NewsOrbit
Entertainment News Telugu TV Serials

Kumkuma Puvvu February 1 2024 Episode 2093: అంజలి చెప్పినట్లుగా ఆశా డెడ్ బాడీ స్మశానంలో దొరుకుతుందా లేదా.

Kumkuma Puvvu Today Episode February 1 2024 Episode 2093 Highlights

Kumkuma Puvvu February 1 2024 Episode 2093: కావేరి చూడండి పద్మావతి గారు మాకే సవా లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి అదికాక ఇప్పుడు తగుదునమ్మా అంటూ మీ ప్రాబ్లం కూడా మాదే అన్నట్టు మా ఇంట్లో వచ్చి పెడితే మేము ఏం చేయాలి చెప్పు అంటుంది. పద్మావతి అదేంటండీ అంజలి శ్వేత బాధ్యత తీసుకుంటాను అంది అందుకే అంజలి దగ్గరికి వచ్చాము అని అంటుంది.అమృత అలా కాదు పద్మావతి గారు అంజలి అప్పుడు అనుకోని కారణాలవల్ల మాట ఇచ్చి ఉండొచ్చు కానీ తను మాట నిలబెట్టుకుంది శ్వేత గురించి చెప్పగానే వెంటనే తన బాధ్యతగా శ్వేత కోసం బయలుదేరి వెళ్ళింది తన ముందు మేము ఇలా చెబితే తను ఫీల్ అవుతుంది అందుకనే మేము ఇప్పుడు చెబుతున్నాము తనకు శ్వేత అంటే ప్రాణం కాదనడం లేదు అలా అని తనకున్న సమస్యల్లో మళ్లీ మీ సమస్యలు తీసుకువచ్చి పెడితే తను ఇలా నెట్టుకు రాగలుగుతుంది చెప్పండి అని అంటుంది. అరుణ్ కుమార్ అవును సాగర్ మా అంజలి అప్పుడు అనుకుని కారణాలవల్ల శ్వేతకు తల్లిగా నటించి ఉండవచ్చు కాదనడం లేదు కానీ ఇకనైనా శ్వేత బాధ్యత మీరు తీసుకుంటే మంచిది అంటాడు. చంద్రం అవును సాగర్ ఇక మీదట నేను మీ సమస్యలు అంజలికి చెప్పకండి వాటిని మీరే పరిష్కరించుకోండి ఈ మాట అంజలి ముందు చెబితే తను నిజంగానే ఫీల్ అవుతుంది కాబట్టి మీకు చెబుతున్నాను మీరే అర్థం చేసుకోండి అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode February 1 2024 Episode 2093 Highlights
Kumkuma Puvvu Today Episode February 1 2024 Episode 2093 Highlights

కట్ చేస్తే అంజలి శ్వేతను తీసుకొని ఇంటికి వస్తుంది. శ్వేత నానమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి పద్మావతిని హత్తుకుంటుంది.పద్మావతి శ్వేత వచ్చేసావా బంగారు తల్లి అంటూ తనకి ముద్దు పెడుతుంది.సాగర్ నా చిట్టి తల్లి వచ్చేసావా అంటూ సాగర్ కూడా శ్వేత దగ్గరికి వెళ్లి నుదుటిన ముద్దు పెడతాడు.సాగర్ అంజలి చాలా థ్యాంక్స్ శ్వేతను ఎక్కడినుండి తీసుకొస్తున్నావ్ అని అడుగుతాడు. అంజలి ఇప్పుడు అవన్నీ మీకు అనవసరం శ్వేతను నేను క్షేమంగా తీసుకువచ్చాను కదా ఇక మీరు శ్వేతను ఇప్పటినుంచి జాగ్రత్తగా చూసుకోండి అని అంటుంది. పద్మావతి అలాగే అంజలి అని వాళ్ళు బయలుదేరుతారు. శ్వేత లక్కీ బాయ్ నేను వెళ్ళొస్తాను అని అంటుంది అంజలి చూడు శ్వేత ఇక్కడే బాయ్ చెబుతావా నేను కారు దాకా వస్తాను కదా అంటూ వాళ్ళని కారు దాక తీసుకువెళ్తుంది కొండమ్మ ఏంటో అమ్మ అందరం ఒకే ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం కానీ ఎవరి స్టేజి వస్తే వాళ్ళని దిగిపోవాలి కదా తప్పదు కదా అని బాధపడుతుంది కొండమ్మ.

Kumkuma Puvvu Today Episode February 1 2024 Episode 2093 Highlights
Kumkuma Puvvu Today Episode February 1 2024 Episode 2093 Highlights

అంజలి చూడు కొండమ్మ జీవితం అన్నాక ఇలాంటి బంధాలు అనుబంధాలు కష్టాలు, నష్టాలు ఎదురవుతూనే ఉంటాయి తప్పదు అని అంటుంది పద్మావతి సరే అంజలి మేము వెళ్ళొస్తాం అని అంటుంది అంజలి చూడండి పద్మావతి గారు మీతో ఒక విషయం చెప్పాలి మీరు ఇకనుండి శ్వేత బాధ్యత మీరే చూసుకోవాలి నాకే సవా లక్ష ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా ప్రాబ్లమ్స్ లో శ్వేత చిక్కుకోకూడదు నా ప్రాబ్లమ్స్ కి స్వేత బలి కాకూడదు అని నేను శ్వేత బాధ్యతను మీరు చూసుకోవాలి అంటున్నాను అని చెబుతుంది అంజలి. పద్మావతి అలాగే అంజలి నువ్వు చెప్పినట్లే ఇకనుండి శ్వేతను కంటికి రెప్పలాగా నా బాధ్యతగా భావించి చూసుకుంటాను అని అంటుంది. అంజలి సాగర్ మీరు కూడా ఒక మంచి తండ్రిగా మారారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇకనుండి మీరే శ్వేతకు తల్లి తండ్రి లోటు రాకుండా పెంచాలి ఆ బాధ్యత నీ మీద కూడా ఉంది అని అంటుంది. సాగర్ అవును అంజలి నా లక్ష్మి కోరుకున్నట్లుగా నేను మారిపోయాను అలాగే శ్వేతకు మంచి తండ్రిగా నా బాధ్యత నేను నిర్వర్తిస్తాను అని అంటాడు అంజలి సరే ఇక మీరు వెళ్ళండి శ్వేతను జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఇంట్లోకి వెళ్ళిపోతుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode February 1 2024 Episode 2093 Highlights
Kumkuma Puvvu Today Episode February 1 2024 Episode 2093 Highlights

కట్ చేస్తే కావేరి ఆహ అయిపోయిందా అప్పగింతలు చెప్పడానికి ఆమడ దూరం వెళ్లినట్టు నువ్వు చెప్పవలసిన అప్పగింతల పని అయిపోయిందా అంటుంది కావేరి. చంద్రం ఏంటమ్మా అంజలి సాగర్ వాళ్ల కంటే చెప్పలేదు ఏ మాక్కూడా చెప్పవా మేము మీ ఇద్దరి సంతోషం కోరుకునే వాళ్ళమే కదా మరి మాకు కూడా ఎందుకు చెప్పడం లేదు శ్వేతను ఎక్కడినుండి తీసుకువచ్చావ్ అని అడుగుతాడు. అంజలి చెబుతాను మామయ్య అంటూనేను అనుకున్నట్టుగా అది నిజమయింది ఆ యుగంధరే శ్వేతను తన మనుషులు పెట్టి కిడ్నాప్ చేయించి నన్ను పోలీస్ స్టేషన్ కి రప్పించాడు అని చెబుతుంది.కావేరి ఏంటి సరిపోయింది సక్కదనంఆ యుగంధర్ కి అదేం పోయేకాలం మొన్న బంటిని ఇప్పుడు శ్వేతను నా చేతులు పొడుగ్గా ఉన్నాయంటూ ఎదుటి వాళ్ళ మూతి మీద ముక్కు మీద పొడవకుండా ఎలా ఉంటాను అన్నట్టు ఆ యుగంధర్ కి పోలీస్ పవర్ ఉంటే మాత్రం ఊరికే మన వెంటే పడుతూ ఉంటాడా అని అంటుంది కావేరి. అవునత్తయ్య ఎలాగైనా ఆశ గురించి తెలుసుకోవాలని శ్వేతను కిడ్నాప్ చేశాడు నేను వెళ్ళాక సీతను అప్పగించమని అడిగితే ఆ యుగంధర్ ఏమన్నాడో తెలుసా ఆశా గురించి లెటర్ మీద నాకు నిజం చెబుతాను అని రాసి ఇవ్వు అన్నాడు నాకు వేరే ఏమీ తోచక ఆ పసి దాని ప్రాణం కోసం నేను ఏదైనా చేయాలి అనిపించింది అందుకే యుగంధర్ కి ఆశ గురించి నిజం చెబుతాను అని కాగితం మీద రాసి ఇచ్చి వచ్చాను అని అంటుంది.

Kumkuma Puvvu Today Episode February 1 2024 Episode 2093 Highlights
Kumkuma Puvvu Today Episode February 1 2024 Episode 2093 Highlights

అరుణ్ కుమార్ అదేంటమ్మా నువ్వే ఆశ గురించి నిజం చెబితే ఎలా బంటికి నీకు ప్రమాదం కదా అని అంటాడు కావేరి సరి సరే బాగోతం బాగానే ఉంది కానీ కలువులు ఎలుక తన గోతిని తానే దువ్వుకుంటూ వెళ్తుంది అన్నట్టు నువ్వు ఇరుక్కుంది కాక మా బంటి గాని కూడా ఇరికించావు కదా అంటుంది కావేరి బంటి అమ్మ మనం ఎవరు ఏమి మాట్లాడొద్దు అంజలి చేసింది కరెక్ట్ ఆ చిన్న ప్రాణం కోసం అంజలి ఈ నిజాన్ని చెప్పడం కరెక్టే అనిపిస్తుంది నాకు అంజలి ఏది చేస్తే అదే రైట్ అని అంటాడు.అంజలి చాలా థాంక్స్ బండి నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు అంటుంది. కావేరి ఇప్పుడు అదే వంక పెట్టుకొని మళ్లీ ఆ యుగంధర్ మన ఇంటి మీదికి రాడని గ్యారెంటీ ఏంటే కోడలా అంటుంది. అంజలి అత్తయ్య ఆశ ఏమైందో నిజం చెబుతాను అని చెప్పాను కానీ ఆశ ఎలా చనిపోయింది ఏమయింది అనే విషయం మనకు సంబంధం లేదు అని అంటుంది. బంటి చూడు అంజలి నువ్వు ఆ యుగంధర్ కి మాట ఇచ్చావు కదా మళ్లీ లేట్ అయితే ఇంటికి వచ్చిన వచ్చేస్తాడు వాడికి ఫోన్ చేసి చెప్పు అని అంటాడు.అంజలిసరే బంటి ఇప్పుడే చెబుతాను అంటూ యుగంధర్ కి ఫోన్ చేస్తుంది అంజలి.

Kumkuma Puvvu Today Episode February 1 2024 Episode 2093 Highlights
Kumkuma Puvvu Today Episode February 1 2024 Episode 2093 Highlights

యుగంధర్ హలో ఎసిపి యుగంధర్ ను మాట్లాడుతున్న మీరు ఎవరు మాట్లాడేది అని అంటాడు. అంజలి నేను మిస్సెస్ అంజలి వినయ్ కుమార్ ని అని అంటుంది అంజలి యుగంధర్ వావ్ వెరీ గుడ్ అండ్ చెల్లి మేడం చాలా మంచి పని చేశారు మీ మాట మీరు నిలబెట్టుకుంటున్నారు కదా చెప్పు ఆశ ఏమైపోయింది త్వరగా చెప్పు అని అంటాడు. అంజలి చెబుతాను మీకు ఆశ కావాలి అంటే ఊరు చివర ఉన్న స్మశానంలో ఎంట్రెన్స్ కొంచెం ముందుకు వచ్చి తొవ్వండి అందులో ఆశ డెడ్ బాడీ కనిపిస్తుంది అని అంటుంది. యుగంధర్ అంటే ఏంటి నువ్వు చెప్పేది నా ఆశ చనిపోయిందా అని అంటాడు. అంజలి అవును ఆశ చనిపోయింది ఆశ డెడ్ బాడీ కావాలి అంటే మీరు నేను చెప్పిన దగ్గర తవ్వించండి అని అంటుంది.యుగంధర్ ఎవరు ఎవరు నా ఆశని చంపేసింది ఎవరు అని అడుగుతాడు.అంజలి చూడండి ఏసీబీ గారు ఆశను ఎవరు చంపారు మాకు తెలియదు కానీ ఆశ డెడ్ బాడీ అక్కడ ఉంటుంది చూసుకోండి అని ఫోన్ కట్ చేస్తుంది అంజలి

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella