NewsOrbit
Entertainment News OTT సినిమా

Narayana & Co Review: “నారాయణ అండ్ కో” మూవీ రివ్యూ & OTT రిలీజ్ డీటెయిల్స్..!!

Narayana & Co Review: నారాయణ అండ్ కో రెండు గంటల 50 నిమిషాల నిడివి కలిగిన ఈ సినిమా ఈ ఏడాది జూన్ నెలలో థియేటర్ లలో విడుదలైంది. కామెడీ సస్పెన్స్ డ్రామా తరకెక్కిన ఈ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

నటీనటులు: సుధాకర్‌ కోమాకుల, ఆర్తిపొడి, దేవీ ప్రసాద్‌, ఆమని, పూజ కిరణ్‌, సప్తగిరి, తోటపల్లి మధు తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చిన్నా పాపిశెట్టి
నిర్మాత: పాపిశెట్టి బ్రదర్స్‌, సుధాకర్‌ కోమాకుల
కథ: రవి గోలి
డైలాగ్స్: రాజీవ్ కోసనం
బ్యాక్ గ్రౌండ్ స్కోర్: కమ్రాన్
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
సంగీతం: సురేశ్‌ బొబ్బిలి, డాక్టర్‌ జోస్యభట్ల, నాగవంశీ, జోశ్యభట్ల శర్మ
సినిమాటోగ్రఫి: రాహుల్ శ్రీవాస్తవ్
OTT: అమెజాన్ ప్రైమ్

Narayana & Co (2023) - Movie | Reviews, Cast & Release Date in kanchipuram-  BookMyShow
స్టోరీ:

జానకి (ఆమని), నారాయణ (దేవి ప్రసాద్) మధ్యతరగతి కుటుంబానికి చెందిన దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు ఆనంద్ (సుధాకర్ కొమకుల) క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. క్రికెట్ బెట్టింగ్ లలో డబ్బులు పెట్టే అలవాటు ఉంది. దీంతో పెద్దకొడుకు ఆనంద్ బెట్టింగ్ లలో డబ్బులు పోగొట్టుకొని 10 లక్షల వరకు అప్పుల పాలవుతాడు. ఇక చిన్న కొడుకు పేరు సుభాష్ (జై కృష్ణ). కెమెరామెన్ గా పనిచేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో సుధాకర్ ఇంటికి వెళ్లి అక్కడ ఫోటోలు వీడియోలు తీస్తూ ఓ అమ్మాయినీ పరిచయం చేసుకుంటాడు. అయితే ఆ అమ్మాయితో సుభాష్ సన్నిహితంగా ఉన్న వీడియోలు ఓ అజ్ఞాత వ్యక్తి రికార్డు చేయడం జరుగుతుంది. దీంతో సుభాష్ కి ఆ వీడియోలు పంపి 10 లక్షలు ఇవ్వకపోతే వైరల్ చేస్తానని సాగర అజ్ఞాత వ్యక్తి బెదిరింపులకు పాల్పడతాడు. ఇదే సమయంలో తండ్రి నారాయణ పనిచేస్తున్న బ్యాంకులో 25 లక్షల దొంగతనం జరుగుతుంది. అది నారాయణ మీదకు వస్తుంది. ఆ 25 లక్షలు ఇవ్వకపోతే పోలీస్ కేసు పెడతానని బ్యాంకు మేనేజర్ నారాయణ మీద మండిపడతాడు. ఈ రకంగా నారాయణ ఫ్యామిలీ డబ్బు కష్టాలలో పడటంతో వీళ్లంతా కలిసి ఎవరైనా కిడ్నాప్ చేయాలని భావిస్తారు. ఈ క్రమంలో బంధువులలో ఒకరిని కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తే అది వర్కౌట్ కాదు. ఇదే సమయంలో వారికి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న రౌడీ శంకర్ (తోటపల్లి మధు) తో ఒక డీలింగ్ కుదురుద్ది. అదేమిటంటే ముంబైకి వెళ్లి ఒక పిల్లి బొమ్మను తీసుకొస్తే… కోటి రూపాయలు ఇస్తానని ఆఫర్ చేస్తారు. దీంతో నారాయణ ఫ్యామిలీ ఈ డీల్ ఒప్పుకోవడం జరుగుతుంది. ముంబాయికి వెళ్లి ఆ పెళ్లి బొమ్మను తీసుకువచ్చే క్రమంలో… నారాయణ కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు ఏమిటి..? ఆ పిల్లి బొమ్మ తీసుకొస్తే కోటి రూపాయలు ఇవ్వడానికి గల కారణం ఏమిటి..? ఇంతకీ ఆ పిల్లి బొమ్మల విశిష్టత ఏముంది? బ్యాంకులో డబ్బులు దొంగతనం చేసింది ఎవరు? సుభాష్ నీ బ్లాక్మెయిల్ చేస్తున్నది ఎవరు? ఈ క్రమంలో దుండగులను పోలీసులు ఎలా పట్టుకున్నారు… అనేది మిగతా స్టోరీ.

Life is Beautiful actor Sudhakar Komakula turns producer for his next film  Narayana And Co; here's the first look
విశ్లేషణ:

మధ్యతరగతి కుటుంబానికి చెందిన కష్టాలను చాలా అద్భుతంగా చూపించారు. ముఖ్యంగా కొడుకులిద్దరూ పడుతున్న ఆర్థిక కష్టాలను అర్థం చేసుకునే తండ్రిగా.. దేవి ప్రసాద్ యాక్టింగ్ చాలా బాగుంటది. కుటుంబం మొత్తం చాలా వరకు తింగరి పన్నులే చేస్తూ సినిమా సాగుతూ ఉంటది. సినిమాలో చాలా సన్నివేశాలు ముందుగానే అర్థం చేసుకునే కథనం కావడంతో కాస్త బోర్ అనిపిస్తుంటది. మొదట నారాయణ ఫ్యామిలీ స్థితిగతులను చూపించి తర్వాత హీరో హీరోయిన్స్ పరిచయాలు తర్వాత పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ కావడం.. వంటి సీన్స్ తో సినిమా సాగుద్ది. ఫస్టాఫ్ కాస్త ఎంటర్టైన్మెంట్ కనిపిస్తది. సెకండ్హౌస్ మాత్రం కొద్దిగా రోటీన్ స్టోరీ మాదిరిగా సినిమా సాగుద్ది. పెద్ద కొడుకు ఆనందం పాత్రకి సుధాకర్ అద్భుతంగా న్యాయం చేశాడు. డాన్స్ పరంగా కూడా బాగా ఆకట్టుకోవడం జరిగింది. తమ్ముడు సుభాష్ గా జయకృష్ణ కూడా తన నటనతో ఆకట్టుకున్నాడు. సినిమాకి అతిపెద్ద ప్లస్ దేవి ప్రసాద్ మరియు సీనియర్ హీరోయిన్ ఆమని పూర్తిగా కామెడీ పండించటం. ఇద్దరు చేసే కొన్ని కామెడీ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. అంతేకాదు సినిమాలో ఎక్కువగా వీరిద్దరికే స్క్రీన్ స్పేస్ లభించింది. ఇంకా పోలీస్ ఆఫీసర్ ఎస్సై అర్జున్ గా అలీ రేజా కూడా బాగా ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రలు కూడా అద్భుతంగా అలరించడం జరిగాయి. కమెడియన్ సప్తగిరి కామెడీ అంతగా పండలేదు.

ప్లస్ పాయింట్స్:-

నటీనటుల పెర్ఫార్మెన్స్.
కామెడీ.
సినిమాటోగ్రఫీ.
ఫస్టాఫ్.

మైనస్ పాయింట్స్:-

సెకండాఫ్.
అనవసరమైన సన్నివేశాలు.
సాగదీత సన్నివేశాలు.
లాజిక్స్ లేని సన్నివేశాలు.
కథకు సంబంధిత లేని సన్నివేశాలు.

Narayana & Co' Teaser: Funny family! - Telugu News - IndiaGlitz.com

నారాయణ అండ్ కో OTT రిలీజ్ డీటెయిల్స్:

ఫస్టాఫ్ అదిరిపోయే కామెడీ ఇంకా సెకండ్ హాఫ్ ప్రేక్షకులను గందరగోళానికి గురిచేసిన నారాయణ అండ్ కో సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వచ్చేయడం జరిగింది. ప్రైమ్ వీడియో అనే ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. దాదాపు రెండు నెలల తర్వాత.. ఈ వారం నుండి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లో మిస్ అయిన వాళ్ళు.. ఓటీటీలో చూడవచ్చు.

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri