Krishna Mukunda Murari: మురారి స్టేషన్ కి వెళ్తుండగా తన కారులో కూర్చున్నావు ముకుందా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి అని అనగానే.. మురారి కార్లో నుంచి లేచి బయటకు వస్తాడు.. ఏమైంది నీకు అని మురారి ముకుందను అడుగుతాడు నన్ను ప్రేమించిన నా మురారి నా కోసం కాకుండా తన భార్య కోసం నా దగ్గరకు వచ్చాడు.

అందుకని కంప్లైంట్ ఇవ్వాలి అని అంటుంది.. నువ్వు నన్ను తీసుకువచ్చి ఈ ఇంట్లో ఒంటరి దాన్ని చేసావు భర్త ప్రేమకు నోచుకునే అవకాశం లేకుండా చేసావు పోనీ నీ ప్రేమను సొంతం చేసుకునే ఆస్కారం కూడా లేదు అంటూ.. ముకుందా తన మనసులో ఉన్న వేదనని మొత్తం మురారి కి చెబుతుంది. ముకుందా మాట్లాడుతున్న మాటలు విని మురారి తను ఎంత తప్పు చేశాడో అని అనుకుంటాడు. మరోవైపు ముకుందా మాటలు విని మురారి ఎమోషనల్ అవుతాడు. నువ్వు బాధ పడాలని నేను ఈ విషయాలు చెప్పడం లేదు మురారి. నా బాధ నీకు అర్థం అవ్వాలని చెబుతున్నాను నన్ను కూడా అర్థం చేసుకో అని చెప్పి ముకుందా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
అలేఖ్య వాళ్ళ అత్తయ్య మాట్లాడుకుంటున్న మాటలను నందిని ఉంటుంది . కృష్ణ మీద చాడీలు చెప్పుకుంటున్నారా మీరు అంటూ పెద్ద పెద్దగా నందిని అరుస్తుంది. అప్పుడే రేవతి అక్కడికి వస్తుంది
. కృష్ణ మీద వీళ్లు చాడీలు చెప్పుకున్నారు. ఈ ఇంట్లో కృష్ణ పెత్తనమే జరుగుతుందని అంటున్నారు అని నందిని అన్నమాటలకు రేవతి రియాక్ట్ అవుతుంది. కృష్ణ చేసింది కరెక్ట్ అంటున్నాను అనగానే.. సీన్ లోకి ముకుంద వస్తుంది. ఈ ఇంటికి భవాని అక్కే పెద్ద. తను. తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అని రేవతి అంటుంది.
మురారి అలసిపోయి ఇంటికి వస్తాడు ఏమైంది ఏసీబీ సార్ అలా ఉన్నారు అని కృష్ణ అడుగుతుంది. రేవతి అత్తయ్య ఏదో విషయం గురించి బాధపడుతున్నారు. అలాగే మీరు కూడా ఏదైనా విషయం గురించి బాధపడుతున్నారని కృష్ణ అడుగుతుంది. ఆదర్శ్ గురించి ఆలోచిస్తున్నారా అంటే.. అవును అని అంటాడు ఆదర్శ్ ముకుందా కలిసి ఉంటేనే మనం సంతోషంగా ఉంటాము అని మురారి అనగానే.. అదేంటి అలా మాట్లాడుతున్నారు వాళ్లకి మనకి ఏం సంబంధం అంటూ కృష్ణ అడగగానే మురారి కోపంగా కృష్ణను అరుస్తాడు.. ఈ విషయాలన్నింటినీ రేవతి దూరంగా గమనిస్తూ ఉంటుంది.
ఇక రేపటి ఎపిసోడ్ లో రేవతి మురారి అని పిలిచి కృష్ణను సినిమాకు తీసుకెళ్లమని చెబుతుంది. ఆ విషయం తెలుసుకున్న ముకుందా కార్ టైర్లో గాలి తీసేస్తుంది. ఇప్పుడు ఎలాగా అని కృష్ణ దిగాలుగా ఉంటే.. మురారి బైక్ తీసుకొని వస్తాడు. బైక్ పై కూర్చొని గేర్ రైస్ చేయగానే కృష్ణ మురారి మీదకు వాలుతుంది. వాళ్లిద్దరూ దగ్గరవడం.. ముకుందా టెర్రస్ మీద నుంచి ముకుంద ఈ విషయాలన్నింటినీ గమనిస్తూ ఉంటుంది.