Malli Nindu Jabili November 20 2023 Episode 499: ఇంకా ఎన్ని రోజులు అమ్మగారు మా అమ్మ అవమానాలు భరిస్తూ ఉండాలి నా చిన్నప్పుడు ఏమి మీరా నీ భర్త ఎవడు నీ బిడ్డకు తండ్రి ఎవడు అని అంటూ ఉంటే విని ఎంతో బాధపడేదాన్ని ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అవమానాలు భరించింది, మా అమ్మ కూడా నీలాంటి ఆడదే కదా మరి ఎందుకు మా అమ్మకు నీలాగా గౌరవం దక్కకూడదు దయచేసి మా అమ్మని అర్థం చేసుకోండి మా అమ్మ మీకోసం త్యాగాలు చేసింది మీ ఇంట్లో అడుగు పెట్టాలని ఉద్దేశమే ఉంటే ఎప్పుడో వచ్చి మీ ఇంట్లో అడుగు పెట్టేది అని మల్లి అంటుంది. మి అమ్మకి ఏం తక్కువైందని మాట్లాడుతున్నావ్ మాతో సమానంగా పరుపుల మీద పడుకుంటుంది మాతో ఎక్కడికి పడితే అక్కడికి కారులో వస్తుంది.

మాతో కలిసి భోజనం చేస్తుంది ఇంకేం కావాలి మీ అమ్మకు అని మాలిని అంటుంది. అర్హత ఉందని మీ అమ్మ ఏం తక్కువైందని నువ్వు అంటున్నారు కదా చెప్తాను వినండి నా అత్తకి నా మామ కట్టిన తాళి ఒకటే తక్కువ అయింది అది ఈరోజు కట్టించి తీరుతాను అని గౌతమ్ అంటాడు.గౌతమ్ నీకు పిచ్చి పట్టిందా రా ఏం చేస్తున్నావ్ అర్థం అవుతుందా దానికి ఇప్పుడు తాళి కట్టించడం ఏంట్రా అదే గనుక జరిగితే నేనేం చేస్తాను నాకే తెలియదు అని వసుంధర అంటుంది. బాబు గారు మీరు నా గురించి గొప్పగా ఆలోచిస్తున్నారు కానీ నేను దీనికి అంగీకరించలేను దయచేసి నన్ను అర్థం చేసుకోండి ఈ వయసులో పెళ్లి చేసుకుంటే నలుగురు నానా రకాలుగా మాట్లాడుతుంటారు అని మీరా అంటుంది. అమ్మ నువ్వు ఇంకేం మాట్లాడకు మంచి పనే చేస్తున్నారు ఇంకేమి ఆలోచించకు, అమ్మ నాన్నల పెళ్లి నేను దగ్గర ఉండి జరిపిస్తాను అని మల్లి అంటుంది.

రేయ్ గౌతమ్ నీ జాగ్రత్తలో నువ్వుంటే నా జాగ్రత్తలో నేనున్నాను రా అని వసుంధర గన్ను తీసి మల్లి తలకి గురి పెట్టి పెళ్లి చేసే దీని తల ఎగిరిపోతుంది చెప్పు పెళ్ళా దీని చావా అని వసుంధర అంటుంది. అత్త నువ్వు ఎంతకైనా తెగిస్తావని నాకు తెలుసు అని గౌతమ్ వసుంధర చేతిలో నుంచి గన్ను లాక్కొని తనకే గుడి పెడతాడు.చూసావా అత్త ఇప్పుడు గన్ ఎవరి చేతిలో ఉంది కాల్చామంటావా నేను ఎంతకైనా తెగిస్తాను నువ్వు నాకన్నా నాలుగు చదివితే నేను పoది ఆకులు ఎక్కువ చదివాను అన్నావు కదా నేను పది ఆకులు చదివాను అత్తా అని గౌతమ్ అంటాడు. కాలుస్తావా అయితే నన్ను కాల్చు అని మాలిని అంటుంది. నా టార్గెట్ నువు కాదు మాలిని అని గౌతమ్ అంటాడు. ఇదంతా నువ్వే చేస్తున్నావ్ కాదు వదిన కొడుకుని కోడల్ని ముందు పెట్టి తెర వెనక ఉండి నువ్వు నడిపిస్తున్నావు కాదు అని వసుంధర అంటుంది.

నాకు కలపడం వచ్చి కానీ విడదీయడం రాదు అని కౌసల్య అంటుంది. బాబు గారు అందుకే వద్దు అని చెప్పానండి అని మీరా అంటుంది. ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు కానీ ఇప్పుడు తాళి కట్టి తీరుతాను అని శరత్ అంటాడు. పిచ్చి మొహం దాన ఇలాంటి అవకాశం నీకు మళ్ళీ రాదే గౌతమ్ బాబు గారు నీ గురించి ఇంతలా ఆలోచిస్తుంటే నువ్వెందుకే భయపడతావ్ అని జగదాంబ అంటుంది. గౌతమ్ మల్లి మొహంలో సంతోషం కోసం ఎంతకైనా తెగిస్తావు కదూ అని మాలిని అంటుంది. నువ్వేం అనుకున్న పర్వాలేదు మాలిని ఈరోజు నేను శరత్ అంకుల్ చేత అత్తయ్యకి తాళి కట్టించి తీరుతాను అని గౌతమ్ అంటాడు.

ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు నాకు అర్థమైంది గౌతమ్ నామీద నువ్వు గెలవడానికి కాదు అని వసుంధర అంటుంది. అత్తకి నీతో పాటు సమానమైన హక్కులు కావాలని నేను అడిగాను అది ఇవ్వకపోగా నేను బట్టలు పెడతాను అంటే గొడవ చేస్తారా అని గౌతమ్ అంటాడు.ఇక్కడ శివపార్వతుల కళ్యాణం బాగానే జరిగింది ఇప్పుడు ఈ గొడవ ఎందుకు ఏదైనా ఉంటే ఇంటిదగ్గర మాట్లాడుకోండి అని గుడికి వచ్చిన వాళ్లలో ఒక్కలు అంటారు. చూడండి బాబు ఇంటి గొడవలు వీధిలో పడితే అందరికీ అవమానం ఇవన్నీ మీరు ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి నలుగురులో కాదు అని ఇంకొక ఆవిడ అంటుoది.

చూడండి నలుగురిలో పడితేనే కదా తెలిసేది ఏ విషయమైనా ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి గొడవలు లేని ఇల్లు అంటూ ఉండదు అని గౌతమ్ అంటాడు. నీకెందుకురా ఇలాంటి చెత్త ఆలోచన వచ్చింది అని వసుంధర అంటుంది.అత్త నువ్వు ఎన్ని అనుకున్నా సరే నేను ఈరోజు నా అత్త మెడలో శరత్ అంకుల్ చేత తాళి కట్టిస్తాను అని మల్లి నువ్వు వెళ్లి అమ్మను చీర కట్టించుకుని తీసుకురా, అరవిoద్ నువ్వు వెళ్లి మామయ్యను రెడీ చేసి తీసుకురా అని గౌతమ్ అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగిస్తుంది