Vaishnavi Chaitanya: తెలుగు అమ్మాయిగా మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య. గతంలో వెబ్ సిరీస్, షార్ట్ ఫిలిమ్స్ సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించింది. తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “అలా వైకుంఠపురం లో” కూడా నటించడం జరిగింది. ఈ సినిమాలో బన్నీ చెల్లెలుగా నటించింది. అనంతరం ఇటీవల దర్శకుడు సాయి రాజేష్ తీసిన “బేబీ”లో వైష్ణవి చైతన్య హీరోయిన్ అవకాశమందుకొని బ్లాక్ బస్టర్ సొంతం చేసుకోవడం జరిగింది. . ఈ సినిమాలో గతానికి భిన్నంగా లిప్ లాక్ సన్నివేశాలు కూడా చేయడం జరిగింది.

ప్రస్తుతం బయట సమాజంలో ప్రేమ అనే పేరుతో అమ్మాయిలు చేస్తున్న వైఖరిని కళ్లకు కట్టినట్లుగా అద్భుతంగా తెరకెక్కించాడు సాయి రాజేష్. ఈ సినిమాలో ఆనంద దేవరకొండ, వీరాజ్ అశ్విన్ హీరోలుగా నటించారు. యువతను ఎంతగానో ఆకట్టుకుంది

ఈ సినిమా. సినిమాతో వైష్ణవి చైతన్య కి మంచి పేరు వచ్చింది. ఏకంగా సినిమా చూసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మీడియా సమావేశం నిర్వహించి.. వైష్ణవి చైతన్య నటనని మెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే “బేబీ” సినిమాకి సీక్వెల్ తీసే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నట్లు సమాచారం. ఇలా ఉంటే వైష్ణవి చైతన్య తన కొత్త సినిమాల విషయంలో సంతకం పెట్టడానికి రెండు కండిషన్స్ పెడుతూ ఉందట.

అదేమిటంటే సినిమాలో లిప్ లాక్ సీన్స్ ఉండకూడదని అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తేనే సినిమాకి ఓకే చెబుతూ ఉందట. ఈ క్రమంలో రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలు బేరాలకు దిగితే వెంటనే వైష్ణవి చైతన్య నో చెప్పేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.

“బేబీ” సినిమా విజయంతో ఈ తెలుగు అమ్మాయికి భారీ ఎత్తున అవకాశాలు వస్తూ ఉన్నాయట. అయితే బేబీ సినిమాలో లిప్ లాక్ సన్నివేశాలకి బాగా నెగిటివిటీ రావటంతో వైష్ణవి చైతన్య ఇప్పుడు కెరియర్ పరంగా కాస్త జాగ్రత్త పడుతుందట.