Mamagaru november 14 2023 episode 55: గంగ వాళ్ళ ఆయన వాళ్ళ అత్తగారింటికి వెళ్తూ ఉండగా వాళ్ళ ఫ్రెండ్ కనిపిస్తుంది. ఏ గంగా ఆగు అని వాళ్ళ ఫ్రెండ్ పిలుస్తుంది. వర్షిని ఎన్ని రోజులు అవుతుంది నిన్ను చూసి ఎలా ఉన్నావు అని గంగ అడుగుతుంది. ఏంటి గంగ ఎలా ఉన్నావు మీ ఆయన అని అడుగుతుంది వర్షిని. నా సంగతికేం కానీ నువ్వేం చేస్తున్నావు అని గంగ అడుగుతుంది. గంగ నీకేదో జాబ్ వచ్చిందని చెప్పారు వెళ్తున్నావా మీ మామగారు ఉద్యోగం చేయొద్దని చెప్పారంట కదా అని వర్షిని అంటుంది. పక్కనే గంగాధర్ ని చూసి వర్షిని అనుకుంటుంటే విన్నానండి అందుకే అడిగాను అని వర్షిని అంటుంది. మీరన్న దాంట్లో తప్పేముందిలెండి అదే నిజం అని గంగాధర్ అంటాడు. గంగ నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది ఇంట్లో ఉండే ఉద్యోగం చేసుకోవచ్చు ఒక లాప్టాప్ ఉంటే సరిపోతుంది అని వర్షిని అంటుంది.

అది కుదరదులే వర్షిని ఇంట్లో ఉండి చేసిన దొంగతనంగా చేయాలి అని గంగ వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మామయ్య గారు ఇంట్లో సరుకులు సరిపోవట్లేదు కొంచెం ఎక్కువ తెప్పించండి అని వసంత అడుగుతుంది.ఏంటమ్మా పొదుపు చేయండి ఎందుకు సరిపోవట్లేదు అని చoగయ్య అంటాడు. అంటే మామయ్య గారు గంగాధర్ కి పెళ్లయింది కదా ఇంకో మనిషి పెరిగింది కదా అని వసంత అంటుంది. ఇంతలో గంగ గంగాధర్ ఇంటికి వస్తారు. గంగ మీ నాన్నకి ఎలా ఉంది అమ్మ ఇంటికి తీసుకు వచ్చారా అని దేవమ్మ అడుగుతుంది. బాగానే ఉన్నాడు అత్తయ్య అని గంగ సమాధానం చెప్పుతూoది. చూడమ్మా గంగ మీ నాన్నకు బాగోలేదని చీటికి మాటికి మీ పుట్టింటికి వెళ్లొద్దు, ఇంతకుముందు నువ్వు పెళ్లి కానీ అమ్మాయివి ఇప్పుడు ఈ చంగయ్య కోడలివి ఎవరైనా చూస్తే ఈ అమ్మాయి ఏంటి ఊరికే పుట్టింటికి వెళ్తుంది అని అనుకుంటారు అందుకని నువ్వు వెళ్లడం తగ్గిస్తే మంచిది అని చంగయ్య అంటాడు.

అంటే మామయ్య గారు మా నాన్నకు ఆరోగ్యం బాగోలేదు కదా అని గంగ అంటుంది. మీ నాన్నకి ఒంట్లో బాగోలేదని నీకు తెలుసు నాకు తెలుసు కానీ ఊర్లో వాళ్లకు తెలియదు కదా అమ్మ ఏంట్రా గంగాధర్ భార్యని వెంటేసుకొని తిరగడమేనా ఉద్యోగం చేసేది ఏమైనా ఉందా ఈ నెల కానించి కొంచెం డబ్బులు ఎక్కువ ఇవ్వాలి ఈ విషయం నీకు అర్థమైంది అనుకుంటా అని చంగయ్య అంటాడు. చూడమ్మా వసంత ఇంటికి పెద్ద కోడలి పెత్తనం అంతా నీదే కదమ్మా పొదుపు చేయడం నేర్చుకో అని చెంగయ్య అంటాడు. అంటే మామయ్య గారు ఒక మనిషి పెరిగినప్పుడు సామాన్లు ఎక్కడ సరిపోతాయి అని వసంత అంటుంది. ఈ ఫినాయిల్ యాసిడ్ లేని రోజుల్లో ఇల్లులు శుభ్రంగానే ఉన్నాయి కదా అమ్మ అని చంగయ్య అంటాడు. అంటే మామయ్య గారు ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు కదా అండి అని శ్రీలక్ష్మి అంటుంది. అది వేరు ఇది వేరు ఎలా అవుతుంది శ్రీలక్ష్మి ఆ రోజుల్లో కోడళ్ళు ఉద్యోగాలకు వెళ్తాము పనిచేస్తామని అడిగే వాళ్ళు కాదు మీరు సమ్మెలు చేశారు కలిసికట్టుగా ఉన్నారు

మరి ఇంటి సామాన్లు పొదుపు చేయడంలో అలా ఎందుకు ఉండరు, చూడండి ఎక్కువైందని మిగిలిపోయిందని పారేయడానికి వీల్లేదు ఎంత తినాలో అంతే చేసుకోండి ఎంత వండాలో అంతే వoడండి పొదుపు చేయడం నేర్చుకోండి అని చoగయ్య అంటాడు. కట్ చేస్తే, ఇంతలో తెల్లవారింది గంగాధర్ వంటింట్లోకి వచ్చి వదిన నేను ఆఫీస్ కి వెళ్ళాలి లంచ్ బాక్స్ పెట్టావా అని అడుగుతాడు. అదేంటయ్యా మీ ఆవిడ ఉంది కదా ఆవిడని అడుగు అని వసంత అంటుంది. అంటే వదిన మర్చిపోయాను అని గంగాధర్ అంటాడు. అలవాట్లో పొరపాటుగా మర్చిపోయి ఉంటావు లే అయినా నేను వంటింట్లోనే ఉంటాను కదా అందరికీ వంట మనిషిని కదా, నాకేం పని పాట లేదు కదా అందరికీ వంట చేసి బాక్సులు కట్టడమే నా పని కదా అని చిరాకు పడుతూ అంటుంది వసంత. సారీ వదిన గంగను అడగకుండా నిన్ను అడగడం తప్పే ఇకమీదట నుంచి గంగని అడుగుతానులే అని గంగాధర్ అంటాడు.

దాంట్లో తప్పేముందయ్యా పెళ్లికాకముందు నీకు నేనే బాక్స్ కట్టేదాన్ని కదా ఎప్పుడూ అలాగే కడతాను అని వసంత అంటుంది. తన మాటలు విని ఏంటి వదిన విచిత్రంగా మాట్లాడుతుంది అసలు వదినను అడగకుండా ఉండాల్సింది మర్చిపోయాను తప్పంతా నాదే అని గంగాధర్ బాధపడుతూ ఉంటాడు. ఏమండీ అక్క అన్న మాటలు గుర్తుకు తెచ్చుకొని బాధపడుతున్నారా మామయ్య గారు చెప్పినది గుర్తునది కదా ఈ నెల నుంచి డబ్బులు ఎక్కువ సంపాదించి ఇవ్వమన్నారు ఏదైనా బిజినెస్ పెట్టుకోవచ్చు కదా అండి అని గంగ అంటుంది.గంగ మా ఇంట్లో విషయాలు పక్కన పెట్టు కాని మీ ఇంట్లో వాళ్లకి ఎలా ఉంటుందో ఆలోచించు నువ్వు ఉద్యోగం చేస్తే బెటర్ ఏమో మీ ఫ్రెండ్ చెప్పింది కదా ఆన్లైన్లో ఇంట్లో ఉండి చేసుకోవచ్చని దాని గురించి ఆలోచించు గంగా అని గంగాధర్ అంటాడు. చాలా థాంక్స్ అండి మా ఇంట్లో వాళ్ల గురించి మా ఇబ్బందుల గురించి ఆలోచించినందుకు అని గంగా అంటుంది..