NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

Heera Rajagopal: టాలీవుడ్ కింగ్, అక్కినేని మన్మథుడు నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఆవిడ మా ఆవిడే ఒకటి. ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రంలో ట‌బు, హీరా రాజగోపాల్ హీరోయిన్లుగా నటించారు. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై డి. కిషోర్, మురళీమోహన్ నిర్మించారు. 1998లో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ తో పాటు క్లాస్‌, మాస్ ప్రేక్ష‌కుల‌ను సైతం మెప్పించింది.

అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించిన హీరా రాజగోపాల్ గుర్తుందా..? ఇండస్ట్రీలో హీరా ఉన్నది కొంత కాలమే అయినప్పటికీ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. తన అందంతో 90వ ద‌శ‌కంలో కుర్ర‌కారును ఉర్రూత‌లూగించింది. 1999 త‌ర్వాత హీరా ఆన్ స్క్రీన్ పై క‌నిపించ‌లేదు. అస‌లు హీరా ఇండ‌స్ట్రీకి ఎందుకు దూర‌మైంది..? కోలీవుడ్ స్టార్ అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉంది..? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

1971న‌ చెన్నైలో హీరా రాజగోపాల్ జ‌న్మించింది. ఆమె తండ్రి రాజగోపాల్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో స్కిన్‌కేర్ స్పెష‌లిస్ట్ కాగా.. తల్లి ఇండియ‌న్ ఆర్మీలో నర్సుగా వ‌ర్క్ చేస్తుండేవారు. పాకిట్ మ‌నీ కోసం మోడ‌లింగ్ లోకి ప్ర‌వేశించిన హీరాకు అనుకోకుండా సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయి. 1984లో అపరాధి మూవీతో హీరా త‌న న‌ట‌నా ప్ర‌స్థానాన్ని ప్రారంభించింది. 1991లో వ‌చ్చిన త‌మిళ చిత్రం ఇధయం తో హీరాకు గుర్తింపు వ‌చ్చింది. ఆ త‌ర్వాత ఆమె వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ముఖ్యంగా కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హీరా ఓ వెలుగు వెలిగింది.

అలాగే తెలుగులో పబ్లిక్ రౌడీ, దొంగల రాజ్యం, లిటిల్ సోల్జర్స్, శ్రీ కారం, ఆహ్వానం, ఆవిడ మా ఆవిడే త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది. హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లోనూ వ‌ర్క్ చేసింది. త‌న అందం, అభిన‌యంతో దాదాపు ద‌శాబ్దం పాటు టాప్ హీరోయిన్ గా స‌త్తా చాటింది. 1999 చివరలో ఇండ‌స్ట్రీ నుంచి హీరా వైదొలిగింది. త‌న ఇమేజ్ కు స‌రిప‌డే పాత్ర‌లు రాక‌పోవ‌డం మ‌రియు వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఆమె న‌ట‌న‌కు గుడ్‌బై చెప్పేసింది. ఇక కెరీర్ జెట్ స్పీడ్ లో ప‌రుగులు పెడుతున్న స‌మ‌యంలో హీరా అజిత్ కుమార్ తో ప్రేమ‌లో ప‌డింది. అజిత్ అప్ప‌టికి ఇంకా స్టార్ హీరోగా నిల‌దొక్కుకోలేదు.

హీరా, అజిత్ జంట‌గా తొలిసారి కథల్‌ కొట్టాయ్ చిత్రంలో న‌టించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే ఒక‌రితో ఒక‌రు ప్రేమలో పడ్డారు. ఈ క్ర‌మంలోనే స్టార్ స్టేట‌స్ ను అనుభ‌విస్తున్న హీరా.. త‌న‌కున్న ప‌లుకుబ‌డితో అజిత్ కెరీర్ కు స‌హకారం అందించింది. ఇక అజిత్‌-హీరా ప్రేమ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో కోలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌ని కూడా ప్ర‌చారం జ‌రిగింది. కానీ పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌కుండానే మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో వారు విడిపోయారు. ఆ త‌ర్వాత కొన్నేళ్లకు అజిత్‌.. శాలినీతో ప్రేమ‌లో ప‌డి ఆమెను వివాహం చేసుకున్నాడు. మ‌రోవైపు హీరా 2002 లో పుష్కర్ మాధవ్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడింది. కానీ వివాహ‌మైన కొంత కాలానికి వీరు విడాకులు తీసుకున్నారు. ప్ర‌స్తుతం హీరా అమెరికాలో సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తోంది.

author avatar
kavya N

Related posts

Trinayani April 17 2024 Episode 1215: తిలోత్తమ విశాలాక్షి మెడలో తాళి పట్టుకోగానే, గాయత్రి ఏం చేయనున్నది..

siddhu

Jagadhatri April 17 2024 Episode 207: నిన్ను సీఈవో చేస్తాను అంటున్నా మీనన్, కౌశికి మీద రివేంజ్ తీర్చుకో అంటున్న మీనన్..

siddhu

Brahmamudi April 17 2024 Episode 386: వెన్నెల అబద్ధం.. రాజ్ పై కావ్య ప్రేమ నిజం.. రుద్రాణి ప్లాన్ సక్సెస్..ఆస్తి పేపర్లు అత్తచేతిలోకి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

bharani jella

Naga Panchami: మోక్ష చెప్పిన మాటలకు వైదేహి మనసు కరుగుతుందా లేదా.

siddhu

Krishna Mukunda Murari April 17 2024 Episode 447: డాక్టర్ తో కలిసి ముకుంద ప్లాన్.. ముకుందని నిలదీసిన ఆదర్శ.. రేపటి ట్విస్ట్.?

bharani jella

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Prabhas: ప్రభాస్ “రాజాసాబ్” ఫస్ట్ సింగిల్ లోడింగ్..!!

sekhar

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

Ram Charan: డైరెక్టర్ శంకర్ కూతురు పెళ్లికి కుటుంబ సమేతంగా వెళ్ళిన చిరంజీవి, చరణ్..!!

sekhar

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !