రానా: సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు, విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఈ మధ్య కాలంలోనే చాలా మంది సెలబ్రిటీలు విడాకుల వైపు టర్న్ తీసుకుని అందరికీ షాకిచ్చారు. అయితే ప్రధానంగా హైలైట్ అయింది మాత్రం సమంత-నాగచైతన్యల విడాకులే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే ఎవరి దారి వారు చూసుకున్నారు.వీరి సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన మరో హీరో వైవాహిక జీవతంపై వార్తలు ఊపందుకున్నాయి. ఆ హీరో మరెవరో కాదు రానా దగ్గుబాటి. ఈయన 2020 ఆగస్టులో ప్రముఖ వ్యాపారవేత్త మిహీకా బజాజ్ ను వివాహం చేసుకున్నాడు. వీరిది ప్రేమ వివాహం. పెద్దలు, పలువురు సెలబ్రెటీల సమక్షంలో తెలుగు-మార్వారీ సాంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
మ్యారెజ్ అనంతరం భార్య మిహీకాతో కలిసి రానా పలు మార్లు వెకేషన్స్‌కు కూడా వెళ్లాడు. అయితే రీసెంట్గా రానా సోషల్ మీడియా నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు, తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి అన్ని ఫొటోలను తొలగించేశాడు. దీంతో అతడి మ్యారెజ్ లైఫ్‌లో పుకార్లు మొదలయ్యాయి.
మిహీకాతో రానాకు గొడవలు జరుగుతున్నాయని.. అందుకే ఇన్‌స్టాలో ఫొటోలన్నీ తొలగించాడంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తకు మిహీకా ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చింది. నేడు రానా, మిహీకాల రెండొవ పెళ్లి రోజు. ఈ సందర్భంగా భర్త రానాతో దిగిన కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాలో లో పోస్ట్ చేస్తూ.. లవ్ సింబల్ జోడించింది. ఈ పోస్ట్‌తో రానా, మిహీకాల మధ్య ఎటువంటి మనస్పర్థలు లేవని.. వారు హ్యాపీగా ఉన్నారని తేలిపోయింది. ఈ నేపథ్యంలోనే రానా అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
https://www.instagram.com/p/Cg_cd42ITqz/?utm_source=ig_web_copy_link