సౌత్‌లో లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలే కోలీవుడ్ దర్శక నిర్మాత విగ్నేష్ శివన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న ఈ లవ్ బర్డ్స్.. ఫైనల్ గా జూన్ 9న మూడు ముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.
తమిళనాడులోని మహాబలిపురంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగా ట్రెండ్ అయ్యాయి. ఇకపోతే నయన్, విగ్నేష్ పెళ్లి తాలూకు వీడియో రైట్స్ ను ప్రముఖ దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

వీరి పెళ్లిని డాక్యుమెంటరీగా రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. దీనికి ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించగా.. ది రౌడీ పిక్చర్స్ నిర్మించింది. అయితే తాజాగా ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన టీజర్‌ను నెట్ ఫ్లిక్స్ వారు బయటకు వదిలారు.
పెళ్లి కూతురుగా నయనతార ఎంత అందంగా ముస్తాబవుతుందో ఈ వీడియోలో చూపించారు. అలాగే పలు ప్రశ్నలకు నయనతార విగ్నేష్ లు సమాధానాలు ఇవ్వడం కూడా చూపించారు. మొత్తానికి అదిరిపోయే ఈ టీజర్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మరి దానిపై మీరు ఓ లుక్కేసేయండి.