NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema April 15 2024 Episode 598: పద్మావతి కోసం తన ప్రాణాన్ని పణంగా పెట్టిన విక్కి.. పద్మావతి ప్లాన్ కనిపెట్టిన కృష్ణ ఏం చేయనున్నాడు?

Nuvvu Nenu Prema Today Episode April 15 2024 Episode 598 highlights

Nuvvu Nenu Prema  April 15 2024 Episode 598: విక్కీ పద్మావతి ఇద్దరూ ఉన్న ప్లేస్ ని దాస్ కనిపెట్టేస్తాడుడు. పద్మావతి వాళ్ళు రావడం చూసి కంగారుపడుతుంది ఇప్పుడు మనం ఎలాగైనా ఇక్కడి నుంచి పారిపోవాలి సారు అని అంటే మనమిద్దరం పారిపోవడం కుదరదు పద్మావతి నేను వాళ్లకు దొరికిపోతాను నువ్వు పారిపోని అంటాడు అందుకు పద్మావతి ఒప్పుకోదు కానీ విక్కీ బలవంతంగా పద్మావతిని ఒట్టేయించుకొని నువ్వు ఇక్కడే ఉంటున్నావు నేనొక్కడినే బయటకు వెళ్తున్నాను అని అంటాడు ఇక రూమ్ బయట దాస్ వాళ్ళందరూ గన్స్ పట్టుకొని రెడీగా ఉంటారు వాళ్ళే డోర్ తీద్దాం అనుకునే టయానికి విక్కీ వచ్చి డోర్ తీస్తాడు. వెంటనే దాస్ బిక్కిని పట్టుకొని వీడి మనకి దొరికేసాడు రా ఇక వీడి భార్య ఎక్కడ ఉందో వెతకండి అని అంటే వికీ ఇప్పటిదాకా ఎందుకు ఉంటుంది ఎప్పుడో పంపించేశాను అని అంటాడు కానీ దాస్ నమ్మడు పక్కనే ఉన్న రౌడీని పంపించి లోపల పద్మావతి ఉందేమో చూసి రమ్మంటాడు లోపలికి వెళ్ళేటప్పటికి ఆ రౌడీ పద్మావతి చేతులు జోడించి దండం పెడుతుంది నేనిక్కడ ఉన్నట్లు ఎవరికీ చెప్పొద్దు అని వేడుకుంటుంది దాంతో ఆ రౌడీ కరిగిపోయి అప్పటికే వాళ్ళ భార్య టార్చర్ ఎక్కువగా ఉంటుంది దాంతో పద్మావతి లాంటి అమ్మాయిని చూసిన తర్వాత భర్త కోసం ప్రాణానికైనా తెగించే వాళ్ళని చూసి ఆ రౌడీ దాస్ కి అబద్దం చెప్తాడు. లోపల ఎవరూ లేరు అన్నా ఈయన చెప్పిందే నిజం అట్టుంది పద్మావతిని పంపించేసి ఉంటాడు అని అంటాడు దాంతో ఇక దాసు మనకి ముఖ్యం వీడేరా పదండి వీడిని కట్టేద్దాం అని చెప్పి తీసుకు వెళ్తుంటారు.

Nuvvu Nenu Prema Today Episode April 15 2024 Episode 598 highlights
Nuvvu Nenu Prema Today Episode April 15 2024 Episode 598 highlights

ఇక వికీ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత పద్మావతి బయటికి వస్తుంది సార్ అని ఏడుస్తూ చూస్తూ ఉంటుంది కానీ అప్పటికే విక్కి దాస్ చేతిలో బందీగా ఉండి తీసుకొని వెళ్తూ ఉంటారు వాళ్ళు పద్మావతి ఇలా ఏడుస్తూ కూర్చుంటే కుదరదు ఎలాగైనా విక్కిని కాపాడుకోవాలి అని లేచి విక్కీ కారు వెనకాల పరిగెడుతూ ఉంటుంది. ఇక కారులో విక్కి నన్ను వదిలేయండిరా ఎక్కడ తీసుకెళ్తున్నారు నన్ను అని అంటూ ఉంటాడు. పద్మావతి ఎలాగైనా విక్కిని కాపాడాలని అనుకుంటుంది. ఇక మరోవైపు కృష్ణ ఇంటి దగ్గర టెన్షన్ పడుతూ ఉంటాడు రాత్రి నుంచి విక్కీ పద్మావతి ఇద్దరు తప్పించుకున్నారు దాస్ కి దొరికారో లేదో అని ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక అప్పుడే దాస్ ఫోన్ చేస్తాడు ఒరేయ్ చెత్త వెధవల్లారా మీ ఫోన్ కోసం నేను ఎంత సేపని ఎదురు చూడాలి పొద్దున్నుంచి టెన్షన్ తో చచేలా ఉన్నాను ఇంతకు విషయం చెప్పండి అని అంటాడు. మీరు ఇంకా అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు బాస్ విక్కి దొరికేశాడు అని అంటాడు దాంతో కృష్ణ సంతోషిస్తాడు ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటే అవును బాస్ అని రాత్రి జరిగింది అంతా చెప్తాడు విక్కీ వాళ్ళు దాకపోవడం దాస్ వాళ్ళు వెళ్లి పట్టుకోవడం అంతా విన్న తర్వాత కృష్ణ నేను చేస్తాను అన్న భయంతోనే మీరు రాత్రంతా వాడిని వెతికి పెట్టుకున్నారు అనమాట పోనీలే ఏదో ఒక విధంగా విక్కీ దొరికేశాడు అని అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతాడు.

Nuvvu Nenu Prema Today Episode April 15 2024 Episode 598 highlights
Nuvvu Nenu Prema Today Episode April 15 2024 Episode 598 highlights

ఇక కృష్ణ విక్కీ ని పట్టుకున్న తర్వాత ఏం చేయాలి అని దాస్ అడిగితే అందుకు నాకు ఆశ రావడానికి పేపర్స్ అన్ని రెడీ అయిపోయాయి ఇప్పుడు విక్కీ ఉన్నా కానీ మనకేమి ఉపయోగం లేదు మీరు వాని ఏం చేసినా పర్వాలేదు కానీ మనకు ఆడవాళ్లు మాత్రం దొరక్క కూడదు అందుకని దూరంగా తీసుకెళ్లి అని చంపేసి కాల్చి బూడిద చేసేయండి అని గట్టిగా అరుస్తాడు. ఓకే బాస్ అని దాస్ ఫోన్ పెట్టేస్తాడు. కానీ కృష్ణకి అనుమానం వస్తుంది పద్మావతి కూడా విక్కీ తో పాటు ఉండాలి కదా దాసు ఓన్లీ విక్కి మాత్రమే దొరికిందని చెప్తున్నారు అని మళ్లీ దాస్ కి ఫోన్ చేస్తాడు. విక్కి తోపాటు పద్మావతి ఉండాలి కదా రా ఇప్పుడు విక్కీ మాత్రమే దొరికాడు అని చెప్తున్నావేంటి ఇంతకీ పద్మావతి విషయం చెప్పలేదు అని అంటాడు. అంటే అది బాస్ అని దాస్ నానిస్తూ ఉంటాడు. అదే విషయం సరిగ్గా చెప్పు అని అంటాడు ఇక దాంతో దాస్ బాస్ అది మేము వెళ్లేసరికి పద్మావతి అక్కడ లేదు విక్కి మాత్రమే ఉన్నాడు అందుకే విక్కిని పట్టుకున్నాము అని అంటే నీకు ఏమైనా పిచ్చా అసలు పద్మావతి వికీ ని వదిలిపెట్టి ఉండలేదు వాళ్ళిద్దరి ప్రేమ అలాంటిది ఒకరిని వదిలిపెట్టి ఒకరికి ఉండలేనంత ప్రేమ వాళ్ళ మధ్య ఉంటే వికీ ని వదిలిపెట్టి అలాంటి పరిస్థితుల్లోంచి పద్మావతి ఎలా వెళుతుంది నువ్వే ఎక్కడో పొరపాటున చూసి ఉంటావు సరిగ్గా వెతకండి అని అంటాడు లేదు బాస్ మేమంతా వెతికాము కానీ ఆమె ఇక్కడ కనిపించట్లేదు అని అంటాడు. దాంతో ఇక వికీ ముందు చంపేయండి తర్వాత చూద్దాం అని ఫోన్ పెట్టేస్తాడు. అప్పుడే అక్కడికి దివ్య వస్తుంది ఏంటి బావ ఈ టెన్షన్ పడుతున్నావ్ అని అడుగుతుంది. టెన్షన్ కాక ఏముంది ఆ పద్మావతి వాళ్లకి దొరకలేదు విక్కీ మాత్రమే దొరికాడుట అని అంటాడు దాంతో అయితే మనకేమైంది బావ పద్మావతి దొరకపోయినా విక్కీ దొరికాడు కదా విక్కిని చంపేస్తే సరిపోతుంది అప్పుడు పద్మావతి మనమేం చేయలేదు అని అంటే నీకు పద్మావతి గురించి పూర్తిగా తెలియట్లేదు దివ్య పద్మావతి చాలా తెలివిగలది అసలు విక్కీని అలాంటి పరిస్థితుల్లో చూసిన తర్వాత పద్మావతి ఎలా వదిలి వస్తుంది ఇంట్లో ఇంతమంది ఉంటే విక్కీ డేంజర్ లో ఉన్న విషయం పద్మావతికి మాత్రమే ఎలా గమనించింది అదే పద్మావతి తెలివి ఇప్పుడు పద్మావతి విక్కీని విడిపించి ఇంటికి తీసుకురాకుండా ఉండదు అని దివ్యతో అంటాడు కృష్ణ వెంటనే బావ అయితే ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అదే గనుక జరిగితే నువ్వు నేను ఏమైపోవాలి అని అంటుంది. ఇక అందుకే నేనే రంగంలోకి దిగుదాము అనుకుంటున్నాను అడ్డు వస్తే ఎవరినైనా సరే చంపుకుంటూ వెళ్లిపోతాను అది విక్కీ అయినా పద్మావతి అయినా కానీ వాళ్ళిద్దరిని చప్పి ఇంటికి వస్తాను అని అంటాడు. పద్మావతి చాలా తెలివిగలది ఎలాగైనా విక్కిని విడిపిస్తుంది నేను ఇప్పుడు అక్కడికి వెళ్లాలి అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode April 15 2024 Episode 598 highlights
Nuvvu Nenu Prema Today Episode April 15 2024 Episode 598 highlights

ఇటు మరోవైపు విక్కీని చాలా దూరం తీసుకొని వెళుతూ ఉంటారు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పండి అని విక్కీ అడుగుతాడు కానీ దాస్ చెప్పడు. పక్కనే ఉన్న రౌడీ మీ ప్రేమ నిజమైతే మీకు క్షేమంగానే ఉంటారు సారు అని అంటాడు. ఏంట్రా వాడితో మాట్లాడుతున్నావ్ అని దాస్ అడిగితే ఏం లేదన్నా మీరు ఎంత ట్రై చేసినా ఇక్కడ నుంచి తప్పించుకోలేరు అని అంటున్నాను అని అంటాడు. ఇక పద్మావతి మాత్రం విక్కీని వెతుక్కుంటూ కారు వెనకాలే ఫాలో అవుతూ ఉంటుంది. కొంత దూరం వచ్చిన తర్వాత విక్కీ తన చేతికి ఉన్న రక్షాకంకణం గుర్తుకు వచ్చి. పద్మావతి ఊరికి వచ్చేటప్పుడు రక్షా కంకణం విక్కీ తీసేద్దాం అనుకుంటే అది మీకు రక్షగా ఉంటుంది ఉంచండి సార్ ఇది మాత్రమే పరిస్థితిలో తీయద్దు అని చెప్తుంది దాంతో రక్షా కంకణం కనపడకుండా పోవడంతో కారులో విక్కీ బాధపడుతూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న రౌడీ మిమ్మల్ని అర్థం చేసుకునే భార్య ఉంది కదా సారు మీకు ఏం కాదు అని అంటాడు. ఇక దాంతో వికీ బాధ పడుతూ ఉంటే రౌడీల్ని బలవంతంగా ఒక చోట కారు ఆపేలా చేస్తాడు వికీ అక్కడే ఒక ముసలాయన విక్కీ కారులో బందీగా వెళ్లడం చూస్తూ ఉంటాడు. దాస్ విక్కిని దూరంగా తీసుకువెళ్లి చంపేయాలి అని అనుకుంటాడు. విక్కీ మాత్రం పద్మావతిని తలుచుకుంటూ మీ జన్మలో ఇక నీకు కనిపిస్తానో లేదో పద్మావతి నువ్వు మాత్రం ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అని అనుకుంటాడు. మీరు లేకుండా నాకు సంతోషం ఎలా ఉంటుంది సారూ మీరు లేని జీవితమే నాకు లేదు అని పద్మావతి బాధపడుతూ ఉంటుంది. విక్కీ పద్మావతి తో గడిపిన క్షణాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. పద్మావతి వికీ కారు ఎక్కడ మిస్ అయిందో అని చూస్తూ ఉంటుంది ఈ అడవిలో ఇప్పుడు నేను విక్కీ సార్ ని ఎలా కనిపెట్టాలి అని అనుకుంటూ ఉండగా, విక్కీ చేతికి కట్టిన కంకణం రోడ్డు మీద దొరుకుతుంది.

Nuvvu Nenu Prema Today Episode April 15 2024 Episode 598 highlights
Nuvvu Nenu Prema Today Episode April 15 2024 Episode 598 highlights

అది చూసి పద్మావతి ఇది విక్కీదే కదా అని అనుకుంటుంది ఇక అక్కడే ఉన్న ముసలాయన, ఎవరికోసం అమ్మ వెతుకుతున్నావు అని అంటే ఏ కొంతమంది రౌడీలు మా ఆయన్ని కొట్టి తీసుకువెళ్తున్నారండి. ఈ కంకనం మా అయన దే మీరు గానీ మా ఆయనను చూసారా ఈ దారిలో అని అడుగుతుంది. ఇక మరోవైపు విక్కీని రౌడీలు ఒక బంగ్లాలో తీసుకెళ్లి బంధిస్తారు అదేంటన్నా మళ్ళీ ఇక్కడికే తీసుకొచ్చామని పక్కన ఉన్న రౌడీ అడిగితే మనం కొన్ని రోజులు ఎన్ని ఇక్కడే బంధించాలా అని అంటాడు. లేదురా ఇక వీటితో పని అయిపోయింది మన బాస్ వీడ్ని చంపేయమన్నారు అని అంటాడు దాస్. ఆ మాటలు విని పక్కనే ఉన్న రౌడీ షాక్ అవుతాడు అదేంటన్న చంపడం ఏంటి?మనం కొంతకాలం బంధించి తర్వాత వదిలేద్దాం అనుకున్నాం కదా అని అంటే, కాదు మనం చంపేస్తున్నాం ఇప్పుడే అని దాస్ చెప్పడంతో విక్కీ ఆశ్చర్యపోతాడు. ఆ ముసలాయన ఇప్పుడే కొంతమంది రౌడీలు కారులో విక్కిని తీసుకువెళ్లిన విషయాన్ని చెప్తాడు. దాంతో పద్మావతి విక్కీ ఎటువైపు వెళ్ళాడో తెలుసుకొని అటుగా వెళుతున్నది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode April 15 2024 Episode 598 highlights
Nuvvu Nenu Prema Today Episode April 15 2024 Episode 598 highlights

రేపటి ఎపిసోడ్ లో, విక్కీని ఒకచోటికి తీసుకువెళ్తారు రౌడీలు విక్కీ నీ చంపడానికి పెట్రోల్ తీసుకుని వస్తాడు. అదేంటన్న పెట్రోల్ ఎందుకు తీసుకొచ్చావు నీ పక్కన ఉన్న రౌడీ అడిగితే ఇది మనం కోసం కాదురా ఈ విక్కీని పెట్రోల్ పోసి చంపేయడానికి అని అంటాడు. దాస్ అగ్గిపెట్ట వెలిగించి ఇక నిన్ను కాపాడే వాళ్ళు ఎవరూ లేరు అని అంటాడు అప్పుడే పద్మావతి వెనుక నుంచి వచ్చి దాసిని తల మీద కర్రతో కొడుతుంది. దాస్ కింద పడిపోతాడు ఇక పద్మావతి పక్కనే ఉన్న రౌడీలు అందరినీ కర్రతో కొడుతుంది విక్కీ పద్మావతిని చూసి సంతోషిస్తాడు. మొత్తానికి పద్మావతి విక్కిని కాపాడేసింది.. మరి కృష్ణ ఏం చేస్తాడో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే…

Related posts

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri