Madhuranagarilo Episode 180: మొత్తానికి వీడి దగ్గర నా పరువు తీసేశావు అని ధనుంజయ్ అంటాడు. స్కూల్లో టీచర్ ముందు పరువు పోయే కంటే వీడు ముందు పోతే తప్పేముంది లేండి అని మధుర అంటుంది. అవును చేత నువ్వు హోంవర్క్ చేస్తే మా టీచర్ దగ్గర నీ పరువు పోయేది అని పండు అంటాడు. ఇంతలో రాధ కి ఫోన్ వస్తుంది అమ్మ నీకు ఫోన్ వస్తుంది అని పండు అంటాడు. రాధ వచ్చి ఫోన్ కట్ చేసి వీడియో కాల్ చేస్తుంది నాన్న ఎలా ఉన్నావ్ ఇదిగో పండు మాట్లాడతాడట అని రాదా అంటుంది. తాతయ్య బాగున్నావా నేను బాగానే ఉన్నాను మా డాడీ చేత హోంవర్క్ చేయించుకుంటున్నాను అమ్మమ్మ ఎలా ఉన్నావు ఇదిగో అమ్మతో మాట్లాడు అని పండు అంటాడు. హలో అమ్మ ఎలా ఉన్నావ్ నాన్నగారు బిజీగా ఉన్నారా అని రాదా అంటుంది.

రాధ వల్ల నాన్న ఫోన్ తీసుకొని రాదా బాగున్నావా పరిహార పూజకి ముహూర్తం పెట్టారా అని అంటాడు. నాన్న నేను ఆయన కలిసి బావని వెతకడానికి అమీర్పేట వెళ్దాం అనుకుంటున్నాం అని రాదా అంటుంది. వద్దులే అమ్మ అల్లుడు గారు నువ్వు ఎందుకు వెళ్లడం పరిహారం పూజకు వస్తాను కదా అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం అని వాళ్ళ నాన్న అంటాడు. నాన్న ఎందుకు అలా అన్నాడు ఏది ఏమైనా బావ ఆచూకీ తెలుసుకోవడం నాకు చాలా అవసరం అని రాదా తన మనసులో అనుకుంటుంది.కట్ చేస్తే రాదా వాళ్ళ అత్తయ్య మధుర టిఫిన్ చేసి ఒరేయ్ శ్యామ్ టిఫిన్ చేద్దురుగాని రండి అని పిలుస్తుంది. ఈరోజు నేను గుడికి వెళ్లి వచ్చాకే టిఫిన్ చేసాను అత్తయ్య అని రాదు అంటుంది.అయితే గుడికి వెళ్లొచ్చాకే అందరం కలిసి టిఫిన్ చేద్దాం అమ్మ ముందు మీరు వెళ్లి రండి అని మధుర అంటుంది. మేము గుడికి వెళ్లొచ్చేదాకా మీరు తినకుండా ఎందుకు ఉండడం అత్తయ్య మీరు తినండి అని రాదా అంటుంది.

అలాగే కోడలు గారు నా ఆరోగ్యం గురించి నా భోజనం గురించి నువ్వు ఇంతలా చెప్తుంటే ఎందుకు కాదంటాను నువ్వు చెప్పినట్టే చేస్తాను మీరు వెళ్లి రండి అని మధుర అంటుంది. శ్యామ్ రాధా కారులో గుడికి బయలుదేరుతారు. రాధా అందరూ గుడికి ఎందుకు వెళ్తారో నీకు తెలుసా అని శ్యామ్ అంటాడు. మనశ్శాంతి కోసం వెళ్తారు అని రాదా అంటుంది. ధైర్యం కోసం వెళ్తారు రాదా జీవితంలో వచ్చే కష్టాలకి నష్టాలకి నువ్వే నన్ను రక్షించు భగవంతుడా అని ఆయన మీద భరోసా వేసి ధైర్యంగా ఉండడానికి వెళ్తారు అని శ్యామ్ అంటాడు. అయితే మీరు కూడా ధైర్యం కోసమే వస్తున్నారా గుడికి అని రాదా అంటుంది.
- Madhuranagarilo Today Episode october 13 2023 Episode 180 Highlights
అవును రాదా నువ్వు నా ప్రేమను యాక్సెప్ట్ చేయాలి పండు నేను చాలా సంతోషంగా ఉండాలి అని భగవంతుడి ని కోరుకోవాలని వస్తున్నాను అని శ్యామ్ తన మనసులో అనుకుంటాడు. కట్ చేస్తే రాధా వాళ్ళు శైలజ వాళ్ళు ఒకే గుడికి వస్తారు. అమ్మ నేను అర్చన చేసే లోపు మీరు ప్రదక్షణ చేసి రండి అని పూజారి అంటాడు. అలాగే పంతులుగారు అని రాధా శ్యామ్ ప్రదక్షణ చేస్తూ ఉంటారు. ఆ గుడికి వచ్చిన శైలజ వాళ్లు కూడా ప్రదక్షణ చేసి పూజ చేయించుకుని ఇక వెళదాము అని నిలబడిపోతారు. మనం వెళ్లాలంటే మన ఫ్రెండ్ ప్రసాదం కోసం వెళ్ళింది తను రాణియి అని శైలజ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది.

ప్రసాదం కోసం గుడికి వెళ్తారని విన్నాను కానీ ఫస్ట్ టైం లైవ్ లో చూస్తున్నాను అది ఎక్కడ ఉందో వెళ్లి వెతుకుదాం పద అని వెతుకుతూ ఉంటారు శైలజ వాళ్ళు. ప్రదక్షణ చేస్తూ ఉండగా ధనుంజయ్ ఫోన్ చేస్తాడు రాధా నాన్న ఫోన్ చేస్తున్నాడు మాట్లాడి వస్తాను అని శ్యామ్ వెళ్తాడు. మామయ్య గారితో ఫోన్ మాట్లాడి వస్తానని ఆయన ఇంకా రాలేదేంటి అని రాధ కూడా శ్యామ్ ని వెతుకుతుంది. వాళ్ళ ఫ్రెండ్ కోసం వెతుకుతూ ఉండగా శ్యామ్ శైలజ కి కనపడతాడు ఇన్నాళ్ళకి కనపడ్డావా దుర్మార్గుడా ఉండు నీ సంగతి చెప్తాను అని శైలజ రాధ కి ఫోన్ చేసి మీ బావగారు కనిపించారు అని శైలజ అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.