Kumkuma Puvvu November 15 2023 Episode 2027: కావేరి చూశారా చూశారా నా తమ్ముడు ఆ అమృత కలసి ఇంత ఘోరానికి ఒడిగడతారా మన బంటి గాడి చేత యాగాన్ని చేయించాలని చూస్తారా వాళ్ళ అంతు చూస్తాను కారును త్వరగా పోనివ్వండి అని భర్తను అంటుంది కావేరి భర్త ఎంత మన బంటి గాడి మంచి కోసమైనా సరే మనకు చెప్పకుండా తీసుకువెళ్తారా ఇది అన్యాయం కదా అంటాడు కావేరి ఆ మీకు ఇప్పుడు తెలిసిందా ఆ అమృత నా తమ్ముడు కలిసి ఎంత నాటకం ఆడుతున్నారో ఇప్పటికైనా తెలుసుకోండి అంటుంది భర్తను కావేరి భర్త అలా కాదు కావేరి మనబంటి ఆరోగ్యం కోసమే కదా వాళ్ళు చేసేది ఆశ అలా అయితే మరి తల్లిదండ్రులుగా మీకెందుకు చెప్పలేదు అంకుల్ అంటుంది త్వరగా పోనీయండి అంకుల్ యాగం జరిపిస్తున్నాలే మనం త్వరగా వెళ్లాలి అంటుంది ఆశ కావేరి దంపతులు ఆశా గుడికి చేరుకుంటారు అంజలి బంటి కలిసి చేస్తున్న చండీయాగాన్ని చూసి షాక్ అయ్యి ఎలాగైనా ఈ యాగాన్ని ఆపాలని వెళ్లి బంటి చెయ్యి పట్టుకుని కావేరి లేవరా బంటీ లే అని లాగుతుంది

అప్పుడు అరుణ్ కుమార్ అక్క నేను చెప్పేది కాస్త వింటావా పంతులుగారు మీరు పూజ మధ్యలో ఆపకండి మీరు కానివ్వండి అంటూ కావేరి చేయి పట్టుకొని అరుణ్ కుమార్ పక్కకి తీసుకువెళ్లి కాస్త నేను చెప్పేది వినండి అక్క అంటాడు కావేరి ఏంట్రా నువ్వు చెప్పేది ఆ వగలాడికి మీరు సపోర్ట్ చేస్తున్నారా అంటుంది అమృత వదిన మాటలు జాగ్రత్తగా రానివ్వు తను మా కూతురు అంజలి తను చేసేది తన భర్త బంటి బాగు కోసమే కదా ఎందుకు మీరు పూజ మధ్యలో ఆపాలని అనుకుంటున్నారు కాసేపు ఆగండి పూజ అయిపోతుంది అంటుంది అమృత అందుకు కావేరి దంపతులు ఏమి మాట్లాడకుండా సైలెంట్ గా నిలబడిపోతారు ఆశా మాత్రం పక్కకు వెళ్లి సాగర్ కు ఫోన్ చేస్తుంది సాగర్ ఎక్కడున్నావ్ అని అంట అంటుంది సాగర్ ఇదిగో వచ్చేస్తున్నాను కార్ లో ఉన్న ఆన్ ది వే అని సాగర్ గుడికి పోలీసుల్ని తీసుకుని వస్తాడు ఎస్సై వచ్చి యు ఆర్ అండర్ అరెస్ట్ అంజలి అని అంటుంది అంజలి షాక్ అవుతుంది అంజలి ఏంటి ఎస్సై గారు మీరు చెప్పేది అంటుంది అంజలి ఎస్సై అవును ఒక వ్యక్తి మరొక వ్యక్తిగా స్టేట్మెంట్ ఇస్తే ఇంపర్సనేషన్ అనే నేరం అవుతుంది అందుకని నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను అంటుంది పోలీస్ ఆఫీసర్ కానిస్టేబుల్స్ వెళ్లి తన అరెస్టు చేసి తీసుకురండి అంటుంది అంజలి పోలీస్ ఆఫీసర్ గారు ఒక్కసారి నా మాట వినండి

ఈ యాగం మధ్యలో ఆపితే మంచిది కాదు ఎలాగైనా యాగాన్ని జరగనివ్వండి నేను బంటి ఆరోగ్యం కోసమే ఈ యాగాన్ని మొదలుపెట్టాను ఈ యాగం పూర్తి అవ్వనివ్వండి తర్వాత మీ ఇష్టం నన్ను ఎక్కడికి తీసుకెళ్లినా వస్తాను అని అంటుంది.పోలీస్ ఆఫీసర్ ఐపీసీ సెక్షన్ 205 ప్రకారం ఆ నేరానికి మూడేళ్ల వరకు శిక్ష పడుతుంది సాగర్ ఇంకేంటి ఆలోచిస్తునారు ఎస్సై గారు ఈ సాక్ష్యం చాలదా అరెస్టు చేయండి తనను అంటాడు సాగర్ అమృత సాగర్ మా అంజలి కావాలని తను సంతకం చేయలేదు ఆశ బలవంతం చేసి బెదిరించడం వల్లే సంతకం చేసింది ఎస్సై ఓహో ఏంటి మీ అమ్మాయి ఏమీ తెలియకుండా నిలబడితే ఆశ వచ్చి మీ అమ్మాయి చేత్తో బలవంతంగా సంతకం పెట్టించింది అంటారా సాగర్ నా భార్య చనిపోతే ఈ అంజలి లక్ష్మీగా నా ఇంట్లో అడుగుపెట్టి కావాలనే ముఖర్జీ గారిని కూడా మాయ చేసి అకౌంట్ ని జాయింట్ అకౌంట్ గా మార్చి కోట్ల డబ్బును నొక్కేయాలని చూసింది చివరికి నన్ను నా ఫ్యామిలీని తన గుప్పిట్లోకి తీసుకుని ఆఖరికి మమ్మల్ని చీకుట్టి తన భర్త బంటి దగ్గరికి వెళ్లిపోయింది ఇలా చెప్పుకుంటూ పోతే ఈ అంజలి లక్ష్మీ పేరుతో చేసిన మోసాలు ఎన్నో ఉన్నాయి అని అంటాడు

సాగర్ అమృత అరుణ్ కుమార్ అబద్ధం పచ్చి అబద్ధం సాగర్ నువ్వు చెప్పేదంతా పచ్చి అబద్ధం ఒక్కసారి నా మాట విను దయచేసి ఈ యాగాన్ని ఆపొద్దు అని అరుణ్ కుమార్ అమృత వేడుకుంటారు కావేరి అమ్మో అమ్మో గ్గొడ్లను కాచేవాడు కొట్టకపోడు గొర్రెలు కాచేవాడు తిట్టకపోడు అన్నట్టు ఇన్నాళ్లు అందరి కళ్ళు కప్పి ఎంత నాటకం మాడింది అంటుంది కావేరి కావేరి భర్త ఏమ్మా అంజలి ఇదంతా మంచి కోసమే చేశాను అంటావా అని అడుగుతాడు అంజలి నేను ఇప్పుడు ఏది చెప్పినా మీరు నమ్మరు కొద్దిరోజులు ఆగితే అంతా మీకే తెలుస్తుంది కావేరి ఏంటి మీరు ఈ మోసగత్తెకు సపోర్ట్ చేస్తున్నారా అని అమృతను అంటుంది అరుణ్ కుమార్ అక్క నోరు మూస్తావా ఇంకోసారి ఆ మాట అన్నావంటే బాగోదు అంటాడు ఆశ లేవవే ఇంకా నువ్వు చేసిన మోసాలు చాలవని కూర్చుని పూజ చేస్తున్నావా అంటుంది అంజలి ఆశ మాటలు జాగ్రత్తగా రా సాగర్ ఇంకా చూస్తున్నారు ఏంటి ఎస్సై గారు తీసుకువెళ్లండి తనని అంటాడు కానిస్టేబుల్స్ అంజలిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు హ్యాపీగా ఇంటికి వచ్చి అమ్మ కొండమ్మ ఎక్కడున్నారు త్వరగా రండి రండి మీకు విషయం చెప్పాలి అంటూ పిలుస్తాడు

పద్మావతి కొండమ్మ తన దగ్గరకు వస్తారు సాగర్ ఏం జరిగింది రా అని పద్మావతి అడుగుతుంది సాగర్ టీత్ ఫర్ డాట్ ఇన్నాళ్లుగా మనల్ని లక్ష్మీగా మోసం చేసిన అంజలిని తగిన శిక్ష పడేలా చేశాను అంటాడు సాగర్ కొండమ్మ అంటే ఏంటి బాబు ఆ అమ్మను ఆ ఇంటికెళ్ళి కొట్టి వస్తున్నారా ఏంటి అని అడుగుతుంది సాగర్ నేను వెళ్లి కొడితే అది ఆడి వరకే ఉంటుంది అది పోలీసులు వెళ్లి అరెస్టు చేస్తే అది పబ్లిక్ ఇష్యూ అవుతుంది అంతా తెలిసిపోతుంది అంటాడు సాగర్ పద్మావతి ఏంట్రా నువ్వు చెప్పేది సాగర్ అంటే అంజలిని అరెస్టు చేయించావా అని షాక్ అవుతారు సాగర్ అవును ఆ అంజలిని పోలీసుల చేత అరెస్టు చేయించి జైలుకు పంపించాను అంటాడు అప్పుడు పద్మావతి కొండమ్మ షాక్ అవుతారు సాగర్ ఆ అంజలి లక్ష్మీ పేరుతో మనకు చేసిన అన్యాయానికి మినిమం మూడు సంవత్సరాలు జైల్లో చిప్పకూడు తింటుంది అది చాలు నాకు అంటాడు సాగర్