Mamagaru Episode 61: అక్క ఏదన్నా పనిలో ఉందేమో తర్వాత చేద్దాంలే అని వాళ్ళ అమ్మ అంటుంది. అమ్మ ఈరోజు పార్టీ చేసుకుందాం అని వర్షా అంటుంది. పార్టీనా అని అంజమ్మ అంటుంది. పార్టీ అంటే డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదమ్మా పాయసం చేసుకున్న సరిపోతుంది డబ్బుతో పనిలేదు అని వర్ష అంటుంది. అలాగే అంజమ్మ వర్ష చెప్పినట్టు పాయసం వండుకొని తిందాం అని వాళ్ళ నాన్న అంటాడు. కట్ చేస్తే, ఏంటి గంగా నాన్న అన్న మాటలు గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నావా అని గంగాధర్ అంటాడు. అసలు సరుకు కొనేటప్పుడు మీకు వాటి విలువ తెలిసి ఉంటుంది అలా ఎలా అమ్మేశారండి మామయ్య గారు ఒక్క ఫోన్ కాల్ చేసి 7000 రూపాయలు మిగిలిచ్చారు దాన్నిబట్టే అర్థమవుతుంది కదా అండి వాటి విలువ ఎంత ఉంటుందో దాన్నిబట్టి మీరు ఆలోచించండి అని గంగ అంటుంది.

గంగా ఎంతసేపు సరుకు అమ్మాలని చూశాను కానీ మిగతావి పట్టించుకోలేదు అని గంగాధర్ అంటాడు. ఒక్కసారి తప్పు చేస్తే వ్యాపారానికి పనికిరారని చెప్పడం కరెక్ట్ కాదు మీరు వ్యాపారాల్లో గొప్ప ధనవంతులైపోతారు నాకు ఆ నమ్మకం ఉంది మనం బిజినెస్ స్టార్ట్ చేయాలండి ఎలా అన్నది ఆలోచిద్దాం ముందు మీరు మనసులో నుంచి ఆ బాధను తీసేయండి అని గంగ అంటుంది.ఏంటండీ ఏదో ఆలోచిస్తున్నారు మీ నాన్నగారి మాట విని మారిపోయారా ఏంటి అని శ్రీలక్ష్మి అంటుంది. అదేం కాదు శ్రీలక్ష్మీ బయటికి వెళ్లి ఎక్కడ ఉందాం అని అంటాడు పాండురంగ. చూడండి మామయ్య గారు ఎన్ని చెప్పినా మనం వినేది లేదు మనం వెళ్లిపోవాల్సిందే అని వసంత అంటుంది. లేదు వసంత నాన్న మాటలు నమ్మే రోజులు పోయాయి అలా ఏమి జరగదు అని సుధాకర్ అంటాడు.నమ్మమంటారా అని వసంత అంటుంది.

లేదు శ్రీలక్ష్మి ఇక మనం వెళ్ళిపోదాం అని పాండురంగడు అంటాడు.కట్ చేస్తే, చూడమ్మా గంగ మానసికంగా మగవాడు బలవంతుడు కావచ్చు కానీ మగవాడి కంటే ఆడదే బలంగా ధైర్యంగా ఉంటుంది అది మగవాళ్ళు ఒప్పుకోరు కానీ మగవాడి విజయం వెనుక ఆడది ఉంటుందని ఊరికే చెప్పలేదు వాడికి ధైర్యంగా నువ్వు ఉండి గెలిపించమ్మా అని దేవమ్మ అంటుంది. ఏవండీ ఏం ఆలోచిస్తున్నారు అన్నం తిందురు రండి అని గంగ అంటుంది. గంగా నాన్న చెప్పినట్టు నేను బిజినెస్ కి పనికిరానేమో అని గంగాధర్ అంటాడు. జీవితం అనే పోరాటంలో అందరూ బిజినెస్ చేస్తారండి ఒక్కసారి ఓడిపోయామని వెనకడుగు వేయకూడదు మళ్ళీ ప్రయత్నిద్దాం విజయం వరిస్తుంది సమస్య వస్తే భోజనం మానేయకూడదండి సమస్య ఎక్కడ ఉంది అని తెలుసుకొని ధైర్యంగా ముందుకు వెళ్లాలి అని గంగా అంటుంది. నాకు ఆ ధైర్యం లేదు గంగా అని గంగాధర్ అంటాడు. మీరు అలా నిరాశ పడకండి మీరు బిజినెస్ లో ముందుకు వెళ్తారు చూడండి అని గంగ అంటుంది.

గంగ ఇక చాలు కడుపు నిండిపోయింది అని గంగాధర్ అంటాడు. ఇది ఒకటే ముద్ద తినండి అని గంగా అంటుంది. కట్ చేస్తే, నన్ను ఆశీర్వదించు నాన్న అని పాండురంగడు అంటాడు. పుట్టినరోజు శుభాకాంక్షలు దేవమ్మ అత్యంతను తీసుకురా ఆశీర్వాదం ఇద్దాము అని చంగయ్య అంటాడు. అన్నయ్య తమ్ముడు వాళ్ళు కనిపించట్లేదు ఏంటమ్మా అని పాండురంగ అంటాడు. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పకుండా ఎక్కడికి వెళ్లారు అని దేవమ్మ అంటుంది. ఆయన పని ఉందని బయటికి వెళ్లారు అత్తయ్య అని వసంత చెప్తుంది. ఇంతలో గంగ వచ్చి బావగారు పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్తుంది. థాంక్స్ అమ్మ గంగాధర్ ఇంట్లో లేడా అని పాండురంగ అంటాడు. పొద్దున్నే బయటికి వెళ్లాడు బావగారు అని గంగ చెప్తుంది. చూశారు కదా అండి మీ వాళ్ళు చేసే పని ఇప్పటికైనా అర్థమైందా అని శ్రీలక్ష్మి అంటుంది. నువ్వు ఊరుకో శ్రీలక్ష్మి చిన్నప్పుడు అన్నయ్య నన్ను లేపి మొట్టమొదటిసారి హ్యాపీ బర్త్డే చెప్పేవాడు అని పాండురంగ అంటాడు.

అవన్నీ ఒకప్పుడు అండి ఇప్పుడు మనుషులు మారిపోయారు అని శ్రీలక్ష్మి అంటుంది. ఇన్నాళ్లు ఇల్లు ఇంట్లో వాళ్ళు నా వాళ్ళు అనుకున్నాను శ్రీలక్ష్మి అని పాండురంగ అంటాడు. బాధపడకండి ఎలాగో రేపు వేరే ఇంటికి వెళ్ళిపోతున్నాము కదా అని శ్రీలక్ష్మి పాండురంగకి వంద రూపాయలు ఇస్తుంది . అవి తీసుకొని పాండురంగడు ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే,గంగ బ్యాంకుకు వచ్చి శ్వేతని కలుస్తుంది. ఏంటి గంగ ఇలా వచ్చావ్ ఏంటి చెప్పు అని శ్వేత అడుగుతుంది. మా వారు బిజినెస్ చేద్దామనుకుంటున్నారు దానికి కావాల్సిన అమౌంట్ లోన్ గా తీసుకుందామని అనుకుంటున్నాను అని గంగ అంటుంది. ఏదైనా ప్రాపర్టీస్ మీ పేరు మీద ఉందా దాన్ని పెట్టి లోన్ తీసుకోవచ్చు అని శ్వేత అంటుంది. ల్యాండ్ లాంటివి ఏమీ లేవే అని గంగ అంటుంది. అయితే మీరు ఎలాగో చదువుకున్నారు కదా ఆ డిగ్రీలు పెట్టి పది లక్షలు లోన్ తీసుకోవచ్చు అని శ్వేత చెప్తుంది.

థాంక్స్ శ్వేత నిన్ను గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టాలనిపిస్తుంది అని గంగ అంటుంది. హలో అవన్నీ మీ ఆయనకి పెట్టుకో నాకు కాదు కానీ లోను మాత్రం కరెక్ట్ గా కట్టాలి అని అంటుంది. సరే శ్వేతా నేను బయలుదేరుతాను అని గంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, పాండురంగడు ఆఫీసుకు వస్తాడు. పాండురంగ వాళ్ళ సార్ నిన్ను సస్పెండ్ చేస్తున్నాం పాండురంగ అని అంటాడు. సార్ నేను లంచం తీసుకోలేదు సార్ అని పాండురంగ అంటాడు. నేను నమ్ముతాను కానీ కలెక్టర్ గారు పైనుంచి ఆర్డర్ ఇచ్చారు నిన్ను సస్పెండ్ చేయమని నేనేమీ చేయలేను పాండురంగ ముందే నువ్వు అతనితో మాట్లాడుకుని ఉండాల్సింది అని వాళ్ల సార్ అంటాడు. సార్ ఉద్యోగం పోతే నా కుటుంబం రోడ్డు మీద పడుతుంది సార్ అని పాండురంగ అంటాడు. నన్ను క్షమించు పాండురంగ నేను ఇంతకుమించి ఏమీ చేయలేను నీ దగ్గర ఉన్న ఫైల్స్ అన్ని రామ్మూర్తి గారికి ఇచ్చేసి వెళ్లిపో అని వాళ్ళ సార్ అంటాడు..