Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘నువ్వు నేను ప్రేమ’. విజయవంతంగా 348ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 349 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్ లో,అరవింద కి, యాక్సిడెంట్ అవ్వడం, అరవింద ప్రాణాలతో బయటపడటం. కృష్ణ, అందరి ముందు నటించడం. పద్మావతికి కృష్ణ మీద అనుమానం వస్తుంది.

Nuvvu Nenu Prema: కృష్ణ ప్రయత్నం విఫలం… అరవింద ని చూసి అల్లాడిన విక్కి..
ఈరోజు ఎపిసోడ్ లో,విక్కీ, అరవింద్ కి ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు అక్క లేకపోతే నేనుండలేను, తనే ప్రాణంగా బతుకుతున్న నా పరిస్థితి ఏమిటి? అక్క కోసం నేను ఏదైనా చేస్తాను. కానీ, అక్కే లేకపోతే ఎలాగు. అయినా అక్కకి వరుసగా ఇలా ఎందుకు జరుగుతుంది. అందరికీ మంచి చేయాలనుకునే మా అక్కకి ఎందుకిలా అవుతుంది. అని మొదటి నుంచి అరవింద కుజరిగినవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు.

Krishna Mukunda Murari: మురారి ని వదిలి వెళ్లిపో కృష్ణ.. మురారి నా వాడు అని నిజం చెప్పిన ముకుంద..
విక్కీకి క్లూ ఇచ్చిన పద్మావతి..
విక్కీ బాధపడుతూ ఉండగా అక్కడికి పద్మావతి వస్తుంది. మీ అక్కకి ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా బాధపడితే ఎలా సారు అని అంటుంది. మా అక్క లేకుండా నేను ఉండలేను పద్మావతి. ఎవరికి ఏదైనా చెప్పగలను గాని మా అక్కకు ఏదైనా జరుగుతుందని భరించలేకపోతున్నాను. మీ అక్కకి ఏమీ కాదులే సారు అని అంటుంది. లేదు పద్మావతి మా అక్కకి వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అసలు ఇలా అన్ని ప్రమాదాలు అక్కకే ఎందుకు జరుగుతున్నాయి. అదే నాకు అర్థం కావట్లేదు ఆలోచిస్తున్నాను. దూరం నుండి కృష్ణ వీళ్లిద్దరిని గమనిస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అని కొంచెం ముందుకు వస్తాడు. చిన్నతనం నుండి మా అమ్మ లేకపోయినా నన్ను మాకే ప్రేమగా పెంచింది. ఇప్పుడు మా అక్కకు ఏమైనా అయితే నేను తట్టుకోలేను. అని విక్కీ అంటాడు. నువ్వు బాధపడుతున్నావని నేను అరవింద్ అని చంపకుండా ఉండలేను అని కృష్ణ అనుకుంటాడు. పద్మావతి సారు మనము మన కల్లో ఎదురుకున్న శత్రువులను గుర్తించలేము.

మనతోపాటే ఉంటూ మనకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు మనతోనే ఉంటారు. మనమే వాళ్ళు ఎవరన్నది గుర్తించి ఒక్కసారి బుద్ధి చెప్పాలి అంటే ఇక మళ్లీ మన జోలికి రాకుండా ఉంటారు అని అంటుంది పద్మావతి. ఏంటి పద్మావతి నువ్వు అంటే అక్కకి ఈ ప్రమాదాలన్నిటికీ కారణం మనలోనే ఒకళ్ళు చేస్తున్నారంటావా అని అంటాడు విక్కి. కృష్ణ నా గురించే చెప్పాలని ప్రయత్నిస్తున్నావు కదా పద్మావతి. నేనుండంగా నీకు ఆ ఛాన్స్ ఇవ్వను కదా, అని లోపలికి వస్తాడు. పద్మావతి కూడా మనలానే అరగంట గురించి ఆలోచిస్తుంది కదా విక్కీ. అందుకే అలా మాట్లాడుతుంది. నేను బ్రతికుండగా మీ అక్కకి ఏమీ కాదు, మీ అక్క ప్రాణాలు కి నా ప్రాణం అడ్డం వేసి కాపాడుతాను. మీ అక్క లేనిదే నేను కూడా ఉండలేను అని, విక్కీ ముందు కృష్ణ నటిస్తాడు. నాకు తెలుసు బావా నీ గురించి. మా అక్క నువ్వు ఎంత ప్రేమగా చూసుకుంటున్నావో, నువ్వేం ప్రత్యేకంగా నాకు చెప్పను అక్కర్లేదు అని అంటాడువిక్కీ. అయినా ఈ సమయంలో అక్క పక్కన నువ్వు ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి, అని అక్క దగ్గరికి వెళ్లి అని అంటాడు విక్కీ. కృష్ణ సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.పద్మావతి మాత్రం నీ సంగతి చూస్తాను రా అనుకుంటుంది. సరే సరే ఇంకా ఆలస్యం అయిపోయింది నేను కూడా ఇంటికి వెళ్తాను అని అంటుంది పద్మావతి. సరే అంటాడు విక్కీ.
అను నీ పెళ్లి కూతుర్ని చేయడం..
ఇక పెళ్లికి బయలుదేరడానికి ముందుగా పెళ్ళికూతురు చేస్తారు. ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అమ్మి అంటుంది అండల్. ముందు దిష్టి చుక్క పెట్టండి అని అంటుంది. పద్మావతి అవును మా అక్క చాలా అందంగా ఉంది అని దిష్టి చుక్క పెడుతుంది. పార్వతి నేను ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా వుంది, అమ్మి అంటుంది. ఇదంతా చూడటానికి నాయనక్క లేడు ఏంటి అని పద్మావతి వాళ్ళ నాన్న కోసం వెతుకుతుంది. వాళ్ల నాన్న ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. నాయనా నీకు ఒకటి చూపిస్తాను రా అని పద్మావతి కళ్ళు మూసి భక్తాన్ని తీసుకొస్తుంది. ముందు నిలబెట్టి, ఇప్పుడు కళ్ళు తెరువు నాయనాఅని అంటుంది. నీ కళ్ళ ముందు ఒక అద్భుతం ఉంది చూడు, అని అంటుంది పద్మావతి. అనుని చూసి భక్తా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ డ్రెస్ లో నువ్వు బంగారు బొమ్మలా ఉన్నావ్ అమ్మ అని అంటాడు.

నీ మంచి మనసుతో, పాపకి ఎంత మంచి జరగాలని ఆశీర్వదించినాయన అని అంటుంది పద్మావతి. బక్త ఒకసారి బాగా కన్నీళ్లు పెట్టుకుంటాడు. దేనికి నాయన బాధపడుతున్నావు అని అడుగుతుంది పద్మావతి. ఇంతకాలం మనతో ఉన్నాము ఇప్పుడు ఈ పెళ్లితో మన నుంచి దూరం అవుతుంది. నేను చూడాలనుకున్నప్పుడు చూడలేను మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడలేను కదా అని అంటాడు భక్త. నేను ఎక్కడికి వెళ్తా, నీ గుండెల్లోనే ఉంటాను కదా అని అంటుంది అను. పార్వతి ఆండాలు అందరూ బాధపడుతూ ఉంటారు. అనరంతా ఇంకెవరు చేస్తారని అని అంటుంది అండల్. అత్త అని, అని కూడా బాధపడుతుంది. ఇలా పిలవడానికి కూడా నీకు ముందు ఎవరు ఉంటారు అని అంటుంది అండల్. నేను పెళ్లి చేసుకొని వెళ్లిన నా మనసు ఇక్కడే ఉంటుంది అత్త.అని బాధపడుతూ ఉంటుంది. పద్మావతి, కూడా బాధపడుతుంది.ఈ పెళ్లిలోనే పద్మావతి కూడా పెళ్లి చేసేయాలి అని అంటుంది అండాలు. నీకు, కాళ్ళకి కళ్ళెం వేసే వాడే వస్తాడు పద్మావతి. అని అండల్ అంటుంది. మా అమ్మని చేసుకోవడానికి, వాళ్లకు చాలా అదృష్టం ఉండాలి అని అంటుంది అను.సరే ఇక అమ్మాయి తో దీపం పెట్టించు.వర్జ్యం వస్తుంది అంటాడు భక్త. సరే అని అను లోపలికి వెళ్తుంది.

ఆర్యా ని పెళ్ళికొడుకుని చేయటం..
ఆర్య వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆర్యాన్ని పెళ్లి కొడుకుని చేయడానికి రెడీ చేస్తారు.అరవింద నీకెందుకు అమ్మ ఈ శ్రమంత అని అంటుంది శాంతాదేవి. నా తమ్ముడు కోసం నేను ఆ మాత్రం చేయలేనా నాయనమ్మ అంటుంది.ఆర్య విక్కి దగ్గరికి వచ్చి,నువ్వు లేకపోతే ఈ పెళ్లి జరిగేది కాదు,నువ్వు నాకు అన్నవే కాదు, ఫ్రెండ్ వి కూడా, నువ్వు నాతో ఇలానే ఉండు అని అడుగుతాడు. విక్కీ కూడా, నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను ఆర్య అని చెప్తాడు. సిద్దు నా పెళ్ళికి కూడా మీరు ఇలానే చేయాలి అక్క అని అడుగుతాడు. నువ్వు యుఎస్ లో అమ్మాయిని చేసుకుంటే, నేను వచ్చి నిన్ను రెడీ చేయలేను కానీ, ఇక్కడ అమ్మాయిని చేసుకుంటే మాత్రం, నేను రెడీ చేయగలను అని అంటుంది అరవింద. ఆర్య పెళ్లిలోనే, నువ్వు కూడా ఎవరో ఒక అమ్మాయిని చూసుకో అని అంటుంది అరవింద. కుచల మన స్థాయికి తగ్గ అమ్మాయిని నన్ను చూడమంటావా అని అంటుంది. వద్దు వద్దు నేను ఇక్కడే ఒక అమ్మాయిని చూసుకున్నాను అని చెప్తాడు. విక్కీ ఒకసారిగా షాక్ అవుతాడు పద్మావతి పేరు ఎక్కడ చెప్తాడు అని, ఎవరా అమ్మాయి అని చెప్పి అందరూ అడుగుతారు సిద్దుని. సిద్దు మాత్రం పద్మావతి నుంచి రెస్పాండ్ వచ్చిన తర్వాతే వీళ్ళందరికీ చెప్పాలి అని అనుకుంటాడు. ఇప్పుడు కాదు తర్వాత చెప్తాను అని అంటాడు. ఇక అందరూ ఆర్యని పెళ్లి కొడుకుని చేసే సంతోషంలో ఉంటారు. ఇలా అందరూ సంతోషంగా ఉంటే, మీ కృష్ణ మనసులో, మీ అందరికీ సంతోషంగా ఉందేమో కానీ నేను పద్మావతి మెడలో తాళి కట్టినప్పుడే సంతోషం అప్పటివరకు నాకు మనశ్శాంతి లేదు అని అనుకుంటాడు. ఎలాగైనా ఈ పెళ్లి జరిగే లోపు పద్మావతిని నాతో పెళ్లికి ఒప్పించాలి. ఒప్పించి తీరుతాను అని అనుకుంటాడు.

రేపటి ఎపిసోడ్ లో, పద్మావతి కుటుంబమంతా కలిసి, ఆర్య వాళ్ళ ఇంటికి వస్తారు. ఊరేగింపుగా, అనుని తీసుకొని వస్తూ ఉంటారు. అందరూ డాన్స్ వేస్తూ ఉంటారు. విక్కీ పద్మావతి కలిసి డాన్స్ వేస్తూ, ఉండడాన్ని సిద్దు చూస్తాడు. సిద్దు కృష్ణ దగ్గరికి వెళ్లి ఏంటి విక్కీ పద్మావతిని ట్రై చేస్తున్నాడా అని అడుగుతాడు. కృష్ణ కోపంగా పద్మావతి విక్కి ల వైపు చూస్తాడు. చూద్దాం కృష్ణ రేపు ఏం చేయనున్నాడో..