Madhuranagarilo november 13 2023 episode 208: రండి మామయ్య ఇంటికి వెళదాము రాదా సప్రైజ్ గా ఫీల్ అవుతుంది అని శ్యామ్ అంటాడు. రాదా కి నా పెద్ద కూతురు ఇచ్చిన షాక్ చాల్లే బాబు మళ్లీ మీరు ఎందుకు అని మురళి అంటాడు.ఇదేంటి మావయ్యకి నామీద కోపం పోలేనట్టుంది అని శ్యామ్ అనుకుంటాడు. అంటే బాబు చచ్చిపోయింది అనుకున్న మా పెద్ద కూతురు తిరిగి వచ్చి రాధకు షాక్ ఇచ్చింది కదా దాని గురించి చెప్తున్నాడు అని వాళ్ళ అత్తయ్య అంటుంది. బస్సు టైం అవుతుంది మనం వెళ్లి టాబ్లెట్ తీసుకోవాలి కదా వెళ్దాం పదా అని మురళి అంటాడు. సరే బాబు ఇక మేము బయలుదేరుతాము అని వాళ్ళు వెళ్ళిపోతారు. కట్ చేస్తే, రాదా వాళ్ళ ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ నాకు ఆకలి వేస్తుంది అన్నం పెట్టు అని పండు అంటాడు. కొద్దిసేపు ఆగు, నాన్న వస్తాడు అప్పుడు అందరం కలిసి తిందాము అని రాదా అంటుంది. అలాగేనమ్మ అని పండు అంటాడు. రాధా మీ అక్క భలేగా అందరిని నవ్విస్తుంది అని మధుర అంటుంది.

అందర్నీ నేను నవ్విస్తాను కానీ ఆ భగవంతుడు నా జీవితంతో ఆడుకున్నాడు అని రుక్మిణి బాధపడుతుంది. చూడమ్మా నీ విషయంలో జోక్యం చేసుకుంటున్నాను అనుకోకపోతే అతని గురించి మాకు చెప్పొచ్చు కదా మేము అతని సంగతి చూస్తాము అని మధుర అంటుంది. వద్దులే అత్తయ్య వాడి సంగతి నేనే చూసుకుంటాను మధ్యలో మీకెందుకు ఆ గొడవలు అన్నీ డిస్టర్బ్ అవుతారు అని రుక్మిణి అంటుంది. రాధా మీ ఆయన ఎక్కడ దాకా వచ్చాడో కనుక్కో లేట్ అవుతుందంటే పండుకైనా అన్నం పెడదామని అని రుక్మిణి అంటుంది. రాధా శ్యామ్ కి ఫోన్ చేసి ఎక్కడున్నారండి లంచ్ కి వస్తున్నారా అని అంటుంది. వస్తున్నాను రాదా 10 మినిట్స్ లో అక్కడే ఉంటాను అని శ్యామ్ అంటాడు. నీకోసం అందరం ఇంటిదగ్గర ఎదురుచూస్తున్నాం అండి మా అక్క నీకోసం గుత్తి వంకాయ ఆలు వండింది అని రాదా అంటుంది. అవునా మొదటిసారి మీ అక్కని మీ అక్క చేసిన వంటని రెండిటిని పరిచయం చేసుకోబోతున్నానన్నమాట అని శ్యామ్ అంటాడు. సరేనండి ఉంటాను అని రాధ ఫోన్ కట్ చేస్తుంది. రాధా ఏమన్నాడు మీ ఆయన వస్తున్నాడా అని రుక్మిణి అడుగుతుంది.

అక్క పది నిమిషాల్లో వస్తున్నాడంట అని రాదా అంటుంది. ఇంతలో రుక్మిణికి ఫోన్ వస్తుంది, నేను ఫోన్ మాట్లాడి వస్తాను అని రుక్మిణి లోపలికి వెళ్ళిపోతుంది. హలో రుక్మిణి,ఎమ్మెస్ సుందరం ఫోన్ నెంబర్ దొరికింది అని చెప్తుంది వాళ్ళ ఫ్రెండ్. అవునా అయితే నాకు పంపించు వాడితో ఒక ఆట ఆడుకుంటాను అని రుక్మిణి అంటుంది. వాళ్ల ఫ్రెండు రుక్మిణికి నెంబర్ మెసేజ్ చేస్తుంది. ఇంతలో శ్యామ్ ఇంటికి వచ్చి రాదా మీ అక్క ఏది అని అంటాడు. ఫోన్ మాట్లాడదామని పైకి వెళ్ళింది అండి కానీ గుడిలో మీరు అనుకుని మా అక్క వేరే వాళ్ళతో మాట్లాడింది తన భార్య చేతిలో దెబ్బలు తిన్నాడు అని రాధా చెప్తుంది. అంటే మీ అక్క నన్ను ఆటపట్టించాలనుకుందన్నమాట నేను కూడా మీ అక్కను ఆట పట్టిస్తాను అని శ్యామ్ అంటాడు. మీ ఇద్దరి మధ్యలో ఆమాత్రం ఆటపట్టించుకోవడం ఉంటేనే బాగుంటుందిరా శ్యామ్ అని ధనంజయ్ అంటాడు. అలాగే అని శ్యామ్ పైకి వెళ్తాడు. ఇంతలో రుక్మిణి శ్యామ్ కి ఫోన్ చేస్తుంది.

కొత్త నెంబర్ కావడంతో హలో ఎవరు అని శ్యామ్ అంటాడు. ఎవరో గుర్తుపట్టలేదా ఎమ్మెస్ సుందరం అని రుక్మిణి అంటుంది. రుక్మిణి నువ్వా అని శ్యామ్ షాక్ అవుతాడు. పర్వాలేదు కట్టుకున్న పెళ్ళాం గుర్తు లేకపోయినా నా గొంతు గుర్తుకుంది అని రుక్మిణి అంటుంది. మళ్లీ ఎందుకు ఫోన్ చేసావు అని శ్యామ్ అంటాడు. నన్ను మోసం చేసి నిర్దాక్షిణ్యంగా వదిలేసి హైదరాబాద్ కి వచ్చి హ్యాపీగా ఉంటున్నావా నీ సంగతి తేల్చుకోడానికే ఇక్కడికి వచ్చాను మన పెళ్లిరోజు నీకు గుర్తుందా అని రుక్మిణి అడుగుతుంది. అది ఎలా మర్చిపోతాను నాకు పెద్ద గాయం చేసిన రోజు అని శ్యామ్ అంటాడు. అయితే అదే రోజు మనం కలిసి మాట్లాడుకుందాం లెక్కలన్నీ తేల్చుకుందాం అని రుక్మిణి ఫోన్ కట్ చేస్తుంది. శ్యామ్ కోపంగా కిందికి వచ్చి నాకు బయట పనుంది వెళ్తున్నాను అని వెళ్ళిపోతాడు. ఇదేంటండి వీడు ఇలా కోపంగా ఉన్నాడు అని మధుర అంటుంది. ఇంతలో రుక్మిణి కూడా గదిలో నుంచి బయటకు వస్తుoది. అక్క ఏంటి అలా ఉన్నావు అని రాదా అడుగుతుంది.

ఏమీ లేదు రాదా ఆ దుర్మార్గుడు నన్ను మోసం చేసిన వాడికి ఫోన్ చేసి వస్తున్నాను అని రుక్మిణి అంటుంది. అయితే అతని ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు అక్క నేను మాట్లాడుతాను అని రాదా అంటుంది. నెంబర్ ఇస్తే వెళ్లి ఏం అడుగుతావు, చెప్పు తీసుకొని మొహం మీద కొట్టి మా అక్కని ఎందుకురా మోసం చేసావు అని అడుగుతావా అని రుక్మిణి అంటుంది. అక్క ఆవేశపడకుండా ఆలోచించక్క అని రాధా అంటుంది. చూడమ్మా నిజంగానే అతను గురించి తెలిస్తే ఏం ఆశిస్తున్నావు అని మధుర అడుగుతుంది. నన్ను మోసం చేసినందుకు గాను పండుకి తండ్రిగా నాకు భర్తగా ఉంటే సరే సరే లేదంటే వాడి సంగతి చూస్తాను అని రుక్మిణి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది