NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారి ముందు కృష్ణని అడ్డంగా బుక్ చేసిన ముకుందా.. సూపర్ ట్విస్ట్ రేపటికి..

Krishna Mukunda Murari Today Episode November 29 2023 Episode 327 Highlights

Krishna Mukunda Murari: రేవతి అత్తయ్య మీరు జరుగుతుంది అంటే సరిపోదు అందుకు తగ్గ ఆధారాలు చూపించండి అని ముకుంద నిలదీస్తుంది. పెద్దపల్లి ప్రభాకర్ చెట్లమ్మ చెల్లమ్మ అని చెప్పాడే కానీ, వాటితో పాటు మర్డర్ చేశాను అన్న విషయాన్ని దాచి పెట్టాడు. మురారి మీద మర్డర్ అటెండ్ చేసి జైలుకు వెళ్లాడు. ఇంత చెప్పినా కూడా మీరు కృష్ణ భజన చేయడం మీ వయసుకి కరెక్ట్ కాదు అత్తయ్య అని ముకుందా హితబోధ చేస్తుంది. రేవతి కోపంగా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావ్ అని అరుస్తుంది నేను చాలా తక్కువ మాట్లాడుతున్నాను అత్తయ్య, అయినా నేను నిజాలే చెబుతున్నాను అత్తయ్య మీలా నేను బ్రమలో బ్రతకడం లేదు వాస్తవంలో బ్రతుకుతున్నాను అని ముకుందా సర్ది చెప్పుకుంటుంది. ఇకనైనా మీరు మీ మనసు మార్చుకొని మా అత్తయ్య చెప్పినట్లు నడుచుకోండి. మా అత్తయ్య ఏం పిచ్చిది కాదు అని అనగానే మా అక్క ఏం పిచ్చిది కాదు. నువ్వే తనని మాయ మాటలు చెప్పి మార్చేసావు అని రేవతి కోపంగా అంటుంది. నేను చెబితే మారిపోయి నమ్మేంత పిచ్చిది కాదు అని ఈ సిటీలో అందరికీ భవాని అత్తయ్య ఆటిట్యూడ్ గురించి తెలుసు అని ముకుందా కవర్ చేసుకుంటుంది. సో బి రెడీ పెళ్లి పనులు మొదలు పెట్టండి. నీకు సిగ్గు లేదా అని రేవతి అంటుంది.

Krishna Mukunda Murari Today Episode November 29 2023 Episode 327 Highlights
Krishna Mukunda Murari Today Episode November 29 2023 Episode 327 Highlights

మురారి వాళ్ల పెద్దమ్మ చెప్పిన మాట గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రెండు రోజుల్లో ఏదో నిజం చెబుతానని అంది ఆ విషయం ఏంటి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే భవాని అక్కడికి వస్తుంది ఏం ఆలోచిస్తున్నావు నాన్న అని అంటే మీరు చెప్పిన మాట గురించి ఆలోచిస్తున్నాను అని మురారి అంటాడు. నువ్వు ఇలా ఆలోచిస్తావని తెలిసే రెండు రోజుల్లో చెప్పాలనుకున్న విషయాన్ని ఇప్పుడే చెబుతున్నాను అని చెబుతోంది. మనసులో మాత్రం దేవుడా ఈ అబద్దం ఆడుతున్నందుకు నన్ను క్షమించు అని భవాని మనసులో అనుకుంటుంది. మురారి నీకు గతం గురించి చెప్పకూడదని అనుకున్నాను మురారి కానీ, ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. నా గతం గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఎక్సైజ్ మెంట్ గా ఉంది పెద్దమ్మ అని మురారి అంటాడు. నువ్వు గతంలో ప్రేమలో ఉన్నావు మురారి. నేను ఎవరి ప్రేమలో ఉన్నాను, ఎవరిని ప్రేమించాను అని భవానిని ఉత్సాహంగా అడుగుతాడు మురారి. ముకుంద అని భవాని అనగానే మురారి గొంతు మూగబోతుంది. కానీ నాకెందుకో ఈ విషయం నమ్మబుద్ధి కావడం లేదు పెద్దమ్మ అని మురారి అంటాడు.

Krishna Mukunda Murari Today Episode November 29 2023 Episode 327 Highlights
Krishna Mukunda Murari Today Episode November 29 2023 Episode 327 Highlights

నువ్వు కృష్ణ గురించే ఆలోచిస్తున్నావు కదా నాన్న, ఆ స్పేస్ లో నుంచి నువ్వు బయటకు వస్తే ముకుంద గురించి కాదు మా గురించి కూడా నువ్వు ఆలోచించగలుగుతావు. ప్రస్తుతానికి ఆ కృష్ణ నిన్ను ఆలోచించుకోవడానికి స్పేస్ ఇవ్వడం లేదో, నువ్వే ఆలోచించడానికి ఇష్టపడటం లేదో మాకు అర్థం కావడం లేదు. కొన్ని కొన్ని నిజాలు కఠినంగా ఉండొచ్చు కానీ అవి వాస్తవాలు మురారి ముకుందా నువ్వు ప్రేమించుకున్నారు. కాబట్టి మీ ప్రేమను అంగీకరించడమే కాకుండా మీ ఇద్దరికీ పెళ్లి చేయాలని అనుకుంటున్నాను అని భవాని సూటిగా తను చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతుంది.

Krishna Mukunda Murari Today Episode November 29 2023 Episode 327 Highlights
Krishna Mukunda Murari Today Episode November 29 2023 Episode 327 Highlights

కృష్ణ వాళ్ళ పెళ్లి ఫోటో చూసి మీకు ఎప్పుడు గతం గుర్తుకు వస్తుందో అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే ముకుందా అక్కడికి వచ్చి కృష్ణ చేతిలో ఉన్న ఫోటోని లాక్కుంటుంది ఇక వెంటనే చిన్నమ్మ అని ప్రేమగా శకుంతలని పిలిచి దీపం వెలిగించాలి అగ్గిపెట్టి ఇవ్వమని అడుగుతుంది. కృష్ణం ముందే కృష్ణ పెళ్లి ఫోటోని అంటించడానికి చూస్తుంది కానీ కృష్ణ ఫేస్ లో ఎలాంటి రియాక్షన్ ఉండదు. ఇక మరోసారి ముకుందా ఆ ఫోటోని కాల్ చేస్తూ ఉండగా కృష్ణ ముకుంద చేతిలో నుంచి ఆ ఫోటో లాక్కొని ఇదే ఫోటోని నేను ఏసీబీ సార్ కి చూపిస్తాను. ఎవరు కాల్చారు అని అడిగితే నీ మీదే చెబుతాను అని కృష్ణ అంటుంది. అయినా ఇక్కడున్న ఫోటోని కలుస్తావు కానీ నా గుండెల్లో ఉన్న ముద్రని మాత్రం నువ్వు కాల్చలేవు అని కృష్ణ అంటుంది. ఇక వెంటనే ముకుందా తన మనసులో మురారి నేను ప్రేమించుకున్నప్పుడు దిగిన ఫోటోలు ఎలాగైనా మురారికు చూపించాలి అని అనుకుంటుంది.

Krishna Mukunda Murari Today Episode November 29 2023 Episode 327 Highlights
Krishna Mukunda Murari Today Episode November 29 2023 Episode 327 Highlights

కాసేపటి తర్వాత మురారి కృష్ణ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు ముకుందా మురారి కి ఆ ఫోటోలు చూపించాలని మురారి కోసం ఇల్లంతా వెతుకుతుంది కానీ, మురారి ఎక్కడా కనిపించడు. అయితే కృష్ణ దగ్గరే ఉండి ఉంటాడు ఈ ఫోటోలు చూపించి ఈ ఫోటోలో ఉన్న మురారిని అసలు రూపం ఇదే అని కృష్ణ చేత చెప్పించాలి అని ముకుందా అనుకుంటుంది. ముకుంద మురారికే కొన్ని ఫోటోలు ఇస్తుంది ఆ ఫోటోలు చూసిన తర్వాత ఈ ఫోటోలో నీ పక్కన ఉన్న వ్యక్తి ఎవరు ముకుందా అని మురారి అడుగుతాడు అని అంటుంది. ముకుందా ఇక ఆ ఫోటోలు చూసిన తర్వాత ఎవరు కృష్ణ ఈ వ్యక్తి అని మురారి అడగగా మీరే సార్ అని కృష్ణ చెబుతుంది ఆ మాటకి మురారి గొంతు మూగపోతుంది. గతంలో ముకుందా తను ప్రేమించుకున్న కొన్ని సన్నివేశాలు మురారి కి గుర్తుకు వస్తాయి.

Krishna Mukunda Murari Today Episode November 29 2023 Episode 327 Highlights
Krishna Mukunda Murari Today Episode November 29 2023 Episode 327 Highlights

రేపటి ఎపిసోడ్ లో మురారి నిద్రపోతూ ఉండగా తనకి కలలో కృష్ణ తో జరిగిన కొన్ని సన్నివేశాలు గుర్తుకు వస్తాయి. వాటిని నెమరు వేసుకుంటూ ఉండగా నిద్రలో మురారి కృష్ణ అని పెద్దగా అరుస్తాడు. మురారి అరవడం వల్ల ముకుందా అక్కడికి వస్తుంది. నేను ఇప్పుడు ఎవరి పేరు అరిచాను అని మురారి మనసులో అనుకుంటాడు. అప్పుడు ముకుందా నిజం చెబుతుందా లేదంటే తన పేరే పిలిచావు అని అంటుందా అనేది చూడాలి.

Related posts

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N