Nuvvu nenu prema: కృష్ణ ఎంత చెప్పినా వినకుండా పద్మావతి కుటుంబం విక్కీ వాళ్ల ఇంటికి వెళ్తారు..ఇక అరవింద అందరూ వస్తారు.. ఆర్యను అను వాళ్ళు వస్తున్నారా అని అడుగుతారు.. హ బయలు దేరారు.. అప్పుడే వాళ్ళు రావడం చూస్తారు.. కృష్ణ ఎటు తప్పించుకోనివ్వకుండా ఇరికించారు అని ఆలోచిస్తాడు.. అందరూ అతన్ని కోపంగా చూస్తారు.. విక్కీ వాళ్లంత పద్మావతిని చూసి బాధపడతారు.. ఇక అందరూ కూర్చుని మాట్లాడుతారు.. ఆర్య వాళ్ల అమ్మ మన స్టేటస్ కు తగని వాళ్ళను చేసుకుంటే ఇలానే ఉంటుంది.. అందరూ ఆమెను చూస్తారు.. మరేంటి.. కాబోయే వియ్యంకులము మనకు చెప్పకుండా ఇలా చేస్తారా.. కనీసం వాళ్లకు చెప్పాలని కూడా లేదు అంటూ అంటుంది.. దానికి ఆర్య నానమ్మ మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు.. మీరు మేము అని కాకుండా మన కుటుంబం అనుకుంటున్నాం ఇలా ఎందుకు చేశారు.. నిశ్చితార్థం అప్పుడే ఎదో చెప్పారు.. ఇప్పుడు పెళ్లికి కూడా చెప్పకుండా ఇలా ఎందుకు చేశారు..

ఇక అరవింద మీరంతా మా కుటుంబం అనుకున్నాం.. అను వేరు, పద్మావతి వేరు కాదు.. మాకు ఇద్దరు ఒకటే కానీ కు చెప్పకుండా ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు.. ఎందుకు చెప్పలేదు అని గట్టిగా అడుగుతుంది.. దానికి అండాలు మేము చెప్పకపోవడానికి ఆ నీచుడే కారణం.. మమ్మల్ని చెప్పనివ్వకుండా చేశాడు.. అందుకే చెప్పలేక పోయాము.. మమ్మల్ని క్షమించండి.. అంటూ అందరూ అంటారు.. అయినా అరవింద ఆ నీచుడు ఎవడో చెప్పండి వాళ్లకు శిక్ష పడేలా చేస్తాము.. వాడు ఎవడో నాకు తెలియాలి.. చెప్పు పద్మావతి వాడు ఎవడో.. వాడిని చంపేస్తాను అంటాడు.. పద్మావతి ఎక్కడ చెబుతుందో అని కృష్ణ టెన్షన్ పడతాడు.. వీళ్ళు నిజం చెబితే నన్ను వదలరు.. ఎలా తప్పించుకోవాలని చూస్తాడు.. అరవింద ఆ మోసగాడు ఎవడో చెప్పు మా ఆయన చూసుకుంటాడు.. ఈయన లాయర్ వాడికి శిక్ష పడేలా చేస్తాడు అని అంటారు.

ఆర్య వాళ్ల నాన్న కూడా కృష్ణ నీకు ఎటువంటి హెల్ప్ కావాలాన్నా నేను చేస్తాను అంటాడు.. చెప్పు పద్మావతి భయపడకు అని అండాలు చెబుతుంది.. అరవింద కూడా అడుగుతుంది.. దానికి విక్కీ బావ ఎందుకు నేను చాలు వాడిని చంపేస్తాను అంటాడు.. నానమ్మ కూడా అమ్మా పద్మావతి చెప్పు.. నీలాగే ఇంకో అమ్మాయిని మోసం చెయ్యడు అంటుంది.. ఇక అరవింద లేచి అడుగుతుంది.. అప్పుడు పద్మావతి నన్ను మోసం చెయ్యాలని చూసింది ఎవరో కాదు.. మీ భర్త అనగానే అరవింద కింద పడుతుంది.. ఏమైందోనని అందరూ కంగారు పడతారు.. ఆర్య డాక్టర్ ను తీసుకొని వస్తాడు.. డాక్టర్ చూసి ప్రగ్నెంట్ అని చెబుతుంది. అందరూ సంతోషంలో మునిగి తేలతారు..
Brahmamudi: కావ్యను అపర్ణ కోడలుగా ఒప్పుకుందా.. అప్పు, కళ్యాణ్ రాహుల్ గుట్టు బయట పెడతారా..

తరువాయి భాగంలో కృష్ణ పద్మావతికి ఫోన్ చేస్తాడు.. నాకు ఫోన్ చేస్తే బాగోదు అంటుంది.. కాబోయే భర్తను ఇలా వెయిట్ చేయిస్తారా.. నువ్వు ఏమి అన్నా కూడా నువ్వే నా భార్య అంటాడు.. రా రా గుడిలో ఉన్నాను అంటుంది.. అక్కడికి వచ్చిన కృష్ణ పద్మావతిని చెయ్యి పట్టుకుంటాడు.. అది విక్కీ చూస్తాడు.. నెక్స్ట్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో చూడాలి..
Krishna Mukunda Murari: కృష్ణ తలకి గన్ గురి పెట్టిన భవాని.. మళ్ళీ ఏం చేసింది.!?