Madhuranagarilo 16th November 2023 Episode 211: అసలు నీకు ఏం కావాలి నాకెందుకు ఫోన్ చేస్తున్నావ్ అని శ్యామ్ అంటాడు. నేను కోల్పోయిన జీవితాన్ని పొందడానికి వచ్చాను అందుకే మన పెళ్లిరోజు మనo కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం ఉంటాను సుందరం బాయ్ అని ఫోన్ కట్ చేస్తుంది రుక్మిణి. శ్యామ్ కోపంతో ఫోన్ పగలగొడతాడు. తను ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది అంతా రాదా వింటుంది. అంటే ఆయన ఎవరితోటో ఫోన్లో మాట్లాడి ఇబ్బంది పడుతున్నాడు అతను ఎవరో తెలుసుకోవాలి అని రాదా అనుకుంటుంది. కట్ చేస్తే, రాధా ఇక మేము బయలుదేరుతాము అని రాధ వాళ్ళ అమ్మ అంటుంది. ఆయన ఏదో కోపంలో అలా అన్నారమ్మా కానీ ఆయన చాలా మంచివారు అని రాదా అంటుంది. ఇంతలో మధుర వచ్చి మీ ఆయన గురించి వాళ్ళు తప్పుగా ఏమి అనుకోరులే అమ్మ అని అంటుంది.

సారీ మామయ్య గారు మీరు ఉన్నారని చూసుకోకుండా రాధ మీద కోప్పడ్డాను, కానీ రాదను ఎందుకు ఫారన్ తీసుకువెళ్లాలనుకుంటున్నాను అంటే తను ఆనందంగా ఉండడం కోసమే మామయ్య గారు అని శ్యామ్ వెళ్లిపోతాడు. రాధా ఇక మేము బయలుదేరుతున్నామని వాళ్ళు వెళ్ళిపోతారు. కట్ చేస్తే, రే శ్యామ్ ఎందుకురా ఇలా చేస్తున్నావ్ అసలు సడన్గా రాదని తీసుకొని ఫారన్ ఎందుకు వెళ్లాలనుకుంటున్నారా అని మదుర అడుగుతుంది. అమ్మ నేను తర్వాత చెప్తాను అని శ్యామ్ అంటాడు. భార్యగా నా వెనకాల ఎక్కడికైనా రావాలి అది నీ బాధ్యత అన్నా నీవు, కొడుకుగా మాకు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా అని ధనంజయ్ అంటాడు. రే శ్యామ్ నువ్వు చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే అని వాళ్ళ అమ్మ అంటుంది. అమ్మ రాదని తీసుకొని ఫారన్ కు ఎందుకు వెళ్లాలనుకుంటున్నాను అంటే నా మొదటి భార్య ఈ ఊరు వచ్చింది, తను నాతో కలిసి ఉండాలనికుంటుంది ఫోన్ చేసి నన్ను బెదిరిస్తుంది పెళ్లి రోజు కలుద్దాం అని చెప్పింది అని శ్యామ్ అంటాడు. నీ మొదటి భార్య ఈ ఊరు వచ్చిందా అని మధుర షాక్ అవుతుంది.

తనకు భయపడి రాదని తీసుకొని ఫారన్ వెళ్లడం ఎందుకురా పిలిపి మాట్లాడుదాము అని ధనంజయ్ అంటాడు. నాన్న ఈ విషయం రాధకి తెలవకూడదనే నాన్న నా బాధంతా అని శ్యామ్ అంటాడు. రాధ గురించి భయపడడమేంటిరా అని మధుర అంటుంది. అవునమ్మా రాదా నన్ను పెళ్లయిన కొత్తలో ఏం అడిగిందో తెలుసా నీ మొదటి భార్య గురించి చెప్పండి నేను వెళ్లి నచ్చజెప్పి తీసుకు వస్తాను మిమ్మల్ని ఇద్దరినీ కలుపుతాను అని చెప్పింది అమ్మ, అందుకే ఇప్పుడు రాధకు ఈ విషయం తెలిస్తే ఆ రాక్షసిని ఎలాగైనా మార్చి తనతో నన్ను కాపురం చేసేలా చేస్తుంది తను మన జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతుందమ్మా అందుకే నా భయం అంత అనే శ్యామ్ అంటాడు. కట్ చేస్తే, చిన్న పనుండి హైదరాబాద్ వెళ్ళాం అమ్మ అని మురళి అంటాడు. అయితే రాధ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకపోయారు నాన్న అని రుక్మిణి అంటుంది. రాధ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం అమ్మ అని మురళి అంటాడు. అయితే రాధవల్లా ఆయన ఇంట్లోనే ఉన్నాడా నాన్న అని రుక్మిణి అడుగుతుంది.

ఉన్నాడమ్మా ఎందుకు అని మురళి అంటాడు. కూతురు ఇంటికి వెళ్లి వచ్చిన మీరు ఆనందంగా ఉండాలి కానీ ఇలా ఎందుకు బాధపడుతున్నారు, మీరు ఎందుకు బాధపడుతున్నారో నాకు అర్థమైంది లే నాన్న నా గురించే కదా రాధా వాళ్ళ ఆయనతో ఆనందంగా ఉంది నేనేమో మీ ఇంట్లో పడి ఉన్నానని బాధపడుతున్నారు కదా, కొద్ది రోజులు ఆగండి నాన్న నేను నా భర్తతో కలిసి కాపురం చేసుకుంటాను అత్తవారింటికి వెళ్ళిపోతాను అప్పుడు మీరు నన్ను చూసి ఆనంద పడొచ్చు అని రుక్మిణి అంటుంది. సరే అమ్మ మేము అలసిపోయి వచ్చాము ఫ్రెష్ అవుతాం అని మురళి వెళ్లిపోతాడు. కట్ చేస్తే సారీ రాదా ఇందాక మీ వాళ్ళు ఉన్నారని చూసుకోకుండా కోప్పడ్డాను అని శ్యామ్ అంటాడు. అడగకుండానే సారీ చెప్పారు కదా నేను ఒక విషయం అడుగుతాను చెప్పండి అని రాదా అంటుంది. ఫారన్ ఎందుకు వెళ్తునo తప్ప ఏది అడిగినా చెప్తాను అని శ్యామ్ అంటాడు. అయితే మీతో ఫోన్లో మాట్లాడింది ఎవరు అని రాదా అడుగుతుంది. ఆఫీసులో అతను అని శ్యామ్ అంటాడు.

ఆఫీసులో అతనితో మాట్లాడి ఫోన్ పలక కొడతారా అని రాధా అంటుంది. అది ఆఫీస్ పోనే కదా రాదా దాని గురించి టెన్షన్ ఎందుకు అని శ్యామ్ అంటాడు. సరే నేను ఫారన్ ఎందుకు వెళ్తునమని అడగను కానీ పండు గురించి ఒక్కసారైనా ఆలోచించారా వాడి ఆరోగ్యం గురించి ఆలోచించారా వాడికి చల్లగా అంటే పడదు అక్కడికి తీసుకు వెళ్తే వాడి ఆరోగ్యం బాగోదు అని రాదా అంటుంది. అయితే పండుని అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టి మనమిద్దరం వెళ్దాము అని శ్యామ్ అంటాడు.

ఆ మాట అనడానికి మీకు మనసు ఎలా వచ్చిందండి పండుని నాకంటే ఎక్కువగా చూసుకునే మీరేనా ఇలా మాట్లాడుతుంది,సొంత కొడుకు అయితే ఇలా మాట్లాడే వారు కాదు కదా, కానీ నేను అలా కాదండి కన్నది మా అక్కే అయినా వాడు అంటే నాకు ప్రాణం వాడిని వదిలిపెట్టి నేను రాను వచ్చినా జీవచ్ఛవంలా ఉండాల్సిందే, అక్కడికి వచ్చి మనసు చంపుకొని జీవచ్ఛవంలా ఉండే కంటే ఇక్కడే గొంతు పిసికి చంపేయండి అని రాధా అంటుంది. అమ్మ రాదా ఏం మాట్లాడుతున్నావు అని మధుర అంటుంది. చూసావా అత్తయ్య పండుని వదిలేసి ఇద్దరం ఫారన్ కి వెళ్ళిపోదాం అంటున్నాడు మీ అబ్బాయి అని రాధా అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది