NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema March 28 2024 Episode 583: పద్మావతి నుండి విక్కీ దూరం కానున్నాడా? పద్మావతి తెలివికి ఆశ్చర్యపోయిన కృష్ణ.. ఆస్తి పేపర్లు సేఫ్..

Nuvvu Nenu Prema Today Episode March 28 2024 Episode 583 highlights

Nuvvu Nenu Prema March 28 2024 Episode 583: కృష్ణ కొన్ని పేపర్స్ ని పద్మావతికి ఇచ్చి వాటి మీద సంతకాలు పెట్టిస్తే దివ్య వీడియో డిలీట్ చేస్తానని చెప్తాడు. షూరిటీ పేపర్స్ ఆ కాదా అని పద్మావతి చెక్ చేస్తుంది. అది షూరిటీ పేపర్స్ అని తెలియడంతోనే పద్మావతి ఎలాగైనా విక్కీ చేత సంతకం పెట్టించాలి అనుకుంటుంది. కానీ పద్మావతి లేకుండా కృష్ణ ఆ పేపర్స్ బదులు ఆస్తి పేపర్లను మారుస్తాడు అది పద్మావతికి తెలియదు.విక్కీ ఆఫీస్ ఫైల్ తో పాటు కృష్ణ ఇచ్చిన ఫైల్ ని కూడా తీసుకెళ్లి పద్మావతి విక్కీ చేత సంతకం చేయిస్తుంది. ఇదంతా గమనించిన కృష్ణా పద్మావతి దగ్గరికి వచ్చి నా పేపర్స్ నాకు ఇచ్చేసేయ్ అని అడుగుతాడు.

Nuvvu Nenu Prema Today Episode March 28 2024 Episode 583 highlights
Nuvvu Nenu Prema Today Episode March 28 2024 Episode 583 highlights

కృష్ణ ఒంటరిగా ఉన్నప్పుడు పద్మావతి రూమ్ లోకి వెళ్లి పేపర్స్ ఇవ్వమని అడుగుతాడు.పరాయి వాళ్ళ గదిలోకి వచ్చి ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గు లేదా అని అడుగుతుంది పద్మావతి. నేను తగ్గాను కదా అని మరీ రెచ్చిపోయి మాట్లాడకు పద్మావతి అని అంటాడు కృష్ణ ముందు నా పేపర్స్ నాకు ఇచ్చేస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని అంటాడు. నీకు ఇవ్వడం కుదరదు అని చెప్తుంది పద్మావతి ఏంటి తమాషాగా ఉందా? నేనంటే ఏందో తెలిసికూడా పేపర్స్ ఇవ్వట్లేదు అని అంటాడు. పద్మావతి అయితే నువ్వు విక్రమాదిత్య గారితో నిజం చెప్పు నీ పేపర్స్ నీకు ఇచ్చేస్తాను అని అంటుంది నువ్వు నేను నిజం చెప్పిన తర్వాత పేపర్ ఇవ్వకపోతే అని అంటాడు పేపర్స్ తీసుకో నువ్వు నిజం చెప్పకపోతే నా జీవితం ఏమైపోతుంది అని అంటుంది పద్మావతి. నా జాగ్రత్తలో నేనున్నాను తెలివిగా ఆలోచిస్తున్నావ్ అనుకుంటున్నావా పద్మావతి అని అంటాడు. నాతో పెట్టుకుంటే కొరివిదతల గోక్కున్నట్టే అని అంటాడు నువ్వు ఏం చేసినా ఊరుకుంటానని అనుకో మాకు పద్మావతి పద్మావతి ఇక్కడ ఎక్కడ తగ్గేది లేదు ఆడ శివంగిని అని అంటుంది. పద్మావతి అనంతపని చేస్తుంది మనం తనని కూల్ గా డీల్ చేయాలి అని కృష్ణ మనసులో అనుకొని అది కాదు పద్మావతి నువ్వు ఆ పేపర్స్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టు. నేను వెంటనే వెళ్లి విక్రమాది తెలియని నిజం చెప్తాను అని అంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 28 2024 Episode 583 highlights
Nuvvu Nenu Prema Today Episode March 28 2024 Episode 583 highlights

అవునా అయితే నిజం చెప్పడం డిసైడ్ అయ్యావు కదా అందర్నీ పిలుస్తాను అందరి ముందు చెప్పు అని అంటుంది మీకు ఏమైనా పిచ్చి అని అంటాడు కృష్ణ. తప్పు చేసినప్పుడు లేనిది ఇప్పుడేంటి ఇంత ఆలోచిస్తున్నావు నీవల్ల విక్రమాదిత్య గారు నన్ను వదిలి అమెరికా వెళ్ళిపోవాలనుకుంటున్నాడు నువ్వు నిజం చెప్తే ఆయన ఇక్కడే ఉంటాడు అని అంటుంది. అందరి ముందు చెప్పడానికి నాకేం ప్రాబ్లం లేదు పద్మావతి కానీ ఒకసారి నువ్వే ఆలోచించు అరవింద కడుపుతో ఉంది. అమ్మమ్మ గారి పెద్దదయింది ఇలాంటి షాకింగ్ న్యూస్లు వాళ్ళ ముందు చెప్తే వాళ్ళు ఏమైపోతారు అయితే చెప్పమంటే చెప్తాను అని అంటాడు కృష్ణ. ఒకరు ఇద్దరు కాదు పద్మావతి ఈ షాకింగ్ విషయం ఇంట్లో ఎవరూ తట్టుకోలేరు నీ సంతోషం కోసం వాళ్ళు ఏమైపోయినా పర్లేదా అని అంటాడు. వద్దు నువ్వు నిజం చెప్పొద్దు అని పద్మావతి అంటుంది. నీ మనసు ఏంటో నాకు తెలుసు పద్మావతి అని అంటాడు తను ఫారెన్ వెళ్లే లోగా తనకి మాత్రమే నిజం చెప్తాను నీకేంటి నిజం తెలియడమే కదా కావాల్సింది నువ్వు ఇంట్లో ఎవరికీ తొందరపడి నిజం చెప్పకు నేను మాత్రం విక్కీతో నిజం చెప్పి నీకు కాపురం నిలబెడతాను అని కృష్ణ పద్మావతి మాటిస్తాడు. నువ్వు కనక తోక జాడించే ఏదైనా చేయకూడదు చేసావో నా సంగతి తెలుసు కదా ఆ పేపర్స్ ఎప్పటికీ నీకు రావు అది ఎక్కడున్నాయో నాకు మాత్రమే తెలుసు అని అంటుంది. నేను అనుకున్నంత తెలివి తక్కువ తక్కువ ది కాదు పద్మావతి తనతో జాగ్రత్తగా డీల్ చేయాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కృష్ణ. ఈ నీచుడు ఎంతకైనా తెగిస్తాడు అతనితో జాగ్రత్తగా ఉండాలి పేపర్ సేఫ్ గా ఉండాలి అని పద్మావతి కూడా మనసులో అనుకుంటుంది.

Nuvvu Nenu Prema Today Episode March 28 2024 Episode 583 highlights
Nuvvu Nenu Prema Today Episode March 28 2024 Episode 583 highlights

ఇక అను ఆర్య ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. పద్మావతి ఎందుకు విక్కిని ఇరిటేట్ చేస్తుంది తను అమెరికా వెళ్తే ఏమైంది ఫారెన్ వెళ్ళేది ఆఫీస్ పని మీదే కదా మళ్లీ తిరిగి రాడేమో అన్నట్టు మాట్లాడుతుంది అని అంటాడు ఆర్య తనకి విక్కీ అంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు కదా అందుకని వదిలి ఉండలేక అలా మాట్లాడుతుంది అని అంటుంది. వికీ కూడా పద్మావతి అంటే ఇష్టం ఆఫీస్ పని ఉంది కాబట్టి వెళ్తున్నాడు లేతే వెళ్లేవాడు కాదు అని ఆర్య అంటాడు వాళ్ళిద్దరూ ప్రేమ గురించి ఆర్యాను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు విక్కికి పద్మావతి అంటే ఇష్టం అని పద్మావతికి విక్కి అంటే చాలా ఇష్టమని మాట్లాడుకుంటారు అందుకే కదా తనకి యాక్సిడెంట్ అయినప్పుడు పద్మావతి ఎంతో కష్టపడి తన ప్రాణానికి తెగించి విక్కీని కాపాడింది అని అంటుంది. మా విక్కీ కూడా పద్మావతికి చిన్న దెబ్బ తగిలిన తట్టుకోలేడు అని అంటాడు ఆర్య. అందుకే వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు అంత ప్రేమగా ఉంటున్నారు అని అంటారు. పద్మావతి వచ్చిన తర్వాత మాకు కిలో చాలా మార్పు వచ్చింది అని అంటాడు ఆర్య. మా పద్మావతి కూడా విక్కిని పెళ్లి చేసుకున్న తర్వాత చాలా సంతోషంగా ఉంది అని అంటుంది అను. ఏదైతేనే మనల్ని కలిపిన వాళ్ళిద్దరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండాలని మన కోరిక కథ అని అంటాడు ఆర్య. వాళ్ళ మధ్య ఏడబాటు రాకూడదు రాదు అంతే అని అంటుంది అను.

Nuvvu Nenu Prema Today Episode March 28 2024 Episode 583 highlights
Nuvvu Nenu Prema Today Episode March 28 2024 Episode 583 highlights

ఇక మరోవైపు విక్కి అమెరికా వెళ్లడానికి బ్యాగ్ సర్దుతూ ఉంటాడు. మనసులో మాత్రం పద్మావతిని తలుచుకుంటూ ఉంటాడు. పద్మావతి నీతో కలిసి జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను. కానీ అది నెరవేరే ఇది కాదని నాకు అర్థం అయిపోయింది అందుకే, నీకు దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాను. ఇక మరోవైపు పద్మావతి తులసి కోటకు పూజ చేసి, ఎప్పటికీ విక్కీ నాతోనే ఉండాలి తను నన్ను వదిలి వెళ్ళకూడదు నేను తన లేకుండా బతకలేను అని దండం పెట్టుకుంటూ ఉంటుంది. కావాలంటే నా ప్రాణం తీసుకో ఆయని మాత్రం ఇక్కడే ఉండేలా చూడు తల్లి అని దండం పెట్టుకుంటూ ఉంటే మరోవైపు విక్కి లేదు పద్మావతి నేను ఇక్కడ ఉంటే నిన్ను బాధ పెడుతూ నన్ను నేను బాధ పెట్టుకోలేను అందుకే నీ నుంచి దూరంగా వెళ్తున్నాను అని అంటూ ఉంటాడు. ఎక్కడ ఉన్నా కానీ నువ్వు ఇక్కడ సంతోషంగా ఉండాలి అదే నేనెప్పుడూ కోరుకునేది అని విక్కీ అంటాడు ఆయన ఉంటేనే నా సంతోషం ఆయన లేనిది నాకు సంతోషం లేదు అని అంటుంది మరోవైపు పద్మావతి. కొన్ని జీవితాలు, ప్రేమ మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు మిగులుస్తాయి, మనకి మాత్రం చెదిరిపోయిన చేదు జ్ఞాపకాలని మిగిల్చాయి అని అంటాడు విక్కీ. మరోవైపు పద్మావతి నేను ఏది చేసిన మంచి కోసమే చేస్తాను ఆయన ప్రేమ పొందడానికి నేను ఏదైనా చేస్తాను కానీ పరిస్థితులు మా ఇద్దరికీ మధ్య దూరాన్ని పెంచాయి ఆ దూరాన్ని నువ్వే తగ్గించాలి అని పద్మావతి దండం పెట్టుకుంటూ ఉండగా అక్కడికి ఒక పెద్దావిడ సోది చెప్తానంటూ వస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode March 28 2024 Episode 583 highlights
Nuvvu Nenu Prema Today Episode March 28 2024 Episode 583 highlights

ఇక ఆవిడ పద్మావతిని చూసి నీ జీవితం చేయి జారిపోతుంది. అది ఆపడం ఎవరి తరం కాదే కూడా అని అంటుంది ఆ మాట విని పద్మావతి షాక్ అవుతుంది. ఇది విధి రాతే తల్లి నువ్వు కాదని ఎంత ప్రయత్నించినా నీ బంధం బలపడదే తల్లి అని అంటుంది పెద్దావిడ. మీ దాంపత్య మీద మూడు నాలుగు ముచ్చటగానే ఉండబోతోంది తల్లి అని అంటుంది. ఏంటమ్మా మీరనేది అని అంటుంది పద్మావతి అవునే తల్లి అని అంటుంది ఇది నేను చెప్పింది కాదే కూన నా చేత ఈ అమ్మవారి పలికించిన పలుకులు అని అంటుంది. మీ భార్యాభర్తల మధ్య ఉన్న ఈ ఎడబాటు ఇక శాశ్వతంగా దూరం కాబోతుందే కూన అని అంటుంది. ఇక జరగబోయేది అదే నీ తల్లి అని, మీరంటే ఒకరికి ఒకరు ఎంత ప్రేమించుకుంటున్నా ఎంత కావాలనుకుంటున్నా కొన్ని దుష్టశక్తులు మిమ్మల్ని వేరు చేస్తున్నాయే తల్లి అని అంటుంది. అందుకే మీ ఆయన నీ మీద కోపంతోనే వెళ్లిపోతున్నాడే తల్లి అని, గడప దాటితే ఇక మళ్ళీ నిన్ను తిరిగి కలిసేదే లేదు, మీ బంధం ప్రమాదంలో పడబోతోందిఅని పెద్ద ఆవిడ చెప్తుంది. మా ఆయన లేకుండా నేను ఉండలేనమ్మ ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పు తల్లి అని పద్మావతి వేడుకుంటుంది. ఇక పెద్ద ఆవిడ కాసేపు కళ్ళు మూసుకొని, నీ భర్త ఆపే శక్తి ఒక్క నీ ప్రేమకే ఉన్న అదే తల్లి అని చెప్తుంది అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ తనని గడప దాటనివ్వకే తల్లి, దాటాడు ఇక నీకు ఎప్పటికీ దక్కడు తనని ఆపు అని అంటుంది. అలాగే తల్లి కచ్చితంగా ఆపుతాను అని అంటుంది అప్పుడే కుడి కన్ను కూడా అదురుతుంది ఎలాగైనా విక్కిని ఫారిన్ వెళ్లకుండా ఆపాలి అని పద్మావతి అనుకొని విక్కీ దగ్గరికి వెళ్తుంది.

విక్కీ దగ్గరికి వెళ్ళి పద్మావతి ఎక్కడికి సారు లగేజీ సర్దుతున్నారు అని అంటుంది. చెప్పాను కదా పద్మావతి ఫారం వెళ్లాలని అని అంటాడు. మీరు ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు మీరు ఇక్కడే ఉండాలి మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటాను అని అంటుంది పద్మావతి.ప్రేమలో మోసపోయిన నేను అందరి ముందు నటిస్తూ తిరగడం నాకు చేత కావట్లేదు అని అంటాడు విక్కి. నీకు దూరంగా వెళుతున్నాను పద్మావతి సారు ప్లీజ్ ఈ ప్రోగ్రాం ని క్యాన్సిల్ చేసుకోండి అంటే నేను వింటున్నాను కదా అని నువ్వుఅన్నీ చెప్పకు అని అంటాడు. నా మనసు ఎందుకో కీడు సంకిస్తుంది మీరు ఇక్కడి నుంచి వెళ్లడానికి వీల్లేదు అని అంటుంది పద్మావతి. నేను ఇక్కడ బాధపడుతూ ఉండడం నీకు ఇష్టమా నా కళ్ళల్లో కన్నీళ్లు చూడాలనేదే నీ కోరిక, అని అంటాడు విక్కీ. లేదు సార్ నాకు ఎప్పటికీ ఆ ఉద్దేశం లేదు నేను ఏమైపోయినా పర్లేదు కానీ మీరు సంతోషంగా ఉండాలని అదే నా కోరిక అని అంటుంది పద్మావతి. మీ కళ్ళల్లో కన్నీళ్లు చూస్తే నా ప్రాణం పోతుంది సారు అని అంటుంది. మరైతే నన్ను ఎందుకు ఆపుతున్నావ్ పద్మావతి నన్ను వెళ్ళనివ్వు అని అంటాడు. చూడు పద్మావతి మూఢనమ్మకాల పేరుతో నాపాలని చూడకు నేను వెళ్ళాలి అని అంటాడు. సారీ వద్దని చెప్తున్న పోతాను అంటారు ఎందుకు అని అంటుంది. నేను తప్పు చేశానని నా మీద కోపంతోనే కదా పోతూ ఉన్నారు దేనికి సారు ఇది మీ ఇల్లు కావాలంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు శిక్షగా నేనే మీకు దూరంగా వెళ్ళిపోతాను అని అంటుంది. మీరు ఇక్కడే ఉండండి అని అంటుంది నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు పద్మావతి అని అంటాడు. నా మీద నాకే కోపం అసహ్యం నాకు ఫ్లైట్ కి టైం అవుతుంది నన్ను బట్టలు సర్దుకొని ఇవ్వు అని అంటాడు. మన ఈ బాధకి అపార్థం సారు. ఈ అపార్ధాలు పోగొట్టే నిజం నా దగ్గర ఉంది ఈ ఆ నిజం మీకు తెలిస్తే మీరు నన్ను అర్థం చేసుకుంటారు మీకు ఆ నిజం తెలిసేలా నేను చేసి తీరుతాను సార్ అని అంటుంది. ఎంత చెప్పినా విక్కీ వినట్లేదు అని పద్మావతి బాధపడుతుంది. శ్రీనివాస ఆయన మనసు మారేలా ఏదో ఒకటి చేయబ్బ నా ప్రేమ ఆయనకు అర్థం అయ్యేలా చెయ్యి అని అనుకుంటూ పద్మావతి నా మాట వినకపోయినా నా మనసులో బాధ విక్రమాదిత్య తెలిసేలా చేస్తాను అని అనుకుంటుంది.

విక్కీ కోసం పద్మావతి ఒక లెటర్ రాస్తుంది. సారు నేను నిజం చెప్పిన మీరు వినేలా లేరు నా మనసులో మాట ఈ విధంగానైనా నీకు చెప్పాలని రాస్తున్నాను. సారు మీ బావ నిజస్వరూపం తెలుసుకొని, తనని కాదన్నానన్న కోపంతో ఆ నీచుడు నాపై పగ పట్టి, మనల్ని విడగొట్టి మన మధ్య అపార్ధాలు సృష్టిస్తున్నాడు మన దివ్య సృహలో లేనప్పుడుఅసభ్యంగా వీడియోలు తీశాడు నేను తను చెప్పింది వినకపోతే ఆ వీడియోలని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అప్పుడు నాకు ఏం చేయాలో తెలీక తప్పక వాడిని కలవాల్సి వచ్చింది. అంతేకాదు సారు, వాడు ఏదో కుట్ర బండి మీ చేత సంతకాలు కూడా చేయించాలని చూశాడు ఈ నిజం చెప్తే మీరు ఆవేశంలో, వాడిని చంపి అరవింద గారిని దూరం చేసుకుంటారు ఏమో అన్న భయంతో, నేను మీకు నిజం చెప్పలేకపోయాను ఇప్పటికైనా మీరు ఈ నిజాన్ని తెలుసుకొని, నన్ను అర్థం చేసుకొని ఆ నీచుడికి తగిన బుద్ధి చెప్పండి సార్ మీ కోసం మీ ప్రేమ కోసం వేయికళ్లతో ఎదురు చూస్తూ ఉంటాను ప్రేమతో మీ భార్య పద్మావతి అని ఒక లెటర్ రాసి, అది విక్కీ వేసుకునే షర్ట్ జేబులో పెడుతుంది. అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విక్కీ వచ్చి నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఆ షర్ట్ వేసుకొని అమెరికా వెళ్లడానికి రెడీ అవుతాడు.

నారాయణ విక్కీ మనసు మార్చుకొని పద్మావతిని తీసుకువెళ్తున్నాడా అని అడుగుతుంది శాంతాదేవి.ఒక్కడే వెళ్తున్నాడమ్మా అని అంటాడు నారాయణ.ఇక్కడ పద్మావతి ఒకటే ఉండలేక ఎంత బాధ పడుతుందో అని అంటుంది అరవింద. నారు వికి వెళ్లకుండా మనిద్దరిని పంపించాల్సింది హాయిగా అమెరికా అంతా చూసి వచ్చేవాళ్ళం అని అంటుంది కుచల. మనిద్దరం ఎందుకు, నువ్వు అమెరికాలో చేసే చిత్ర విచిత్రమైన విన్యాసాలు చూడలేక నేను అల్లాడాలి దానికన్నా నువ్వు కొన్ని రోజులు మీ పుట్టింటికి వెళ్ళు అని అంటాడు నారాయణ. ఇక మరోవైపు పద్మావతి కృష్ణ కి ఫోన్ చేస్తుంది. విక్కీ ఊరికి వెళ్తున్నాడు కదా, నిజం చెప్పమని అడగడానికి ఫోన్ చేసినట్టు ఉన్నది అని కృష్ణ అనుకోని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఎక్కడ ఉన్నావు విక్రమాదిత్య గారు ఊరికి వెళ్తున్నారు వచ్చి నిజం చెప్పు అని అంటుంది పద్మావతి. ఇంకా చాలా టైం ఉంది నిజం చెప్పడానికి అని అంటాడు కృష్ణ.

రేపటి ఎపిసోడ్ లో విక్కీ కారులో వెళ్తూ ఉండగా పద్మావతి వెనకాలే పరిగెడుతూ ఉంటుంది వికీ కొంత దూరం వెళ్లిన తర్వాత అద్దంలో పద్మావతి రావడం గమనించి కారు ఆపి దిగుతాడు. పద్మావతి విక్కీని హగ్ చేసుకుని మీరు ఎక్కడికి వెళ్లదు సారు మిమ్మల్ని వదిలి ఉండడం నావల్ల కాదు మీరు వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది మీరు ఎక్కడికి వెళ్లదు సార్ అని బతిమిలాడిని హగ్ చేసుకుంటుంది. విక్కీ ఆలోచిస్తూ ఉంటాడు. మరి విక్కీ అమెరికా వెళ్ళాడా లేదా తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

Related posts

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri