Krishna Mukunda Murari: మురారి ముకుంద వాళ్ళ నాన్న వచ్చి ఇంట్లో చేసిన గొడవ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కృష్ణ వచ్చి బౌ అని దడిపిస్తుంది. ఏంటి కృష్ణ నేను సీరియస్గా ఆలోచిస్తుంటే నువ్వు ఇలా చేస్తావ్ ఏంటి చిన్న పిల్లలాగా అని మురారి అంటాడు. ముకుంద విషయంలో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా ఏసీబీ సార్ అని కృష్ణ అడుగుతుంది. పొద్దున వాళ్ళ నాన్న వచ్చి గొడవ చేసిన విషయంలో తప్పేముందిని కృష్ణ అంటుంది. ముకుంద ఎన్ని రోజులని ఒంటరిగా ఉంటుంది. నిజంగా ఇంకో పెళ్లి చేసుకోవడం కరెక్ట్ అని కృష్ణ అంటుంది. అయినా బయట వాళ్ళు రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. పెద్ద అత్తయ్య చాలా మంచివారు కాబట్టి ఆ విషయాలు బయటకు రాకుండా ఉన్నాయి అని అంటుంది. అయ్యో కృష్ణ ముకుందా ఇక్కడ ఉండేదే నన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఆ విషయం నీకు ఎలా మురారి మనసులో అనుకుంటాడు.

వాళ్ల నాన్న ఇంటికి వెళ్లేసరు ఎదురుగా కనిపిస్తుంది ఏంటమ్మా ఇంటికి వచ్చా వు. పొద్దున మీరు అలా నాకేం నచ్చలేదు డాడీ అని. నువ్వు ఎలా ఒంటరిగా ఉంటావు అని వాళ్ళ నాన్న అడుగుతాడు. ఎన్ని రోజులు నుంచి ఆ ప్రశ్న ఏమైపోయింది నాన్న అని ముకుందా ప్రశ్నిస్తుంది. మీరే కదా నా జీవితాన్ని ఆకారంలోకి నెట్టు వేశారు. నేను మురారి ప్రేమించుకున్నామన్న విషయం మీకు తెలుసు. కానీ ఆదర్శ్ తో నా పెళ్లి చేసి మీరే నా గొంతు కోసేశారు. ఇప్పుడు తనతో విడాకులు ఇప్పించి మరొక అతనితో నా పెళ్లి చేయాలని అనుకుంటున్నారు. నా జీవితంలోకి ఇంతమంది మగవాళ్ళు రావడం గురించి నా మనసు ఎలా ఫీలవుతుంది. నేను ఎలా ఆలోచిస్తున్నానో మీకు పెట్టడం లేదు కదా నాన్న అని ముకుందా అంటుంది మురారి ఇప్పుడు వేరే పెళ్లి చేసుకున్నాడు కదా అని వాళ్ళ నాన్న అనగానే.. అది పెళ్లి కాదు వాళ్ళ గురువు గారికి ఇచ్చిన మాట కోసం కృష్ణుని పెళ్లి చేసుకున్నాడు. కృష్ణ కూడా అంతే అంటూ వాళ్ళిద్దరూ నిజమైన భార్యాభర్తలు కాదని అగ్రిమెంట్ మీద ఒప్పందంతో ఈ పెళ్లి చేసుకున్నారు ముకుందా అంటుంది. ఇక కృష్ణ ఇంట్లో నుంచి వెళ్ళిపోగానే నాకు విడాకులు ఇప్పించి మురారితో నా పెళ్లి చేసే బాధ్యత మీదే. అందుకు ఇప్పటినుంచే మురారితో మీరు కూడా మాట్లాడండి అని ముకుందా చెబుతుంది.

మురారి పొద్దు న్న టిఫిన్ కూడా చేయలేదని కృష్ణ టిఫిన్ ప్లేట్ తో మురారి దగ్గరకు వస్తుంది. ఇప్పుడు నాకొద్దు అని మురారి మారం చేస్తుంటే కృష్ణ ఆప్యాయంగా మురారి కి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. ఇది మీ అమ్మ ముద్ద ఇది మీ నాన్న ముద్ద ఇది నా ముద్ద అంటూ మురారి కి ప్రేమగా గోరుముద్దలు తినిపిస్తున్న కృష్ణని చూస్తూ అక్కడికి మురారి తమ్ముడు వస్తారు వాళ్ళిద్దర్నీ కలిపి ఓ వీడియో తీస్తున్నానంటూ అలాగే తినిపించమని తను రిక్వెస్ట్ చేస్తారు ఇక తినిపించేసిన తరువాత ఫ్లవర్ వాసులో ఉన్న వాటర్ తో చేయకడుక్కోమని ఇద్దరినీ ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోమని తను చెప్పడంతో కృష్ణ అలాగే చేస్తూ ఉంటుంది మురారి కృష్ణ క్లోజ్ గా ఉండడం చూసి ముకుందా లో లోపల రగిలిపోతూ ఉంటుంది.

Brahmamudi: స్వప్న కి కావ్య గురించి లేనిపోనివి చెప్పి రెచ్చగొట్టిన రాహుల్.. తర్వాత ఏమైందంటే!
ఇక రేపటి ఎపిసోడ్లో ముకుందా మురారి దగ్గరకు వెళ్లి మన ఎంగేజ్మెంట్ రింగ్ ని ఎందుకు తీసేసావు అని అడుగుతుంది. మనిద్దరికీ ఎంగేజ్మెంట్ జరగడం ఏంటి నాన్సెన్స్ అని మురారి అంటాడు.

ఐ లవ్ యు మురారి అని ముకుందా చెప్పడం చూసి తాగి ఉన్నా మురారి తమ్ముడు వెళ్లి రేవతి ని పిలుసుకు వస్తాడు. తను అక్కడికి తీసుకువచ్చి రేవతి కి ముకుందా మురారి మాట్లాడుకోవడం చూపిస్తాడు. ఇక రేవతి ఈ విషయంపై ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.