NewsOrbit
Entertainment News సినిమా

ఆ హిట్ మూవీ రీమేక్ లో అఖిల్‌-నాగార్జున‌.. అదే నిజ‌మైతే ఫ్యాన్స్‌కి పండ‌గే!

Share

ఒక భాష‌లో హిట్టైన మూవీని మ‌రో భాష‌లో రీమేక్ చేయ‌డం ఇటీవ‌ల రోజుల్లో బాగా కామ‌న్ అయిపోయింది. ఇప్ప‌టికే తెలుగులో అలా అయిన చిత్రాలు, అవుతున్న చిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లో మ‌రో మూవీ చేర‌బోతోంది. అదే `బ్రోడాడీ`. మ‌ల‌యాళంలో ఈ ఏడాది ఆరంభంలో విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది.

అనుకోని పరిస్థితుల్లో తండ్రీ కొడుకులిద్దరూ ఒకేసారి తండ్రులవుతారు. ఆ త‌ర్వాత ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయి అన్న‌దే ఈ సినిమా. ఇందులో మోహన్ లాల్, పృధ్విరాజ్ సుకుమారన్ తండ్రీకొడుకులుగా న‌టించారు. అయితే హిట్ మూవీ తెలుగులో రీమేక్ కానుందండో ఎప్ప‌టి నుండో ప్ర‌చారం జ‌రుగుతోంది. కొంద‌రి హీరోల పేర్లు కూడా తెర‌పైకి వ‌చ్చాయి.

కానీ, అక్కినేని నాగార్జున ఈ రీమేక్‌ను త‌న త‌న‌యుడు అఖిల్ అక్కినేనితో చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నార‌ట‌. అఖిల్ కూడా అందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో.. తమిళ దర్శకుడు మోహన్ రాజాకు ఇప్ప‌టికే ఈ రీమేక్ బాధ్య‌త‌ల‌ను ఆప్ప‌గించాడ‌ట నాగ్‌. స్వల్ప మార్పులతో తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ సినిమాను తీర్చిదిద్దమ‌ని సూచించార‌ట‌.

అన్నపూర్ణా స్డూడియోస్ లోనే ఈ మూవీ నిర్మితం కానుంద‌ని.. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియ‌ల్ అనౌన్స్ సైతం వ‌స్తుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చార‌మే నిజ‌మై తండ్రీకొడుకులు ఒకే స్క్రీన్‌పై మెరిస్తే అక్కినేని ఫ్యాన్స్ పండ‌గ చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. కాగా, నాగార్జున ప్ర‌స్తుతం `ఘోస్ట్‌`, అఖిల్ `ఏజెంట్‌` చిత్రాలు చేస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ రెండు సినిమాలు మ‌రి కొద్ది రోజుల్లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నున్నాయి.


Share

Related posts

ఒకే పాటలో 300 మంది డ్యాన్సర్లు.. ఇండియన్ సినీ హిస్టరీలో ఇదే మొదటిసారి!

Ram

Ram Charan : సినిమాల్లో ఆరితేరిన రామ్ చరణ్, బిజినెస్ లో మాత్రం నష్టాల్లో కూరుకుపోయాడు!

Ram

Sai pallavi: సాయి పల్లవి లేకుంటే ఈ సినిమానే లేదు: దర్శకుడు

Ram