Nuvvu Nenu Prema స్టార్ మా ఛానల్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని దక్కించుకుంటున్న సీరియల్స్ లో ఒకటి ‘నువ్వు నేను ప్రేమ’. 354 ఎపిసోడ్స్ ని పూర్తి చేసుకున్న ఈ సీరియల్ ఇప్పుడు 355 వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. ఈ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాము.

కృష్ణ మురళి నిజస్వరూపం ని అరవింద కి చెప్పడానికి వచ్చిన విక్రమాదిత్య :
మా అక్కకి ఈ నీచుడు చేస్తున్న మోసం గురించి మొత్తం చెప్పాలి అని అనుకుంటాడు విక్రమాదిత్య. ఆ ఉద్దేశ్యం తోనే ఆమె వద్దకి వెళ్లి చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు. ఆమె ముఖం చూస్తూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటాడు. ఏమి జరిగింది విక్కీ అంటూ విక్కీ ని అడుగుతూ ఉంటుంది అరవింద. విక్కీ కృష్ణ మురళి మాటలను గుర్తు చేసుకుంటూ ‘మీ అక్క ఇప్పుడు గర్భవతి..ఇలాంటి విషయాలు తెలిస్తే ఆమె పరిస్థితి ఏమి అవుతుందో తెలుసు కదా’ అని బెదిరించడం గుర్తు చేసుకుంటాడు. ఇంత కృష్ణ మురళి అక్కడికి వస్తాడు.

ఏంటి విక్కీ ఎదో చెప్పాలని అనుకుంటున్నావు , చెప్పు ఏంటో మీ అక్కకి అని అంటుంటాడు. విక్రమాదిత్య అతడి వైపు చాలా సీరియస్ గా చూస్తూ ఉంటాడు. మరో పక్క అరవింద కూడా అడుగుతూ ఉంటుంది ఏమి జరిగిందో చెప్పమని, కానీ విక్రమాదిత్య నోరు పెగల్చలేక ఒక పక్క కోపం ఒక పక్క బాధతో కుమిలిపోతూ ఉంటాడు. ఇంతలోపే కృష్ణ మురళి మాట్లాడుతూ, ఏమి లేదు అరవింద, ఇందాక నేను కాసేపు పెళ్లి మండపం లో కనిపించకపోయేసరికి విక్కీ కంగారు పడ్డాడు, అదే చెప్పాలని వచ్చావు కదా విక్కీ అని చెప్పి అక్కడి నుండి అరవింద ని తీసుకొని వెళ్ళిపోతాడు. మరో పక్క విక్రమాదిత్య పద్మావతి తనని మోసం చేసింది అనే అపోహలో ఉంటాడు. ఆమెతో గతం లో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఆ బాధలో ఫుల్లుగా మందు కూడా తాగేస్తాడు, అనంతరం పెళ్లి మండపం కి వెళ్తాడు.

పద్మావతి మేడలో తాళి కట్టిన విక్రమాదిత్య :
పెళ్లి మండపం కి వెళ్లిన తర్వాత పద్మావతి ని చెయ్యి గట్టిగా పట్టుకొని ఈడ్చుకొని వెళ్తాడు, పద్మావతి ని మాత్రమే గమనించిన సిద్దు, అవతల అక్కడ పెళ్లి జరుగుతుంటే ఇక్కడ ఏమి చేస్తున్నావు పద్మావతి అని అడుగుతాడు. మా చుట్టాలు వస్తున్నారు వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి అందుకే అక్కడికి వెళ్తున్నాను అని అంటుంది పద్మావతి. నువ్వు బాగానే ఉన్నావా, కళ్ళలో ఆ నీళ్లు ఏమిటి అని అడుగుతాడు సిద్దు, అప్పుడు పద్మావతి ఇందాక కళ్ళలో దుమ్ము పడింది, అందుకే అని కవర్ చేస్తుంది. సరే వెళ్దాం పదా అని సిద్దు అనగా, నువ్వు వెళ్ళు, నేను మావాళ్లను రిసీవ్ చేసుకొని వస్తాను అని అంటుంది పద్మావతి. ఇక ఆ తర్వాత పద్మావతి ని ఒక మూలకు ఈడ్చుకెళ్తాడు విక్కీ.

అసలు మీకు ఏమైంది సారూ, ఎందుకు నన్ను ఇలా లాకొచ్చారు అని అడుగుతుంది. నమ్మించి నమ్మక ద్రోహం చేసావు, నీ ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది అనుకున్నాను, కానీ నమ్మిన వాళ్ళను ఇంత మోసగిస్తావా అని అంటాడు. అప్పుడు పద్మవతో ఏమి మాట్లాడుతున్నారు సారూ, నేను మోసం చెయ్యడం ఏమిటి అని అయ్యోమయ్యం తో విక్రమాదిత్య ని అడుగుతుంది. అప్పుడు విక్రమాదిత్య ఏమి జరిగిందో తెలుసుకోవాలని ఉందా, అయితే నేను చెప్పినట్టు చెయ్యి, లేకపోతే మీ అక్క పెళ్లిని ఈ క్షణమే ఆపేస్తాను అని బెదిరిస్తాడు..ఇక మరుసటి ఎపిసోడ్ ప్రోమో లో పద్మావతి మేడలో విక్రమాదిత్య తాళి కడుతాడు, తర్వాత ఏమి జరిగింది అనేది రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.