Nuvvu Nenu Prema: స్టార్ మా ఛానల్ లో అత్యంత ఆదరణ దక్కించుకుంటున్న డైలీ సీరియల్స్ లో ఒకటి ‘నువ్వు నేను ప్రేమ’. విజయవంతంగా 347ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 348 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. నిన్నటి ఎపిసోడ్ లో, పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్లిన విక్కి, పద్మావతి కుటుంబానికి హెల్ప్ చేస్తాడు. అనుకిబంగారం కొనడానికి,డబ్బులు లేకపోతే తను ఇస్తాడు. అలాగే భోజనాల దగ్గర కూడా హెల్ప్ చేస్తాడు. ఇక అరవింద్ అని చంపడానికి కృష్ణ కారు లో బ్రేకులు తీసివేస్తాడు. అరవింద కారు ప్రమాదానికి గురి అవుతుంది.

Nuvvu Nenu Prema: కృష్ణ నట విశ్వరూపం.. అనుకున్నది సాధించిన కృష్ణ.. ప్రమాదంలో అరవింద..
ఈరోజు ఎపిసోడ్ లో,పద్మావతి తో విక్కీ, నీ మనసులో నేనున్నా కూడా ఎందుకు నువ్వు బయట పెట్టట్లేదు, పరిస్థితులన్నీ ఎప్పుడూ ఒకేలాగా ఉండవు పద్మావతి, ఆ పరిస్థితులకు నువ్వు తాలోగ్గి నిజాన్ని దాచద్దు, ఇప్పటికైనా నిజం చెప్పు అని అడుగుతాడు. నాకోసం ఇంతలా తపిస్తున్న మిమ్మల్ని చూస్తుంటే, నాకు చెప్పాలని ఉంది. ఇన్నాళ్లు పరిస్థితులకు భయపడి చెప్పలేదు, ఇప్పుడు కూడా చెప్పకపోతే మీ ప్రేమను నేను, అవమానించిందని అవుతాను.ఇప్పుడే నా మనసులో మాట మీకు చెప్తాను అని పద్మావతి అనుకుంటుంది.శ్రీనివాస ఇప్పుడే నా మనసులో మాట విక్కీ గారికి చెప్పబోతున్నాను, ఇక నీదే భారం అని అనుకుంటుంది.పద్మావతి తన మనసులో మాట చెప్పబోయే సమయానికి విక్కీకి ఫోన్ రింగ్ అవుతుంది.

అరవింద కు యాక్సిడెంట్ అయిందని విక్కీ కి ఫోన్..
ఫోన్ రింగ్ అవుతుంది సారు ఎవరో చూడండి అంటుంది పద్మావతి. ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడుగుతాడు. నేను ఎస్ఐ ని మాట్లాడుతున్నాను మీ కాడికి ఇక్కడ యాక్సిడెంట్ అయింది. ఈ కారులో మీ అక్క గారు ఉన్నారు ఆవిడకి కూడా బ్లడ్ చాలా పోయింది. మీరు ఉన్నట్టుండి ఇక్కడికి రావాల్సి ఉంటుంది. అని ఫోన్ పెట్టేస్తాడు ఎస్ఐ. అది విని విక్రమ్ ఆదిత్య చాలా భయపడుతూ కంగారుగా పద్మావతి తో చెప్తాడు. పద్మావతి వికీ ఇద్దరు కలిసి అరవింద యాక్సిడెంట్ అయిన స్పాట్ కి వెళ్తారు.

అరవింద గారికి యాక్సిడెంట్ అయిందని ఇంట్లో వాళ్లకు తెలియటం..
నారాయణ అరవింద ఫోన్ కి కాల్ చేస్తూనే ఉంటాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా అని చెబుతాడు. డ్రైవర్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని ఆర్య చెప్తాడు. కుచల అసలు ఏమైందో ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది అని అంటుంది. మీరేం కంగారు పడకండి అంటే అంతా బానే ఉంటుందిలే అంటాడు సిద్దు. లేదు అరవింద ఫోన్ పెట్టేముందు నాయనమ్మ, నాయనమ్మ అని పెద్ద పెద్దగా అరిచి కంగారుగా ఫోన్ పెట్టేసింది. అంటే ఏదో జరిగి ఉంటుంది అని అంటుంది.అదే సమయానికి అక్కడ కృష్ణ వస్తాడు. ఇప్పుడు వీళ్ళ ముందు నా నటన అంతా ప్రదర్శించాలి నేనే వీళ్ళకి చెప్పాలి అని అనుకుంటాడు. ఫోన్ రాకపోయినా ఫోన్ మాట్లాడుతున్నట్టుగా చెప్పండి ఎవరు అని అంటాడు. ఏంటి అరవింద కు యాక్సిడెంట్ అయిందా, మీరు చెప్పినది నిజమేనా, నా రాణమ్మకు ఆక్సిడెంట్ అయిందా, రాణమ్మ అని ఫోను కింద పడేస్తాడు. ఏడుస్తూ వెళ్లి సోఫాలో కూర్చుంటాడు. ఇంట్లో వాళ్ళందరికీ ఏమీ అర్థం కాక కంగారుపడుతూ ఏమైంది అని అడుగుతుంటారు. చెప్పు కృష్ణ నా కాళ్లు చేతులు ఆడట్లేదు అరవింద్ కి ఏమైంది అని అంటుంది కుచల.

ఇలా చేస్తాడని అనుకోలేదు అత్తయ్య, దేవుడికి కాస్త కూడా కనికరం లేకుండాపోయింది. మా రాణమ్మ కారు కి ఆక్సిడెంట్ అయ్యేలా చేశాడు ఏంటి అరవింద కారికే ఆక్సిడెంట్ అయిందా ఇప్పుడు అరవింద్ కి ఎలా ఉంది అని అడుగుతుంది. కారంతో చాలా పాడైపోయింది. కారిక ఎలా అయితే ఒక లోపల అరవింద పరిస్థితి ఏమిటి? అసలు నా ప్రాణం లేకుండా నేను ఎలా బతకాలి. అంత మంచి అరవిందకు ఇలాంటి, పరిస్థితి వస్తుందనుకోలేదు. అరవింద నువ్వు లేని ఈ జీవితాన్ని నేను ఊహించుకోలేను. అరవింద్ కి ఏమన్నా అయితే నేను బతకలేను. తనకేమైనా జరిగిందని తెలిస్తే ఇప్పుడే చనిపోతాను. అని అందరిని నమ్మించడానికి తగల ట్రై చేస్తుంటాడు కృష్ణ. ఏమి కాదులే కృష్ణా ఊరుకో అరవింద్ ఏమి కాదు అని అంటుంది కుచల. ఏమి కాకుండా ఎందుకు ఉంటుంది అత్తయ్య, కారు మొత్తం డ్యామేజ్ అయినప్పుడు అరవింద్ కి ఏమి కాకుండా ఉంటుందా,అయినా నా రాణమ్మ లేని జీవితంలో నేను ఉండలేను, నేను కూడా నా రాణి మీ దగ్గరికి వెళ్ళిపోతాను అని లేస్తూ కళ్ళు తిరిగినట్టు యాక్టింగ్ చేసి పడిపోతాడు. ఏమైంది బావ ఏమైంది అని ఆర్య కళ్ళు తెరువు బావ నికేమైంది, ఇంట్లో వాళ్ళందరూ ఏమైంది కృష్ణ కళ్ళు తెరువు అని అంటూ ఉంటారు.వాటర్ తీసుకొని రావడానికి ఆర్యా లోపలికి వెళ్తాడు. ఈ మాత్రం నటిస్తే చాలు వీళ్లంతా నన్ను నమ్మేస్తారు అని అనుకుంటాడు కృష్ణ.

అరవింద ను చుసిన విక్కీ..
విక్కీ పద్మావతి చాలా కంగారుగా, అరవింద గారికి ఏమైందో అని హాస్పిటల్ దగ్గరికి వస్తారు. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు లోపల ఉంది వెళ్ళండి అని చెప్తుంది నర్స్. విక్కీ చాలా కంగారుగా లోపలికి వెళ్తాడు. అరవింద ప్రాణాలకు ఏ ప్రమాదం లేకుండా చక్కగా, చేతికి కట్టు కట్టించుకుంటూ ఉంటుంది.నీకే అరవింద్ చూసి అక్క ఏమైంది అని అడుగుతాడు. అసలు నీకు యాక్సిడెంట్ అయింది అని తెలియగానే, నా గుండె ఆగిపోయినంత పని అయింది అక్క. ఏంటి అక్క ఇదంతా ఏమైంది నీకు, నాకేం కాలేదు విక్కీ,కంగారు పడకు అంటుంది అరవింద.నువ్వు లేకుండా అసలు నేను ఎలా ఉంటాను అక్క. నాకు డ్రైవరు కారుకు బ్రేకులు లేవని చెప్పినప్పుడు, నువ్వు మీ బావే గుర్తొచ్చారు. అసలు నేను లేకుండా మీరిద్దరు ఎలా ఉంటారు ఎవరు మిమ్మల్ని చూసుకుంటారు. నాకు చాలా బాధేసింది. మీకేం కాలేదు అరవింద గారు మిమ్మల్ని ఆ దేవుడు కాపాడతాడు అని అంటుంది పద్మావతి. ఇంత మంచి మనసున్న మిమ్మల్ని, ఆ దేవుడు ఎప్పుడు కాపాడుతూనే ఉంటాడు మీ అక్క తమ్ముడు ఇద్దరు ఇట్లానే కలిసి ఉండాలి అని అంటుంది. డాక్టర్ గారు మా అక్క ని ఇంటికి తీసుకెళ్లొచ్చా ఏమన్నా ప్రమాదమా అని అంటాడు. ఏమీ లేదండి యాక్సెంట్ పెద్దది జరిగినా కానీ మీ అక్కకి ఏమీ కాలేదు. లక్కీగా తన కడుపులో బిడ్డ కూడా ఏమీ కాలేదు అని అంటుంది డాక్టర్. మీ కడుపులో ఉన్న మీ అమ్మగారే మీ ప్రాణాలను రక్షించింది అంటుంది పద్మావతి. డాక్టర్ గారు కొన్ని మందులు రాసి ఇస్తారు అవి తీసుకొని, పద్మావతి నానమ్మ చాలా కంగారు పడుతూ ఉంటుంది. నానమ్మ నాతో ఫోన్ మాట్లాడుతూ, ఉన్నప్పుడే ఇలా జరిగింది అంటే, నాకు ఏదో అయ్యిందని ఇంట్లో వాళ్ళు భయపడుతూ ఉంటారు తొందరగా వెళ్దాం విక్కీ,అని అంటుంది అరవింద.

కృష్ణా తన నటన అంతా ప్రదర్శిస్తూ ఉంటాడు. ఇక అరవింద్ లేదు రాదు అని అనుకుంటూ ఉంటాడు.వీళ్ళ ముందు, ఇలానే నటిస్తే, వీళ్లు నన్ను పూర్తిగానమ్మేస్తారు.అని అనుకుంటాడు కృష్ణ.ఏమీ కాదు కృష్ణ, అరవింద బానే ఉంటుంది నువ్వు కంగారు పడకు అని అంటాడు నారాయణ. లేదు నా కళ్ళతో నా రాణమ్మ ని చూస్తే కానీ నేను నమ్మలేను. కుచన కూడా ఒకసారి కృష్ణ చెప్పినట్టు హాస్పిటల్ కి వెళ్లి అరవింద్ ను చూడాలి.అని అందరూ హాస్పిటల్ కి వెళ్దాం అనుకుంటారు.కృష్ణ వాళ్ళముందు కళ్ళు తిరుగుతున్నట్టు లేచి నడవలేనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు.ఈపాటికి అరవింద డెడ్ బాడీ రావాలి అంబులెన్స్ లో, ఇంకా రాలేదు ఏంటి అని అనుకుంటూ, కృష్ణ ఇంట్లో వాళ్లతో పాటు,బయటికి వస్తూ ఉంటారు.

విక్కీ,అరవింద, ను తీసుకుని వస్తాడు..
కృష్ణ ఇక అరవింద ఈ లోకంలోనే ఉండదు అని చాలా సంతోషంగా, ఒకసారి హాస్పిటల్ కి వెళ్లి చూస్తే, ఇంట్లో వాళ్ళందరికీ కూడా అర్థమవుతుంది అని అనుకుంటూ ఉండగా, విక్కీ పద్మావతి అరవింద తో పాటు ఇంట్లోకి ఎంట్రీ ఇస్తారు. అంతే కృష్ణ గుండె, ఆగినంత పని అవుతుంది. ఇదేంటి నేను అనుకున్నది ఏంటి జరిగింది ఏంటి? అసలు అరవింద్ ఎలా బతికింది. బతికే ఛాన్సే లేదు కదా, ఇప్పుడు ఏం చేయాలి. అని కృష్ణ అనుకుంటూ ఉంటాడు. అరవింద్ అని చూసి ఇంట్లో వాళ్లంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కంగారు అరవింద దగ్గరికి వెళ్లి ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటారు. విక్కీ ఏమీ కాలేదు అతని కారుకి యాక్సిడెంట్ అయిన తను మాత్రం ప్రాణంతో మనకి దక్కింది అని అంటాడు. మీ అందరి ప్రేమ అభిమానాల వల్లే, తన సేఫ్ గా ఇంటికి వచ్చింది అని అంటుంది పద్మావతి. దూరం నుంచి కృష్ణ అరవింద ని చూసి, ఇప్పుడు నా పర్ఫామెన్స్ కి వీళ్ళకి ఏమాత్రం అనుమానం రాకూడదు, వీళ్ళకి అనుమానం రాకుండా ఇప్పుడు నేను మళ్ళీ నటించాలి అని అనుకుంటాడు.
అరవింద ముందు కృష్ణ నటన..
అరవింద్ ను చూసి ఇంట్లో వాళ్ళ మాట్లాడుతూ ఉంటారు. ఇంత ప్రమాదం తప్పినందుకు, అరవింద్ కు ఏమీ కాకుండా ఇంటికి వచ్చినందుకు, ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉంటారు. దూరం నుంచి కృష్ణ మాత్రం, నటించడానికి రెడీ, అవుతుంటాడు. కృష్ణ,రానమ్మ అని దగ్గరికి వెళ్తాడు.నీకేమైందో నేను ఎంత కంగారుపడ్డానో తెలుసా, అసలు మళ్లీ నేను ఇలా చూస్తాను అనుకోలేదు అండి, అంటుంది అరవింద. నువ్వు లేకపోతే నేను కూడా ఈ లోకం వదిలి వెళ్ళిపోదాం అనుకున్నాను, రాణమ్మ. అలా ఎప్పటికీ మాట్లాడొద్దండి, మనం కలిసే ఉంటాము. అసలు నీకు యాక్సిడెంట్ అయింది అని తెలియని నా గుండె ఆగినంత పని అయింది రాణమ్మ. నాకేం కాలేదు అండి, మీరు కంగారు పడకండి అని అంటుంది అరవింద. నువ్వు క్షేమంగా బయటపడటానికి, ఒక రకంగా కృష్ణ ప్రేమే కారణం అమ్మ అంటుంది, అరవింద నానమ్మ. అవును మా అందరి కన్నా కృష్ణ ఎక్కువ నీకోసం బాధపడ్డాడు. నువ్వు లేకపోయేటప్పటికి తల్లడిల్లిపోయాడు, అని కుచల అంటుంది.

కృష్ణ మీద పద్మావతి అనుమానం..
పద్మావతి,కృష్ణ మీద అనుమానంగా చూస్తూ ఉంటుంది. అరవింద గారిని చంపాలని చూసే వీడి కళ్ళల్లో కన్నీళ్లు ఎలా వస్తున్నాయి. వీడు కావాలని వీళ్ళ ముందు నటిస్తున్నాడు. అని అనుకుంటుంది పద్మావతి. సిద్దు అసలు ఆక్సిడెంట్ ఎలా జరిగింది అని అడుగుతాడు. కృష్ణ కంగారుగా బిత్తరగా చూస్తూ ఉంటాడు. ఇవన్నీ పద్మావతి గమనిస్తూ ఉంటుంది. అరవింద, సడన్గా డ్రైవరు బ్రేకులు పనిచేయట్లేదు అని చెప్పాడు. తర్వాత, కారుని యాక్సిడెంట్ చేశాడు.డ్రైవర్ చెప్పేటప్పటికి నాకు చాలా కంగారేసింది. అయినా కారు చాలా కండిషన్లో ఉంది కదా, మేడంగా బ్రేకులు ఎందుకు ఫెయిల్ అయ్యాయి అని అడుగుతాడు సిద్ధి. ఒకసారిగా కృష్ణ షాక్ అవుతాడు.ఒకసారి అలా జరుగుతూ ఉంటాయి లే, కారు ఎంత కండిషన్ లో, వున్నా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అని అంటాడు నారాయణ. ఏది ఏమైనా అరవిందుకేమీ కాలేదు అని అంటుంది శాంతాదేవి. నా రాణమ్మకు ఏమీ కాలేదు, నాకంటే చాలు అని అందరి ముందు నటిస్తుంటాడు కృష్ణ. పద్మావతి కచ్చితంగా ఇది వీడి పని అయి ఉంటుంది. వీడి ప్రవర్తన చూస్తుంటే నాకు అనుమానం గా వుంది అనుకుంటూ ఉంటుంది. నాకేం కాలేదు కదండి మీరు టెన్షన్ పడకండి. అని అరవింద లోపలికి వెళుతుంది. టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను, నేను పద్మావతిని పెళ్లి చేసుకోవాలంటే, నువ్వు ఉండకూడదు కదా, అని అనుకుంటాడు మనసులో కృష్ణ. పద్మావతి మాత్రం అనుమానంగా కృష్ణ ని చూస్తూనే లోపలికి వెళ్తుంది.
నువ్వు లేకుండా నేను ఉండలేను అక్క..
విక్కీ అరవింద్ అని తీసుకొని లోపలికి వస్తాడు. అరవింద, విక్కిని చూసి నాకేం కాలేదు కదరా ఎందుకు ఇంకా బాధ పడుతున్నావ్, నేను బానే ఉన్నాను అని అంటుంది. చిన్నప్పటినుండి అమ్మ లేకపోయినా, నన్ను అమ్మలాగ పెంచావు, నీకేమన్నా అయితే నేనేం అవ్వాలి అక్క, నువ్వు లేకుండా అసలు నేను ఎలా ఉంటాను. నువ్వు అలా బాధపడకు విక్కీ, నాకు కూడా ఏడుపొస్తుంది.అని అంటుంది అరవింద.నాకేం కాలేదు అయినా నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను. అదే సమయానికి అక్కడికి జ్యూస్ తీసుకుని పద్మావతి వస్తుంది. మీ అక్క తమ్ముళ్ళని ఇలా చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. మీరిద్దరూ ఎప్పుడు ఇలానే కలిసి ఉంటారు నాది గ్యారెంటీ అని అంటుంది. ముందు ఈ జ్యూస్ తాగండి, కడుపులో ఉన్న మీ అమ్మగారు బలంగా ఉంటేనే కదా, మీరు కూడా బలంగా ఉంటారు. ఆవిడ మీకు ఏమీకాకుండా చూసుకుంటుందిలే, ఆవిడ చూసుకోకపోయినా నేను చూసుకుంటాను నాది గ్యారెంటీ. అని అంటుంది పద్మావతి.
విక్కీ మాత్రం,అరవింద్ కు జరిగిన,ప్రతి ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అందరికీ మంచి చేసే మా అక్కకి, వరుసగా ఎందుకు ఇలా జరుగుతున్నాయి అని ఆలోచిస్తూ ఉంటాడు.
రేపటి ఎపిసోడ్ లో, అర్యని పెళ్లి కొడుకుని చేస్తారు. సిద్దు అరవింద్ తో, రేపు నా పెళ్లి కూడా ఇలానే రెడీ చేయాలి సిస్టర్ అని అడుగుతాడు. కుచల సిద్దు ని, నీకు మంచి గ్రాండ్, సంబంధం చూడమంటావా అని అడుగుతుంది. వద్దు నేను ఇక్కడే లోకల్ అమ్మాయిని చూశాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. అందరూ ఎవరు అ అమ్మాయి అని అడుగుతారు. విక్కీ సిద్దు వైపు చూసి పద్మావతి పేరు చెప్తాడా ఏంటి అని అనుకుంటాడు. చూడాలి రేపటి ఎపిసోడ్ సిద్దు ఎవరి పేరు చెప్తాడో..