NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi March 25 2024 Episode 366: రాజ్ కి ఝలక్ ఇచ్చిన కావ్య. అపర్ణ వైపు నిలబడిన ధాన్యం. అత్తకు ఎదురు తిరిగిన కోడలు..

Brahmamudi Today Episode March 25 2024 Episode 366 highlights

Brahmamudi March 25 2024 Episode 366:  ఊహించని మలుపులతో బ్రహ్మముడి సీరియల్ కొనసాగుతోంది. రాజ్ నుండి ప్రేమని ఆశించిన కావ్యకు రాజు కొడుకుతో ఎంట్రీ ఇచ్చి ఆమె ఆశలపై నీళ్లు చల్లుతాడు. ఆ బిడ్డ తన వారసుడిగా ఇంటికి పరిచయం చేస్తాడు. ఆ మాటలు జీర్ణించుకోలేని అపర్ణాదేవి కొడుకుకి క్లాస్ పీకి తనని ఇంటి వారసుడిగా ఉండడానికి వీల్లేదని చెప్తుంది అసలు రాజకీయ ఎవరు సహాయం చేయడానికి వీలు లేదని, ఇది తన మాటగా ఇదే తన నిర్ణయంగా చెప్పి వెళ్ళిపోతుంది అపర్ణ. రాజ్ తలి నిర్ణయానికి తలవంచి తన ఇంట్లో అతిథిగానే ఉంటానని ఈ బిడ్డని మాత్రం వదులుకోనని తెగేసి చెప్తాడు. రాజ్ బిడ్డకి సపోర్ట్ చేయడంతో ఇంట్లో అందరూ కూడా రాజ్ ని అతిధి గానే చూడ్డం మొదలుపెడతారు. అపర్ణ నిర్ణయాన్ని ఇంట్లో అందరూ గౌరవిస్తారు రాజ్ కి ఎవరు హెల్ప్ చేయరు. రాజ్ బిడ్డ ఏడుస్తూ ఉంటే వంటగదిలోకి వెళ్లి పాలు కాగబెట్టి బిడ్డకు పట్టాలని చూస్తాడు కానీ అది కుదరదు వెంటనే కావ్యాధి గమనించి రాజ్ కి సహాయం చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది. రాజ్ బిడ్డకి పాలు కలుపుకొని కావ్య మేడ మీదకి వెళుతూ ఉండగా రుద్రాణి ఆపుతుంది.

Brahmamudi Today Episode March 25 2024 Episode 366  highlights
Brahmamudi Today Episode March 25 2024 Episode 366 highlights

నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా మా వదిన ఇంట్లో ఎవరూ రాజ్ కి హెల్ప్ చేయకూడదు అంటే నువ్వు ఏం చేస్తున్నావు అంటే మా వదిన మాటంటే నీకు లెక్క లేదా అని రుద్రాణి కావ్య తో అంటుంది. అక్కడికి వచ్చిన అపర్ణ కూడా కావ్యదే తప్పన్నట్లుగా మాట్లాడుతుంది నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాక నువ్వు ఎవరివి దాన్ని కాదనడానికి రాజుకి హెల్ప్ చేయొద్దు అని చెప్పాను కదా అని అంటుంది అపర్ణ. కావ్య అసలు మీరు చేస్తుందే తప్పు మీ అబ్బాయి తప్పు చేస్తే ఆ పసివాడు ఏం చేశాడు ఆ పసివాడిని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు వాడి ఆకలితో ఏడుస్తున్నాడు ఇప్పుడు పాలు తీసుకెళ్లి ఇవ్వకపోతే పసివాడి బాధపడతాడు మీ అబ్బాయి తప్పు చేస్తే శిక్ష మీ అబ్బాయికి వేయండి పసివాడి కాదు అసలు మీరు తీసుకొని నిర్ణయమే తప్పు అని కావ్య అంటుంది. తప్పు చేస్తే శిక్ష పడాలి అంతేకానీ నిజాన్ని డబ్బుతో పాతి పెట్టాలని చూడకూడదు మీరు అన్నట్లు నాకు డబ్బు పై ఆశ ఉంటే నేను ఎప్పుడో డబ్బులు నా దగ్గరికి తెచ్చుకునేదాన్ని నేను ఇంట్లో డబ్బు సంపాదించాలని నేను అనుకుంటే నాకు ఆల దగ్గరికి డబ్బులు వచ్చేటట్లు చేసుకునేదాన్ని కానీ నాకు కావాల్సింది డబ్బు కాదు నాకు డబ్బు పై కానీ ఆస్తి పై కానీ ఎలాంటి ఆశ లేదు ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది పోయిన మీ పరువు గురించి కాదు అంటున్న మాటలు గురించి కాదు మీ కొడుకు గురించి మీ కొడుకు చేసిన తప్పుని ఎలా పరిష్కరించాలి దానికి ఎలా అందరిలోకి వెళ్లకుండా ఆపడం, అని ఆలోచించాలి కానీ ఆ పసివాడిని బాధ పెట్టాలని కాదు ఆ పసివాడి బాధ పెడితే నేను చూస్తూ మాత్రం ఊరుకోలేను ప్రాణం పోయినా నేను మీరన్న మాటలకి ఒప్పుకోను కావాలంటే నేను ఆ దేవుని కూడా ఈ విషయంలో ఎదిరిస్తాను అని కావ్య అంటే అప్పుడే అక్కడికి ఇందిరాదేవి చప్పట్లు కొడుతూ ఎంట్రీ ఇస్తుంది.

Brahmamudi Today Episode March 25 2024 Episode 366  highlights
Brahmamudi Today Episode March 25 2024 Episode 366 highlights

శభాష్ కావ్యా నా మనవరాలు వినిపించుకున్నావు అని అంటుంది ఇందిరా దేవి అంటే ఏంటమ్మా అపర్ణ వదిన చేసిన నిర్ణయాన్ని నువ్వు తప్పు పడుతున్నావా అని అంటుంది రుద్రాణి నేను తప్పు పట్టడం లేదు ఆ పసివాడిని బాధ పెట్టడం కరెక్ట్ కాదు అని అంటున్నాను. కావ్య చెప్పింది కరెక్ట్ అంటున్నాను. పెద్ద పెద్ద ఇళ్లలో పుట్టడం గొప్ప కుటుంబాల్లో పెరగడం కాదు గొప్ప ఆలోచనలు రావడం గొప్ప అందుకు అది నా మనవరాలికి ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను అందుకు కాఫీకి సపోర్ట్ చేస్తున్నాను. మీరన్నది కూడా నిజమే కావ్య స్థానంలో ఇంకొక ఆడది ఉంటే పెద్ద గొడవ జరిగేది. కానీ కావ్య అలా ఆలోచించలేదు మన ఎవ్వరికి రాని ఆలోచన తన భర్త విషయంలో తాను ఎంత గొప్పగా ఆలోచించిందో నాకు తెలుసు అది మీకు ఈ జన్మలో అర్థం కాదు అయినా నువ్వు ఏది చేసినా నీకు తోడుగా నేను ఉంటాను అని కావ్యకి ఫుల్ సపోర్ట్ ఇస్తుంది అమ్మమ్మ గారు. నువ్వు వెళ్లి కావ్య అని అంటుంది ఇందిరా దేవి కావ్య మేడ మీదకు వెళ్ళిపోతుంది వారసుడు వచ్చిన వేళా విశేషం అనుకుంటా వదినా ఇప్పుడు నీ మాట నెగ్గడం లేదు ఇక ముందు ముందు ఎలా ఉంటుందో ఏంటో అని అంటుంది రుద్రాణి ఆ పరమత అపర్ణ అక్కడి నుంచి కోపంగా చూసుకుంటూ వెళ్ళిపోతుంది. రాజు దగ్గరికి వెళ్లిన కావ్య బాబుకి పాల బాటిల్ ఇస్తుంది బాబు పాలు తాపి నిద్రపుచ్చుతూ ఉంటాడు రాజ్. థాంక్స్ అని చెప్తాడు రాజ్. ఎందుకు అని అంటుంది నా బాధ్యత నువ్వు పంచుకున్నందుకు అని అంటాడు మీ బాధ్యత మీ పక్కనే ఉంది కదా అంటుంది కావ్య నువ్వు పంచుకున్నావు కదా అందుకు థాంక్స్ అంటాడు అంటే పంచుకున్నాను కదా అని పెంచుకోమనొద్దు అని అంటుంది కావ్య నేను అలా ఏమీ అడగలేదు అని అంటాడు రాజ్ కానీ నేను అడగాల్సిన చాలా ఉన్నాయి అంటుంది కావ్య ఆ ప్రశ్నలకు నీ కళ్ళల్లో కనిపిస్తున్నాయి అని అంటాడు రాజ్. మరి వాటికి జవాబు కూడా మీ నుంచి రావాలి అని అంటుంది కావ్య. నువ్వు ఆశించి జవాబు అయితే ఎప్పటికీ నా నుంచి రాదు అని అంటాడు సమాధానం వచ్చేదాకా నేను ప్రశ్నిస్తూనే ఉంటాను అంటుంది కావ్య ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా అలానే ఉంటారు అని అంటాడు రాజ్ ఏది ఈ పరిస్థితి ఇంతకాలం అని అంటుంది కావ్య నా మనసు ముక్కలు చేశారు ఇలా సైలెంట్ గా ఎన్నాళ్ళు ఉండమంటారు అని కావ్య అంటుంది నేను నిన్ను ఇలా సైలెంట్ గా ఉండమని చెప్పలేదు మరి జరిగిన మార్పుని జీర్ణం చేసుకోమని చెప్పలేను పరిస్థితి తలవంచి వెళ్ళమని చెప్పలేను పుట్టింటికి అత్తింటికి మధ్య సమాజం గీసిన గీత పై నువ్వు నిలబడి ఉన్నావు నీ మనసులో ఉండే ఆలోచనలు సందిగ్ధాలు నాకు అర్థం అవుతున్నాయి అని అంటాడు అవును నీకు అన్నీ తెలుసు తెలిసిన ఏం లాభం నష్టం పూరించలేము కదా కష్టాన్ని మార్చలేరు కదా అని అంటుంది కావ్య కష్టాన్ని నష్టాన్ని భరించాల్సిన అవసరం నీకు రాకుండా చేస్తాను అని అంటాడు. కాదు షాకే చూస్తూ ఉంటుంది రాజు ఇంతలో విడాకుల పై పరిస్థితి ఈ విడాకులు నువ్వు ఇచ్చినవి ఇందులో నువ్వు చేసింది చివరి సంతకం నేను ఈ బిడ్డను తీసుకురాకముందు నువ్వు నాకు ఇచ్చావు ఏడాది పాటు విసిగిపోయి వేసారి పోయి, నా నుంచి ఎంతో ఆశించావు కానీ నీ నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయాను నమ్మకం పోయి ఈ విడాకులు తీసుకొచ్చి నాకిచ్చి కాపురం రెండు ముక్కలు చేయడానికి అటు నీ సంతకం అవసరం కదా అందుకే నువ్వు ఏది అడిగినా చేయలేకపోయాను కనీసం ఈ ఒక్కటైనా చేయనివ్వ నన్ను అని రాజ్ విడాకుల మీద సంతకం చేస్తాడు అవి చూసి ఏడుస్తూ ఉంటుంది.

Brahmamudi Today Episode March 25 2024 Episode 366  highlights
Brahmamudi Today Episode March 25 2024 Episode 366 highlights

విడాకులు పేపర్ల మీద సంతకం చేసి ఆ పేపర్స్ ని కావ్య చేతిలో పెడతాడు ఇక ఇప్పుడు నీ చేతిలోనే ఉంది నిర్ణయం అని అంటాడు. ఇప్పటివరకు నిన్ను ఇల్లు దాటకుండా నేను ఏదో పరీక్ష పెట్టి అడ్డు చెప్పాను కానీ ఇప్పుడు మాత్రం ఆపే హక్కు నాకు లేదు అర్హత లేదు నిన్ను ఆపాలి అని అనుకుని ఏ శక్తి నీకు అడ్డు పడేయలేదు నా వల్ల ఈరోజు నుంచి నీకు బాధ ఉండదు అని అంటాడు వెంటనే అయిపోయిందా ఇంతటితో మీ బాధ్యత తీరిపోయిందా నేను మిమ్మల్ని వదిలేసి వెళ్లిపోవాలంటే ఈ కాగితాలే అవసరమా నమ్మకం పోయినప్పుడే మనసు ముక్కలైనప్పుడే భార్యాభర్తలుగా మనం ఎప్పుడూ మానసికంగా విడాకులు తీసుకున్నాము ఈ కాగితాలు సమాజానికి చెప్పడానికి మాత్రమే పనికి వస్తాయి అని అంటుంది. కావ్య అలా మాట్లాడుతూ ఉంటే రాజ్ మౌనంగా కావ్య వైపు తిరిగి చూస్తూ ఉంటారు. అంటే నువ్వు కోరుకుందే కదా అని రాజ్ అంటాడు దాంతో నేను కోరుకునేవన్నీ మీరు చేశారా? నేను ఏది చెప్తే మీరు అది చేస్తూ వచ్చారా? మీరు ఏది చెప్తే అది నేను చేయాలా నాకంటూ ఒక మనసు కోరిక ఆశ ఉండదా నేను వెళ్ళను ఇంత సింపుల్గా మీరు సంతకం చేసిన చేతిలో పేపర్స్ పెడితే నేను ఇక్కడి నుంచి ఎలా వెళ్తాను అనుకున్నారు ఈ బిడ్డకు తల్లి ఎవరో తెలియాలి తాళి కట్టిన భార్య నేను ఉండగా ఆ తల్లి తల్లిగా ఎలా మారిందో నాకు చెప్పాలి ఏంటి వారసుడిగా ఇంటికి ఈ బిడ్డను ఎందుకు తీసుకొచ్చారు నాకు చెప్పాలి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం మీ నుంచి నాకు తెలియాలి అప్పుడే నేను ఇంట్లో ఉండాలో వెళ్లిపోవాలో నిర్ణయం తీసుకుంటాను అప్పటివరకు నన్ను వెళ్లి పొమ్మనే హక్కు మీకు కూడా లేదు అని కావ్య రాజ్ చేతిలో విడాకులు పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

Brahmamudi Today Episode March 25 2024 Episode 366  highlights
Brahmamudi Today Episode March 25 2024 Episode 366 highlights

ఇక మరోవైపు రాజ్ బాబుని తీసుకొన్న వచ్చిన విషయాన్ని వాళ్ళ అమ్మతో అనామిక ఫోన్లో చెప్తూ ఉంటుంది అదేంటి అలా ఎలా చేసాడు అని అంటుంది అనామికా తల్లి అదే అర్థం కావట్లేదు అమ్మ ఇప్పుడు ఆ బాబు ని ఇంటి వారు శ్రీకా ప్రకటించాడు అని అంటే గుట్టు చప్పుడు కాకుండా డబ్బులు ఇచ్చి వదిలించుకోవాలి కానీ అలా ఎలా చేస్తాడు అని అంటుంది ఇంతలో అపర్ణ వచ్చి అనామిక ఫోన్ లాక్కొని పెట్టేస్తుంది. ఏం చేస్తున్నావ్ నువ్వు ఇంటి విషయాలు ఎవరితో పంచుకుంటున్నావు అని అంటే మా అమ్మతో అని అంటుంది. జరిగిన బాగోతమే కదా నేను చెప్పేది అని అంటుంది ఇంట్లో విషయాలు బయటకు ఎలా చెప్తావు అది కన్నతల్లి అయినా సరే చెప్పడానికి వీల్లేదు అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రుద్రాణి అనామికకు అపర్ణ క్లాస్ తీసుకుంటుంది ఈ విషయాన్ని ధాన్యానికి చెప్పాలి అని వెంటనే దాన్ని దగ్గరికి వెళ్లి ధాన్యాన్ని తీసుకొని అనామిక అపర్ణల దగ్గరికి వస్తుంది రుద్రాణి.చూడు నీ కోడలికి క్లాస్ తీసుకుంటుంది అని ధాన్యంతో అంటుంది వెంటనే ధాన్యం నా కోడలు ఏం చేసింది అక్క అని అడుగుతుంది. బావగారు చేసిన పని మా అమ్మకు చెప్తున్నాను అని అంటుంది అనామిక దాంతో వెంటనే అనామిక మీద ధాన్యం రివర్స్లో అరుస్తుంది. ఇంట్లో జరిగిన విషయాలన్నీ బయటకు చెప్తున్నావా అయినా బయటికి చెప్పడంలో అంతరార్థం ఏంటి గుడ్డు చప్పుడు కాకుండా ఇంట్లో విషయాలు పక్కకి పోనివ్వకుండా చూడాలి కానీ నువ్వు పబ్లిసిటీ చేస్తున్నావా ఇంటికి తల పంపులు తెచ్చే పని చేస్తున్నావా అని ధాన్యం అనామిక మీద ఫైర్ అవుతుంది అనామిక వెంటనే అది కాదు అత్తయ్య అని అంటుంది ఏంటి నువ్వు ఇంట్లో విషయాలు బయటకు చెప్తే పోయేది ఎవరి పరువు అయినా కానీ రాజు తప్పు చేశాడు అంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు అలాంటిది ఏది కరెక్ట్ గా తెలియక ముందే ఇంట్లో విషయాలు బయటకు చెప్పకు కళ్యాణ్కు తెలిస్తే అరుస్తాడు ఇకనుంచి వెళ్ళు అని అంటుంది. మీకు అపర్ణ వైపు తిరిగి అక్క అనామికను అరవడం కాదు ముందు నువ్వు రాజు చేసిన పనిని ఏం చేయాలో ఆలోచించు అసలు కావే బాధపడాల్సింది కావ్య వాడికి సహకారం అందిస్తుంది అలాంటిది ఇప్పుడు నువ్వేం చేయాలో ఒకసారి ఆలోచించి చెప్తా అని అంటుంది. అదంతా అక్కడ ఉండి గమనించిన రుద్రానికి ఏమీ అర్థం కాదు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ధాన్యంతో ఇదేంటి నువ్వు నీ కోడలికి అపర్ణ తిడుతూ ఉంటే సపోర్ట్ చేస్తావు అనుకున్నాను కానీ రివర్స్లో అనామికను తిట్టి అపర్ణ వదిన వైపు మాట్లాడావు అని అంటుంది. నేను నీ రూట్లోకే వచ్చాను రుద్రాణి అని ధాన్యం అంటే నాకేం అర్థం కావట్లేదు అని ఉంటుంది రాజ్ నిజంగా తప్పుచేసి బిడ్డను కానీ గుర్తు చప్పుడు కాకుండా వదిలించుకొని ఉండేవాడు మరి ఇంటికి తీసుకొచ్చి అందరిలో వారసుడని ప్రకటించాడు అంటే రాజు తప్పు చేసినట్టు ఇంట్లో అందరూ కూడా నమ్మారు కదా ఇలాంటి అప్పుడే రాత్రి ఇంటి వారసుడు నుంచి తప్పిస్తారు అప్పుడు నా కొడుకుని ఆఫీసులో రాజును చేస్తాను అని అంటుంది ధాన్యం అబ్బో ఇంత ముందు చూపి నీకు ఎప్పటి నుంచి వచ్చింది అని అంటుంది రుద్రాణి. నీ నుంచే నేర్చుకున్నాను నువ్వే కదా నాకు ట్యూషన్ చెప్పేది అని అంటుంది ధాన్యం. అందుకే కావాలని అపర్ణ అక్కకు సపోర్టుగా మాట్లాడాను ఇప్పుడు జరగాల్సింది జరుగుతుంది అని ధాన్యం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక రుద్రాణి మనసులో చేయి చేయి నువ్వు చేయాల్సింది నువ్వు చేయాల్సింది నేను చేస్తాను నీ కొడుకుని తప్పించి నా కొడుక్కి పట్టం కట్టేలా నేను చూస్తాను కదా అని మనసులో అనుకుంటుంది.

Brahmamudi Today Episode March 25 2024 Episode 366  highlights
Brahmamudi Today Episode March 25 2024 Episode 366 highlights

రేపటి ఎపిసోడ్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటాడు అప్పుడే రాజ్ అక్కడికి వచ్చి భోజనానికి కూర్చుంటాడు ఇక వెంటనే అపర్ణాదేవి లేచి వెళ్ళిపోతుంది రాజు వాళ్ళ అమ్మ చేయి పట్టుకొని భోజనం చేసి వెళ్లొచ్చు కదా అని అంటాడు నాకు ఆకలి చచ్చిపోయింది అని చెయ్యి విదిలించుకుంటుంది అపర్ణాదేవి. నావల్ల మీరందరూ బాధపడాల్సిన అవసరం లేదు నేనే వెళ్ళిపోతాను అని రాజ్ లేచి వెళ్ళిపోతాడు. కావ్య రాజకీయ భోజనం తీసుకొని వెళ్తుంటే అపర్ణ దేవి ఆపుతుంది నేను రాజ్ కి హెల్ప్ చేయొద్దు అని చెప్పాను కదా అని అంటే మీరు చేస్తున్నదే తప్పు మీ అబ్బాయి నుంచి నిజం రాబట్టాల్సింది పోయి ఆయన్ని బాధపెడుతున్నారు. నేను ఇలా చేసిన తన నుండి నిజం రాబడతాను అని రాజ్ కి భోజనం ఇస్తుంది రాజ్ భోజనం తింటూ కావ్య వైపు చూస్తాడు.

Related posts

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri