Brahmamudi: ప్రముఖ బుల్లితెర సీరియల్ బ్రహ్మముడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడమే కాకుండా ఇందులో నటిస్తున్న నటీనటులు కూడా తమనటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న మానస్ , కావ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సీరియల్ లో లీడ్రోల్ పోషిస్తున్న వీరిద్దరూ తమ నటనతో అందంతో బుల్లితెర ప్రేక్షకులను టీవీకే కట్టిపడేస్తున్నారు ఇదిలా ఉండగా బ్రహ్మముడి సీరియల్ ద్వారా భారీ పాపులారిటీ దక్కించుకొని బిగ్ బాస్ తో మరింత క్రేజ్ సొంతం చేసుకున్న మానస్ ప్రతి ఒక్కరికి సుపరిచితుడే.

హౌస్ లో ఉన్నంతసేపు చాలా అమాయకంగా అందరి మనసులు దోచుకున్న ఈయన అద్భుతమైన టాస్క్ పెర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా పెద్దలు కుదిర్చిన వివాహానికే ఓటు వేసిన మానస్ తాజాగా నిశ్చితార్థం జరుపుకున్నట్లు తెలుస్తోంది.

శ్రీజ నిస్సంకర అనే అమ్మాయితో బుల్లితెర నటీనటులు, కుటుంబ సభ్యుల మధ్య అంగరంగ వైభవంగా నిశ్చితార్థాన్ని జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఒక పోస్ట్ తో బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య అటు మానస్ ను ఇటు స్టార్ మాను బుక్ చేసిందని చెప్పవచ్చు. ఇంతకు కావ్య అన్నమాట ఏమిటి అనే విషయానికి వస్తే.. మానస్, శ్రీజాలు ఎంగేజ్మెంట్ ఫోటోని ఆమె షేర్ చేస్తూ కంగ్రాట్యులేషన్స్ మానస్ గారు.. శ్రీజ గారు.. వీరిద్దరినీ హైదరాబాదుకు తీసుకురండి స్టార్ మా షో లో వీరిద్దరికి మళ్ళీ ఎంగేజ్మెంట్ చేయండి..

ఇది నేను కాదు అభిమానులు అడుగుతున్న మాటగా చెబుతున్నాను. ముఖ్యంగా మానస్ అభిమానులు అడుగుతున్నారు కదా అన్నట్టుగా ఒక పోస్ట్ వదిలింది కావ్య. ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతుంది.మరి కావ్య ఫ్యాన్స్ తరఫున కోరినట్టు కోరగా అటు మానస్.. ఇటు స్టార్ మా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.