NewsOrbit
Entertainment News Telugu TV Serials

Naga Panchami January 31 2024 Episode 267: మేఘన నాగ కన్య మోక్ష తనని పెళ్లి చేసుకుంటే మరణిస్తావు అంటున్న పంచమి..

Naga Panchami Today Episode January 31 2024 Episode  267 Highlights

Naga Panchami January 31 2024 Episode 267: పంచమి మోక్ష గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మోక్ష వచ్చి పంచమి నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాను నువ్వు లేకుండా నేను ఉండలేను పిచ్చోడిలా తిరుగుతున్నాను అని మోక్ష అంటాడు. మా అమ్మ నువ్వు ఆలోచించినట్టే ఆలోచిస్తుంది తోడు మనిషికి అవసరమే కావచ్చు కానీ నేను కోరుకునేది నా మనసుకు తోడు అది నువ్వు తప్ప ఆ స్థానానికి ఇంకెవరు సరిపోరు అని మోక్ష అంటాడు. మనల్ని అర్థం చేసుకోలేని మనుషుల మధ్య మనం ఉండొద్దు ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం రా పంచమి అని మోక్ష తన చెయ్యి పట్టుకుంటాడు.

Naga Panchami Today Episode January 31 2024 Episode  267 Highlights
Naga Panchami Today Episode January 31 2024 Episode  267 Highlights

మా అమ్మ చెప్పిన చివరికి ఆ దేవుడు చెప్పిన నీ చేయి వదిలిపెట్టను రా వెళ్దాం అని మోక్ష అంటాడు. ఈ గుడిలోనే మనం పెళ్లి చేసుకున్నాం కానీ ఆ పంచమి మోక్ష ఇప్పుడు లేరు మీరు పునర్జన్మెత్తారు ఆ పంచమి పాముగా మిగిలింది ఇప్పుడు నీ లోకం వేరు నా లోకం వేరు మీ జీవితం మీది నా జీవితం నాది అని పంచమి అంటుంది. మా అమ్మ నాకు పెళ్లి ఏర్పాట్లు చేస్తుంది పంచమి అని మోక్ష అంటాడు.

Naga Panchami Today Episode January 31 2024 Episode  267 Highlights
Naga Panchami Today Episode January 31 2024 Episode  267 Highlights

ఇంకా ఏమీ ఆలోచించకుండా వెళ్లి పెళ్లి చేసుకోండి అని పంచమి అంటుంది. ఏదో ఒక అమ్మాయిని తెచ్చి నాకు పెళ్లి చేయాలని చూస్తుంది మా అమ్మ నేను కాదంటే చచ్చిపోతానని బెదిరిస్తుంది నేను కాదనలేని పరిస్థితిలో ఉన్నాను అర్థం చేసుకో పంచమి అని మోక్ష అంటాడు. మీరు నన్ను మర్చిపోయి ఆనందంగా ఉండాలంటే అదే కరెక్ట్ అని పంచమి అంటుంది. లేదు పంచమి నిన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్లాలని గట్టి నిర్ణయంతో వచ్చాను అని మోక్ష అంటాడు. మీరు నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్లడం అనేది జరగదు అని పంచమి అంటుంది. నిన్ను తీసుకువస్తానని నమ్మకంతో మేఘనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇక్కడికి వచ్చాను నువ్వు రాకపోతే మేఘనను నాకు ఇచ్చి పెళ్లి చేస్తుంది మా అమ్మ అని మోక్ష అంటాడు.

Naga Panchami Today Episode January 31 2024 Episode  267 Highlights
Naga Panchami Today Episode January 31 2024 Episode  267 Highlights

ఆ పెళ్లి జరగడానికి వీల్లేదు అని పంచమి అంటుంది. అయితే నువ్వు వచ్చేసేయ్ మనం వెళ్ళిపోదాం అని మోక్ష అంటాడు. ఆ పెళ్లి జరగడానికి వీల్లేదు మేఘన నాలాగే నాగ కన్య తనను కలిస్తే మీరు చనిపోతారు ఎందుకు ఏమిటి అని అడగకండి కానీ మీరు మాత్రం మేఘనని పెళ్లి చేసుకోకండి అని పంచమి అంటుంది. నువ్వు చెప్పిన తర్వాత పంచమి నేను మేఘనని పెళ్లి చేసుకుంటాను అని మోక్ష అంటాడు. అలా జరగకూడదు అని పంచమి అంటుంది. నీకు మా అమ్మకు కావలసింది నా పెళ్ళి జరగడం కదా ఇప్పుడే వెళ్లి మేఘనని పెళ్లి చేసుకొని చచ్చిపోతాను నువ్వొచ్చి ఆ పెళ్లి ఆపితే మనిద్దరం కలిసి ఉంటాం లేదంటే మోక్ష లోకంలోనే ఉండడు అని కోపంగా వెళ్ళిపోతాడు మోక్ష. కట్ చేస్తే,

Naga Panchami Today Episode January 31 2024 Episode  267 Highlights
Naga Panchami Today Episode January 31 2024 Episode  267 Highlights

మేఘన తన ఆశ్రమానికి వచ్చి అద్దంలో చూసుకొని ఎలా ఉన్నా కరాలిని ఎలా అయిపోయాను నన్ను నేను చూసుకుంటేనే జాలేస్తుంది మహా మంత్రగత్తెగా ఎన్నో శక్తులు ఉన్న నేను అన్ని పోగొట్టుకొని మామూలు మనిషిలా ఉండాల్సి వస్తుంది మళ్ళీ నేను మంత్రగత్తల మారి అందరినీ సాధించాలి సాధించి తీరుతావు కరాలి అని అనుకుంటుంది మేఘన. మేఘన మహాకాళి కోసం మళ్లీ తపస్సు చేస్తుంది. తన తపస్సుకు మెచ్చి మహాకాళి ప్రత్యక్షమవుతుంది. నా శక్తులన్నీ తీసుకొని నన్ను దీనురాలిని చేసావు తల్లి నన్ను కరుణించు అని మేఘన వేడుకుంటుంది. అంతా నీ స్వయంకృతాపరాధం ఎంత చెప్పినా వినకుండా నీ అన్న కోసం శక్తులను పోగొట్టుకున్నావ్ ఇప్పుడు చింతిస్తున్నావు అని మహాకాళి అంటుంది. తోడ పుట్టిన వాడిని రక్షించుకోవాలని తాపత్రయపడ్డాను కానీ మిమ్మల్ని ఎదిరించాలని ఉద్దేశం నాకు లేదు మాత అని కరాలి అంటుంది.మన శక్తులే మనకు ఎదురి తిరిగి మనల్ని పతనం చేస్తాయి కరాలి.

Naga Panchami Today Episode January 31 2024 Episode  267 Highlights
Naga Panchami Today Episode January 31 2024 Episode  267 Highlights

అయినా నువ్వు నన్ను వేడుకోగానే నేను ప్రత్యక్షమవుతున్నాను నీ మొర ఆలకిస్తున్నాను అని మహాకాళి అంటుంది. నా శక్తులను నాకు ప్రసాదించు తల్లి అని మేఘన అంటుంది. అందుకు ఏం చేయాలో నీకు చెప్పాను కదా కరాలి అని మహాకాళి అంటుంది. బ్రహ్మచారి అయిన మోక్షనీ బలి కోరడంలో అంతరార్థం ఏమిటో నాకు తెలియడం లేదు మహాకాళి అని మేఘన అడుగుతుంది. తన భర్తను కాపాడుకోవడానికి పంచమి చూస్తుంది నువ్వు తన భర్తని బలివ్వడానికి చూస్తే పంచమి చేతిలో నువ్వు పంచమి చేతుల్లో చస్తావు నువ్వు జయిస్తే మోక్ష నీ చేతుల్లో బలవుతాడు అని మహాకాళి అంటుంది. నేనే జయిస్తాను మహాకాళి నా శక్తుల కోసం ఎవ్వరినైనా బలి ఇస్తాను అని మేఘన అంటుంది. అన్నిటికన్నా శక్తివంతమైనది కాలం మనకన్నా ముందే నిర్ణయించబడి ఉంటుంది నీ ప్రయత్నం నువ్వు చెయ్యి కరాలి అని మహాకాళి వెళ్ళిపోతుంది. నేను మహా మంత్రగత్తెను అయ్యి తీరుతాను మహాకాళి అంతవరకు నిద్రపోను అని కరాలి అంటుంది.కట్ చేస్తే,

అక్క నువ్వు చెప్తుంటే పంచమి మీద మోక్షకి ప్రేమ తగ్గలేదనిపిస్తుంది కానీ మరి మేఘనని పెళ్లి చేసుకుంటానని ఎలా ఒప్పుకున్నాడంటావు అని చిత్ర అంటుంది. పంచమి మేఘన ఫ్రెండ్స్ కాబట్టి మోక్షని ఒక ఆట ఆడుకుంటారని నాకనిపిస్తుంది అని జ్వాలా అంటుంది. ఫారన్ లో చదువుకున్న మోక్ష వాళ్ళ మాయలో పడే అంత తెలివి తక్కువగా ఉంటాడంటావా అక్క అని చిత్ర అంటుంది. ఎంత పెద్ద మేధావులైన కాంతదాసులే చిత్ర ఫీజులు పోయిన బల్బులా పడి ఉండాల్సిందే అని జ్వాల అంటుంది. ఇదంతా ఆస్తి కోసమే అంటావా అక్క అని చిత్ర అంటుంది. అదంతా నాకు తెలియదు కానీ పంచమే వీళ్ళందర్నీ ఇంట్లోకి తీసుకువచ్చింది అని జ్వాల అంటూ ఉండగా మేఘన లోపలికి వస్తుంది. మేఘనని చూసి చిత్ర చిటికెసి ఇలా రమ్మని పిలుస్తుంది. ఎక్కడికెళ్లి వస్తున్నావ్ అని జ్వాల అడుగుతుంది. గుడికి వెళ్లాను అని సైగ చేసి చెప్తుంది మేఘన. నోరుతో చెప్పి చావొచ్చుగా అని చిత్ర అంటుంది. నోరు తెరిస్తే మంత్రాలు రాలుతాయేమో అంతేనా అని జ్వాల అంటుంది.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N