నా లక్కీ అని కేదార్ అంటాడు.ఇంతలో యువరాజ్ సూరి దగ్గరికి వెళ్తాడు. సూరి తన మనవరాలికి అన్నం తినిపిస్తూ ఉంటాడు. యువరాజ్ అక్కడికి వెళ్లి సూరి మామ అంటే మీరేనా అని అడుగుతాడు. అవును బాబు నాతో ఏం పని ఎవరు నువ్వు అని సూరి అడుగుతాడు. నేను కేదార్ వల్ల ఫ్రెండ్ ని అంకుల్ తనకి ఆఫీసులో అర్జెంట్ వర్క్ ఉందంట నన్ను ఇక్కడికి వెళ్లి మీరేదో సాక్షాలు ఇస్తానన్నారంట కదా అవి నన్ను తీసుకుని రమ్మన్నాడు అని యువరాజ్ అంటాడు. అయితే ఒకసారి కేదార్ కి ఫోన్ చేసి  మాట్లాడించు బాబు ఇస్తాను అని సూరి అంటాడు. తను అలా అనేసరికి యువరాజ్ తన జేబులో నుంచి కత్తి తీసి తన మనవరాలికి పెట్టి కేదార్ గాడికి ఇస్తానన్న సాక్షాలు నాకు ఇవ్వు లేదంటే నీ మనవరాలిని చంపేస్తాను అని బెదిరిస్తాడు యువరాజ్.

Jagadhatri Today Episode January 23  2024 Episode 134 Highlights
Jagadhatri Today Episode January 23  2024 Episode 134 Highlights

వద్దు నా మనవరాలు ఏం చేయొద్దు ఆ సాక్షాలతో నువ్వేం చేసుకుంటావు బాబు అని అతను అంటాడు. తెచ్చి ఇస్తావా చంపేయమంటావా అని యువరాజ్ అంటాడు. సూరి వెళ్లి సాక్షాలు తీసుకువచ్చి ఫోటోని చూపెడతాడు. అందులో ఉన్నది ఎవరు అని యువరాజ్ అడుగుతాడు. అందులో ఉన్నది సుధాకర్ సుధాకర్ భార్య సుహాసిని కేదార్ వాళ్ళ అమ్మ అని సూరి చెబుతాడు. అంటే అందుకేనా నాన్న కేదార్ గాని ఇంట్లో ఉండనిచ్చాడు నిజంగానే కేదార్ నాన్నకు పెద్ద కొడుకా అని ఆలోచిస్తాడు యువరాజ్. ఆ ఫోటో లాక్కుంటాడు యువరాజ్.బాబు నా మనవరాలు వదిలే ఏం చేయకు అని సూరి తన చేతిలో ఉన్న కారంపొడిని తన కళ్ళల్లో కొట్టి మనవరాలుని తీసుకొని  ఫోటోని తీసుకుపోయేసరికి సగం చినిగి తన చేతిలోకి వస్తుంది అది తీసుకొని పారిపోతాడు. కళ్ళు మండుతూ ఉండగా యువరాజ్ అక్కడే కూర్చుంటాడు. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 23  2024 Episode 134 Highlights
Jagadhatri Today Episode January 23  2024 Episode 134 Highlights

ఇంతలో జగదాత్రి కేదార్ అక్కడికి వచ్చి సూరి మామ అని పిలుస్తాడు. ఇంట్లో ఎవరూ లేరు కేదార్ కాని ఏదో జరిగింది అని జగదాత్రి అంటుంది. ఇంతలో యువరాజ్ పారిపోతుండగా సౌండ్ వస్తుంది అక్కడికి వెళ్లి చూసేసరికి యువరాజ్ కనబడతాడు. మనకంటే ముందే యువరాజ్ ఇక్కడికి వచ్చి సాక్షుల కోసం సూరి మామని బెదిరించాడు అందుకే భయపడి తన మనవరాలి ని తీసుకొని పారిపోయాడు సూరి మామ మా నాన్న కొడుకునని ప్రశ్నగానే మిగిలిపోతుందా దాత్రి అని కేదార్ బాధపడతాడు. యువరాజుకు నిజం తెలిసిపోయింది కేదార్ నువ్వు సుధాకర్ మామయ్య కొడుకుని ప్రూవ్ చేస్తానని నీకు మాట ఇచ్చాను యుద్ధం సృష్టించి అయినా సరే యుద్ధం చేసైనా సరే వజ్రపాటి సుధాకర్ కొడుకు వ్వేనని నిరూపిస్తాను నువ్వేం బాధపడకు అని జగదాత్రి కేదార్ ని తీసుకొని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode January 23  2024 Episode 134 Highlights
Jagadhatri Today Episode January 23  2024 Episode 134 Highlights

యువరాజ్ ఆ ఫోటో పట్టుకొని ఆలోచిస్తూ ఈ విషయం అమ్మ కూడా తెలియకూడదు ఎన్ని అబద్ధాలు ఆడవు నాన్న అని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయం నిషికకి కూడా తెలియకూడదు తెలిస్తే అన్ని అబద్ధాలు ఆడి పెళ్లి చేశారని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని యువరాజ్ అనుకుంటాడు..

Related posts

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri