NewsOrbit
Entertainment News Telugu TV Serials

Mamagaru December 29 2023 Episode 95: గంగాధర్ మోసం చేశాడని బాధపడుతున్న గంగ..

Mamagaru Today Episode December 29 2023 Episode 95 Highlights

Mamagaru December 29 2023 Episode 95: ఏంటండీ ఇది గంగ ఎక్కడికి వెళ్లి ఉంటుంది అని దేవమ్మ అంటుంది. అది నన్ను అడిగితే ఎలా తెలుస్తుంది దేవమ్మ ఈ కాలం పిల్లలు చిన్న విషయానికే ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి ఆత్మహత్యలు చేసుకోడాలు అని చ0గయ్య అంటాడు.ఇది చిన్న విషయం అంటారు ఏంటండీ అని దేవమ్మ అంటుంది. చిన్న విషయం కాకపోతే ఏంటి దేవమ్మ ఈ మాత్రం దానికే గంగ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా అసలు ఎవరికీ చెప్పకుండా ఎందుకు బయటకు వెళ్ళింది అని చ0గయ్య అంటాడు. రేయ్ గంగాధర్ ఇప్పటిదాకా రాలేదు కదా వాళ్ళ ఇంటికి ఫోన్ చెయ్ అని చ0గయ్య అంటాడు. అలాగే అని దేవమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఇంతలో గంగ ఇంటికి వస్తుంది. దేవమ్మ ఫోన్ కట్ చెయ్ గంగ ఇంటికి వచ్చేసింది అని చ0గయ్య అంటాడు. గంగను చూసి అందరూ ఆనందిస్తారు. మగంగా ఎక్కడికి వెళ్లావు అని దేవమ్మ అడుగుతుంది. దేవమ్మ నేను అడుగుతున్నాను కదా నువ్వు ఆగు గంగా ఎక్కడికి వెళ్లావు చెప్పకుండా అని చంగయ్య అంటాడు.

Mamagaru Today Episode December 29 2023 Episode 95 Highlights
Mamagaru Today Episode December 29 2023 Episode 95 Highlights

గుడికి వెళ్ళాను మామయ్య అని గంగా అంటుంది. ఎవరికి చెప్పకుండా గుడికి వెళ్లడమేంటమ్మా అని చ0గయ్య అంటాడు. ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగు పెట్టాను నా ఆశలన్నీ అడి ఆశలు చేసి మా మామగారు ఉద్యోగం చేయొద్దు అన్నారు సరే నా తలరాతనే ఊరుకున్నాను కానీ నా భర్త అబద్ధాలతో నన్ను మోసం చేశాడు బాధని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక గుడికి వెళ్లి దేవుడికి చెప్పుకున్నాను మామయ్య గారు, ఎవరికైనా చెప్తే గంగా అయిందేందో అయిపోయింది వదిలేయమ్మా ఇప్పుడు మంచిగా ఉండు బాధపడకమ్మా అని అంటారు అదే దేవుడు అయితే మనం చెప్పింది మాత్రమే ఉంటాడు మామయ్య మళ్లీ మారు మాట చెప్పడు ఎందుకంటే దేవుడు కదా ఒకరు నా ఆశల్ని కాల్చివేశారు ఇంకొకరు నమ్మకాన్ని బూడిద చేశాడు ఏం చేయాలో అర్థం కాక దేవుడి దగ్గరికి వెళ్లి నా మొర చెప్పుకున్నాను. అందరి ఆడపిల్లల్లాగా అమ్మ నాకు కష్టం వచ్చింది అని పుట్టింటికి వెళ్లి ఏడవలేను అలాగని బాధను భరిస్తూ ఏడవలేను అందుకే దేవుడికి చెప్పుకుంటే భారం తగ్గుతుందని వెళ్లాను మామయ్య గారు అని గంగా దేవమ్మ దగ్గరికి వెళ్లి ఇది దేవుడు ప్రసాదమత్తయ్య అందరికీ ఇవ్వండి అని బాధపడుతూ వెళ్ళిపోతుంది గంగ. గంగ అలా మాట్లాడుతుంటే చంగయ్య నోట మాట రాదు. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 29 2023 Episode 95 Highlights
Mamagaru Today Episode December 29 2023 Episode 95 Highlights

గంగా పైకి వస్తుంది గంగాధర్ గంగను చూసి గంగా ఎక్కడికి వెళ్లావు ఏమైపోయినా ఏ0త కంగారు పడ్డానో తెలుసా అని అంటాడు. చచ్చిపోయాను అనుకున్నారా అని గంగా అంటుంది. గంగ నేను తప్పు చేశాను క్షమించు అని పదేపదే అంటున్నాను కదా ఇంకా ఎందుకు గంగా నన్ను బాధ పెడతావు పెళ్లికి ముందు నేను దుబాయ్ కి వెళ్లాలనుకున్నాను మహేష్ గాడు దొంగ సర్టిఫికెట్ గురించి చెప్పి నన్ను ఇరికించాడు ఆ తరువాత నీకు నాకు పెళ్లి కుదిరింది మా నాన్న డిగ్రీ చేశాన ని అబద్ధం చెప్పాడని నాకు నిజంగా తెలియదు షాపింగ్ మాల్లో చెబుదామని నీకు వీడియో చేసి పెట్టాను కానీ మా నాన్న అది డిలీట్ చేశాడు ప్రతిరోజు నీకు నిజం చెప్పాలని అనుకుంటూనే చెప్పలేక పోయాను గంగా నీ కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నాను నన్ను క్షమించు గంగా అని గంగాధర్ అంటాడు. మీరు బాధని మాత్రమే పడ్డారు నేను శిక్షింపబడ్డాను ఏది ఎక్కువ అని గంగా అడుగుతుంది. గంగా నేను ఏం చేస్తే నీ కోపం పోతుంది నీకు కోపం వస్తే నన్ను శిక్షించు లేదంటే తిట్టు అరువు కానీ ఇలా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళకు గంగా నేను తట్టుకోలేను అని గంగాధర్ అంటాడు. అలా మాట్లాడుతూ గంగాధరికి పోరా పోయి దగ్గు కంటిన్యూగా వస్తూనే ఉంటుంది. అది చూసి గంగా ఇంట్లోకి వెళ్లి మంచినీళ్లు తెచ్చి ఇస్తుంది. వెళ్ళిపోతూ ప్రేమ ఒక చెట్టు లాంటిదండి అది పెరిగి పెద్దదై పుష్పం వికసించి ఆనందించే లోపు అబద్ధం అనే గొడ్డలితో నరికి వేస్తే ఆ చెట్టు ఏమైపోతుంది జీవం లేని ఆ చెట్టు నేల కూలిపోతుంది నమ్మకం లేని జీవితం కూడా అలాంటిదే నండి అని గంగా లోపలికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Mamagaru Today Episode December 29 2023 Episode 95 Highlights
Mamagaru Today Episode December 29 2023 Episode 95 Highlights

పాండురంగడు శ్రీ లక్ష్మీ సుధాకర్ వసంత గంగని ఎలా కలపాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఇంతకు మనం దేని గురించి ఆలోచిస్తున్నాం అని పాండురంగ అంటాడు. ఏంటి అప్పుడే మర్చిపోయారా అని శ్రీలక్ష్మి అంటుంది. గంగని గంగాధర్ ని ఒకటి చేద్దాం అనుకున్నాం రా అని సుధాకర్ అంటాడు. అవునా మర్చిపోయాను అన్నయ్య శ్రీలక్ష్మి నువ్వే గంగవేతే ఏం చేస్తావో చెప్పు అని పాండురంగ అంటాడు. నేనే గంగనయితే అనే పైట చెంగు ధోపీ, చింగులు పైకెత్తి ఒక్క తన్ను తన్నుతుంది పాండురంగని ఆ తరువాత కత్తి తీసి మెడ మీద పెట్టి ఇప్పుడు చెప్పు అబద్ధం చెప్పడం తప్ప కాదా గంగాధర్ అని అడుగుతుంది శ్రీలక్ష్మి. శ్రీలక్ష్మి వదిలేయి పాండురంగడు తెలియక అన్నాడు అని సుధాకర్ అంటాడు బావగారు నేను శ్రీలక్ష్మిని కాదు గంగని ఇప్పుడు చెప్పు గంగాధర్ ఎవరు సర్దుకుపోవాలి అని శ్రీలక్ష్మి అంటుంది.

Mamagaru Today Episode December 29 2023 Episode 95 Highlights
Mamagaru Today Episode December 29 2023 Episode 95 Highlights

తప్పైపోయింది గంగా నేనే సర్దుకుంటాను వదిలేయి అని పాండురంగ అంటాడు. అది అలా ఉండాలి అని శ్రీలక్ష్మి లేస్తుంది. అమ్మో ఈ లెక్కన చూస్తే మా గంగాధర్ సేఫ్ గంగా చాలా సాఫ్ట్ బతికిపోయాడు లేదంటే చేతిలో చచ్చేవాడు అని పాండురంగ అనుకుంటాడు. చూడండి నా విషయంలో అలాంటి అబద్ధాలు చెప్తే మీకు పడేది ఇలాంటి శిక్ష అని మళ్లీ మెడ మీద కత్తి పెడుతుంది శ్రీలక్ష్మి. గంగా వదిలేయమ్మా అని సుధాకర్ వసంత అంటారు. నేను గంగను కాదు శ్రీలక్ష్మిని అని శ్రీలక్ష్మి అంటుంది. ఆ మాట వినగానే మళ్లీ వాళ్ళు షాక్ అయిపోతారు. అన్నయ్య వాళ్ళిద్దరినీ కలిపే విషయం మనం విడివిడిగా ఆలోచిద్దాం అని పాండురంగ శ్రీలక్ష్మి తీసుకొని వెళ్ళిపోతాడు. అవునండి అని వసంత సుధాకర్ ని తీసుకుని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

 

గంగా బాధపడుతూ కూర్చుంటుంది. ఇంతలో అంజమ్మ ఫోన్ చేస్తుంది. గంగా ఫోన్ ఎత్తి ఏంటమ్మా బాగున్నారా అని అడుగుతుంది. బాగానే ఉన్నాను గంగ మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది ఎత్తితే ఎవరు మాట్లాడట్లేదు ఏంటి అని అంజమ్మ అడుగుతుంది. అదేమీ లేదమ్మా వేలు ఒత్తుకొని వచ్చి ఉంటుంది అని గంగా అంటుంది. అంతేనంటావా నీ గొంతు ఏంటి అమ్మ అలా ఉంది అన్నం తిన్నావా అని అంజమ్మ అడుగుతుంది. అమ్మ నేను తర్వాత ఫోన్ చేస్తాను అని గంగా ఫోన్ కట్ చేస్తుంది..

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N