Malli NIndu Jabili November 06 episode 487: గౌతమ్ బాబు మల్లిని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నాడు ఈ విషయం తెలిస్తే తను చాలా బాధపడతాడు అని మీరా అంటూ ఉండగా, గౌతమ్ వచ్చి సారీ అత్తయ్య ఏదైనా పర్సనల్ మాట్లాడుకుంటున్నారా వెళ్తాను అని గౌతమ్ అంటాడు. అదేమీ లేదండి రండి అని మల్లి అంటుంది.ఎప్పుడు ఊర్లోనే ఉండిపోతారు ఎందుకు? మేము వెళ్లేటప్పుడు మాతో బయలుదేరి వచ్చేయండి అని గౌతమ్ జగదాంబని అంటాడు. బాబు మేము ఇంటికి వెళ్తున్నాము అని మీరా అంటుంది. ఎందుకు అత్తయ్య మీరు కూడా ఇక్కడే ఉండొచ్చు కదా మాతో పాటు అని గౌతమ్ అంటాడు. అత్తయ్య నేను ప్లాన్ చేసిన సుప్రైజ్ అయిపోగానే మీ ఇంటికి వస్తాను అని గౌతమ్ అంటాడు. మా ఇంటికా అని మీరా కంగారుతో అంటుంది. ఏంటి అత్తయ్య రావద్దా మీ ఇంటికి అని గౌతమ్ అంటాడు. మా ఇంట్లో మీకు అంత సౌకర్యంగా ఉండదని అంటున్నాను బాబు అని మీరా అంటుంది. ఏం పర్వాలేదు అత్తయ్య మీ చేతి వంట నేను తినాలి మీ ఇంట్లో నేను నిద్ర చేయాలి అని గౌతమ్ అంటాడు.

శ్రవణ్ అత్తయ్య వాళ్ళని వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేసిరా అని డ్రైవర్ కి చెప్తాడు. అయ్యో మేము వెళ్తాం బాబు కారు ఎందుకు అని మీరా కంగారుగా అంటుంది. ఇప్పుడు మీరు గౌతమ్ నంద బంధువులు అలా కాలినడకన వెళ్లకూడదు ఏం పర్వాలేదు మీరు వెళ్ళండి అని గౌతమ్ వాళ్ళని కారెక్కించి పంపిస్తాడు. మల్లి నీకోసం కష్టపడి కాఫీ చేసి తెచ్చాను తీసుకో అని గౌతమ్ అంటాడు. అయ్యో మీరెందుకు తెచ్చారండి అని మల్లి అంటుంది. నువ్వు ఆశపడేది ఏదైనా నీ కాళ్ళ దగ్గరికి రావాలనదే నా కోరిక కాఫీ ఇద్దరం కలిసి తాగుదామా అని గౌతమ్ అంటాడు. అలాగే అండి అని మల్లి గౌతమ్ ఇద్దరూ రొమాన్స్ గా చూసుకుంటూ కాఫీ తాగుతూ ఉంటారు. కట్ చేస్తే, గౌతమ్ మీడియాని ఎందుకు పిలిపించాడో తెలవట్లేదు నువ్వు నేలకొండపల్లిలో గలాటాకు ఏర్పాటు చెయ్ గన్నులో బుల్లెట్లు దూసుకు వచ్చినట్టు సమస్యల మీద సమస్యలతో ఆ మల్లి ఉక్కిరిబిక్కిరి అయిపోవాలి అని రిపోర్టర్ కి వనజాక్షి చెప్తుంది. చూస్తారు గా మేడం ఆ మల్లి గారు ఎలా ఉక్కిరిబిక్కిరి అయిపోతారు అని రిపోర్టర్ వెళ్ళిపోతాడు. ఇంతలో మాలిని అక్కడికి వస్తుంది. చూడు బిడ్డ ఆ మల్లితో నీకు ఎటువంటి లొల్లి లేదు కదా నీ కాపురం అయితే సక్కగా ఉంది కదా అని వనజాక్షి మాలినిని అడుగుతుంది.

అదేమీ లేదు పిన్ని నువ్వు ఎందుకు వచ్చావు అని కొందరు మనుషుల్లో అనుమానం మొదలైంది నువ్వు ఎవరి జోలికి వెళ్ళకు పిన్ని అందరూ ఎంజాయ్ చేయడానికి వచ్చారు సరదాగా ఉండి వెళ్ళిపోదాం ఓకేనా అని మాలిని అంటుంది. సరే బిడ్డ నేను కూడా ఏదో చల్లబడి పోదామని వచ్చిన ఆ విషయాలన్ని నాకెందుకులే అని వనజాక్షి అంటుంది. నా బిడ్డ గమ్మత్తుగా అంటుంది కాని గాళ్ళ సంగతి చూడు నీకనే ఇక్కడికి వచ్చిన అని వనజాక్షి అనుకుంటుంది. మీరా స్కూల్లో వాళ్లకి గౌతం బాబుకి ఎక్కడ నిజం తెలిసిపోతుంది అని క్షణక్షణం భయం అవుతుంది అని జగదాంబ అంటుంది. నువ్వే నోరు ఆపుకోలేక అక్కడ నోరు జారుతావు అనిపిస్తుంది నిప్పుల మీద నడుస్తున్నట్టే ఉందమ్మ నాకైతే అని మీరా అంటుంది. మీరా నీ చీర చాలా బాగుంది మల్లి పెట్టిందా అని వాళ్ళ ఊళ్లో ఒక ఆవిడ అంటుంది. వాళ్ల కూతురు ఎందుకు పెడుతుంది వాళ్ళ ఆయన హైదరాబాదులోనే ఉంటాడు కదా ఆయన పెట్టి ఉంటాడు మీరా జీవితం మారిపోయింది ఇక్కడ ఉన్నప్పుడు కాయ కష్టం చేసుకునేది అని ఇంకొక ఆవిడ అంటుంది.

అది సరే కానీ మీరందరూ ఎక్కడికి బయలుదేరి వెళుతున్నారు అని జగదాంబ వాళ్ళని అడుగుతుంది. ఎవరో గౌతమ్ సార్ అంట మా ఊర్లోకి వచ్చాడంట అందరిని రమ్మని పిలిచాడంట వెళ్తున్నాము అని వాళ్ళు వెళ్ళిపోతారు. అమ్మ గౌతమ్ బాబు ఎందుకు అందరిని రమ్మని ఉంటాడు ఏం విషయం మాట్లాడుతాడు అని మీరా అంటుంది.కట్ చేస్తే, స్కూల్లో పెద్దలందరూ మీటింగ్ పెట్టి మన ఊర్లోకి గౌతమ్ బాబు మల్లి గురించి ఏదో చెప్తాడు అంట రమ్మని అందరికీ కబురు పెట్టాడు అందరూ వచ్చినట్టేనా అని ఆ ఊరి పెద్ద మల్లన్న అంటాడు. అమ్మ ఈరోజుతో మల్లి బతుకు బండలైపోతుందేమో అని మీరా టెన్షన్ పడుతుంది. చూడండి మనము ఈ ఊరికి సీతారాముల పెళ్లి చూద్దామని ఒక్కరోజు వచ్చాము అప్పుడు అనుకోకుండా అడవిలో చిక్కుకు పోవడం వల్ల మల్లి కాపాడింది దానికి ఊళ్లో పెద్దలు అందరూ మల్లికి అన్యాయం జరగకూడదు మీరు పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టి మల్లికి మీకు పెళ్లి చేశారు ఇప్పుడు ఊర్లో వాళ్ళందరూ మీరే భార్యాభర్తలు అనుకుంటారు మరి గౌతమ్ కి మల్లి నువ్వు భార్యాభర్తలని తెలిస్తే ఊర్లో జనం ఏమంటారో అని మాలిని అంటుంది. ఇప్పుడు వాటి గురించి ఎందుకు మాలిని అక్కడికి వెళ్లాక చూద్దాం ఏం జరుగుతుందో అని అరవింద్ అంటాడు. అందరూ ఊరు మధ్యలోకి వచ్చి నిలబడతారు.

మల్లి నీకు సప్రైజ్ ఇస్తానన్నది ఇక్కడే ఈ ప్లేస్ లోనే అని గౌతమ్ అంటాడు. గౌతమ్ యుద్ధ భూమిలోకి వచ్చాము విజయం నాది అపజయం నీది అని వనజాక్షి తన మనసులో అనుకుంటుంది. మల్లి గురించి ఇంకా చాలా విషయాలు మీరు తెలుసుకోవాలి రండి అని ఆ ఊరు పెద్ద మల్లన్న అంటాడు. అక్క ఈ సమయంలో నువ్వు కొన్ని మాటలు మాట్లాడు అక్క అని యాదగిరి అంటాడు. గౌతం బాబు ఇక్కడికి అందరిని పిలిచాడు మల్లి గురించి ఏం మాట్లాడుతాడో ఎవరికీ ఏమీ తెలియదు అని వనజాక్షి అంటుంది.

ఆవిడని ఎప్పుడూ చూడని ఆ ఊరి జనం అందరూ అలా నిలబడి షాక్ అవుతారు . ఏంటి అలా చూస్తున్నారు నేను ఎవరు అనా ఒరేయ్ యాదగిరి నా గురించి చెప్పరా వీళ్ళకి అని వనజాక్షి అంటుంది. మీ ఊరికి సీతారాములు ఎంత ఫేమస్సో వరంగల్ లో మా అక్క అంత ఫేమస్ మా అక్క పేరు వనజాక్షి అని యాదగిరి వాళ్లకు పరిచయం చేస్తాడు.