Nindu Noorella Saavasam november 14 2023 episode 80: ఈ మిస్సమ్మ టైం చాలా బాగున్నట్టుంది అందుకే అందరూ తన మాట వింటున్నారు తను ఏం చేసినా మంచిదే అని అనుకుంటున్నారు అని మనోహరి తన మనసులో అనుకుంటుంది.అమ్ములు నేను ఇక్కడే ఉంటే నన్ను మీకు ఇచ్చినందుకు మిస్సమ్మకి థాంక్స్ చెప్తావ్ ఎందుకు అమ్మ అని వాళ్ళ తాతయ్య అంటాడు. మీరు కాదు తాతయ్య స్కూల్లో ఈరోజు కొత్తగా పరిచయమయ్యాడు ఆ తాతయ్య గురించి చెప్తున్నాను అని అమృత అంటుంది. అవును నాన్న ఆయన చాలా మంచివారు ఆయనని చూస్తూ ఉంటే మాకు చాలా సంతోషం వేసింది అని ఆకాష్ అంటాడు.పిల్లలు నేను పక్కన ఉండగానే అతను ఎవరి గురించో మీరు తాతయ్య తాతయ్య అని పొగుడుతున్నారు నాకు నచ్చట్లేదు అని శివరామ్ అంటాడు. తాతయ్య నువ్వు వేరు ఆయనే వేరు అమ్మకి నాన్న ఉంటే అలాగే ఉండేవాడేమో అంత ప్రేమగా చూసుకునేవాడేమో అనిపించింది తాతయ్య ఆయనను చూసిన మొదటి సారైనా ఎందుకు మాకు అంత ప్రేమ కలిగింది అని ఆనంద్ అంటాడు.

వీళ్లు చెప్తున్నది ఎవరి గురించి అని భాగమతి ఆలోచిస్తుంది. మొదటిసారి నా పిల్లలకు అంత దగ్గర అయిన వ్యక్తి ఎవరై ఉంటారు అని అరుంధతి కూడా ఆలోచిస్తుంది. సరే అమ్మ ఆ తాతయ్య ఎలా ఉంటాడు అని భాగమతి అడుగుతుంది. తాతయ్య అనుకోకుండా ఒక విషయం తెలిసింది వాళ్ళ కూతురు బర్త్డే కూడా ఇదే రోజంతా చూశారా మా అమ్మది కూడా ఇదే రోజు బర్త్డే ఎందుకని ఇద్దరిదీ ఒకే రోజు వచ్చింది అని ఆకాష్ అంటాడు సరే పిల్లలు సాయంత్రం బర్త్డే పార్టీ ఉంది మీ అమ్మది అని శివరామ్ అంటాడు. డాడీ మీకు గుర్తుందా పోయిన సంవత్సరం కూడా అమ్మది బర్త్డే ఇంట్లోనే జరుపుకున్నాము అప్పుడు ఎంతో ఆనందంగా అందరితో కలిసి అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాము ఇప్పుడు అమ్మ మన మధ్యలో లేదు కదా అని అమృత అంటుంది. ఒకసారి మళ్లీ అమరేంద్ర ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోయి అరుంధతి బర్త్ డే చేసిన రోజును గుర్తుకు తెచ్చుకొని బాధపడతాడు.

అదెలా మర్చిపోతామమ్మ మీ అమ్మ మన మధ్యన లేకపోయినా మనలని చూస్తూనే ఉంటుంది అని శివరామ్ అంటాడు.సరే రాథోడ్సాయంత్రం పార్టీకి ఏర్పాట్లు చెయ్యి అని అమరేంద్ర వెళ్ళిపోతాడు. నాన్న బర్త్ డే పార్టీకి ఒప్పుకున్నారు అని పిల్లలు సంతోష పడిపోతారు. కట్ చేస్తే భాగమతి వాళ్ల నాన్న డ్యూటీ అయిపోగానే ఇంటికి వస్తాడు. రండి రండి మొదటిసారి ఉద్యోగం ఎలా ఉంది అని వాళ్ళ ఆవిడ అంటుంది. నువ్వు పెట్టిన అన్నం కడుపునిండా తిని బాగా హుషారుగా ఉన్నాను చాలా బాగుంది ఉద్యోగం అని వెటకారంగా అంటాడు బాగమతి వాళ్ళ నాన్న. మీరు బయట ఉద్యోగానికి వెళ్లారు కాబట్టి మీకు ఆకలేస్తుందని ఉన్నదాoతా మీకే ఊడ్చి పెట్టానండి అని వాళ్ళ ఆవిడ అంటుంది. వీధిలో పని కోసం తిరుగుతున్న నిన్ను ఇంట్లోకి చేరదీసి పని ఇచ్చి అన్నం పెట్టినందుకు, ఉలోవాలందరూ ఇంట్లో పెళ్ళికాని అమ్మాయిని ఉంచుకున్నాడు ఈ అమ్మాయికి పెళ్లి అవుతుందా లేదా అని అందరూ అంటున్నారు ఏంటి నా పరిస్థితి అని నువ్వు బాధ పడుతూ ఉంటే చూడలేక నీకు తాళి కట్టాను,నిన్ను పెళ్లి చేసుకున్నాక పెత్తనం అంత నీకు ఇస్తే ఇల్లు చక్క దిద్దుతావని అనుకుంటే నీ పనికిమాలిన తమ్ముని తీసుకువచ్చి ఇంట్లో పెట్టి నా కూతుర్ని నాన కష్టాలు పెట్టిన భరించాను, పెళ్లి చేసుకున్నాను కదా నా కర్మ ఇంతే దాని అంటే ఏమొస్తుంది భగవంతుడా అని నాలో నేనే బాధపడ్డాను కానీ మిమ్మల్ని ఎన్నడైనా ఒక మాట అన్నానా, అలాంటి నాకు ఎందుకే చెద్దన్నం పెట్టిన హింసిస్తున్నావు నీకు ఏం ద్రోహం చేశానని నా మీద ఇంత కోపం పెంచుకున్నావు అని భాగమతి వాళ్ళ నాన్న అంటాడు.

బావ ఏదో తెలవక చేసింది లే బావ బాగుంటుంది అన్నం అనుకొని పెట్టి ఉంటుంది అది పాడైపోతుందని అక్కకు మాత్రం ఏం తెలుసు బావ ఇంకెప్పుడూ ఇట్లా చెయ్యదు ఈసారి కి క్షమించే బావ అని వాళ్ల బామ్మర్ది అంటాడు. సరేలే గాని భాగమతి ఇంకా రాలేదా అందులో కేక్ ఉంది చూడు అని భాగమతి వాళ్ళ నాన్న అంటాడు. కేక్ ఎందుకు తెచ్చినవ్ బావ అని వాళ్ళ బామ్మర్ది అంటాడు. మొదటిసారి పనికి పోయాను కదా కేకు తెద్దాం అనిపించింది తెచ్చాను అని వాళ్ళ బావ అంటాడు ఏంటి ఊరుకుంటుంటే బాగా ఎక్కువ మాట్లాడుతున్నావ్ బయటికి వెళ్లి సంపాదిస్తున్నానని పొగరుగా మాట్లాడుతున్నావా, అయినా మీరిద్దరూ ఎక్కడ కలుసుకొని మంతనాలు ఏం మాట్లాడుకుంటున్నారో మాకు ఏమైనా తెలుసా నువ్వు ఉద్యోగం చేసేది దానికి తెలవదు అది ఎక్కడ పని చేస్తుందో మాకు తెలియదు ఇక అది ఎప్పుడు వస్తుందో మాకేం తెలుసు అని వాళ్ళ ఆవిడ అంటుంది. సరే సరేలే బాగి ఎక్కడ ఉందో నేనే కనుక్కుంటాను అని భాగమతికి ఫోన్ చేస్తాడు వాళ్ళ నాన్న.హలో నాన్న ఎక్కడ ఉన్నారు అని భాగమతి అడుగుతుంది .

ఇంట్లోనే ఉన్నానమ్మ కానీ అక్క బర్త్డే కదా కేకు కట్ చేదుగానే రామ్మా అని వాళ్ల నాన్న అంటాడు. నాన్న ఈరోజు మా సార్ వాళ్ళ వైఫ్ ది కూడా బర్త్డే ఇక్కడే ఉండమంటే ఉన్నాను కొత్తగా జాయిన్ అయ్యాను కదా నాన్న ఉండను అంటే ఫీల్ అవుతారని ఉండాల్సి వచ్చింది అని భాగమతి అంటుంది. ఏంటో నమ్మ మీ అక్క బర్త్ డే కి కూడా రానంత పని ఏం చేస్తున్నావు ఆ ఉద్యోగం ఏంటి బాగి ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా ఆ పిల్లల వల్ల మీ అక్క మళ్లీ మనకు దగ్గరవుతుందనిపిస్తుంది, నేను ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఆ పిల్లలే నమ్మా వాళ్లే లేకపోతే నేను బాధపడుతూ ఉండేవాణ్ణి అని వాళ్ళ నాన్న అంటాడు. ఏ పిల్లల గురించి మాట్లాడుతున్నావు నాన్న కొంపతీసి మీరు ఎక్కడైనా ఉద్యోగం చేయట్లేదు కదా అని భాగమతి అడుగుతుంది.

లేదమ్మా ఎందుకు అలా అడిగావు నేను ఉద్యోగం చేస్తే నువ్వు ఊరుకుంటావా చెప్పు కేకు తెద్దామని రోడ్డు మీదికి వెళ్తే అక్కడ ఒక నలుగురు పిల్లలు కనిపించారు వాళ్ల గురించి చెప్పానమ్మా అని వాళ్ళ నాన్న అంటాడు. అవునా నాన్న వాళ్ళ పిలుస్తున్నారు నేను ఉంటాను అక్క బర్త్ డే కి రాలేకపోతున్నాను క్షమించు అని భాగమతి అంటుంది. ఏం పర్వాలేదమ్మా నువ్వు రాకపోతే ఏముందిలే నేనే కట్ చేస్తాను అని వాళ్ళ నాన్న అంటాడు. ఇంతలో రాథోడ్ వచ్చి మిస్సమ్మ ఇక్కడ ఏం చేస్తున్నావ్ అందరు నీకోసం వెయిట్ చేస్తున్నారు పద అని అంటాడు. మా నాన్న ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను సార్ వస్తున్నాను అని భాగమతి అంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది