krishna mukunda murari స్టార్ మా ఛానల్ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతున్న రెండు మూడు సీరియల్స్ లో ఒకటి ‘కృష్ణ ముకుంద మురారి’. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతున్న ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ఒకసారి చూద్దాము.

తాగేసి కృష్ణ కి ఫోన్ చేసిన మురారి :
మురారి తన స్నేహితుడు గోపి తో కలిసి ఫుల్ గా తాగుతూ, కృష్ణ మీద తనకి ఎంత ప్రేమ ఉందో చెప్తూ ఉంటాడు. ఈరోజు ఎలా అయినా కృష్ణ కి తన ప్రేమ గురించి చెప్పేస్తాను అంటూ, తానూ ఉంటున్న చోటుకి కృష్ణ ని ఫోన్ చేసి రమ్మనడానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు సమయం ఉదయం 2 అయ్యింది, ఇంట్లో మీ అమ్మకి నువ్వు తాగుతున్న విషయం తెలిసిందంటే ఇక అంతే సంగతులు అని గోపి చెప్తున్నా కూడా పట్టించుకోకుండా కృష్ణ కి ఫోన్ చేస్తాడు మురారి. మురారి ఫోన్ కాల్ ని కృష్ణ ఎత్తుకోగానే పసిగట్టేస్తుంది మురారి బాగా తాగేశాడని.

మురారి కలవడానికి గోపి దగ్గరకి వచ్చిన ముకుంద :
ఆ తర్వాత కృష్ణ తో మాట్లాడుతూ ‘ వెంటనే ఇక్కడికి ఒకసారి రావా, నీకొక విషయం చెప్పాలి’ అని అంటాడు మురారి. ఈ సమయం లోనా అని కృష్ణ అడగగా, నీకు హాస్పిటల్ లో సర్జరీ ఈ సమయం లో చెయ్యాలని ఫోన్ వస్తే వెళ్లకుండా ఉంటావా అని అంటాడు మురారి. వెళ్తాను కానీ మీరు తాగిన విషయం అత్తయ్య కి తెలిస్తే అని అంటుంది కృష్ణ , అప్పుడు మురారి తెలియకుండా నువ్వు చూసుకో, వెంటనే గోపి ఇంటికి వచ్చేయ్ అని అంటాడు మురారి. ఈ ఫోన్ కాల్ సంభాషణ ని దూరం నుండి నక్కి వింటున్న ముకుంద, మురారి గోపి దగ్గర ఉన్నాడు అనే విషయం తెలుసుకొని కృష్ణ కంటే ముందు తాను అక్కడ ఉండాలని అనుకోని , వెంటనే బయలుదేరుతుంది. అక్కడ ముకుంద ని చూసిన వెంటనే మురారి చాలా కోపగించుకుంటాడు, వెంటనే తనని అక్కడి నుండి వెళ్ళిపో అని గట్టిగా అరుస్తాడు.

మురారి ముకుంద ఒకే చోట ఉన్నది కృష్ణ చూసేసిందా ?:
ఇంతలోపే కృష్ణ ఏసీపీ సార్ అని పిలుచుకుంటూ గోపి ఇంటికి వచ్చేస్తుంది. కృష్ణ వచ్చింది అనే విషయం తెలుసుకున్న మురారి కంగారు పడుతుంటాడు, గోపి కూడా ముకుంద ని ఇక్కడి నుండి వెళ్ళిపో అని చెప్తాడు, అప్పుడు ముకుంద గోపితో నేను మురారి తో 5 నిముషాలు మాట్లాడాలి, కృష్ణ ఇక్కడికి వచ్చినా నాకు ఎలాంటి ప్రాబ్లెమ్ లేదు అని అంటుంది. నువ్వు మాట్లాడుతూ ఉండురా ఈలోపే నేను కృష్ణ ని మ్యానేజ్ చేస్తాను అని క్రిందకి వెళ్తాడు గోపి.

ఈలోపు ముకుంద ని ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు అని అరుస్తాడు మురారి, ఇప్పుడు నువ్వు ఎందుకు తాగుతున్నావో, ఎవరిని తలచుకొని తాగుతున్నావో తెలుసుకోవడానికి వచ్చాను అని అంటుంది ముకుంద, అప్పుడు మురారి నేను ఈరోజు నా ప్రేమ విషయం కృష్ణ కి చెప్పేస్తాను అని ‘ఐ లవ్ యూ’ కృష్ణ అని పెద్దగా అరుస్తూ ఉంటాడు మురారి. క్రింద ఉన్న కృష్ణ కి వినిపిస్తుందేమో అనే భయం తో కిటికీ తలుపులు మూసేస్తుంది ముకుంద. ఈలోపు కృష్ణ పైకి రావడాన్ని గమనించిన ముకుంద చాటున దాక్కుంటుంది. మురారి తాగేసి పడిపోవడాన్ని చూసి కంగారు పడుతూ కృష్ణ తనని ఇంటికి తీసుకెళ్తుంది. ఇక తెల్లవారు జామున నిద్ర లేవగానే మురారి కి రాత్రి ఏమి జరిగిందో నెమ్మదిగా గుర్తుకు వస్తుంది. కృష్ణ మాటలను బట్టి రాత్రి ముకుందతో నన్ను చూడలేదు అని అనుకోని రిలాక్స్ అవుతాడు మురారి.