Kumkuma Puvvu November 16 2023 Episode 2028: పద్మావతి ఎంత పని చేసావు రా సాగర్ అంజలిని జైలుకు పంపించడం ఏంట్రా నువ్వు ఎంత పొరపాటు చేసావో నీకు అర్థం అవుతుందా లక్ష్మీ చనిపోయిందని తెలిసి తల్లి లేని ఆ పసి దానికి తల్లి లాగా మారిమన ఇంట్లో దీపం పెట్టే దిక్కు లేకుంటే లక్ష్మీ ప్లేస్ లో అంజలి వచ్చి మన ఇంట్లో అడుగుపెట్టి నిన్ను పేకాటలు పబ్బులు రీసులు అంటూ తిరిగే నిన్ను మార్చింది చూడు అదేనా అంజలి చేసిన తప్పు దిక్కులేని పరిస్థితుల్లో మేముంటే మా మన గుండెల నిండా సంతోషాన్ని నింపి శ్వేతకు తల్లిగా ఇంటికి వచ్చి తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది చూడు అదేనా అంజలి చేసిన తప్పు మనల్ని మన కుటుంబాన్ని తను ఏ విధంగా మోసం చేసింది చెప్పరా సాగర్ అంటుంది పద్మావతి కొండమ్మ అంజలి అయిన వాళ్లందర్నీ వదులుకొని లచ్చు అమ్మకు ఇచ్చిన మాట కోసం వచ్చి మన ఇంట్లో దీపం పెట్టి వెలుగులు నింపింది అదేనా బాబు ఆ అంజలి అమ్మ చేసిన నేరం అంటుంది కొండమ్మ సాగర్ స్టాప్ ఇట్ ఆపండి అంజలి మిమ్మల్ని మోసం చేసింది అందుకనే మీరు తనవైపు మాట్లాడుతున్నారు

అంజలి ముఖర్జీ గారిని నమ్మించి కంపెనీకి ఎండి సీట్లో కూర్చుంది అలాగే నేను పెట్టుబడి పెట్టిన 50 కోట్లు రాకుండా అడ్డుకుంది నా అకౌంట్ నుంచి డబ్బులు నేను తీసుకోకుండా నా అకౌంట్ ని జాయింట్ అకౌంట్ గా మార్చి తన గుప్పిట్లో పెట్టుకుంది పిల్లకు తల్లిగా ఇంటికి కళ్ళల్లో వెలుగులు నింపింది అంటూ సానుభూతి చూయించి మనల్ని మోసం చేసింది మీరు ఇంకా ఆ అంజలి నమ్ముతున్నారా అని అంటాడు సాగర్ పద్మావతి సాగర్ ఒక్కసారి ఆలోచించరా ఇప్పుడు శ్వేత తన లక్ష్మి లేదని తెలిస్తే ఆ పసి దాని గుండె తట్టుకోగలుగుతుందా ఒక్కసారి ఆలోచించరా సాగర్ అంజలిని జైలు నుంచి విడిపించు అని ప్రాధేయపడుతుంది పద్మావతి సాగర్ అది నా కూతురు కాదు నా పాలిట దరిద్రం అయినా ఇన్ని రోజులు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంటుంది

అంటాడు సాగర్ పద్మావతి అంటే ఏంట్రా మళ్లీ శ్వేతను హాస్టల్లో వేస్తావా అంటుంది సాగర్ అవును ఇన్ని రోజులు నేను శ్వేతతో తప్పని పరిస్థితుల్లో అలా ప్రేమగా మాట్లాడాను తప్ప తన మీద నాకు ఎలాంటి ప్రేమ జాలి దయ లేదు ఇక చాలు వెళ్లండి అంటాడు సాగర్ కట్ చేస్తే వంటి ఇంట్లో అమృత అరుణ్ కుమార్ అంజలిని ఎలాగైనా బయటికి తీసుకురావాలి అన్న ఆలోచనతో బంటికి ఎలాగైనా గతం గుర్తు చేస్తేనే తప్ప మనం అంజలిని బయటికి తీసుకురాలేము అంటూ బంటి కోసం ఇల్లంతా వెతుకుతారు బంటి కింద గార్డెన్ లో యోగా చేసుకుంటూ కనిపిస్తాడు అమృత అరుణ్ కుమార్ బంటి దగ్గరికి వచ్చి అరుణ్ కుమార్ బంటి నీకేమైనా గుర్తుకొస్తున్నాయా నువ్వు పెళ్లి రోజు కింద పడిపోవడానికి గల కారణమేంటి నువ్వే పడిపోయావు నిన్నెవరైనా నెట్టి వేశారా ఒక్కసారి గుర్తు తెచ్చుకో బంటి అంటాడు అరుణ్ కుమార్ బంటి తన గదాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండగా కావేరి దంపతులు వచ్చి అరుణ్ కుమార్ ని ఒరేయ్ తమ్ముడు ఎందుకు నా కొడుకుని ఇలా బాధ పెడుతున్నారు

నీ కూతురుఅంజలిని జైలు నుంచి విడిపించడానికి నా కొడుకు బంటిని ఇబ్బంది పెడతారా మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి ఫస్ట్ వాన్ని నేను చూసుకుంటాను మీరు ఇంకోసారి బంటి దగ్గర గతం గురించి మళ్లీ మాట్లాడితే ఊరుకునేదే లేదు అంటుంది కావేరి అమృత వదిన అది కాదు ఒక్కసారి నేను చెప్పేది వినండి బంటి కొంచెం కొంచెం మాట్లాడగలుగుతున్నాడు. అలానే కొంచెం మనం సపోర్ట్ చేస్తే గతం గుర్తుకు వస్తుంది ప్లీజ్ ఒక్కసారి మా గురించి ఆలోచించండి కావేరి ఏమీ అక్కర్లేదు మీ చావు మీరు ఎలా అయినా చావండి మమ్మల్ని వదిలేయండి అంటుంది కావేరి కట్ చేస్తే పోలీస్ స్టేషన్లో అంజలి ప్లీజ్ ఇన్స్పెక్టర్ గారు ఒక్కసారి నేను చెప్పేది వినండి దీనంతటికీ కారణం ఆశ నన్ను లక్ష్మిగా మార్చడానికి తను ప్లాన్ తో ఈ సంతకాలు పెట్టించింది ప్లీజ్ ఒక్కసారి అర్థం చేసుకోండి పోలీస్ ఆఫీసర్ ఏంటి రేపు సీఎం గా సంతకాలు పెట్టమంటే పెట్టేస్తావా అంటుంది ఆశ వెరీ గుడ్ ఇన్స్పెక్టర్ గారు చాలా మంచి ప్రశ్న అడిగారు ఈ అంజలి లక్ష్మీ లాగా ఇలాంటి మోసలు ఎన్నో చేసింది తనని జైల్లో వేయండి ఫస్ట్ అంజలి ఆశ ఈరోజు నీది కావచ్చు కానీ రేపు అనేది తప్పనిసరిగా నాదే అవుతుంది.

ఈ అంతటికి కారణం నువ్వే అని తెలిసినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో ఇన్స్పెక్టర్ ఏమ్మా లక్ష్మీ లాగా ఉన్న అంజలి నీ వివరాలన్నీ ఇందులో రాసి నాకు స్టేట్మెంట్ ఇవ్వు అంటుంది పోలీస్ ఆఫీసర్ అంజలి నేనేమీ తప్పు చేయలేదు ఆఫీసర్ ఒక్కసారి నేను చెప్పేది వినండి ఇన్స్పెక్టర్ ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది ఒక దాంట్లో అంజలి ఒక దాంట్లో లక్ష్మి అని సంతకాలు చేసావ్ ఇది చాలదా నిన్ను జైల్లో వేయడానికి ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్స్ ఈ చీటింగ్ లేడీ ని తీసుకెళ్లి సెల్లో వేయండి అంటుంది కానిస్టేబుల్స్ వచ్చి అంజలిని తీసుకువెళ్లి సెల్లో వేస్తారు ఆశ అంజలి దగ్గరికి వచ్చి చూడు అంజలి నీవు చేసిన ఈ సంతకాలకు శిక్ష మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాలు కాలం అయ్యే లోపు నేను ఇంకో ప్లాన్ వేస్తాను

నిన్ను ఎప్పటికీ ఈ కటకటాల వెనకే ఉంచుతాను కాస్కో నువ్వు బయటికి వచ్చేలోపు జరగకూడనిది అంతా జరిగిపోతుంది అప్పుడు ఏం చేయగలవు నువ్వు అంజలి ఆశ నన్ను ఎదురుగా వచ్చి ఢీకొట్టలేక ఈ దొంగ నాటకాలు అన్ని ఆడుతున్నావు నీ ప్లాన్స్ అన్ని నాకు తెలుసు నేను త్వరలోనే బయటికి వస్తాను బంటికి గతం మొత్తం గుర్తుకు వస్తుంది అంటుంది అంజలి ఆశ పూర్ అంజలి సాగరతో చేయి కలిపి నిన్ను ఇలా ఇరికించిందే నేను ఇంకా నువ్వు బయటికి వస్తావని కలగంటున్నావా అంజలి ఆశ నిజం నిప్పులాంటిది దాన్ని సెల్లో వేసినంత మాత్రాన అది ఎప్పటికీ బయటికి రాదు అని అనుకోకు దాని టైం వచ్చినప్పుడు సెల్ బద్దలు కొట్టుకొని బయటికి వచ్చి నిజాన్ని నిర్భయంగా చెబుతుంది అంటుంది అంజలి కట్ చేస్తే సాగర్ ఇంట్లో పద్మావతి శ్వేతకు లక్ష్మి లేదు అన్న నిజాన్ని ఎలా చెప్పాలి అని మనసులో సతమతమవుతూ ఉంటుంది పద్మావతి