NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili November 27 2023 Episode 505: మీడియా వాళ్ళు చేసిన అవమానానికి కోపంతో రగిలిపోతున్న గౌతమ్…

Malli Nindu Jabili Today Episode November 27 2023 Episode 505 Highlights

Malli Nindu Jabili November 27 2023 Episode 505:  మాకైతే ఎక్కువగా వినిపిస్తున్నది మీ పేరు అరవింద్ గారు అని ఒక అమ్మాయి అంటుంది. ప్లీజ్ నాకు కొంచెం హెడేక్ గా ఉంది ఇక మీరు బయలుదేరండి అని మల్లి అంటుంది. అది కాదు మేడం మీ పర్సనల్ లైఫ్ లో కొన్ని విషయాలు అడగాలనుకుంటున్నాను అని ఇంకొక అతను అంటాడు. కీర్తి అందర్నీ పంపించేసేయ్ అని మల్లి వెళ్ళిపోతుంది. ప్లీజ్ మీరందరూ ఇక్కడ నుంచి దయచేసి వెళ్ళండి మేడంని ఇబ్బంది పెట్టకండి అని కీర్తి వాళ్ళని పంపించేస్తుంది. ఈ సంఘటన గౌతమ్ ని చాలా డిస్టర్బ్ చేసినట్టు ఉంది అని మాలిని మనసులో అనుకొని, గౌతమ్ ఇక మేము బయలుదేరుతాం అని అంటుంది మాలిని. థాంక్స్ మాలిని మా కోసం లంచ్ తీసుకొచ్చినందుకు రేపు కూడా ఇలాగే  కలిసి పార్టీ చేసుకుందాం అని గౌతమ్ అంటాడు. సరే గౌతమ్ బాయ్ అంటూ మాలిని వెళ్ళిపోతుంది. మల్లి గౌతమ్ కి సారీ చెప్తుంది. దేనికి మల్లి అని గౌతమ్ అంటాడు. మీడియా వాళ్ళు మిమ్మల్ని పక్కకు జరగమన్నారు కదా అందుకు అని మల్లి అంటుంది.

Malli Nindu Jabili Today Episode November 27 2023 Episode 505 Highlights
Malli Nindu Jabili Today Episode November 27 2023 Episode 505 Highlights

 

నో ప్రాబ్లం మల్లి నేను అర్థం చేసుకోగలను నేను మీడియా లోనే ఉన్నాను కదా ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి టేక్ ఇట్ ఈజీ లైట్ తీసుకో ఇక నువ్వెళ్ళు అని గౌతమ్ అంటాడు. అది కాదండి అంటూ మల్లి బాధ పడుకుంటూ వెళ్ళిపోతుంది. మల్లి వెళ్లిపోయిన తర్వాత గౌతమ్ ఆ బుక్ లో నుంచి ఒక రోజు పువ్వు తీసి వాళ్లు అడిగిన ప్రశ్నలన్ని గుర్తు చేసుకుంటూ కోపంగా రోజా పువ్వు రేకులను చించి కింద పడేస్తాడు. కట్ చేస్తే, భద్ర వసుంధర కి ఫోన్ చేసి మీరు చెప్పినట్టే చేశాను మేడం మల్లి అరవింద్ ల గురించి మ్యాగ్జిన్లో రాసి పంపించాను అది గౌతమ్ ఆఫీస్ కి చేరేలా చేశాను అని భద్ర అంటాడు.వెరీ గుడ్ మరి మీడియా వాళ్ళని ఏం చేశావు అని వసుంధర అడుగుతుంది. మనం అరేంజ్ చేసిన వాళ్లే కదా మేడం మల్లి నీ ప్రశ్నలతో దాడి చేశారు అని భద్ర అంటాడు. మ్యాగజిన్ కాదు మేడం న్యూస్ పేపర్ లో ప్రకటన వచ్చేలా చేశాను అని భద్ర అంటాడు.

Malli Nindu Jabili Today Episode November 27 2023 Episode 505 Highlights
Malli Nindu Jabili Today Episode November 27 2023 Episode 505 Highlights

ఆఫీసులోనే కాదు తన ఇంటికి కూడా వెళ్లేలా చూడు నేను ఎప్పుడు ఏం చెప్పినా చేసేలాగా అందుబాటులో ఉండు, అ మల్లి కి క్షణం కూడా మనశ్శాంతి లేకుండా చేయాలి అని వసుంధర అంటుంది. మీరేం చెప్పినా చేస్తాను మేడం అని భద్ర అంటాడు. ఇంతలో అరవింద్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. అరవింద్ నీది మల్లి ఇది ఒక ఆర్టికల్ వచ్చిందంట కదా ఇప్పుడే ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పింది అని వసుంధర అంటుంది. ఈ విషయం నీకు చెబుదామనుకున్నాను అమ్మ కానీ ఆఫీసులో దీని గురించి పెద్ద ఇష్యూ జరిగింది గౌతమ్ చాలా ఫీల్ అయ్యాడు అని మాలిని అంటుంది. అది సరే అరవింద్ పేరు రావడమేంటి గౌతమ్ పేరు రాకుండా అని వసుంధర అంటుంది.మల్లి నీ ఆకాశమంత ఎత్తు ఎదిగేలా చేసింది గౌతమైతే అరవింద్ ని చూపించారు అని అంటుంది. ఇదైతే ఎవరో కావాలనే చేసినట్టు నాకు అనిపించింది అని అరవింద్ అంటాడు. హైదరాబాద్ స్టూడియో పెద్దది అందులో ఇలాంటి తప్పుడు పనులు ఎందుకు చేస్తారు నువ్వు అలా ఆలోచించకు అరవింద్ అని వసుంధర అంటుంది. లేదు అత్తయ్య మల్లి గౌతమ్ ల ఫోటోలు వేసి ఆర్టికల్ రావాలి కానీ అలా జరగలేదు అంటే దీని వెనకాల ఎవరో ఉన్నారు అని అరవింద్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode November 27 2023 Episode 505 Highlights
Malli Nindu Jabili Today Episode November 27 2023 Episode 505 Highlights

మమ్మీ మీడియా వాళ్లయితే అసలు గౌతమ్ ని గుర్తుపట్టలేదు ఒక అతను అయితే గౌతమ్ ని  పక్కకు జరగమన్నాడు గౌతమ్ మొహం అయితే చిన్నబోయింది అనుకో అని మాలిని అంటుంది. బాగా హర్ట్  అయినాడు అనుకుంటా అని వసుంధర అంటుంది. ఇంతలో గౌతమ్ వసుంధర కి ఫోన్ చేస్తాడు. నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు నామీద ఏమైనా అనుమానం వచ్చిందా అని వసుంధర అనుకుంటుంది. హలో గౌతమ్ ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటున్నాం నిండా నూరేళ్లు అని వసుందర అంటుంది. ఎందుకత్త అని గౌతమ్ అంటాడు. నువ్వు చాలా ఇబ్బంది పడ్డావు అనుకుంటా అని వస్తుందా రా అంటుంది. దేని గురించి అత్త అని గౌతమ్ అంటాడు. అదే గౌతమ్ మీడియా వాళ్ళు నిన్ను అవమానించారంట కదా అని వసుంధర అంటుంది.ఇప్పుడు ఆ విషయం ఎందుకు అత్త వదిలేయ్ అని గౌతమ్ అంటాడు. రాసిన వాడికైనా బుద్ధి ఉండాలి కదా అరవింద్ కొంతవరకు మల్లి నీ చదివించాడు కానీ నిన్ను పెళ్లి చేసుకున్నకే అంత పొజిషన్ కి వచ్చింది కదా పూర్తిగా తెలుసుకొని రాయాలి కదా అని వసుందర అంటుంది. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టను అత్తా కానీ నేను అందుకు ఫోన్ చేయలేదు, అమ్మ రేపు దివాళి కి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాము మిమ్మల్ని పిలవమని చెప్పింది అందుకే ఫోన్ చేశాను మర్చిపోకుండా తప్పకుండా రండి అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today Episode November 27 2023 Episode 505 Highlights
Malli Nindu Jabili Today Episode November 27 2023 Episode 505 Highlights

సరే మీరు పిలిచిన ప్రతి ఫంక్షన్ కి వచ్చాము అక్కడ అవమానాలు పడ్డాము ఇప్పుడు ఏం చేస్తావో చెయ్యి వస్తాంలే అని వసుంధర అంటుంది. అలాంటిది ఏమీ ఉండదు అత్తా రేప్ అయితే మీరు దివాళికి రండి అని గౌతమ్ అంటాడు. రేయ్ గౌతమ్ ఈరోజు చూపించింది శాంపిల్ మాత్రమే రేపు మీ ఇద్దరినీ దూరం చేస్తాను నీ చావుకి నువ్వే ముహూర్తం పెట్టుకున్నావ్ రా గౌతమ్ అని వసుంధర అనుకుంటుంది. కట్ చేస్తే అరవింద్ ఆలోచించి మల్లి కి ఒకసారి ఫోన్ చేద్దాం అనుకుంటాడు కానీ మళ్ళీ వద్దులే నా ఫోన్ వల్ల మళ్ళీ డిస్టర్బ్ అవుతారు అని ఊరుకుంటాడ అరవింద్. నన్ను మల్లి నీ గౌతమ్ మీటింగ్ నుంచి అవాయిడ్ చేశాడు. మీటింగ్ లో ఏం జరిగిందో స్టాప్ ని అడిగితే చెప్పట్లేదు అని అరవింద్ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో మాలిని వచ్చి ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు మళ్లీ మీడియా గురించి ఆలోచిస్తున్నారా గౌతమ్ అలాంటివి ఏమి మనసులో పెట్టుకోడు నువ్వేమీ టెన్షన్ పడకు బాబు అని మాలిని అంటుంది. నావల్ల మల్లి ఇబ్బంది పడకూడదు అని అరవింద్ అంటాడు.నేను మీకోసం ఒకటి తీసుకువచ్చాను రండి అని కూర్చోబెడుతుంది మాలిని. ఏంటి చూపించు అని అరవింద్ అంటాడు. అలా సీరియస్ గా అడిగితే చెప్పను బాబు కళ్ళు మూసుకో అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today Episode November 27 2023 Episode 505 Highlights
Malli Nindu Jabili Today Episode November 27 2023 Episode 505 Highlights

అరవింద్ కళ్ళు మూసుకుంటాడు.మాలిని తమలపాకులను వేళ్ళకు చుట్టుకుని అరవింద్ కి తినిపిస్తుంది. థాంక్స్ మాలిని అని అరవింద్ అంటాడు. ఇంతకుముందు కవితలు చెప్పే వాడివి ఇప్పుడు ఒకటి చెప్పొచ్చు కదా అని మాలిని అంటుంది. చంద్రుడు సాక్షిగా చెప్తున్నాను నా జీవితం ఆనందంగా ఉండేది నువ్వు నా కనుల ముందట ఉన్నప్పుడే,మన ప్రేమ సాక్షిగా చెప్తున్నాను నువ్వు లేకుండా బ్రతకడం కష్టం నువ్వు లేకుండా భూమి మీద ఉండడం అసాధ్యం అందుకే నువ్వే నా జీవితానికి అయ్యావు ఒక వరం ప్రతి జన్మకి కావాలి నీ పరిచయం అని అరవింద్ కవిత చెప్తాడు.తన ఒళ్లో పడుకునే వింటున్న మాలిని థాంక్స్ అరవింద్ అని అంటుంది. మన ప్రేమకి ప్రతిరూపం ఎప్పుడు వస్తుందా నన్ను అమ్మ అని ఎప్పుడు పిలుస్తుందా అని ఎదురుచూస్తున్నాను అరవింద్ అని మాలిని బాధపడుతుంది. త్వరలోనే మనం అమ్మా నాన్నలను కాబోతాం అని అరవింద్ అంటాడు. థాంక్స్ అరవింద్ అని మాలిని సంతోషపడుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri