NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Krishna Mukunda Murari March 25 2024 Episode 427: మురారి విడుదల.. ఆదర్శ్ కోపం.. మురారి ఇంట్లో ముకుంద మీనాగా ఎంట్రీ..

Krishna Mukunda Murari Today Episode  March 25 2024 Episode 427 highlights

Krishna Mukunda Murari March 25 2024 Episode 427: మురారిని అరెస్ట్ చేయడంతో ముకుంద చాలా బాధపడుతుంది ఎలాగైనా మురారిని విడుదల చేయించడానికి పోలీస్ స్టేషన్ కి వెళుతుంది అసలు నేను చెప్పింది ఏంటి నాన్న చేసింది ఏంటి అని మనసులో అనుకుంటుంది. పోలీస్ స్టేషన్లో ఉన్న మురారి దగ్గరికి వెళ్తుంది ముకుంద. కృష్ణ నీ అరెస్ట్ చేయించమని చెప్తే నాన్న నిన్ను అరెస్ట్ చేయించాడు. నాన్నకు నీ మీద ఇంత కోపం ఉందని తెలియదు తప్పంతా నాదే అని ముకుందా మురారితో అంటుంది. నీకు దగ్గర అవ్వాలని నేను ఏదో చేద్దామనుకుంటే ఇంకా ఏదో జరిగిపోయింది అని అనటంతో మురారి నన్ను అలా చూస్తున్నావు నన్ను గుర్తు పట్టలేదా, నేను ముకుంద అని అంటుంది. నువ్వు ముకుందేంటి తను చనిపోయింది కదా ఎవరు నువ్వు అని అంటాడు మురారి.. ఇక అప్పుడే కానిస్టేబుల్ మేడం అని పిలవడంతో ముకుంద ఊహలో నుంచి బయటికి వస్తుంది ఇప్పటిదాకా ముకుంద కలగంటుంది.

Krishna Mukunda Murari Today Episode  March 25 2024 Episode  427 highlights
Krishna Mukunda Murari Today Episode  March 25 2024 Episode 427 highlights

ఇక పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చిన ముకుంద మురారితో మాట్లాడినట్టు కలగంటుంది.కానిస్టేబుల్ పిలిచేసరికి ఊహలో నుంచి బయటికివస్తుంది. మీరు ఎవరు మేడం అని అడిగితే లోపల ఉన్న మురారిని రిలీజ్ చేయాలి అని అంటుంది నాన్ వెలబుల్ వారంటి మీద అరెస్ట్ చేసామని ఎస్సై చెప్తాడు కానీ ముకుంద మాత్రం అతని రిలీజ్ చేయాల్సిందే అని అంటే మీరు ఎవరండి అని ఎస్ఐ అడుగుతాడు వెంటనే ముకుంద హోమ్ మినిస్టర్ కి ఫోన్ చేస్తుంది మీరు డైరెక్ట్ గా అతనితో మాట్లాడండి అని అంటుంది ఇక వెంటనే పోలీస్ తో మీరు మీకు ఇప్పుడు ఫోన్ వస్తుంది హోమ్ మినిస్టర్ నుంచి మాట్లాడండి అని అంటుంది వెంటనే హోమ్ మినిస్టర్ గారి ఎస్సై కి ఫోన్ చేస్తాడు మురారిని రిలీజ్ చేయమని చెప్తాడు. మురారిని బయటకు తీసుకు రమ్మని ఎస్ఐ చెప్తాడు అసలు మురారిని చూసి ముకుంద బాధపడుతుంది మురారి ఒళ్లంతా దెబ్బలతో నడవలేక నడుస్తూ ఉంటాడు. మురారి కి సారీ చెప్తుంది ముకుంద, మీరు రాకపోయి ఉన్నట్టయితే నేను అసలు బయటికి వచ్చేవాడిని కాదు అలాంటిది మీరు నాకు సారీ చెప్పడం ఎందుకు అని అంటాడు ఆలస్యం అయినందుకు సారీ చెప్తున్నాను అని అంటుంది. నేను పోలీస్ ఆఫీసర్ ని నన్ను నేను కాపాడుకోలేక పోయినాను. ఇంట్లో వాళ్ళు విడిపించడానికి ట్రై చేసినా కూడా వాళ్ళ ప్రయత్నం వృధా అయ్యింది వాళ్ల వల్ల కూడా కాలేదు మీరు నన్ను ఎలా విడిపించారు ఇంతకీ మీరు ఎవరు అని ముకుంద ని అడుగుతాడు.

Krishna Mukunda Murari Today Episode  March 25 2024 Episode  427 highlights
Krishna Mukunda Murari Today Episode  March 25 2024 Episode 427 highlights

ముకుంద నేను మీనాని ముకుంద ఫ్రెండ్ని అని పరిచయం చేసుకుంటుంది హోమ్ మినిస్టర్ కూతురు కూడా నాకు ఫ్రెండే అని చెప్తుంది. నేను హోమ్ మినిస్టర్ కూతురు నీ హెల్ప్ అడిగి మిమ్మల్ని విడుదల చేయించాను అని చెప్తుంది. అసలు హోమ్ మినిస్టర్ నన్ను అరెస్ట్ చేయమని చెప్తే మీరు చెప్పగానే రిలీజ్ ఎలా చేశారు అని అనుమానం గా అడుగుతాడు మురారి. నేను ముకుందా మృదుల ముగ్గురం ఫ్రెండ్స్ కూతురు మాట కాదనలేక హోం మినిస్టర్ గారు నిన్ను విడుదల చేశారు అని ముకుందా కవర్ చేస్తుంది. ఇక హెల్ప్ చేసినందుకు మీకు చాలా థాంక్స్ అని చెప్పి ముకుందా చనిపోయే ముందు నాకు కాల్ చేసింది మురారి లేకుండా నేను బతకలేను అందుకే చనిపోతున్నాను అని చెప్పింది మీ మీద ముకుందకు ఎప్పుడు కోపం లేదు మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంది తప్ప మీరు బాధపడాలని తను ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. మీరంటే తనకి చాలా ఇష్టం అని మురారితో చెప్తుంది మీరా.. ఏం తెలియనట్లు మురారి ఫోన్ నెంబర్ అడుగుతుంది మురారి కూడా తన ఫోన్ నెంబర్ ఇస్తాడు మిస్డ్ కాల్ ఇచ్చాను అని అంటుంది మీరు మా ఇంటికి రావచ్చు కదా అని అంటాడు మురారి. ఇప్పుడు కాదు మరొక రోజు సమయం చూసుకొని వస్తాను అని అంటుంది ముకుందా గా మారిన మీరా..

Krishna Mukunda Murari Today Episode  March 25 2024 Episode  427 highlights
Krishna Mukunda Murari Today Episode  March 25 2024 Episode 427 highlights

ఇక కృష్ణ ఇంట్లో అందరూ కూర్చొని భయపడుతూ ఉంటారు కృష్ణ కానిస్టేబుల్ చెప్పిన మాటలు గుర్తుచేసుకొని ఇక మురారి ఇంటికి తిరిగి రాడని నీ లాకప్ లోనే చనిపోతాడేమోనని భయపడుతూ ఉంటుంది పెద్దతయ్య వచ్చేదాకా మనం ఏం చేయలేమా అత్తయ్య అని అడుగుతుంది. చేస్తగలిగితే ఇంత బాధ ఎందుకు కృష్ణ అని అంటుంది రేవతి. ఇప్పుడు అత్తయ్య గారు వచ్చేదాకా ఇలానే కూర్చుంటే మురారి కి జరగరానిది ఏమన్నా జరుగుతుందేమోనని భయమేస్తుంది అని అంటుంది కృష్ణ. పక్కనే ఉన్న ఆదర్శ తప్పు చేశాడు కాబట్టి శిక్ష అనుభవించాల్సిందే అతని విడిపించి బయటికి తీసుకురావడం ఎవరివల్లా కాదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు. అప్పుడే కృష్ణ వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది ఎవరు వచ్చారో చూద్దామని అంటాడు మధు కృష్ణ వద్దు నాకు భయంగా ఉంది అని అంటుంది. ఎవరొచ్చారు కనీసం తెలుసుకోవాలి కదా కృష్ణ అని మధు వెళ్లబోతు ఉంటే కృష్ణ నేను వెళ్తాను అని తను డోర్ దగ్గరికి వెళ్లి కంగారుగా డోర్ తీస్తుంది. ఎదురుగా కానిస్టేబుల్ ఉంటాడు వెంటనే కానిస్టేబుల్ ని చూసి కృష్ణ ఏమైంది మీరు ఇక్కడికి వచ్చారు ఏంటి అని అడుగుతుంది. పక్కనే ఉన్న ఆదర్శ నేరస్థుడు లోపల ఉంటే కానిస్టేబుల్ ఇంటికి వచ్చాడు అంటే నేరస్థుడికి ఏదో జరగరానిది జరిగింది అని అంటాడు . కృష్ణ కోపంగా సెటప్ ఆదర్శ నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా, అంటే ఇప్పుడు మురారి కి ఏమన్నా జరగాలని కోరుకుంటున్నావా అని అంటుంది. ఇక వెంటనే కానిస్టేబుల్ మీరంతా కంగారు పడకండి అని మురారిని చూపిస్తాడు మురారిని చూసి అందరూ మురారి దగ్గరికి వెళ్తారు ఒంటినిండా దెబ్బలతో మురారి నీ చూసి రేవతి బాధపడుతుంది ఇక మురారిని లోపలికి తీసుకు వస్తారు. అసలు ఏసీబీ సార్ ఇంటికి తిరిగివచ్చారంటే ఆయన్ని మీరు ఇలా చూస్తున్నారంటే ఒక ఆవిడ ఎందుకు కారణమమ్మా అని అంటాడు కానిస్టేబుల్ ఆవిడ ఎవరు అని అడుగుతారు ఇంట్లో వాళ్ళు ముకుంద ఫ్రెండ్ అమ్మ తను వచ్చి విడిపించింది అని కానిస్టేబుల్ ఇంట్లో వాళ్లకి జరిగింది మొత్తం చెప్తాడు. అది విని నిజమేనా అని కృష్ణ మురారిని అడుగుతుంది నిజమే అని చెప్తాడు మురారి ఇక నువ్వు బయటికి రావని నేను అనుకున్నాను కానీ భలేగా బయటకు వచ్చావు లక్కీ ఫెలో అని అంటాడు ఆదర్శ. కానిస్టేబుల్ వెళ్ళిపోతాడు ఇక ఇంతలో ఆదర్శ్ అసలు నిన్ను ఎవడి వినిపించారు ముకుంద ఫ్రెండ్ విడిపించిందా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వే తనని మోసం చేసావని ముకుందా సూసైడ్ నోట్ రాసి చనిపోయింది ఆ విషయం తన ఫ్రెండ్ కి కూడా తెలిసే ఉంటుంది కదా అయినా నేను ఎలా విడిపించింది అని ఆదర్శ అడుగుతాడు. అందుకు అందరూ ఆదర్శ్ ని చూస్తూ ఉంటారు ఇక స్నేహితురాలు చావుకి కారణమైన వారిని ఆ అమ్మాయి కాపాడింది అంటే తను అసలు స్నేహితురాలే కాదు తను ద్రోహి అవుతుంది అని అంటాడు అలాంటి ద్రోహులను నడిరోడ్డు మీద నిలబెట్టి ప్రాణాలు తీసేయాలి అని అంటాడు ఆదర్శ ఆ మాటలకు వెంటనే మురారి కి కోపం వస్తుంది నోరు మూయి ఇంకొక మాట అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడావంటే అని మురారి సీరియస్ గా ఆదర్శ్ కి వార్నింగ్ ఇస్తాడు తనతో మాటలు అనవసరం అని ఇంట్లో వాళ్ళందరూ చెబుతారు అసలు ఆదర్శ్ తో మాట్లాడొద్దని నందు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది తనకి ఇష్టం అంటే మాట్లాడు లేదంటే నువ్వు అసలు మాట్లాడొద్దు అని ఆదర్శనీ కోపడుతుంది నందు. తనతో మాటలు అనవసరం ఎసిపి సార్ మనం వెళ్దాం పదండి అని కృష్ణ లోపలికి వెళ్దాం అని అంటుంది వెంటనే మురారి తను ముకుంద ఫ్రెండ్ అయ్యుండి కూడా సూసైడ్ నోట్ నిజం కాదని నమ్మి నన్ను విడిపించింది కానీ నువ్వు నాతో చిన్నప్పటినుంచి కలిసి ఉన్నావు నేనంటే ఏంటో కూడా తెలుసు నీకు అయినా నన్ను నువ్వు నన్ను నమ్మలేకపోతున్నావు ఆవిడ గురించి తప్పుగా మాట్లాడే హక్కు నీకు లేదు ఆదర్శ్ అని చెప్తాడు నిన్ను కాపాడిన అమ్మాయి కాటేసే విషపు నాకు నువ్వేనని తెలుసుకొని రోజు దగ్గరలోనే ఉంది అని ఆదర్శ అంటాడు. ఇక ఇంట్లో అందరూ ఆదర్శం తిడతారు. మురారి మాత్రం నడవలేకపోతూ ఉంటాడు ఇక రేవతి అది చూసి నా కొడుకుని ఎలా కొట్టారు ఒళ్లంతా ఎన్ని గాయాలయ్యాయి అని బాధపడుతూ ఉంటుంది.

Krishna Mukunda Murari Today Episode  March 25 2024 Episode  427 highlights
Krishna Mukunda Murari Today Episode  March 25 2024 Episode 427 highlights

అసలు ఆ లెటర్ రాసింది ముకుందా అయి ఉండదు నాన్న కచ్చితంగా శ్రీనివాస ఆ లెటర్ రాసి ఉంటాడు అని రేవతి అంటుంది. వెంటనే మురారి అవునమ్మా ఇందులో ఆయన తప్పేముంది చిన్నప్పటినుంచి నా ఫ్రెండ్ అయి ఉన్న ఆదర్శ అని అర్థం చేసుకోలేదు అలాంటిది నావల్ల ముకుంద ఎంతో కొంత బాధపడింది అలాంటప్పుడు ముకుంద చావుకి నేనే కారణమని శ్రీనివాసా అంకుల్ తప్పుగా అర్థం చేసుకోవడంలో ఆశ్చర్యం లేదు అని అంటాడు మురారి. ఇక జరిగింది ఏదో జరిగింది ముందు వెళ్లి రెస్ట్ తీసుకొని ఇవ్వు అని అంటుంది మధులత ఇక మురారి స్నానం చేసి వస్తాడు ఒళ్లంతా ఎన్ని గాయాలు అయ్యాయో అని కూడా లోపల కూడా చాలా గాయాలు అయ్యాయి అత్తయ్య అని అంటూ ఏడుస్తుంది. ఇక మురారి నాకు చాలా ఆకలిగా ఉంది అక్కడ కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేదు అమ్మ అని అంటాడు దాంతో వెంటనే రేవతి వెళ్లి మురారి కి అన్నం తీసుకుని వస్తుంది. ప్రేమగా మురారికి అన్నం తినిపిస్తుంది రేవతి.

Krishna Mukunda Murari Today Episode  March 25 2024 Episode  427 highlights
Krishna Mukunda Murari Today Episode  March 25 2024 Episode 427 highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో భవానీ దేవి ఎంట్రీ ఇస్తుంది భవానీ దేవి వస్తు అదే కారులో ముకుందని తీసుకొని వస్తుంది. ముకుంద కార్ దిగి లోపలికి వస్తూ ఒకసారి ఇంట్లోకి కోడలుగా అడుగుపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇక ఈసారి లోపలికి వెళ్తే బయటకు వచ్చేది లేదు అని మనసులో అనుకొని కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది.

Related posts

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Karthika Deepam 2 May 1st Episode: తండ్రిని గుర్తు చేసుకుంటూ కార్తీక్ ముందు కంటతడి పెట్టిన దీప.. నిజ నిజాలను తెలుసుకున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Trinayani May 1 2024 Episode 1227: గాయత్రి చాయను అందరికీ చూపించిన హాసిని, నా కూతురు గోపికలా ఉంది అంటున్న నైని..

siddhu