Naga Panchami: నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి అత్తయ్య పంచమి వచ్చిన కానుంచి మన ఇంట్లో ఏం జరిగాయో అన్ని ఆలోచించండి ఆ తర్వాత ఏ నిర్ణయం తీసుకున్న మీ ఇష్టం అని జ్వాల అంటుంది. ఒక మనిషి పాముగా మారడం అది అసాధ్యం అలా ఎప్పటికీ జరగదు అని మేఘన అంటుంది. మా ఇంట్లో సంగతి నీకు ఎలా తెలుసు ఇన్నాళ్లు నేను చెప్తే నమ్మరు అని ఊరుకున్నాను పంచమి కూడా పామే అత్తయ్య ఇంతకుముందు పంచమి వచ్చినప్పటికీ ఏం జరిగాయి మామయ్య నీ పాము కాటు వేయడం ఆ తర్వాత కాపాడడం ఒకరోజు నాగిని డాన్స్ వేయమంటే నాగిని లాగా డాన్స్ వేయడం ఇదంతా చూస్తుంటే పంచమి పాము అని చిత్ర అంటుంది. ఏమండీ పాముల పట్టే అతన్ని పిలిపించి పట్టించే ప్రయత్నం చేయండి పంచమి అయితే ఇక్కడే ఎక్కడో చుట్టుపక్కల ఉండే ఉంటుంది అని వైదేహి అంటుంది. మోక్ష వచ్చిన తర్వాత ఆలోచిద్దాం వైదహి ఇప్పుడప్పుడే ఈ విషయం ఎక్కడ ప్రస్తావించకండి అని రఘు అంటాడు. మావయ్య మీరు నమ్మిన నమ్మకపోయినా మాత్రం పంచమి మాత్రం పామే ఎందుకంటే ఆ అబ్బాయిని నేను కళ్ళారా చూశాను అని జ్వాలా తెగేసి చెప్తుంది. కట్ చేస్తే,
మమ్మల్ని క్షమించండి అత్తయ్య నేను పొరపాటు చేశాను అని మోక్ష అంటాడు. పంచమి శివయ్య బిడ్డ బాబు నీ వెంట ఉంటే నేను రక్షిస్తుంది శివయ్య పంచమిని కాపాడుతాడు అని గౌరీ అంటుంది. మోక్ష మీరిద్దరూ శివపార్వతూల ని ఆదర్శంగా తీసుకోండి మీ జీవితాలు అనుకోకుండా ముడిపడ్డాయి నీ ప్రాణం కాపాడేది ఒక పంచని మాత్రమే ఎందుకు అంటే ఇష్ట రూప నాగిని విషయానికి విరుగుడు దొరికేది ఈ సృష్టిలో నాగులోకంలో మాత్రమే ఆ నాగులోకం వెళ్ళగలిగేది పంచమి మాత్రమే ఆ నాగులోకానికి వెళ్లి నిన్ను తప్పకుండా పంచమి కాపాడుతుంది పంచమిని శివయ్య కాపాడుతాడు మీరు ఒకరి కోసం ఒకరు పుట్టారు ఒకరంటే ఒకరికి ప్రాణం మి బంధం పవిత్రమైనది అని నాగ సాధువు అంటాడు. అర్థమైంది స్వామి ఇక మేము వెళ్లి వస్తాం అని మోక్ష అంటాడు. భగవంతుడి ఆశీస్సులు కన్నా తల్లి ఆశీర్వాదం ఎంతో గొప్పది పంచమి మీరిద్దరూ మీ అమ్మ ఆశీర్వాదం తీసుకోండి అని నాగ సాధువు అంటాడు. వాళ్లు గౌరీ దగ్గర ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే,
మేఘన మోక్షని ఎలా వశం చేసుకోవాలి పంచమి ఎక్కడికి వెళ్లింది పంచమి తప్పకుండా మోక్ష కోసం వస్తుంది వీళ్లకు పంచమి మీద డౌట్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో వైదేహి వచ్చి మేఘన నీ స్నేహితురాలు నిజంగా మనిషా పామా నీకేం తెలుసు అని అడుగుతుంది. నేను చిన్నప్పటినుంచి తనతోనే పెరిగాను అంటే పంచమి పాము అయితే మాకు తెలియకుండా ఉంటుందా పంచమి మనిషే ఆంటీ పంచమి చాలా మంచిది పాపం ఎక్కడికి వెళ్లిందో ఏమో మోక్ష కోసం తప్పకుండా వస్తుంది అని మేఘన అంటుంది. అది వచ్చినా నేను రానీయను మేఘన కానీ మా మోక్ష గురించి నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు అని వైదేహి అడుగుతుంది. మి మోక్షకు ఏంటి ఆంటీ చాలా మంచి వ్యక్తి అని మేఘన అంటుంది. ఆ పంచమిని వదిలించుకొని మా వాడికి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాను నువ్వు ఒప్పుకుంటే వాడికి నేను ఇచ్చి పెళ్లి చేస్తాను మా ఇంట్లో సంగతి అంతా నీకు తెలిసిందే కదా ఇంక దాచేది ఏమీ లేదు అని వైదేహి అడుగుతుంది. మీరు చెప్పింది నాకు అర్థమైంది ఆంటీ కానీ నా ప్రాణ స్నేహితురాలికి నేను ద్రోహం చేయలేను పంచమి మోక్ష కోసం తప్పకుండా వస్తుంది అని మేఘన అంటుంది.కట్ చేస్తే,
ఇంతలో మోక్ష పంచమి ని తీసుకొని వస్తాడు. మోక్ష ఆగరా నీ పక్కన ఉన్నది పంచమి కాదు పాము రా కొట్టి చంపెయ్ అని వైదేహి అంటుంది. అవును మోక్ష మాకు అంత తెలిసిపోయింది పంచమి తో మాట్లాడిన వ్యక్తి పాముగా మారడం నేను చూశాను పంచమి కూడా పామే తనను అక్కడే వదిలేసి లోపలికి వచ్చేయ్ మోక్ష అని జ్వాల అంటుంది. మోక్ష నేను చెప్పితే నువ్వు నమ్మలేదు కానీ నీకు కూడా ఆ నిజం తెలుసు అని చిత్ర అంటుంది. ఏంటి డాడీ వీళ్ళందరూ మాట్లాడేది నాకు ఏమీ అర్థం కావట్లేదు పామేంటి మనిషి ఏంటి అసలు
మీ అందరికీ ఏమైంది అని మోక్ష అంటాడు. పంచమిపామన సంగతి నీకు కూడా తెలుసు మోక్ష ఎందుకు నటిస్తున్నావ్ ఆరోజు పంచమి తో మాట్లాడిన అబ్బాయిని నేను చూశాను నేను చెపితే అతను పంచమి ఫ్రెండ్ అన్నావు కానీ ఇక్కడ ఏదో జరుగుతుంది మనకు తెలియకుండా పంచమిని వదిలించుకో మోక్ష కొట్టి చంపెయ్ దాన్ని అని చిత్ర అంటుంది. మోక్ష ఇంకా ఏం చూస్తున్నావ్ దాన్ని తరిమేసేయ్ అని వైదేహి అంటుంది.పంచమి నా భార్యఈ ఇంట్లోనే ఉంటుంది మీరు పాములు చూశారో ఏం చూసారో నాకు తెలియదు మేము శివపార్వతుల్లా కలిసే ఉంటాం అని మోక్ష అంటాడు. పంచమి ఆ మాట వినగానే మెల్లగా గడపలోకి వస్తుంది. అది కాదు మనవడా జ్వాల చెప్పేది కాస్త విను అని శబరి అంటుంది.
శబరి ఎవరు చెప్పినా పంచమి ఇంట్లో నుంచి వెల్లదు తను నా భార్య మాకు పెళ్లి చేసే అంతవరకే మీ బాధ్యత మేము ఎలా బ్రతుకుతామనేది మికు అనవసరం మేము ఒకరి కోసం ఒకరు ప్రాణాలు త్యాగం చేసుకుని అంతగా పెనవేసుకున్నది మా బంధం మమ్మల్ని ఎవరూ వేరు చేయలేదు ఒక మరణం తప్ప అని మోక్ష అంటాడు. సారీ మోక్ష తప్పు జరిగేటప్పుడు మౌనంగా ఉండడం కూడా తప్పే నన్ను క్షమించు అని రఘు అంటాడు. అవును మోక్ష మీరిద్దరూ నిజంగా శివపార్వతుల ఉన్నారు మీ బంధం చాలా గొప్పది భార్యాభర్తల బంధం అంటే మిలాగే ఉండాలి మీరిద్దరూ అదృష్టవంతులు అని భార్గవ్ అంటాడు..
Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!