OTT: కోవిడ్ వచ్చిన తరువాత ఏవి స్థిరపడ్డాయో పెద్దగా తెలియదు కానీ ఓటీటీల హవా మాత్రం భారీగా పెరిగిపోయింది. ఇదివరకు థియేటర్లో సినిమా రిలీజ్ అయింది అంటే ఎంతో క్యూరియాసిటీగా ఉండేవారు. కానీ ప్రస్తుత కాలంలో థియేటర్లను పట్టించుకోవడమే మానేశారు ప్రేక్షకులు. నిత్యం ఓటీటీలలో ఎటువంటి సినిమాలు మరియు సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయో చూసుకుంటూ వాటిని వీక్షిస్తున్నారు. డబ్బులు పెట్టి టికెట్ కొనేందుకంటే నెల రోజులపాటు బ్యాలెన్స్ వేసుకుని ఓటీటీలోనే చూడడం బెటర్ అనుకుంటున్నారు. ఇక స్టార్ హీరోల సినిమాలు లేనందున థియేటర్ కి కూడా పెద్దగా ఎవ్వరూ వెళ్ళాలనుకోవడం లేదు.
ఒకవేళ స్టార్ హీరో సినిమాలే అయితే థియేటర్ను సంప్రదిస్తున్నారు. కానీ చిన్న చిన్న హీరోల సినిమాలు అయితే ఓటీటీలోకి వస్తాయి కదా అప్పుడు చూడొచ్చులే అనే ఇంటెన్షన్ తో ఉంటున్నారు. కోవిడ్ సమయంలో థియేటర్లు మూతపడి ఉంటే ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ అందించింది ఓటిటిలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. నాని ” వీ” సూర్య ” ఆకాశమే నీ హద్దురా” వంటి సినిమాలు ఓటీటీలో నేరుగా రిలీజ్ అయ్యి ఎనలేని ప్రేక్షక ఆదరణ దక్కించుకున్నాయి. అలా కోవిడ్ సమయంలో ఓటిటిలకు అలవాటు పడ్డ ప్రజలు అనంతరం థియేటర్లను పట్టించుకోవడం మానేశారు. సినిమా ఎంత బాగున్నప్పటికీ జనాలు మాత్రం థియేటర్ కి వెళ్లడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇక మరో పక్క టికెట్ రేట్లు కూడా సమస్యగా మారాయి.
ఇవన్నీ కూడా జనాలను థియేటర్లకు దూరం చేశాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ విషయాలు పక్కన పెడితే.. ఓటీటీలు జనాలను థియేటర్లకు దూరం చేస్తున్నాయి అనే అభిప్రాయం కూడా జనాల్లో ఉంది. కాకపోతే.. ఓటిటిల విషయంలో నిర్మాతల అభిప్రాయం వేరేగా ఉంటుంది. ఏ సినిమాకి అయినా ఓటీటీల రూపంలో చాలావరకు రికవరీ ఉంటుందట. అయితే ఈమధ్య మిడ్ రేంజ్ హీరోల సినిమాలకి కూడా బిజినెస్ జరగడం లేదు అనే టాప్ కూడా నడుస్తుంది. ఇక సినిమాలకి ఫ్లాప్ టాక్ కనుక వస్తే జనాలు థియేటర్లకు వెళ్లరు. ఎలాగో ఓటీటీకి వస్తుంది కదా అప్పుడు చూద్దాం అనే మైండ్ సెట్ లో ఉంటారు.
అలాంటి ఆలోచన కూడా మేకర్స్ కి పనికొస్తుంది అని చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఓటీటీల వల్ల అడ్వాన్స్ ల రూపంలో, వ్యూయర్ షిప్ బేస్ ల రూపంలో 60 శాతం బడ్జెట్ తో రికవరీ అవుతుంది. దీని ద్వారా ఫ్లాప్ అయిన సినిమాలకి కూడా పెద్దగా ఏమీ నష్టం జరగడం లేదు. అందువల్ల ఓటీటీల వల్లే తాము సినిమా ఫ్లాప్ అయినా దాని నుంచి బయటపడగలుగుతున్నారు. అందువల్లే ఓటిటిలే సినిమాల రిలీజ్ డేట్స్ ను డిసైడ్ చేస్తున్నాయి. ఇక ఈ విషయంలో నిర్మాతలు సైతం పెద్దగా ఏమీ అనడం లేదు. ఎందుకంటే ఓటిటి వారితో పెట్టుకుంటే తమ సినిమా పూర్తిగా నష్టపోతుందని చెప్పుకోవచ్చు. అందువల్ల దొరికినంత దోచుకుంటూ ఓటీటీలు చెప్పిన డేట్ ని రిలీజ్ చేస్తున్నారు తమ సినిమాలను. అలా ప్రస్తుతం ఓటీటీల హవా బాగా పెరిగింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!